కడ్తాల్ మండలం

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం

కడ్తాల్ మండలం,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] మండల కేంద్రం, కడ్తాల్. ఇది సమీప పట్టణమైన హైదరాబాద్ నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాల ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 15 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కందుకూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.

కడ్తాల్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°59′03″N 78°29′54″E / 16.984180°N 78.498307°E / 16.984180; 78.498307
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం కడ్తాల్ (కడ్తాల్ మండలం)
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 205 km² (79.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 36,406
 - పురుషులు 19,108
 - స్త్రీలు 17,298
పిన్‌కోడ్ 509358

నూతన మండల కేంద్రంగా గుర్తింపు మార్చు

లోగడ కడ్తాల్  గ్రామం రంగారెడ్డి జిల్లా,సరూర్‌నగర్‌ రెవెన్యూ డివిజను పరిధిలోఉండి, మహబూబ్ నగర్ జిల్లా, ఆమన‌గల్ మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కడ్తాల్ గ్రామం కేంద్రంగా, మహబూబ్ నగర్ జిల్లా, ఆమన‌గల్ మండలానికి చెందిన 8 గ్రామాలను, తలకొండపల్లి మండలానికి చెందిన 7 గ్రామాలను విడగొట్టి (1+14) పదిహేను గ్రామాలతో నూతన మండల కేంధ్రంగా రంగారెడ్డి జిల్లా, కందుకూరు రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1] ఈ మండల వైశాల్యం 205 చ.కి.మీ. కాగా, జనాభా 36,406. జనాభాలో పురుషులు 19,108 కాగా, స్త్రీల సంఖ్య 17,298. మండలంలో 8,026 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. కడ్తాల్
  2. వాసుదేవపూర్
  3. ముద్విన్
  4. కర్కల్‌పహాడ్
  5. చెరికొండపట్టికల్వకుర్తి
  6. పట్టిపడ్కాల్
  7. ఏక్రాజ్‌గూడ
  8. చెల్లంపల్లి
  9. వంపుగూడ
  10. సాలార్‌పూర్
  11. రావిచేడు
  12. ముక్తమాదారం
  13. తక్రాజ్‌గూడ
  14. న్యామతపూర్
  15. నాగిరెడ్డిగూడ

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016           
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు