ప్రధాన మెనూను తెరువు

కర్మ అనేది హిందూ మతం లో ఒక సిధ్ధాంతం, అది అకస్మికంగా సంభవించే సంఘటనలను, గతంలో మనిషి చేసిన మంచి పనులకు మంచి పరిణామాలూ, చేసిన చెడుకి చెడు పరిణామాలు ఉంటాయనీ, ఇది ఆత్మ యొక్క పునర్జన్మ పొందిన జీవితాల[1]లో స్పందనలూ, ప్రతిస్పందనల వ్యవస్థ ఒకటి సృష్టిస్తుందని విశ్లేషిస్తూ, ఆ వ్యవస్థ ద్వారా కర్మ సిధ్ధాంతం యొక్క ఆకస్మిక సంఘటనని వివరిస్తుంది. ఈ ఆకస్మికమయిన సంఘటనలు కేవలం భౌతిక ప్రపంచానికే కాక మన ఆలోచనలకు, మాటలకు, చేసే పనులకు, మన ఆజ్ఞానుసారం ఇతరులు చేసే పనులకు కూడా వర్తిస్తాయి.[2] పునర్జన్మల చక్రం అంతమయినపుడు, ఒక మనిషి మోక్షం పొందాడనీ, లేదా సంసార బంధనాల నుండి విముక్తి పొందాడనీ చెబుతారు.[3] అన్ని జన్మలూ, మానవ జన్మలు కావు. భూమి మీద జనన మరణాల చక్రం 84 లక్షల జీవాకృతుల నుండి ఏర్పడుతుందని అంటారు, కానీ మానవ జన్మలో మాత్రమే ఈ చక్రం నుండి విముక్తి లభిస్తుంది.[4]

వ్యాసక్రమం
హిందూ మతం

ఓం

చరిత్ర · దేవతలు
Denominations
Mythology

ధర్మము · Artha ·
కామము · మోక్షము ·
కర్మ · సంసారం
యోగ · భక్తి · మాయ
పూజ  · హిందూ దేవాలయం

వేదములు · ఉపనిషత్తులు
రామాయణం · మహాభారతము
భగవద్గీత · పురాణములు
ధర్మ శాస్త్రములు · others

సంబంధిత విషయాలు

en:Hinduism by country
Gurus and saints
Reforms · Criticism
హిందూ కేలండర్ · హిందూ చట్టము
ఆయుర్వేదం · జ్యోతిష్యము
వర్గం:హిందువుల పండుగలు · Glossary

హిందూ స్వస్తిక గుర్తు

విషయ సూచిక

మూలాలుసవరించు

కర్మ ఫలితంగా ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి ప్రయాణిస్తుందన్న సిధ్ధాంతం, ఋగ్వేదంలో కనిపించదు.[5] కర్మ సిధ్ధాంతం మొదటగా భగవద్గీతలో (c.3100BC) బలంగా కనపడుతుంది.కర్మ అనే విషయము పురాణాలలో ఉదహరించబడింది.[6] కలియుగంలో పురాణాలకు సంబంధించిన జ్ఞానాన్ని నాశనం కాకుండా సంరక్షించడానికి వ్యాసమహాముని పురాణాలను ద్వాపర యుగాంత సమయంలో రచించాడని చెబుతారు.[7][8] అదే జ్ఞానాన్ని మునులు అంతకుముందు జ్ఞాపకం ఉంచుకుని, కేవలం నోటిమాట ద్వారా మాత్రమే ఈ జ్ఞానాన్ని ఇతరులకు అందచేసేవారు.[9] శ్రీ యుక్తేశ్వరుని ప్రకారం, చివరి కలియుగం 700 B.C.లో మొదలయ్యింది.[10]

నిర్వచనాలుసవరించు

"కర్మ" అనే మాటకు సరి అయిన అర్థం "కార్యము" లేదా "కృత్యము", మరింత విస్తారముగా చెప్పలంటే, అది కారణము మరియు పరిణామము, స్పందన మరియు ప్రతిస్పందనల యొక్క విశ్వజనీనమయిన సూత్రమును పేర్కొంటుంది, హిందువులు దానిని మనిషి యొక్క చేతనని నడిపించేదిగా నమ్ముతారు.[11] కర్మ అంటే విధి కాదు, ఎందుకంటే మనిషి తన జీవితంలో రాబోవు పరిణామాలను తన స్వేచ్ఛానుగతమయిన సంకల్పము చేత నిర్దేశించబడిన చేతల ప్రభావంతో సృష్టించుకుంటాడు. వేదాల ప్రకారము, మనం మంచితనాన్ని నాటితే మంచి ప్రతిఫలాన్ని పొందుతాము, చెడుని నాటితే, చెడు ఫలితాన్ని పొందుతాము. కర్మ అనేది మన కార్యాలని అన్నింటినీ సమష్టిగా సూచించి వాటికి ప్రస్తుత జీవితంలోనూ, గత జన్మలలోనూ అనుసరించి ఉన్న ప్రతిస్పందనలను సూచిస్తుంది, ఇవన్నీ మన భవితవ్యాన్ని నిర్ధారిస్తాయి. కర్మను జయించడము తెలివయిన కార్యాచరణలోనూ మరియు నిశ్చలమయిన ప్రతిస్పందనలోనూ ఉంది. అన్ని కర్మ ఫలితాలూ వెంటనే సంభవించవు. కొన్ని జమ అయ్యి, ఈ జన్మలోనో లేదా ఇతర జన్మల్లోనో అనుకోని విధంగా సంభవిస్తాయి.[11] మనం నాలుగు విధాలుగా కర్మని ఉత్పత్తి చేస్తాము:[12]

 • ఆలోచనల ద్వారా
 • మాటల ద్వారా
 • మనమే చేపట్టే మన కార్యాల ద్వారా
 • మన ఉపదేశాలను అనుసరించి ఇతరులు చేసే కార్యాల ద్వారా

మనం ఆలోచించేది, మాట్లాడేది, చేసేది లేదా దేనికైనా కారణమయ్యేది అంతా కూడా కర్మ; ఈ క్షణంలో మనం ఆలోచించేది, మాట్లాడేది లేదా చేసేది కూడా కర్మే.[2] హిందూ శాస్త్రాలు కర్మను మూడు రకాలుగా విభజిస్తాయి:[2]

 • సంచిత అనేది కూడబెట్టబడిన కర్మ. అన్ని కర్మలనూ ఒకే జీవితంలో అనుభవించడం, భరించడం అనేది అసాధ్యం. ఈ సంచిత కర్మ యొక్క ఖాతాలోనుండి, చేతిలో పట్టేటన్ని ఒక జీవితంలో అనుభవించడానికి వెలికి తీయడం జరుగుతుంది, ఈ కార్యాలు, ఫలించడం మొదలు పెట్టి, అవి ఫలించాకనే వాటిని అనుభవించడం ద్వారా తరిగిపోతాయి, వేరే విధంగా కాదు, దానిని ప్రారబ్ధ కర్మ అని అంటారు.
 • ఫలించగలిగే ప్రారబ్ధ కర్మ అనేది కూడబెట్టబడిన కర్మలోని ఒక భాగం, అది "పండి", ప్రస్తుత జీవితంలో ఒక ప్రత్యేకమైన సమస్యగా గోచరిస్తుంది.
 • క్రియమాన అనేది ప్రస్తుత జీవితంలో మనం ఉత్పత్తి చేసేది. అన్ని క్రియామాన కర్మలూ సంచిత కర్మలో జమ అయ్యి, తదనంతరముగా మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. మానవజన్మలో మాత్రమే మనం మన భవిష్యత్గమ్యాన్ని మార్చుకోగలము. చనిపోయాక మనం మన క్రియా శక్తి (పని చేయకలిగే శక్తి) కోల్పోయి, (క్రియామాన) కర్మను మళ్ళీ మనిషి శరీరంలో జన్మించేంతదాకా చేయలేము.

స్పృహతో చేసిన కార్యాలు, స్పృహ లేకుండా అంటే తెలీకుండా చేసిన వాటికంటే చాలా భారీగా ఉంటాయి. ఎలాగయితే విషం తెలీకుండా తీసుకున్నా కూడా మనల్ని ప్రభావితం చేస్తుందో అలాగే, మనకు తెలీకుండా ఇతరులని బాధిస్తే, దానికి కూడా తగిన విధమైన కార్మిక ప్రభావం ఉంటుంది. మంచి చెడుల మధ్య తేడా తెలిసిన మనుషులు మాత్రమే (క్రియామాన) కర్మను చేయగలరు.[12] జంతువులు మరియు చిరుప్రాయంలో ఉన్న పిల్లలు కొత్త కర్మని సృష్టించడం లేదు (అందుకని వాళ్ళు తమ భవిష్యద్గమ్యాన్ని ప్రభావితం చేసుకోలేరు) ఎందుకంటే వాళ్ళు మంచి, చెడుల మధ్య తారతమ్యం గ్రహించలేరు. కానీ స్పర్శా జ్ఞానం కలిగిన ప్రతి జీవీ కర్మ యొక్క ప్రభావమును అనుభవించగలదు, అవి వాటికి ఆనందము మరియు బాధగా తెలుస్తాయి.[13]

తులసిదాస్ అనే హిందు సాధువు ఈ విధంగా అన్నాడు: "మన శరీరం సృష్టిలో భాగం కాక ముందే మన గమ్యం నిర్దేశించబడుతుంది." [4]సంచిత కర్మ లోని ఖాతా అంతమయ్యే వరకూ, దానిలోని కొంచం భాగము ఒక జీవిత కాలంలో ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి వెలికితీయడం జరుగుతుంది, అది జనన మరణ చక్రానికి దారితీస్తుంది. జీవుడు జమకాబడిన సంచిత కర్మ పూర్తిగా తరిగిపోయేంత వరకూ జనన మరణాల చక్రం నుండి మోక్షం పొందలేడు.[14]

భూమిపైన జనన మరణాల చక్రం అనేది 84 లక్షల జీవాకృతుల నుండి ఏర్పడుతుంది, వాటిల్లో ఒకటి మాత్రమే మానవ జన్మ. మనుషులుగా మాత్రమే మనం మన గమ్యస్థానం కోసం సరి అయిన సమయంలో సరి అయిన విధంగా ఏదో ఒకటి చేసే స్థానంలో ఉంటాము. మంచి పనుల వల్ల, స్వచ్ఛమయిన ఆలోచనల వల్ల, ప్రార్థన వల్ల, మంత్రము మరియు ధ్యానం వల్ల, మనం కర్మ యొక్క ప్రభావాన్ని ప్రస్తుత జీవితంలో తగ్గించుకోగలిగి, మన గమ్యాన్ని బాగు చేసుకోగలము. మన కర్మ ఏ రకంగా, ఏ వరుసక్రమంలో పరిపక్వం చెందుతుందో అన్న విషయం తెలిసిన ఆధ్యాత్మిక గురువు మనకి సాయపడగలడు. మనుషులుగా మనం మంచి పనులు చేయడమనే అభ్యాసం ద్వారా మన ఆధ్యాతిమ పురోగమనాన్ని త్వరితం చేసుకోగల అవకాశం ఉంది. మనకు జ్ఞానము లేదా స్పష్టత లేక పోవడం వలన మనము చెడు కర్మను ఉత్పత్తి చేస్తాము.[4]

నిర్దయగా ఉండటం చెడిపోయిన ఫలాలను ఉత్పత్తి చేస్తుంది, వాటిని పాపం అంటారు, మంచి పనులు తియ్యటి ఫలాలను తీసుకువస్తాయి, వాటిని పుణ్యము అంటారు. మనం చేసే పనులకు తగ్గట్లుగా మనం తయారవుతాము: సన్మార్గపు కార్యాల వలన సన్మార్గులుగానూ, దుర్మార్గపు కార్యాల వల్ల దుర్మార్గులుగానూ మారతాము.[11]

దైవిక శక్తుల పాత్రసవరించు

దైవికమయిన శక్తులు కర్మ యొక్క ప్రభావాలను నియంత్రించడం లేదా నియంత్రించక పోవడం అనే విషయం గురించి హిందూ మతంలో అనేక భిన్నమయిన దృష్టి కోణాలుంటాయి, కొన్ని ఇప్పటికీ నశించకుండా ఉన్నవి మరి కొన్ని చారిత్రాత్మకమైనవి.

