కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం
కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం 2007 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014లోని సెక్షన్ 22 ప్రకారం రెండు రాష్ట్రాలకు శాసనమండలులు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి తెలంగాణ శాసనమండలిలో 40 స్థానాలలో ఒక స్థానంగా వుంది.
ఎన్నికైన సభ్యుల జాబితా
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008 | నారదాసు లక్ష్మణ్‌రావు | భారత్ రాష్ట్ర సమితి | |
2013 | |||
2019 | టి.జీవన్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | |
2025 | సి. అంజిరెడ్డి | భారతీయ జనతా పార్టీ |
2019 ఎన్నికల ఫలితాలు
మార్చుకరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి పోటీ చేయగా, అధికార టీఆర్‌ఎస్ పార్టీ పోటీ చేయకుండా స్వతంత్ర అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ కు మద్దతు ప్రకటించింది. ఈ ఎన్నికలలో మొత్తం 17 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, 1,15,458 ఓట్లు పోలయ్యాయి.
కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్‌గౌడ్ పై మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. జీవన్‌రెడ్డికి 56,698 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ బలపరిచిన మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు 17,268 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సుగుణాకర్ రావుకు 15,077 ఓట్లు, నవ తెలంగాణ పార్టీకి చెందిన రాణి రుద్రమకు 5,192 ఓట్లు వచ్చాయి.[1][2]
2025 ఎన్నికల ఫలితాలు
మార్చు2025 తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఉమ్మడి కరీంనగర్ - మెదక్- నిజామాబాద్ - ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు నియోజకవర్గంకు ఫిబ్రవరి 27న ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలలో మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ చేయగా అధికార కాంగ్రెస్ పార్టీ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ నుండి సి. అంజిరెడ్డి, బీఎస్‌పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్యలో త్రిముఖ పోటీ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 2,23,343 ఓట్లు పోల్ కాగా వాటిలో 28,686 ఓట్లు చెల్లుబాటు కానివిగా, గెలవడానికి కావాల్సిన కోటాఓట్లు 1,11,672 గా నిర్ధారించారు.
మొదటి ప్రాధాన్య ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డికి 70,565 ఓట్లు, బీఎస్‌పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి.[3][4] దీంతో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓటు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించగా పోటీలో ఉన్న 54 మంది ఎలిమినేట్ అయినా కోటా ఓట్లు ఎవరికి లభించలేదు.ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత అంజి రెడ్డి 98,637 ఓట్లతో ప్రథమ స్థానం పొందగా, నరేందర్ రెడ్డి 93,531 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా అంజిరెడ్డికి అదనంగా 22,962 ఓట్లు రాగా, నరేందర్‌రెడ్డికి 22,966 ఓట్లు వచ్చాయి. దీంతో ఆ ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అంజిరెడ్డిని 5,106 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.[5]
మూలాలు
మార్చు- ↑ HMTV (27 March 2019). "ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
- ↑ Sakshi (27 March 2019). "ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి జీవన్ రెడ్డి విజయం". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
- ↑ "ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. నెక్ట్స్ స్టెప్ ఇదేనా." Andhrajyothy. 5 March 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "కొనసాగుతోన్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో భాజపా అభ్యర్థి". Eenadu. 5 March 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "భాజపాకే పట్టాభిషేకం". 6 March 2025. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.