వేదాంతపు దృష్టికోణంసవరించు

హిందూ మతంలో ప్రసిధ్ధి గాంచిన అభ్యాసమయిన వేదాంతాన్ని అనుసరించే వాళ్ళు, ఈశ్వరుడు, ఒక వ్యక్తిగతమయిన సర్వశక్తిమంతుడయిన దేవుడు, ఆ పాత్రను పోషిస్తాడని విశ్వసిస్తారు.[15] వేదాంతపు దృష్టికోణం ప్రకారం, సర్వశక్తిమంతుడయిన దేవుడు కర్మలను అమలు చేసేవాడు కానీ మనుషులకు మంచి లేదా చెడుని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది.

ఈ ఆస్తిక వాదపు ఆలోచనాక్రమంలో, ఉదాహరణకి బౌధ్ధ మతం, జైన మతంలో లాగా కర్మను కేవలం కారణము మరియు ప్రభావముల కార్యక్రమానుగత సిధ్ధాంతముగా చూడడం జరుగదు, కానీ అది సర్వశక్తిమంతుడయిన దేవుడి సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. సర్వశక్తిమంతుడయిన దేవుడి ఉదాహరణలలో, శైవ మతంలో శివుడు, వైష్ణవ మతంలో విష్ణువు ఉన్నారు. కర్మ యొక్క ఆస్తిక దృష్టికోణానికి సంబంధించిన సంగ్రహమును ఈ క్రింది వాక్యము చక్కగా వ్యక్తీకరిస్తుంది: "దేవుడు ఎవరినీ కారణం లేకుండా బాధించడు, అతను ఎవరినీ కారణము లేకుండా సంతోషపెట్టడు. దేవుడు చాలా న్యాయసహితంగా ఉండి మీరు దేనికయితే అర్హులో సరిగ్గా అదే మీకు అందజేస్తాడు." [16] అందుచేత ఆస్తికవాదపు అధ్యయన సరళి మానవ దురవస్థ యొక్క సమస్యకు కర్మ అనేది ఒక వివరణము అని నొక్కి చెబుతుంది; కర్మానుసారంగా ఒక ఆత్మ తగిన శరీరంలో పునర్జన్మ పొందుతుంది, అందుకే కొంత మంది మనుషులు తమ జీవిత కాలంలో తమ కార్యాల యొక్క ఫలాలు చూడలేరు ఇంకా కొంత మంది పిల్లలు ఏ పాపం చేయకుండానే మరణిస్తారు.[17] అందుకని, మనిషి తన వ్యక్తిగత కర్మల యొక్క ఫలాలను అనుభవించాల్సిందే. ఇంకా అతను అనేక జన్మలు, మొక్కలు, జంతువుల నుండి మనుషుల దాకా పొందే అవకాశం ఉంది, కర్మ ఫలాలను ఒక బాంకుతో (అంటే దేవుడు) పోల్చవచ్చు. అది బాంక్ ఖాతాలోని లెక్కలు పరిష్కారమయ్యేంత దాకా మనిషిని కర్మ యొక్క ప్రభావాల నుండి విముక్తుడిని చేయదు.[17]

సంఖ్యా దృష్టికోణంసవరించు

హైందవ మతపు కొన్ని మునుపటి చారిత్రక సంప్రదాయాలలో, సంఖ్యా అధ్యయన సరళికి చెందిన నాస్తిక వర్గానికి చెందిన వారు, సర్వశక్తిమంతుడయిన దేవుడి భావనను అంగీకరించరు. సంఖ్యా అధ్యయన సరళి ప్రకారం, ఒక సర్వశక్తిమంతుడయిన దేవుడు ఉండడు కానీ, కొంచం తక్కువ పరిణితి చెందిన శక్తులు కర్మఫలాలను అందచేయడంలో సహాయం చేస్తాయి. అందుచేత, వాళ్ళు దేవుళ్ళు లేదా ఆధ్యాత్మిక శక్తులు ఏదో ఒక పాత్రను పోషిస్తాయని భావిస్తారు.[18] ఈ శక్తులు ఐహిక ప్రపంచంలో మనిషి మనుగడ బాగుగా ఉండడానికి చేయూతనిచ్చి, జనన మరణ చక్రం పూర్తి అయ్యాక, మోక్షాన్ని కూడా ఇవ్వగలవు.[18]

మీమాంస దృష్టి కోణంసవరించు

హిందూ మతంలో మీమాంసకాలనబడే మునుపటి చారిత్రక సంప్రదాయాలు అలాంటి దైవికమయిన అవాస్తవిక భావనలు దేనికయినా బాధ్యత వహించడాన్ని తిరిస్కరించి, కర్మ దేని మీదా ఆధారపడకుండా పనిచేస్తుందని, కారణత్వం యొక్క సహజ సిధ్ధాంతాలు కర్మ యొక్క ప్రభావాన్ని వివరించడానికి చాలనీ అంటాయి.[19][20][21] వారి అభిప్రాయం ప్రకారం, సర్వశక్తిమంతుడయిన దేవుడు కానీ, తక్కువ పరిణితి చెందిన దైవత్వాలు కానీ ఉండవు; ఆచారకర్మలు మాత్రమే కర్మఫలాలను అందజేస్తాయి; అందుకని, కర్మలు (ఆచారకర్మలు) మాత్రమే ఫలితాలను అందివ్వగలవనీ, ఈశ్వరుడనే సర్వశక్తిమంతుడయిన దేవుడు గానీ లేదా తక్కువ దైవత్వంగల వారు గానీ ఉండరనీ, ఆ కారణాన ఈ ఫలితాలను వాళ్ళు ఇవ్వరనీ మీమాంసకులు నమ్ముతారు.[18]

వేదాంతపు ఖండనలుసవరించు

బ్రహ్మసూత్రాలలోని కొన్ని మార్గాలలో ఈ భిన్నమయిన అభిప్రాయాలు స్పష్టంగా గోచరిస్తాయి, వేదాంతములో బ్రహ్మసూత్రాలు చాలా ముఖ్యమయిన విషయము. వేదాంతము, హైందవ మతములోని ఒక పెద్ద అధ్యయయనవేదిక, ఈశ్వరుడి సిధ్ధాంతాన్ని బలపరిచి, ఒక వ్యక్తిగతమయిన సర్వశక్తిమంతుడయిన దేవుడిని కర్మ ఫలాలకు మూలంగా ఉంటాడని చెబుతుంది, కానీ వ్యతిరేక భావనలను ఖండించే ఉద్దేశంతో పరిగణనలోకి తీసుకుంటుంది. ఉదాహరణకి స్వామి శివానంద యొక్క బ్రహ్మ సూత్రాల లోని స్లోకము III.2.38 మీద వ్యాఖ్యానము కర్మఫలాలను అందించేవాడిగా ఈశ్వరుడి (ప్రభువు) పాత్రను సూచిస్తుంది.[22] అదే శ్లోకం పైన స్వామి వీరేశ్వరానందుడి వ్యాఖ్యానం, ఈ శ్లోకం యొక్క లక్ష్యం మనిషి యొక్క కర్మలకు ఫలితాన్నిచ్చేది కర్మే కానీ ఈశ్వరుడు కాదన్న మీమాంసకుల అభిప్రాయాలను ప్రత్యేకంగా ఖండించేందుకేనని చెబుతుంది. మీమాంసకుల ప్రకారం, ఈ లక్ష్యం కోసం ఒక ఈశ్వరుడిని స్థాపించడం అనవసరం, ఎందుకంటే కర్మ అనేది తనకు తానై ఒక భవిష్యద్కాలంలో ఫలితాన్ని ఇవ్వగలదు.[23]

గీతార్థ వివరణలు గురువు యొక్క పాత్రసవరించు

భగవద్గీత[24] లోని కొన్ని తాత్పర్యములు ఒక తటస్థమయిన దృక్కోణాన్ని సూచిస్తాయి, అవి కర్మ అనేది కారణహేతువు దాని ప్రభావముల యొక్క సిధ్ధాంతామని చెబుతాయి, కానీ దేవుడు తన భక్తుల కోసం కర్మ యొక్క ప్రభావాన్ని ఉపశమింపజేయకలడు అని కూడా చెబుతాయి.[ఉల్లేఖన అవసరం] కానీ భగవద్గీతలోని శ్లోకాల మరో అర్థం, కర్మలను అమలు చేయువాడు తుదకు దేవుడు ఒక్కడే అని సూచిస్తుంది.[25]

మరొక అభిప్రాయం ప్రకారం, సద్గురువు దేవుడి తరఫున పనిచేస్తూ, శిష్యుడి యొక్క కర్మ ప్రభావాన్ని ఉపశమింపచేయగలడు లేదా అతనికి తగిన విధంగా కర్మ ప్రభావాన్ని నిర్దేశించగలడు.[26][27][28]

సర్వశక్తిమంతుడయిన దేవుడిని నమ్మే ఆస్తికవాద హిందూ సంప్రదాయాల దృష్టికోణాలుసవరించు

వేదాంతముసవరించు

కర్మ కేవలం కారణహేతువు దాని ప్రభావాల యొక్క సిధ్ధాంతమని చెప్పే బౌధ్ధ, జైన మరియు ఇతర హిందూ మతపు దృష్టికోణాలతో హిందూ మతపు వేదాంతం లాంటి ఆస్తిక వాదపు అధ్యయనవేదికలు అంగీకరించవు, అవి అదనముగా కర్మ అనేది వ్యక్తిగతమయిన సర్వ శక్తిమంతుడయిన దేవుడి సంకల్పము చేత మధ్యస్తం కూడా చేయబడుతుందని చెబుతాయి.

శంకర (అద్వైతము)సవరించు

వేదాంత విషయమయిన బ్రహ్మ సూత్రాల (III, 2, 38, మరియు 41) మీద వ్యాఖ్యానిస్తూ, ఆది శంకరుడు, వేదాంతపు అధ్యయన వేదికకు కొమ్మవంటిదయిన అద్వైత వేదాంతమనే సిధ్ధాంతానికి బలము చేకూర్చిన భారతీయ తత్త్వవేత్త, తొలుత చేసిన కర్మ క్రియలు ఒక భవిష్యత్ సమయంలో తమంత తాము సరి అయిన ఫలితాలను ఇవ్వవని; అతీంద్రియమయిన, బుధ్ధితో సంబంధము లేని లక్షణమయిన అదృష్టము కూడా ఏమీ చేయలేదనీ - వీక్షింపలేని శక్తి అయిన పని దాని ఫలితముల మధ్య ఆధ్యాత్మిక సంబంధం వాటంతట అవే సరి అయిన, న్యాయసమ్మతమైన ఆనందము మరియు బాధ కలగజేయడంలో మధ్యస్తం చేస్తాయనీ వాదించాడు, అతని ప్రకారం, ఫలాలు అనేవి, చేతనావస్థలో ఉన్న ప్రతినిధి, అంటే, ఒక సర్వశక్తిమంతుడయిన దేవుడి (ఈశ్వరుడు) యొక్క కార్యం ద్వారానే లభించడం సంభవం.[29]

మనిషి యొక్క కర్మసంబంధమయిన కార్యములు యోగ్యత మరియు అయోగ్యతలకు దారి తీస్తాయి. అచేతనమయిన వస్తువులు తమంత తామే సాధారణంగా కదలవు, అవి ఒక ప్రతినిధి కారణంగానే (ఉదాహరణకి, గొడ్డలి ఒక ప్రతినిధి చేత ఊపబడినపుడు మాత్రమే కదులుతుంది) కదులుతాయి, కర్మ సిధ్ధాంతమనేది ఒక బుధ్దితో సంబంధము లేని, అచేతనమయిన సిధ్ధాంతం కాబట్టి, మనుషులు తమ కర్మల చేత సంపాదించిన యోగ్యతలు, అయోగ్యతలను ఎరిగిన సచేతనమయిన దేవుడు ఉండి తీరాలని, అతను మనుషులు తమ కర్మలకు తగిన ఫలితాలు పొందడానికి దోహదపడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాడనీ వాదిస్తాడు.[30] అందుకని, దేవుడు ఒక వ్యక్తి యొక్క పర్యావరణాన్ని, అణువులదాకా కూడా, ప్రభావితం చేస్తాడు, అంతే కాక పునర్జన్మ పొందే ఆత్మల కోసం, సరి అయిన పునర్జన్మపు శరీరాన్ని ఉత్పత్తి చేస్తాడు, ఇదంతా ఆ వ్యక్తి కర్మానుసారంగా తగిన అనుభవాలు పొందడం కోసమే.[31] అందుచేత, దేవుడనే ఒక ఆస్తిక నిర్వాహకుడు లేదా కర్మ పర్యవేక్షకుడు ఉండి తీరాలి.

అద్వైతంలో పండితుడు అయిన స్వామి శివానంద, బ్రహ్మ సూత్రాల పైన వేదాంతపు దృక్కోణాలను సంకలనం చేసిన వ్యాఖ్యానంలో అవే అభిప్రాయాలను పునరుద్ఘాటించారు. బ్రహ్మసూత్రాలలోని మూడో అధ్యాయం పై వ్యాఖ్యానంలో, శివానంద, కర్మ అచేతనమయినది, తక్కువ కాలం జీవించేదనీ, కార్యము అమలు చేయగానే అది ఇక ఉండదనీ చెప్పాడు.

అందుకని, ఒకని యోగ్యత ప్రకారము, భవిష్యత్తులో ఒక రోజున కర్మ అనేదే కర్మ ఫలితాన్నివ్వలేదు. అంతే కాక, కర్మ అనేది అపూర్వ లేదా పుణ్యాన్ని ఉత్పత్తి చేస్తుందని, అది ఫలాన్నిస్తుందని ఎవ్వరూ వాదించలేరు. అపూర్వ అచేతనమయినది కాబట్టి, దేవుడు అనే బుధ్ధిజీవి కదల్చకుండా అది పని చేయదు. దానంతట అదే ప్రతిఫలాన్నో లేదా శిక్షనో ఇవ్వలేదు.[32]

ఈ సిధ్ధాంతాన్ని ఉదహరిస్తూ, స్వామి శివానంద యొక్క శ్వేతాస్వతర ఉపనిషత్తు యొక్క అనువాదములోని ఒక భాగం ఉంది:

అందమయిన ఈకలు కలిగిన రెండు పక్షులు - విడదీయలేని స్నేహితులు - ఒకే చెట్టు మీద జీవిస్తాయి. ఈ రెండింటిలో ఒకటి తియ్యని ఫలాన్ని తింటూ ఉంటుంది, రెండోది తినకుండా చూస్తూ ఉంటుంది.

అతని వ్యాఖ్యానములో, మొదటి పక్షి ఒక అఖండమయిన ఆత్మ, రెండోది బ్రాహ్మణ్ లేదా దేవుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆత్మ అనేది అత్యవసరముగా బ్రాహ్మణ్ యొక్క ప్రతిబింబము. చెట్టు శరీరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆత్మ తనను తాను శరీరముతో గుర్తించుకుంటుంది, దాని కర్మల యొక్క ఫలాలను అనుభవించి పునర్జన్మను పొందుతుంది. ప్రభువు మాత్రమే శాశ్వతమయిన సాక్షిగా నిలిచి, ఎప్పుడూ సంతుష్ఠుడయి ఉంటాడు, ఎప్పుడూ తినడు. ఎందుకంటే అతను తినేవాడినీ, తినబడే దానినీ నిర్దేశించేవాడు.

సామాజిక అసమానతలు, విధి, విశ్వజనీనమైన శోకముల కారణంగా పక్షపాతము మరియు క్రౌర్యము అనబడే ఆరోపణలను ఎదుర్కునే దేవుడు ఆ ఆరోపణల ప్రభావం పైబడకుండా స్వేచ్ఛగా ఉంటాడని కూడా స్వామి శివానంద చెబుతాడు. బ్రహ్మసూత్రాల ప్రకారము, తమ విధికి అఖండమయిన ఆత్మలు తామే బాధ్యులు; దేవుడు కేవలం, ఆత్మల యోగ్యత, అయోగ్యతలకు సాక్షి మరియు ఫలాలను అందజేసేవాడు మాత్రమే.

బ్రహ్మ సూత్రాలలోని రెండవ అధ్యాయము పై వ్యాఖ్యానములో, శివానంద, కర్మకు సంబంధించి దేవుడి స్థానము వర్షము అనే పోలికతో వివరించవచ్చని చెబుతాడు. వర్షము వలన, బియ్యము, యవలు మరియు ఇతర మొక్కలు పెరిగినప్పటికీ, అనేక జీవరాశుల మధ్య తారతమ్యాలు, ఆయా విత్తనాలలో దాగి ఉన్న వైవిధ్యమయిన శక్యతలను బట్టి ఉంటాయి. అందుచేత, శివానంద, జీవాల యొక్క వర్గాలలోని తారతమ్యాలకు కారణం అఖండమయిన ఆత్మల యొక్క యోగ్యతలే అని వివరిస్తాడు. జీవముల యొక్క ప్రత్యేకమయిన కార్యములను దృష్టిలో ఉంచుకుని మాత్రమే దేవుడు ప్రతిఫలాన్ని, శిక్షనీ అందజేస్తాడని అతను తుది అభిప్రాయం తెలియజేస్తాడు.[33]

వేదాంతంలో ఇతర అధ్యయన వేదికలుసవరించు

వేదాంతములోని ఇతర అధ్యయన వేదికలలో కర్మను ఏ విధంగా పరిగణిస్తారో వైష్ణవ మతానికి చెందిన భాగములో చర్చించడం జరిగింది.

శైవ మతంసవరించు

తిరుజ్ఞాన సంబంధార్సవరించు

 
స్పందన మరియు ప్రతిస్పందనలుగా కర్మ: మనము మంచిని నాటితే, మంచిని ఫలముగా పొందుతాము.

శైవ సిధ్ధాంత అధ్యయన వేదికకు చెందిన తిరుజ్ఞాన సంబంధార్, 7వ శతాబ్దం C.E.. శైవమతానికి చెందిన తన సంక్షిప్తమయిన వివరణలో కర్మ గురించి వ్రాస్తాడు. అతను హిందూ మతములోని కర్మ అనే విషయమును దేవుడు అనే బాహ్యమయిన శక్తి యొక్క ఉనికి అవసరం లేని బౌధ్ధ మతము మరియు జైన మతములతో పోల్చి వృత్యాసమును వివరిస్తాడు. వాళ్ళ నమ్మకాలలో, ఎలాగయితే లేగదూడ పాలు తాగే సమయంలో అనేక ఆవులలో తన తల్లిని కనిపెట్టగలదో, అలాగే కర్మ కూడా తాను ఎవరికి వర్తించాలో ఆ ప్రత్యేకమయిన మనిషిని కనిపెట్టి, అతనితో ముడిపడి ఫలంగా మారుతుంది.[34] కానీ హిందూ మతపు ఆస్తిక వాద అధ్యయన వేదికలు, కర్మ అనేది, దూడ లాగా కాకుండా బుధ్ధితో సంబంధం లేని సమూహం అంటాయి.[34]

అందుచేత, కర్మ అనేది తనంత తాను తగిన మనిషిని కనిపెట్టలేదు. కర్మ అనేది తగిన మనిషితో ముడిపడడానికి ఒక తెలివయిన సర్వశక్తిమంతుడయిన శక్తి, పరిపూర్ణమయిన వివేకము మరియు శక్తి (ఉదాహరణకి, శివుడు) యొక్క అవసరం ఉన్నదని శ్రీ సంబంధా తన తుది అభిప్రాయంలో సెలవిస్తాడు.[34] ఆ దృష్టితో చూస్తే, దేవుడు అనేవాడు, ఒక దైవికమయిన జమాఖర్చు లెక్కల అధికారి.[34]

అప్పయ్య దీక్షితసవరించు

శైవమతానికి చెందిన వేదాంతి మరియు శివ అద్వైతాన్ని ప్రతిపాదించే అప్పయ దీక్షిత, కర్మ సిధ్ధాంతం ప్రకారం, మనిషికి సంతోషము మరియు దుఃఖము ఇచ్చువాడు శివుడు మాత్రమే అని సెలవిస్తాడు.[35] కనుక మనుషులు వాళ్ళంతట వాళ్ళే గతజన్మ వాసనల ప్రభావముతో పొందిన తమ కోరికలను బట్టి మంచి పనులో లేదా చెడ్డ పనులో చేస్తారు, ఆ కర్మానుసారముగా, కర్మసిధ్ధాంతమును పరిపక్వం చేయడం కోసం కొత్త జన్మ తయారవుతుంది. శైవులు, జన్మల యొక్క చక్రాలు ఉంటాయనీ అందులో ఆత్మలు కర్మానుసారముగా, ప్రత్యేకమయిన శరీరాల దిశగా ఆకర్షితమవుతాయని, ఆ శరీరం అనేది బుధ్ధితో సంబంధం లేని లక్ష్యం అనీ అందుచేత అది శివుడి సంకల్పం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందనీ నమ్ముతారు. అందుకని, చాలా మంది కుల వ్యవస్థకు కర్మానుసారముగా అర్థం చెబుతారు, అందులో మంచి పనులు చేసిన వారు ఉన్నతమయిన ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మిస్తారు (అంటే బ్రాహ్మణ కులం కావచ్చు).

శ్రీకంఠుడుసవరించు

శివ అద్వైతాన్ని ప్రతిపాదించే మరొక శైవమతపు వేదాంతి, శ్రీకంఠుడు, అఖండమయిన ఆత్మలు తమంత తామే తమ కార్యములకు, హేతువుగా పరిగణించదగ్గ పనులను చేస్తాయి, లేదా ప్రత్యేకమయిన కార్యములు చేయకుండా ఉంటాయి, అది వాటి గతములోని కార్యాల పరిపక్వత యొక్క స్వభావానుసారముగా జరుగుతుంది అని నమ్ముతాడు.[36] ఆ పైన శివుడు మాత్రమే ఒక మనిషి ఏదయినా పని చేయాలనుకున్నపుడు, లేదా చేయకుండా ఉండాలనుకున్నపుడు ఆ మనిషికి సాయం చేస్తాడని శ్రీకంఠుడు నమ్ముతాడు. కర్మ తన ప్రభావాలను నేరుగా ఉత్పత్తి చేస్తుందన్న అభిప్రాయానికి, శ్రీకంఠుడు, కర్మ బుధ్ధితో సంబంధము లేనిది కాబట్టి, వివిధ జన్మల ద్వారా, శరీరాల ద్వారా నానావిధమయిన ప్రభావాలను ఉత్పత్తి చేస్తుందని అనుకోరాదని చెబుతాడు; కర్మఫలాలు నెరవేర్చడం అనేది మనిషి యొక్క స్వేచ్ఛానుగతమయిన సంకల్పానికి తగ్గట్లుగా, దేవుడి సంకల్పంతో జరుగుతుంది, లేదా మనిషి యొక్క సొంత కర్మ చేత తరువాతి దశలలో నిశ్చయించిన విధముగా జరుగుతుంది, కర్మ యొక్క ముద్రలన్నింటినీ సరి అయిన క్రమంలో పంచి ఇవ్వడం అనేది శివుడి దయ వలన సంభవిస్తుంది.[36] ఈ విధంగా, స్వేచానుగతమయిన సంకల్పముచేత వ్యక్తీకరించబడిన మనిషి యొక్క నైతిక బాధ్యత లేదా మన కర్మానుసారముగా నిశ్చయింపబడిన వాటి పట్ల ఏ అపోహ లేకుండా, ఒక వైపు మన కర్మలకు తుదకు దేవుడే బాధ్యుడు, మరొక వైపు మన కర్మానుసారముగా సుఖ దుఃఖాలను అనుభవించడానికి కూడా ఆయనే బాధ్యుడు.[36] శ్రీకంఠుని దృక్కోణము యొక్క మంచి సంగ్రహము ఏమిటి అంటే "మనిషి తాను సంకల్పించిన విధముగా నడుచుకోడానికి తానే బాధ్యుడు, ఎందుకంటే శివుడు మాత్రమే, ఆత్మ యొక్క కర్మానుసారముగా అవసరాలను తీరుస్తాడు.[37]

వైష్ణవ మతంసవరించు

కర్మా నుసారముగా , అన్ని జీవరాశులూ విశ్వమంతా సంచరిస్తూ ఉంటాయి. కొన్ని పైభాగపు గృహవ్యవస్థలలోకి ఎదుగుతాయి, మరికొన్ని దిగువనున్న గృహ వ్యవస్థలలోకి దిగజారతాయి. అలా సంచరిస్తోన్న లక్షల కొలది జీవరాశులలో , అదృష్టవంతుడయిన వాడు ఎవడో, కృష్ణుడి దయ చేత ఒక మంచి ఆధ్యాత్మిక గురువుతో సంబంధం కలిగే అవకాశం పొందుతాడు. కృష్ణుడు మరియు ఆధ్యాత్మిక గురువు యొక్క అనుగ్రహము వలన, అలాంటి వ్యక్తి భక్తితో కూడిన సేవ యొక్క తీగ యొక్క విత్తనాన్ని అందుకుంటాడు." (C.C. మధ్య 19-151-164) "భక్తితో కూడిన సేవ చేయని జ్ఞానులు, యోగులు మరియు కర్మచేయువారిని అపరాధులని అంటారు. శ్రీ చైతన్య మహాప్రభు, మాయావాది కృష్ణే అపరాధి, అంటాడు: ఎవడయితే అంతా కృష్ణుడని ఆలోచించకుండా, అంతా మాయేనని ఆలోచిస్తాడో, వాడు అపరాధి.[38] విస్తారమయిన దృష్టికోణంలో కర్మ అనేది ఏ కార్యకలాపముకు అయినా వర్తిస్తుంది, కానీ దాని అర్థం తరచుగా వేదముల ఆజ్ఞానుసారముగా, వాటి హద్దులలో ఫలితాలను అనుభవించే ఉద్దేశంతో చేసే కార్యాలు అని చెప్పబడుతుంది. (మరొక పదం వికర్మ అనేది వేదాలు నిషేధించిన కార్యకలాపాన్ని సూచించడానికి ఉపయోగించేది). అందువలన కర్మకి మతపరమయిన హోదా ఉన్నప్పటికీ, అది ఇప్పటికీ ప్రాపంచిక విషయాలతో సంబంధము కలిగినదే. డబ్బు, ఇంద్రియ లాలస, జీవితములో పరపతి, తదుపరి జన్మలో ఉన్నతమయిన గృహాలకు పదోన్నతి లాంటి ప్రతిఫలాలు పొందడం పట్ల కర్మ చేయువాడు ఆసక్తి కలిగి ఉంటాడు. కర్మలోని అతిపెద్ద లోపం ఏమిటి అంటే, అది ఎల్లప్పుడూ ప్రతిస్పందలకు దారి తీస్తుంది, అది ఆత్మ ఒక దేహంలో నుండి మరో దేహంలోకి ప్రవేశించడం ద్వారా, కర్మ చేయువాడిని మరొక ప్రాపంచికమయిన జన్మ పొందేలా చేస్తుంది. అందుచేత, మంచో, చెడో, పవిత్రమో, అపవిత్రమో, కర్మ అంతా కూడా మనిషిని జనన మరణ చక్రంలో భాగం చేసి తీరుతుంది."[39]

విష్ణు సహస్రనామముసవరించు

విష్ణు సహస్ర నామాలలోని అనేక పేర్లు, విష్ణువు యొక్క వెయ్యి పేర్లు కర్మను నియంత్రించడానికి సంబంధించి దేవుడి యొక్క శక్తిని సూచిస్తాయి. ఉదాహరణకి, విష్నువు యొక్క 135వ పేరు, ధర్మాధ్యక్ష అనే పదానికి అర్థం, అద్వైత తత్త్వవేత్త అయిన శంకరుడి వివరణ ప్రకారం, "ధర్మాన్నీ మరియు అధర్మాన్నీ ప్రత్యక్షంగా చూసి, దాని ప్రతిఫలాలను జీవులకు అందజేసేవాడు." [40]

దేవుడి యొక్క ఈ స్వభావాన్ని సూచించే ఇతర పేర్లలో, భావనః, 32వ పేరు, విధాత, 44వ పేరు, అప్రమత్తః, 325వ పేరు, స్థనదః, 387వ పేరు మరియు శ్రీవిభవనః, 609వ పేరు ఉన్నాయి.[41] శంకరుని వివరణ ప్రకారం, భావనః అంటే, "అన్ని జీవాలకు కర్మానుసారముగా అనుభవించేందుకు ఫలములను ఉత్పత్తి చేయువాడు."[42] జీవుల అన్ని కర్మలకు ఫలాలను అందజేయువాడిగా విధిని నిర్వర్తించే ప్రభువుని గురించి బ్రహ్మ సూత్రములోని (3.2.28) "ఫలమతః ఉపపత్తే" అను పదాల సమూహము వివరిస్తుంది.[42]

రామానుజ (విశిష్ఠాద్వైతము)సవరించు

వేదాంతంలో ఒక శాఖ అయిన విశిష్టద్వైత అధ్యయనవేదికకు చెందిన రామానుజ, జీవితములోని అన్ని చెడు పరిణామాలకు జీవులు (మానవ ఆత్మలు) చేసే చెడు కర్మలు జమ అవ్వడం కారణమని దేవుడు అమల అనీ లేదా చెడు అనబడే మలినము లేనివాడనీ చెప్పి చెడు యొక్క సమస్యని వివరిస్తాడు.[43] శ్రీ భాష్యములో, వైష్ణవ ఆస్తికవాద దృష్టికోణం నుండి, బ్రహ్మ సూత్రాల యొక్క రామానుజుని వివరణ అయిన బ్రాహ్మణ్‌ను రామానుజుడు విష్ణువుగా భావిస్తాడు, అతనే సృష్టి యొక్క భిన్నత్వాన్ని అఖండ ఆత్మల వివిధ కర్మలకు తగినట్లుగా అమరుస్తాడు.[44]

శ్రీ భాష్యము 1.1.1లో రామానుజుడు, ప్రపంచములో అసమానత మరియు భిన్నత్వమునకు కారణం వివిధ ఆత్మల యొక్క కర్మల ఫలితంగానేననీ, సర్వత్రా ఉన్న ఆత్మ యొక్క శక్తి, కర్మ మూలాన సుఖ దుఃఖాలను అనుభవిస్తుందనీ పునరుద్ఘాటిస్తాడు.[45] కర్మ ఫలాల మధ్య వృత్యాసం, అంటే, మంచి మరియు చెడు కర్మ, కర్మను అమలు చేసే విష్ణువు వల్లనే ఉంటుంది, అయినా కూడా ఆత్మలకి మాత్రమే తమ తమ కర్మలను చేయడానికి స్వేచ్ఛ మరియు బాధ్యత ఉంటుంది.[45]

అంతే కాకుండా, తనను ప్రసన్నుడిని చేసుకునే కర్మలను చేయాలన్న సంకల్పంతో ఉన్నవారికి వాళ్ళ మనసులలో మంచి పనులు చేయాలనే కోరికను కలుగచేసి, తనను పొందే మార్గం సుగమం చేసే ప్రయత్నం ఒక వైపు, మరొక వైపు, తనకు నచ్చని పనులు చేయాలన్న సంకల్పముతో ఉన్నవారిని శిక్షించే ఉద్దేశముతో వారి మనసులలో చెడ్డ పనులు చేయడం వలన సంతోషం కలుగునట్లు చేసి తనని పొందే మార్గాన్ని జటిలం చేసి వాళ్ళు అధోగతి పాలయ్యే పని విష్ణువు చేస్తాడని రామానుజుడు నమ్ముతాడు.[46]

మధ్వ (ద్వైతము)సవరించు

వేదాంతంలో మరో శాఖ అయిన, ద్వైత అధ్యయన వేదిక యొక్క స్థాపకుడు అయిన మధ్వాచార్యుడు, మరో వైపు, కర్మకి ఆది అనేది లేకపోయినా, అది చెడు అన్న సమస్యకు కారణం అయినా కూడా కర్మలలో వృత్యాసములకు ఒక మూల కారణం ఉండి తీరాలని నమ్ముతాడు.[47] మంచి నుండి చెడు దాకా, జీవులకు వివిధ రకాలయిన కర్మలు ఉండడం వలన, కాలం మొదలయినప్పటి నుండి అందరూ కచ్చితంగా ఒకే రకమయిన కర్మతో మొదలుపెట్టి ఉండరు. అందువలన, క్రీస్తు మతపు సిధ్ధాంతములాగా, జీవములన్నీ (ఆత్మలు) దేవుడి సృష్టి అనుకోరాదనీ, అవి విష్ణువుతో కలిసి జీవించే రాశులనీ అయితే వాటిపైన అతనికి సంపూర్ణమయిన నియంత్రణ ఉంటుందనీ తుది అభిప్రాయం వెలిబుచ్చుతాడు. తమ ప్రాచీనమయిన స్వభావములో మరియు వాటి వివిధ రూపాంతరాలలో ఆత్మలన్నీ విష్ణువు మీద ఆధారపడి ఉంటాయి.[47]

మధ్వాచార్యుని ప్రకారం, దేవుడికి నియంత్రణ ఉన్నప్పటికీ, మనిషి యొక్క స్వేచ్ఛానుగతమయిన సంకల్పము విషయములో తాను కల్పించుకోడు; సర్వ శక్తిమంతుడయినప్పటికీ దాని అర్థం అతను అసామాన్యమయిన అద్భుత కృత్యములు చేయడం కాదు. జీవులకు తమ తమ స్వభావాన్ని బట్టి నడచుకోడానికి స్వేచ్ఛనిస్తూ, దేవుడు జీవుల న్యాయసహితమయిన కోరికలను అనుసరించి చట్టాన్ని అమలు చేస్తాడు.[47] అందువలన దేవుడు ప్రదాతగా లేదా జమాఖర్చుల లెక్కలు వేసే దైవికమయిన అధికారిగా తన విధులు నిర్వర్తిస్తాడు, తదనుగుణంగా జీవులు తమ అంతర్గత స్వభావాన్ని బట్టి తమ పద్దులో జమ కాబడిన కర్మను బట్టి, మంచో, చెడో, తమ పని తాము చేయడానికి స్వేచ్ఛని కలిగి ఉంటారు. దేవుడు ప్రదాతగా వ్యవహరిస్తాడు కాబట్టి, ప్రతిదానికీ ఉత్కృష్టమయిన శక్తి దేవుడినుండే వస్తుంది, జీవుడు తన అంతర్గత స్వభావాన్ని బట్టి ఆ శక్తిని వినియోగించుకుంటూ ఉంటాడు. కానీ, ఇదివరకు చెప్పిన విధముగా బ్రహ్మసూత్రాలకు అర్థం వివరించిన శంకరుడి లాగా, మద్వాచార్యుడు మనుషుల మంచి మరియు చెడు కృత్యాలను బట్టి వారికి ప్రతిఫలాలను మరియు శిక్షలను నియంత్రించి ఇచ్చే పని దేవుడు చేస్తాడని ఒప్పుకుంటాడు. దేవుడు ఆ పని తనను తాను న్యాయం విషయంలో నిక్కచ్చిగా ఉండేందుకు చేస్తాడు, అతని చర్యలను మనుషుల కర్మలు నియంత్రించలేవు, అంతేకాక నువ్వు పక్షపాతం చూపించావని గానీ, లేదా నా పట్ల క్రూరంగా వ్యవహరించావని గానీ ఎవ్వరూ వేలెత్తి చూపలేరు.[47]

మధ్వాచార్యుని సిధ్ధాంతాన్ని ఈ పోలికతో ఉదహరిస్తూ స్వామి తపస్యానంద మరికొంత వివరణ ఇస్తాడు: ఒక కర్మాగారంలో కరెంటు పవర్‌హౌస్ (దేవుడు) నుండి వస్తుంది, కానీ యంత్రాల చక్రాలకు ఉన్న పళ్ళు (జీవాలు ) అమర్చిన దిశలోనే నడుస్తాయి. అందువలన, ఎవరూ కూడా దేవుడు పక్షపాతం చూపాడనీ లేదా క్రౌర్యం ప్రదర్శించాడనీ ఆరోపించలేరు. జీవుడు కర్మలు చేయువాడు, అంతేకాక, తన కర్మఫలాలను అనుభవించేవాడు కూడా అతనే.[47]

తన శాశ్వతమయిన నరక ప్రాప్తి అనే కల్పన వల్ల, మధ్వాచార్యుడు సంప్రదాయ హిందూ విశ్వాసాలను చెప్పుకోతగ్గ రీతిలో విభేదించాడు. ఉదాహరణకి అతను ఆత్మలను మూడు వర్గాలుగా విభజిస్తాడు: ఒక వర్గానికి చెందిన ఆత్మలు ముక్తి పొందడానికి యోగ్యత (ముక్తి యోగ్యాస్) కలిగి ఉంటాయి, మరొక వర్గానికి చెందిన ఆత్మలు శాశ్వతమయిన పునర్జన్మ లేదా శాశ్వతంగా దేహాంతరం చెందే (నిత్య సంసారులు) రకం, మూడో వర్గానికి చెందిన ఆత్మలు కాలానుగుణముగా శాశ్వతమయిన నరకములోకో లేదా అంధతమస్ (తమో-యోగ్యాస్) లోకో వెళ్ళే రకం అయి ఉంటాయి.[48] ఏ ఇతర హిందూ తత్త్వవేత్త లేదా హిందూ అధ్యయన వేదిక అలాంటి విశ్వాసాలను కలిగిలేదు. దానికి విరుధ్ధముగా చాలా మంది హిందువులు విశ్వజనీనమయిన మోక్షాన్ని నమ్ముతారు: లక్షల కొలది పునర్జన్మల తర్వాత అయినపట్టికినీ, అన్ని ఆత్మలు తదనుగుణముగా మోక్షాన్ని పొందుతాయి అని నమ్ముతారు.

స్వామినారాయణుడి దృష్టికోణంసవరించు

భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో చాలా మంది అనుసరించే స్వామి నారాయణ్ తెగకు చెందిన వారిలో, వారి ఆధ్యాత్మిక గురువు అయిన స్వామినారాయణ్ కర్మను మన కర్మలకు ఫలాలని ఇచ్చేదిగా అనుకోరాదని చెప్పాడు. స్వామి నారాయణ్ విశ్వాసమునకు చెందిన మూలాధారమయిన శాస్త్రమయిన అతని వచనామృతములో, స్వామి నారాయణ్, "ఎలాగయితే భూమిలో నాటబడ్డ విత్తనాలు వర్షపునీటికి మొలకెత్తుతాయో, అలాగే సృష్టి సమయంలో, జీవులు మాయలో తమ కారణ శరీరంతో (కారణభూతమయిన శరీరం) పాటు ఉన్నారు, అనేక రకాల శరీరాలను, కర్మఫలాలను ఇచ్చే దేవుడి సంకల్పముతో తమ వ్యక్తిగత కర్మానుసారముగా పొందుతారు" అని చెప్తాడు. (వార్తల్ 6)[49]

అందువలన, హిందూమతములోని ఇతర ఆస్తికవాద అధ్యయనవేదికల లాగా, స్వామినారాయణ్ విశ్వాసాన్ని అనుసరించే వారు కర్మఫలాలను అందించేవాడు దేవుడు అని నమ్ముతారు. దేవుడు చెడ్డ పనులకు ఫలాలను అందించేపుడు క్రౌర్యంగా ఉంటాడని మనుషులు అనుకున్నప్పటికీ, అది నిజం కాదు. దేవుడు, నిజానికి, అందరి పట్ల చాలా నిష్పక్షపాతంగా ఉంటాడు. వేదవ్యాసుని బ్రహ్మసూత్రాలు, "దేవుడు సుఖ దుఃఖాలను ఇవ్వడములో ఎవరి పట్లా పక్షపాతం చూపడు కానీ ఒక్కొక్కరి కర్మలను బట్టి ఫలాలను అందజేస్తాడు." అని చెబుతాయి. (2-1-34)[49] కానీ, హిందూ మతపు సాధారణ అధ్యయన వేదికలలాగా కాకుండా, స్వామినారాయణ్ యొక్క అనుచరులు స్వామినారాయణ్‌ను సర్వశక్తిమంతుడయిన దేవుడిగా నమ్ముతారు, దానిని హిందూ మతాన్ని అనుసరించే వారు నమ్మరు.[50]

జగద్గురు కృపాలుజీ మహరాజ్సవరించు

ఒక స్వామీజీ అయిన జగద్గురు కృపాలుజీ మహరాజ్, కర్మ అనేది సాధారణంగా స్థిరపడిపోయి ఉంటుందనీ, మనుషులు తమ కర్మ ఫలాలను అందుకుంటారనీ సూచిస్తాడు; దేవుడు కూడా కర్మసిధ్ధాంతాన్ని అతిక్రమించడని అతను చెబుతాడు; అందుకు రెండు ముఖ్య ఉదాహరణలు అతను ఉదహరిస్తాడు: శ్రీ కృష్ణుడికి గొప్ప భక్తులయినప్పటికీ కూడా పాండవులు తీవ్రముగా దుఃఖమును అనుభవిస్తారు; విష్ణువు అవతారమయిన రాముడు దశరథుడు, కౌసల్యల పుత్రుడు అయినప్పటికీ, దశరథుని మరణము తరువాత, కౌసల్య విధవరాలు అవుతుంది, అయినా కూడా రాముడు వారి దుఃఖాన్ని తొలగించడానికి పూనుకోలేదు.[51]

కానీ, జగద్గురు కృపాలుజీ మహరాజ్ ఒకని కర్మఫలితము చాలా అంశాల మీద ఆధార పడి ఉందని కూడా చెప్తాడు, అవి: 1) ప్రారబ్ధ కర్మ, లేదా స్థిరపడిన కర్మ దానిని ఈ జన్మలో అనుభవించాలి; 2) క్రియామాన కర్మ, అది మనం ఈ జన్మలో చేయబోయే కర్మ, 3) దేవుడి సంకల్పం; 4) ఒక ప్రత్యేకమయిన స్థలంలో ఉన్న మనుషులు చేసిన కర్మ, మరియు 5) సంభావ్యత (అనుకోని విధముగా సంఘటనలలో మనము భాగము కావడం).[51] కానీ కర్మ అనే విషయములో అనేకమయినవి సృష్టి రహస్యాలనీ, మనుషులు దానిని తనలో తాను దేవుడిని తెలుసుకునేంత వరకూ వదిలివేయాలనీ చెబుతాడు.[51]

వైష్ణవమతానికి చెందిన ఇతర ఆలోచనలుసవరించు

కులశేఖర ఆల్వార్, ఒక వైష్ణవ భక్తుడు, అతని "ముకుందమాల స్తోత్ర"లో ఈ విధంగా చెప్తాడు: 'యద్ యద్ భవ్యం భవతు భగవాన్ పూర్వ-కర్మ-అనురూపం'. పూర్వ-కర్మ లేదా భాగ్యము లేదా దైవము అనేది మనము చూడని అదృష్టము, అది విధాతగా దేవుడికి మాత్రమే తెలుస్తుంది.[52] కర్మసిధ్ధాంతాన్ని దేవుడు సృష్టించాడు, దానిని అతను అతిక్రమించడు. కానీ మనం కోరితే దేవుడు మనకి ధైర్యాన్నీ, బలాన్నీ ఇస్తాడు.

భాగవత పురాణముసవరించు

భాగవత పురాణములోని 10వ పుస్తకములోని 1వ అధ్యాయములో, వసుదేవుడు, కంసుడిని కృష్ణుడికి తల్లి తనకు పత్ని అయిన దేవకిని చంపవద్దని హితబోధ చేస్తాడు. పుట్టినవారికి చావు అనేది తధ్యమనీ, శరీరం పంచభూతాలలోకి తిరిగి వెళ్తుందనీ, ఆత్మ శరీరాన్ని వదిలి నిస్సహాయంగా కర్మానుసారముగా మరొక రూపం పొందుతుందనీ, బృహదారణ్యక ఉపనిషత్తులోని భాగాలను ఉదహరించి చెబుతాడు వసుదేవుడు.[53] అంతేకాక, అతను ఆత్మ అనేది, చావు సంభవించినపుడు ఎలాంటి మానసిక స్థితి ఉన్నప్పటికీ ఒక శరీరముగా పరిణితి చెంది స్థిరపడుతుందని చెప్తాదు; అంటే, చావు సమయంలో, మనసు యొక్క మార్మికమయిన శరీరం, వివేకము, అహము ఒక జీవి యొక్క గర్భములోకి వెళ్తుంది, అది మనిషిది కావచ్చు కాకపోవచ్చు, అది ఆత్మకు ఒక స్థూల శరీరాన్ని ఇచ్చి, నిర్ధిష్టమయిన వ్యక్తి చావు సమయంలో కలిగిన మానసిక స్థితిని బట్టి ఏర్పడుతుంది; ఈ భాగము భగవద్గీత, VIII, స్లోకము 6[53]తో సరిసమానముగా ఉందని గుర్తించగలరు. ఇలాంటి వ్యాఖ్యానాలు న్యూ జెర్సీలోని రట్గర్స్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ రెలిజియన్ అయిన ఎడ్విన్ బ్రైయాంట్ చేత అందివ్వబడినవి.

న్యాయసవరించు

న్యాయ అధ్యయన వేదిక, హిందూతత్త్వంలోని ఆరు ప్రామాణికమయిన అధ్యయన వేదికలలో ఒకటి, దేవుడు ఉన్నాడనడానికి ఒక సాక్ష్యం కర్మ[54] అని చెబుతుంది; కొంతమంది సంతోషముగానూ, కొంతమంది దుఃఖముగానూ ఉండటం చూస్తాము. కొంతమంది ధనవంతులయి ఉంటారు, కొందరు పేదవాళ్ళయి ఉంటారు. నైయానికులు దీనిని కర్మ యొక్క విషయముతోటీ, పునర్జన్మతోటీ వివరిస్తారు. మనిషి యొక్క కర్మఫలము అతనికి అందుబాటులో ఉండదు, అందుకని, కర్మఫలాలను అందజేసేవారు ఎవరో ఉండి తీరాలి, అతనే సర్వశక్తిమంతుడయిన ఫలాలను ఇచ్చే దేవుడు.[54] తదనుసారముగా, న్యాయ అధ్యయన వేదిక యొక్క ఈ నమ్మకం వేదాంతపు నమ్మకముతో సరితూగుతుంది.[54]

ధర్మశాస్త్రాలుసవరించు

హిందూ మతములో, మరీ ముఖ్యముగా ధర్మశాస్త్రాలలో, కర్మ అనేది ఒక సిధ్ధాంతము అందులో "హేతువు దాని ప్రభావము విడదీయరాని విధముగా, శాస్త్రీయమయిన భౌతిక పరిధిలో ఎలాగయితే కలిసి ఉంటాయో అదే విధముగా నైతిక పరిధిలో కూడా సంబంధము కలిగి ఉంటాయి. మంచి పనికి మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడ్డపనికి శిక్ష ఉంటుంది. చెడ్డపనులు ఈ జన్మలో తమ పరిణామాలకు దారి తీయకపోతే, ఆత్మ మరో జన్మ ఎత్తి ఒక క్రొత్త పర్యావరణములో తన గతకాలపు ఆకృత్యాలకు శిక్ష రూపంలో దుఃఖాన్ని అనుభవిస్తుంది".[55] అందుకని ముఖ్యముగా అర్థం చేసుకోవలిసినది ఏమిటంటే, కర్మ అనేది మనల్ని వీడి పోదు, తన గతకాలపు కర్మలకు ఎవరయినా ప్రతిఫలాన్ని పొందడమో లేదా దుఃఖించడమో జరగాల్సిందే. బృహదారణ్యక ఉపనిషత్తు ఈ విధంగా చెబుతుంది: "తాను చేసిన విధముగా మనిషి నమ్ముతాడు అతను దానికి తగ్గట్లుగా ఉంటాడు; ఉన్నతమయిన కార్యములు చేసిన మనిషి ఉన్నతంగా ఉంటాడు, చెడ్డ పనులు చేసిన మనిషి పాపాత్ముడిలాగా ఉంటాడు. పవిత్రమయిన కార్యములు చేయడం వలన పవిత్రుడౌతాడు, చెడ్డ కార్యములు చేయడం వలన దుష్టుడు అవుతాడు. ఇక్కడ వాళ్ళు మనిషికి కోరికలు ఉంటాయని చెబుతారు. అతని కోరికలకు తగ్గట్లుగా అతని సంకల్పం ఉంటుంది; అతని సంకల్పానికి తగ్గట్లుగా అతని కర్మ ఉంటుంది; అతని కర్మకు తగ్గట్లుగా కర్మఫలం ఉంటుంది".[56] కర్మ సిధ్ధాంతం పురాతన కాలమునకు సంబంధించినది, దానికి తోడు పైన చెప్పిన రచయిత పేరు గౌతమ ధర్మ-సూత్రములో, షతపథ బ్రాహ్మణలో, కథాక-గృహ్య-సూత్రలో, ఛందోగ్య ఉపనిషత్తులో, మార్కండేయ పురాణము మొదలగు వాటిల్లో కనపడుతుంది.[57]

కర్మ గురించి వ్రాసిన శాస్త్రాలు కర్మ యొక్క సంభావ్యత ఉన్న పరిణామాల గురించి కొంత వివరములలోకి వెళ్తాయి. గత జన్మల గురించి, పునర్జన్మ గురించి మాట్లాడేపుడు, తరచు ఒక భిన్నమయిన వస్తువుగా తిరిగి రావడం గురించి చర్చ ఉంటుంది. ఈ విషయములో అది నిజం, లేదా కనీసం గ్రంథాలు చెప్పినంతవరకూ అది నిజం.

కథాక-గృహ్య-సూత్ర ఇలా చెబుతుంది, "కొంతమంది మనుషులు గర్భములోకి వెళ్తారు, ఒక శరీరముతో కూడిన జీవితము కోసం; ఇతరులు నిర్జీవమయిన పదార్ధము (చెట్టు యొక్క మోడు అటువంటి వాటిలోకి) వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి, జ్ఞానాన్ని బట్టి వెళ్తారు".[58]

చాలా విస్తారముగా చర్చించేది, పాపకర్మల ఫలితముగా జరిగే పరిణామాలు.కర్మవిపక అంటే పాపకృత్యములు లేదా పాపము పండటం. ఇది యోగసూత్ర II.3లో చెప్పిన విధముగా మూడు రూపాలుగా పండుతుంది, అంటే, జాతి (ఒక కీటకముగానో లేదా జంతువుగానో జన్మించడం), ఆయువు (తక్కువ కాలము జీవించడం అంటే అయిదో లేదా పదో సంవత్సరాల పాటి చిన్న కాలం) మరియు భోగ (నరకం యొక్క పీడనము అనుభవించడం".[59]

పాపులు అనుభవించే జబ్బులకు, కురూపములకు మరియు ఎత్తబోయే నీచ జంతువుల జన్మలకు సంబంధించిన పొడవాటి జాబితాలు ఉన్నాయి.[60] కొంతమంది రచయితలు ప్రత్యేకమయిన పాపాలకు ప్రత్యేకమయిన పరిణామాలు ప్రస్తావిస్తారు. ఉదాహరణకి, "హరితసంహితలో బ్రాహ్మణుడిని చంపువాడు తెల్ల కుష్ఠువ్యాధితో, ఆవుని చంపువాడు నల్ల కుష్ఠు వ్యాధితో దుఃఖిస్తారు అని చెప్పడం జరిగింది."[61] పాపమును పాపకార్యములను తగ్గించే మార్గాలకు సంబంధించిన జాబితా చాలా విస్తారముగా ఉంటే, కొంతమంది, అంటే యజ్ఞవల్క్య స్మృతి మీద వ్యాఖ్యాత అయిన మితాక్షర లాంటి రచయితలు, కర్మ అనేదానికి, "శబ్దార్ధ ప్రకారం అర్థం తీసుకోకూడదనీ, అది ప్రజాపాత్యునిలాగా పాపులు ప్రాయశ్చితాలో లేదా తపమో చేయడానికి ప్రోత్సహిచడానికి ఉద్దేశించినదనీ, అది చాలా కష్టతరముగా ఆందోళన కలిగించేదిగా ఉండటం వలన ఎవరయినా తమంత తాము చేయరనీ" నమ్ముతాడు.

అంతేకాక కర్మవిపక, "తన పాపాలకు వేచి ఉండటానికీ బాధలను అనుభవించడానికి సిధ్ధంగా ఉంటే ఏ ఆత్మ కూడా సంభావన లేకుండా ఉండే అవసరం లేదనీ, ఆ కృత్యములలో ముందుగా సూచించిన అనేక పరిణామాలను చూసి భయబడే అవసరం లేదనీ, ఆత్మ, తన ప్రయాణము మరియు పరిణామ క్రమంలో, తుదకు తన నిజమయిన గొప్పతనాన్ని కనిపెట్టి శాశ్వతమయిన శాంతినీ మరియు లోపరహితమయిన సంపూర్ణత్వాన్నీ తెలుసుకోగలదనీ" చెబుతుంది.[61]

చెడు కర్మ యొక్క ఉపశమనంసవరించు

ఒక ఆస్తికవాదపు దృష్టికోణం ప్రకారం, మనిషి యొక్క దుష్కర్మ యొక్క ప్రభావాన్ని ఉపశమింపచేయవచ్చు. ఏ విధంగా చెడు కర్మను ఉపశమింపచేయచ్చనడానికి ఉన్న ఉదాహరణలలో, ధర్మాన్ని అనుసరించడం, సన్మార్గుడిగా బ్రతకడం; ఇతరులకు సాయపడటం లాంటి మంచిపనులు చేయటం; భక్తి యోగం లేదా దేవుని దయకు పాత్రుడవటం కోసం దేవుని పూజించటం; దేవుడి దయకు పాత్రుడవటం కోసం, చిదంబరం లేదా రామేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్ళడం లాంటివి ఉన్నాయి.[62] మరొక ఉదాహరణలో, గణేశుడు తన భక్తులని వారి జీవితాలను సరళము చేయడము ద్వారా, పావనము చేయడము ద్వారా కర్మ నుండి విముక్తులని చేయగలడు, కానీ వాళ్ళు అతనితో వ్యక్తిగత సంబంధము నెలకొల్పిన తర్వాతనే ఇది జరుగుతుంది.[63]

దేవుని దయకు పాత్రులవడానికి సంబంధించిన ఉదాహరణలు ఈ క్రింద ఉదహరించబడ్డాయి.

పురాణాలుసవరించు

శివుడి చేత చావునుండి రక్షింపబడిన మార్కండేయుని కథ, దేవుడి దయ కర్మను మరియు చావుని తన ప్రియమయిన భక్తుల కోసం అధిగమించగలదని ఉదహరిస్తుంది.[64]

అలాంటిదే మరొక కథలో, కృష్ణుడు తన గురువు సాందీపని యొక్క పుత్రుడిని, మరణానికి ప్రభువు అయిన యముడి లోకము నుండి రక్షించి చావు నుండి మరల బ్రతికేలా చేసాడు. గురుపుత్రుడు వ్యక్తిగత కర్మ చేత నరకానికి తీసుకురాబడ్డాడని గ్రహించి, యముడికన్న మిన్న అయిన తన శక్తి వలన, గురుపుత్రుడిని తిరిగి జీవించేట్లు చేసాడు.[65] కృష్ణుడి బాల్యదశలో సాందీపని కృష్ణుడి గురువు.

భాగవత పురాణములో అజమిలుడి కథ కూడా అదే అభిప్రాయాన్ని బలపరుస్తుంది.[66] అజమిలుడు తన జీవితములో దొంగతనము, భార్యాబిడ్డ్లను వదిలివేయుట, వేశ్యను వివాహమాడుట లాంటి అనేక దుష్ట కార్యములు చేసాడు. కానీ, చనిపోయే సమయంలో అతను అప్రయత్నపూర్వకంగా నారాయణుడి పేరు జపించాడు అందువలన అతనికి మోక్షము లేదా దేవుడితో ఐక్యత లభించింది, అందువలన అతను యమభటుల నుండి రక్షింపబడ్డాడు. అజమిలుడు నిజానికి తన చిన్న కొడుకుని గురించి ఆలోచిస్తున్నాడు, అతని పేరు కూడా నారాయణుడే. కానీ దేవుడి పేరుకి శక్తివంతమయిన ప్రభావాలు ఉంటాయి, అందువలన అజమిలుడు మహాపాపముల నుండి క్షమింపబడి, దుష్కర్మలు చేసినప్పటికీ మోక్షం పొందాడు.

ఉపనిషత్తులుసవరించు

శ్వేతాస్వతర ఉపనిషత్ 7 మరియు 12, కర్మలు చేసేవాడు సంచరించి తన కర్మలకు తగిన విధముగా పునర్జన్మ పొందుతాడని చెబుతుంది కానీ ఒక సర్వశక్తిమంతుడయిన సృష్టికర్తను స్వీకృతము చేస్తుంది, అంటే ఈశ్వరుడు లేదా అతని దయ యొక్క సిధ్ధాంతము.[67] ఈశ్వరుడు అందరికీ శరణమునిచ్చువాడు, ఈశ్వరుడి ఆశీర్వాదము వల్ల, అతని కటాక్షము వల్ల మనిషి అమరుడౌతాడు.[68]

ఈశ్వరుడి దయ వలన మనిషి దుఃఖ విముక్తుడయ్యి ఉండగలడు. అందుకని, శ్వేతాస్వతర ఉపనిషద్ ఒక సర్వశక్తిమంతుడయిన దేవుడిని స్వీకృతము చేసి, అతని కృప భక్తులను కర్మ సిధ్ధాంతము నుండి తప్పించుకోడానికి ఒక దారి కల్పిస్తుందని చెబుతుంది.[68] శ్వేతాస్వతర ఉపనిషద్ VI:4, మీద తన వ్యాఖ్యానములో ఆది శంకరుడు చెప్పినట్లుగా, "మనము మనము చేసే అన్ని పనులని ఈశ్వరుడికి అర్పిస్తే, మనము కర్మ సిధ్ధాంతమునకు బధ్ధులము కాజాలము." [67]

ధర్మ శాస్త్రాలుసవరించు

ధర్మశాస్త్రాలు పాపమును పరిహారం చేసుకునే మార్గాల గురించి చెబుతాయి, వాటిల్లో కొన్ని కర్మ సిధ్ధాంతమునకు విరుధ్ధముగా ఉండి సరితూగడం కష్టమనిపిస్తాయి. ఉదాహరణకి, శ్రాధ్ధము అనే కర్మకాండ, లేదా బ్రహ్మ పురాణము చెప్పిన విధముగా, "ఏదేని విశ్వాసముతో పితృదేవతల లబ్ధి కొరకు సరి అయిన సమయంలో, సరి అయిన స్థలంలో, అర్హతగల మనుషులకు, బ్రాహ్మణులకు, పద్ధతి ప్రకారం[69] సమర్పించుకుంటామో" అది పితృదేవతలను గౌరవించడం కోసం అయినదై ఉంటుంది; కానీ, దానికి విరుధ్ధముగా, కర్మను విశ్వసించువాడు, శరీరము మరణించునపుడు, పితృదేవతలకు శ్రాధ్ధము పెట్టినప్పటికీ, ఆత్మ యాంత్రికముగా మరొక శరీరములోకి ప్రవేశిస్తుంది అని నమ్ముతాడు.

అందుకని కర్మకు విరుధ్ధముగా, కేన్, "శ్రాధ్ధము, అంటే పిండములను ముగ్గురు పితృదేవతలకు అర్పించడానికి ముగ్గురు పితృదేవతల యొక్క ఆత్మలు, 50 లేదా 100 సంవత్సరాల తరువాత కూడా, గాలిలోకి రవాణా కాబడ్డ పిండాల రుచిని లేదా సారాన్ని గ్రహించి ఆనందించగలగాలి", అని చెబుతుంది.[70] ఏదేమయినా గాని, కర్మను శబ్దార్ధ ప్రకారం తీసుకోకూడదనే శాస్త్రాల నమ్మకాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ రెండు విభేదించే దృష్టికోణాలను సరితూగేలా చేయవచ్చు. కానీ, ఈ విషయం మీద అనేక అభిప్రాయాలను వెలిబుచ్చిన విధము చూస్తే, కర్మ మీద భిన్నాభిప్రాయాల మధ్య అనుగుణ్యత మరోచొట కనపడదు.

ఒక ప్రత్యేకమయిన శరీరములో జన్మించడమునకు కర్మకుగల సంబంధంసవరించు

ఆస్తికవాద అధ్యయన వేదికలు సృష్టి చక్రాలను నమ్ముతాయి, అందులో ఆత్మలు ప్రత్యేకమయిన శరీరాలలోకి కర్మానుసారముగా ప్రవేశిస్తాయి, ఎందుకంటే బుధ్ధితో సంబంధము లేని వస్తువు దేవుడి సంకల్పము మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, కౌషితాకి ఉపనిషద్ 1.2 ప్రకారం, కీటకము, పురుగు, చేప, పక్షి, సింహము, పంది, పాము లేదా మనిషి అనే భిన్నమయిన రూపాలలో జన్మని ఎత్తడం అనేది మనిషి యొక్క కర్మ మరియు జ్ఞానము వలన నిశ్చయించబడుతుంది.[71] ఛందోగ్య ఉపనిషద్ 5.10.7 మంచి జన్మకు అంటే ఆధ్యాత్మిక కుటుంబములో (బ్రాహ్మణ కులము) జన్మించడం మరియు దుష్ట జన్మ, అంటే కుక్క లేదా పంది జన్మకు మధ్య వృత్యాసము చూపుతుంది. ఆ విధముగా, సృష్టిలో అనేక జీవాల రూపములు ఎందుకు విస్తృతంగా అనేక స్థాయిల జీవశాస్త్ర పరిణామక్రమంలో అంటే మొక్కలు మొదలుకుని అనేక రకాల జంతువులుగా వివిధ జాతులలో భాగమవుతాయో, ఇంకా ఒకే జాతిలోని సభ్యుల మధ్య తేడాలు ఎందుకు ఉన్నాయో కర్మ సిధ్ధాంతము వివరిస్తుంది.[72]

అందువలన, ఉపనిషద్ పాఠాలవంటివి ఒక నిర్దిష్టమయిన కులంలో పుట్టడం అనేది కర్మానుసారంగా జరుగుతుందని సూచిస్తాయి, అంటే మంచి పనులు చేసిన వారు ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మిస్తారు, ఆధ్యాత్మిక కుటుంబము అంటే అది బ్రాహ్మణ కులముకి పర్యాయము. మంచి పనులు చేయడం వలన అది ఆధ్యాత్మిక కుటుంబములో జన్మించడానికి దోహదపడి, అతని భవిష్యద్గమ్యం అతని నడవడి మరియు ప్రస్తుత జీవితములోని కర్మల వలన నిశ్చయించబడుతుంది. గీతలో కృష్ణుడు, బ్రాహ్మణుడి లక్షణాలు అతని నడవడిచే నిశ్చయించబడతాయని, పుట్టుక వలన కాదనీ చెప్పాడు. గీతలో ఒక శ్లోకము ఈ విషయాన్ని ఉదహరిస్తుంది: "ఓ శత్రువులను దహించువాడా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రుల విధులు వారి వారి స్వంత స్వభావముచే జనించిన గుణాలను (నడవడి) బట్టి పంచడం జరుగుతుంది." (భగవద్గీత 18.41)[73]

గీతలో చెప్పబడిన ఈ దృక్కోణమును మరింత వివరిస్తూ, మధ్వాచార్యుడు వర్ణ (హిందూ మతం) అనే విషయానికి అర్థం వివరిస్తాడు. వర్ణం అనేది అతని ప్రకారం, హిందూ సమాజాన్ని నాలుగు సామాజిక తరగతులుగా విభజించడం, ఆ విభజన గుణాన్ని (లక్షణాలు) మరియు కర్మను (చర్య) ఆధారం చేసుకుని చేయబడుతుంది, అది ఆత్మ యొక్క స్వభావముతో గానీ, పుట్టుకతో నిర్వచించబడదు.[74][unreliable source?] ఉదాహరణకి, బ్రాహ్మణ స్వభావము కల ఆత్మ, శూద్రుడిగా జన్మించవచ్చు, శూద్రుడి స్వభావము కల ఆత్మ బ్రాహ్మణుడిగా జన్మించవచ్చు.[74][unreliable source?] పుట్టుక ఆధారముగా నిర్ణయించే కులవ్యవస్థ, అతని ప్రకారం, నిజానికి జాతిని సూచిస్తుంది, జాతి అనేది ఒక ప్రత్యేకమయిన సముదాయానికి హోదా కల్పించేది, అది వర్ణము కాదు.[74][unreliable source?] వర్ణాలు కేవలం ఆత్మ యొక్క స్వభావసిధ్ధమయిన ఉత్సుకతను నిర్వచిస్తాయి; ఉదాహరణకి, బ్రాహ్మణ వర్ణముగా వర్గీకరింపబడిన ఆత్మ నేర్చుకోడానికి ఉత్సాహం చూపుతుంది, క్షత్రియుడి ఆత్మ కార్యనిర్వహణ పట్ల ఉత్సుకత చూపుతుంది, శూద్రుడి ఆత్మ సేవ చేయడం పట్ల ఉత్సాహం చూపుతుంది.[74][unreliable source?] అందువలన అతను కులవ్యవస్థకు కొత్త అర్థం చెప్పాడు, ఎందుకంటే అతను, కులం అనేది మనిషి స్వభావముతో ముడిపడి ఉంది కానీ అతని పుట్టుకతో కాదని నమ్మాడు; పుట్టుక అనేది, మధ్వాచార్యుడి ప్రకారం, వర్ణాన్ని నిశ్చయించేది కాదు; అజ్ఞాని అయిన బ్రాహ్మణుడి కంటే, ఆధ్యాత్మికంగా జ్ఞానము పొందిన ఛండాలుడు (భ్రష్టుడు) నయం.[74][unreliable source?]

జ్యోతిష్య శాస్త్రానికి కర్మకు మధ్య సంబంధంసవరించు

వాషింగ్‌టన్ విశ్వవిద్యాలయములో ప్రొఫెసర్ ఎమెరిటస్ అయిన చార్ల్స్ కీస్ మరియు కొలంబియా విశ్వవిద్యాలయములో మనుష్యవర్ణన శాస్త్రములో ప్రొఫెసర్ అయిన E. వాలెంటైన్ డేనియల్, చాలా మంది హిందువులు నక్షత్రాలు, గృహాల ప్రభావం జీవితమంతా ఉంటుందనీ, ఈ గృహాల ప్రభావాలే "కర్మ ఫలం" అని నమ్ముతారని చెప్తారు.[75]

నవగ్రహాల వంటి గ్రహదేవతలు, శనిగ్రహంతో కలిపి, ఈశ్వరుడికి (అంటే సర్వశక్తిమంతుడయిన దేవుడు) విధేయులై పనిచేస్తారు, వాళ్ళు న్యాయ నిర్వహణలో సహాయం చేస్తారని చాలామంది నమ్ముతారు.[75] అందుచేత, ఈ గ్రహాలు భూమిపైని జీవకోటిని ప్రభావితం చేయగలవు.[75]

అలాంటి గ్రహసంబంధమయిన ప్రభావాలను హిందువుల శాస్త్రమయిన జ్యోతిష్యం వంటి శాస్త్రీయమైన పధ్ధతుల ద్వారా తెలుసుకోవచ్చని చాలా మంది నమ్ముతారు.[76]

హిందూ మతంలో ఇతర ఉపయోగాలుసవరించు

గత జన్మలలోని కర్మ వలన కలిగే ప్రతిస్పందన లేదా దుఃఖము అంతే కాక మనిషి తదుపరి జన్మలో మరొక శరీరంలోకి దేహాంతరం చెందాలి అనే సంకుచితమయిన అర్థమే కాకుండా, కర్మ అనే పదాన్ని తరచు విశాలమయిన దృష్టికోణములో స్పందన లేదా ప్రతిస్పందనగా ఉపయోగిస్తారు.

అందువలన, హిందూ మతంలో కర్మ అనే మాటకు అర్థం కార్యకలాపం, ఒక చర్య లేదా ఒక ప్రాపంచికమయిన కార్యకలాపము. ప్రత్యేకమయిన పదసమ్మేళనముతో అది ప్రత్యేకమయిన అర్థాలకు దారితీస్తుంది, కర్మ-యోగ లేదా కర్మ-కాండ లాంటి పదాలకు "యోగ లేదా చర్యలు" మరియు "ప్రాపంచిక కార్యకలాపాల యొక్క మార్గము" అనే అర్థం వస్తుంది. ప్రతిరోజు హిందువులు నిర్వహించాల్సిన ఆచారకర్మలను వర్ణించే పదం, నిత్య కర్మలకు మరొక ఉదాహరణ, సంధ్యావందనం, ఇందులో గాయత్రి మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది.

ఇతర ఉపయోగాలలో "ఉగ్ర-కర్మ"లాంటి వ్యక్తీకరణలు ఉంటాయి, దాని అర్థం చేదయిన, అనారోగ్యకరమయిన కాయకష్టం.[77]

వీటిని కూడా చూడండిసవరించు

 • చెడు అన్న సమస్యకి హిందు పరిష్కారాలు
 • చెడు యొక్క సమస్య
 • స్వేచ్ఛానుగతమయిన సంకల్పం
 • పునర్జన్మ మరియు హిందూ మతము
 • కర్మ
 • బౌధ్ధమతంలో కర్మ
 • జైన మతంలో కర్మ

సూచనలుసవరించు

 1. Brodd, Jefferey (2003). World Religions. Winona, MN: Saint Mary's Press. ISBN 978-0-88489-725-5.
 2. 2.0 2.1 2.2 పరమహన్స్ స్వామి మహేశ్వరానంద, ది హిడెన్ పవర్ ఇన్ హ్యూమన్స్ , ఐబెరా వెర్లగ్, పేజ్ 23, ISBN 3-85052-197-4
 3. కారెల్ వెర్నర్, అ పాప్యులర్ డిక్షనరి ఆఫ్ హిందూయిజం 110 (కర్జన్ ప్రెస్ 1994) ISBN 0-7007-0279-2
 4. 4.0 4.1 4.2 పరమహన్స్ స్వామి మహేశ్వరానంద, ది హిడెన్ పవర్ ఇన్ హ్యూమన్స్ , ఐబెరా వెర్లగ్, పేజ్ 24., ISBN 3-85052-197-4
 5. మిఖేల్స్, పే. 217.
 6. కర్మ అండ్ రిబర్త్ ఇన్ క్లాసికల్ ఇండియన్ ట్రెడిషన్స్, బై వెండి డోనిగర్ ఒ'ఫ్లాహెర్తి, వెండి డోనిగర్, పేజ్ 14, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్, 1980
 7. మహాభారత 12.350.4-5, K.M. గంగూలి ఫుల్ ఎడిషన్ http://www.సేక్రెడ్-టెక్స్ట్స్.com/hin/m12/m12c049.htm
 8. ది పురాణాస్ బై స్వామి శివానంద
 9. జాన్‌సన్, W.J (2009). అ డిక్షనరి ఆఫ్ హిందూయిజం, పేజ్ 247, ఆక్ఫార్డ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 978-0-19-861025-0.
 10. శ్రీ యుక్తేస్వర్, స్వామి (1949). ది హోలి సైన్స్. యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా.
 11. 11.0 11.1 11.2 సత్‌గురు శివాయ సుబ్రమణియస్వామి, లెక్సికాన్ సెక్షన్ ఆఫ్ హిస్ బుక్, డాన్సింగ్ విత్ శివ
 12. 12.0 12.1 పరమహన్స్ స్వామి మహేశ్వరానంద, ది హిడెన్ పవర్ ఇన్ హ్యూమన్స్ , ఐబెరా వెర్లగ్, పేజ్ 22., ISBN 3-85052-197-4
 13. చంద్రశేఖర భారతి మహాస్వామిగళ్, డయలాగ్స్ విత్ ది గురు .
 14. గోయాండక J, ది సీక్రెట్ ఆఫ్ కర్మయోగ , గీతా ప్రెస్, గోరఖ్‌పూర్
 15. వేదాంతిక్ మెడిటేషన్, pg. 4, బై డేవిడ్ ఫ్రాలే ఎట్ http://books.google.com/books?id=f8oWsWOKDC4C&pg=PA4&dq=vedanta+supreme+Being+karma&lr=&cd=50#v=onepage&q=vedanta%20supreme%20Being%20karma&f=false
 16. "GitaMrta". Gitamrta.org. Retrieved 2008-10-20. Cite web requires |website= (help)
 17. 17.0 17.1 http://www.shaivam.org/hipkarma.htm
 18. 18.0 18.1 18.2 http://www.ssvt.org/Education/Hinduism%20FAQ.asp
 19. ప్రతిమా బోవ్స్, ది హిందూ రెలిజియస్ ట్రెడిషన్ 54-80 (అలైయ్డ్ Pub. 1976) ISBN 0710086687
 20. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానందా, Vol. II, ఎట్ 217-225 (18వ పునర్ముద్రణ 1995) ISBN 81-85301-75-1
 21. అలెక్స్ మైకేల్స్, హిందూయిజం: పాస్ట్ అండ్ ప్రెజెంట్ 154-56 (ప్రిన్స్‌టన్ 1998) ISBN 0-691-08953-1
 22. బ్రహ్మ సూత్రాలు III.2.38. ఫలమాత ఉపపత్తే ట్రాన్స్లేటెడ్ బై శివానందా యాస్ "ఫ్రమ్ హిమ్ (ది లార్డ్) ఆర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్, ఫర్ దట్ ఈజ్ రీజనబుల్." [1] వెబ్ సైట్ చెక్డ్ 13 ఏప్రిల్ 2005.
 23. కామెంటరి ఆన్ బ్రహ్మ సూత్రాస్ III.2.38. వీరేశ్వరానంద, p.312.
 24. వర్సెస్ 4:14, 9.22 అండ్ 18.61
 25. వర్స్ 16.19
 26. యోగానంద, పరమహంస, ఆటోబయోగ్రఫి ఆఫ్ ఎ యోగి, చాప్టర్ 21 ISBN 1-56589-212-7
 27. స్వామి క్రిష్ణానంద ఆన్ ది గురు మిటిగేటింగ్ ది కర్మ ఆఫ్ ది డిసైపుల్
 28. స్వామి B.V. త్రిపురారి ఆన్ గ్రేస్ ఆఫ్ ది గురు డిస్ట్రాయింగ్ కర్మ
 29. Reichenbach, Bruce R. (April 1989). "Karma, causation, and divine intervention". Philosophy East and West. Hawaii: University of Hawaii Press. 39 (2): p. 145. Retrieved 2009-12-29. More than one of |pages= and |page= specified (help)CS1 maint: extra text (link)
 30. చూడండి, థీయిస్టిక్ ఎక్స్‌ప్లనేషన్స్ ఆఫ్ కర్మ, pg.146 ఆఫ్ కాజేషన్ అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ బై BR రీషెన్‌బాష్ ఎట్ http://ccbs.ntu.edu.tw//ఫుల్‌టెక్స్ట్/JR-PHIL/reiche2.htm సైటింగ్ శంకర'స్ కామెంటరి ఆన్ బ్రహ్మ సూత్రాస్, III, 2, 38, అండ్ 41.
 31. చూడండి, థీయిస్టిక్ ఎక్స్‌ప్లనేషన్స్ ఆఫ్ కర్మ, కాజేషన్ అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ బై BR రీషెన్‌బాష్ ఎట్ http://ccbs.ntu.edu.tw/ఫుల్‌టెక్స్ట్/JR-PHIL/reiche2.htm సైటింగ్ శంకరా'స్ కామెంటరి ఆన్ బ్రహ్మ సూత్రాస్, III, 2, 38, అండ్ 41.
 32. శివానంద, స్వామి. ఫలాధికరణం, టాపిక్ 8, సూత్రాస్ 38-41.
 33. శివానంద, స్వామి. అధికరణ XII , సూత్రాస్ 34-36.
 34. 34.0 34.1 34.2 34.3 ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ ఫిలాసఫి, pg.34, బై వ్రజ్ కుమార్ పాండే, మోతిలాల్ బనార్సిదాస్ పబ్లిషర్స్.
 35. దాస్‌గుప్తా, సురేంద్రనాద్, ఎ హిస్టరి ఆఫ్ ఇండియన్ ఫిలాసఫి , వాల్యూం V, ది సదెరన్ స్కూల్స్ ఆఫ్ శైవిజం , p. 87
 36. 36.0 36.1 36.2 దాస్‌గుప్తా, సురేంద్రనాద్. ఎ హిస్టరి ఆఫ్ ఇండియన్ ఫిలాసఫి, వాల్యూం V, ది సదెరన్ స్కూల్స్ ఆఫ్ శైవిజం , pp. 87-89.
 37. హిందూయిజం టుడే, మార్చ్ 1994 ఇస్స్యూ ఎట్ http://www.hinduismtoday.com/modules/smartsection/item.php?itemid=3249
 38. ఓ మహాతపస్వి, ముక్తి పొంది ముక్తిజ్ఞానములో సంపూర్ణత్వాన్ని పొందిన లక్షల కొలది మనుషులలో ఒకరు, నారాయణ ప్రభువు లేదా కృష్ణుడి భక్తుడు కావచ్చు. పూర్తిగా శాంతమూర్తులయిన అలాంటి భక్తులు, చాలా అరుదు. శ్రీమద్ భాగవతం 6.14.5
 39. స్వచ్చమయిన భక్తితో కూడిన సేవ, మరోవైపు, ఫలాన్ని ఆశించె చేసే పని కన్నా చాలా ఉత్తమమయినది, తత్త్వ చింతన, రహస్య ధ్యానం.... కర్మ, జ్ఞాన మరియు యోగకు సంబంధించిన కార్యకలాపాలను భక్తిని, భక్తితో కూడిన సేవను అభ్యసించువారు, నిరసించరు. దానికి బదులు, ఈ తక్కువ స్థాయి కార్యకలాపాలు సర్వశక్తిమంతుడయిన ప్రభువు సేవకు అర్పించినపుడు, అవి భక్తితో కూడిన సేవకు అనుకూల పధ్ధతులు. ఉదాహరణకి, కర్మని, లేదా కార్యకలాపాన్ని, భక్తితో కూడిన సేవతో కలిపినపుడు, అది కర్మ-యోగమవుతుంది, అంటే కృష్ణభక్తిలో చేసిన కార్యం. కృష్ణ ప్రభువు దీనిని భగవద్గీత (9.27)లో సిఫారసు చేస్తాడు: యత్ కరోసి యద్ అస్నసి యజ్ జుహోసి దాదసి యత్ యత్ తపస్యాసి కౌంతేయ తత్ కురుస్వ మద్-అర్పణం/"నీవు ఏమి చేస్తావో, ఏమి తింటావో, ఏమి ఇస్తావో లేదా ఇచ్చేస్తావో, ఏదేని పూజపునస్కారాలు చేస్తావో -- ఓ కుంతీపుత్రా అంతా కూడా నాకు అర్పించి చేయి" (Bg. 9.27).నారద భక్తి సూత్ర 25
 40. తపస్యానంద, స్వామి. శ్రీ విష్ణు సహస్రనామ, pg. 62 .
 41. తపస్యానంద, స్వామి. శ్రీ విష్ణు సహస్రనామ, pgs. 48, 49, 87, 96 అండ్ 123.
 42. 42.0 42.1 తపస్యానంద, స్వామి. శ్రీ విష్ణు సహస్రనామ, pg. 48.
 43. తపస్యానంద, స్వామి. భక్తి స్కూల్స్ ఆఫ్ వేదాంత
 44. "SriBhashya - Ramanujas Commentary On Brahma Sutra (Vedanta Sutra) - Brahma Sutra Sribhashya Ramanuja Vedanta Sutra Commentary Ramanuja204". Bharatadesam.com. Retrieved 2008-10-20. Cite web requires |website= (help)
 45. 45.0 45.1 కృష్ణన్, యువ్‌రాజ్, "ది డాక్ట్రైన్ ఆఫ్ కర్మ,"1997, మోతిలాల్ బనార్సిదాస్ పబ్లిషర్స్, pgs.155-156, ఎటి http://books.google.com/books?id=_Bi6FWX1NOgC&pg=PA155&dq=Ramanuja+karma&cd=4#v=onepage&q=Ramanuja%20karma&f=false
 46. "SriBhashya - Ramanujas Commentary On Brahma Sutra (Vedanta Sutra) - Brahma Sutra Sribhashya Ramanuja Vedanta Sutra Commentary Ramanuja287". Bharatadesam.com. Retrieved 2008-10-20. Cite web requires |website= (help)
 47. 47.0 47.1 47.2 47.3 47.4 తపస్యానంద, స్వామి. భక్తి స్కూల్స్ ఆఫ్ వేదాంత pgs. 178-179.
 48. తపస్యానంద, స్వామి. భక్తి స్కూల్స్ ఆఫ్ వేదాంత pg. 177.
 49. 49.0 49.1 http://www.swaminarayan.org/faq/hinduism.htm#8.
 50. http://www.swaminarayan.org/faq/bapsgeneral.htm#1
 51. 51.0 51.1 51.2 http://www.jkyog.org/ask_swamiji.html
 52. "ముకుందమాల స్తోత్ర". రచయిత: కులశేఖర ఆళ్వార్. వర్స్: 5. పబ్లిషర్: లక్ష్మి వెంకటేశ్వర ప్రెస్, కల్యాణ్, ముంబై. ఇయర్: సంవత్ 1980
 53. 53.0 53.1 కృష్ణ, ది బ్యూటిఫుల్ లెజెండ్ ఆఫ్ గాడ్, pgs 11-12, అండ్ కామెంటరి pgs. 423-424, బై ఎడ్విన్ బ్రయాంట్
 54. 54.0 54.1 54.2 చూడండి థీయిస్టిక్ ఎక్స్‌ప్లనేషన్స్ ఆఫ్ కర్మ, pg. 146 ఆఫ్ కాజేషన్ అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ బై BR రీషెన్‌బాష్, సైటింగ్ ఉద్యోతకార, న్యాయవార్తిక, IV, 1, 21, ఎట్ http://ccbs.ntu.edu.tw/FULLTEXT/JR-PHIL/reiche2.htm
 55. కేన్, P.V. హిస్టరి ఆఫ్ ది ధర్మశాస్త్రాస్ Vol. 4 p.38
 56. IV. 4. 5
 57. కేన్, P.V. హిస్టరి ఆఫ్ ది ధర్మశాస్త్రాస్ Vol. 4 p.39
 58. 5.7
 59. కేన్, P.V. హిస్టరి ఆఫ్ ది ధర్మశాస్త్రాస్ Vol. 4 p. 176
 60. ఐబిడ్., పేజీ. 175.
 61. 61.0 61.1 ఐబిడ్., పేజీ. 176.
 62. ఎడిటర్స్ ఆఫ్ హిందూయిజం టుడే మాగజీన్, వాటి ఈజ్ హిందూయిజం? pg. 254 <http://www.himalayanacademy.com/resources/books/wih/>
 63. లవింగ్ గణేశా, చాప్టర్ 1, ఎట్ http://www.himalayanacademy.com/resources/books/lg/lg_ch-01.html
 64. "The abode of Lord Shiva at Thirukkadavoor". Chennaionline.com. October 20, 2008. మూలం నుండి 2008-05-02 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-10-20. Cite web requires |website= (help)
 65. కృష్ణ, ది బ్యూటిఫుల్ లెజెండ్ ఆఫ్ గాడ్, pg. 190, బై ఎడ్విన్ బ్రయాంట్
 66. [2] [3],[4]
 67. 67.0 67.1 కృష్ణన్, యువ్‌రాజ్, "ది డాక్ట్రైన్ ఆఫ్ కర్మ,"1997, మోతిలాల్ బనార్సిదాస్ పబ్లిషర్స్, pg.25, ఎటి http://books.google.com/books? d=_Bi6FWX1NOgC&printsec=frontcover&source=gbs_navlinks_s#v=onepage&q=&f=false
 68. 68.0 68.1 కృష్ణన్, యువ్‌రాజ్, "ది డాక్ట్రైన్ ఆఫ్ కర్మ,"1997, మోతిలాల్ బనార్సిదాస్ పబ్లిషర్స్, pg.25, ఎటి http://books.google.com/books=id=_Bi6FWX1NOgC&printsec=frontcover&source=gbs_navlinks_s#v=onepage&q=&f=false
 69. ఐబిడ్., పేజీ. 334.
 70. ఐబిడ్., పేజీ. 335.
 71. కృష్ణన్, యువ్‌రాజ్, "ది డాక్ట్రైన్ ఆఫ్ కర్మ,"1997, మోతిలాల్ బనార్సిదాస్ పబ్లిషర్స్, pg.21, ఎటి http://books.google.com/books=id=_Bi6FWX1NOgC&printsec=frontcover&source=gbs_navlinks_s#v=onepage&q=&f=false
 72. కృష్ణన్, యువ్‌రాజ్, "ది డాక్ట్రైన్ ఆఫ్ కర్మ,"1997, మోతిలాల్ బనార్సిదాస్ పబ్లిషర్స్, pg.22, ఎటి http://books.google.com/books?id=_Bi6FWX1NOgC&printsec=frontcover&source=gbs_navlinks_s#v=onepage&q=&f=false
 73. "BHAGAVAD GITA OF ORDER: CHAPTER 18b". Bhagavata.org. Retrieved 2008-10-20. Cite web requires |website= (help)
 74. 74.0 74.1 74.2 74.3 74.4 [5]
 75. 75.0 75.1 75.2 కర్మా, ఆన్ ఆంథ్రోపొలాజికల్ ఇంక్వైరి, pg. 134, at http://books.google.com/books?id=49GVZGD8d4oC&pg=PA132&dq=shani+karma&lr=&cd=2#v=onepage&q=shani%20karma&f=false
 76. కర్మా, ఆన్ ఆంథ్రోపొలాజికల్ ఇంక్వైరి, pgs. 133-134, at http://books.google.com/books? id=49GVZGD8d4oC&pg=PA132&dq=shani+karma&lr=&cd=2#v=onepage&q=shani%20karma&f=false
 77. Dasa Goswami, Satsvarupa (1983). "SPL A Summer in Montreal, 1968". Prabhupada Lila. ISBN 0911233369.

మరింత చదవటానికిసవరించు

 • Krishnan, Yuvraj (1997). The Doctrine of Karma. New Delhi: Motilal Banarsidass. ISBN 81-20812-33-6.
 • Michaels, Axel (2004). Hinduism: Past and Present. Princeton, New Jersey: Princeton University Press. ISBN 0-691-08953-1. (డర్ హిందువిస్మస్ : గెషిక్ట్ అండ్ గెగెన్‌వార్ట్ యొక్క ఇంగ్లీషు అనువాదము, వర్లాగ్ C.H. బెక్, 1998)
 • Vireswarananda, Swami (1996). Brahma Sūtras. Calcutta: Advaita Ashrama Publication Department. ISBN 81-85301-95-6.

బాహ్య లింకులుసవరించు

{{{1}}} గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

  [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
  [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
  [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
  [[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
  [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
  [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి