కల్పకం స్వామినాథన్

కల్పకం స్వామినాథన్ (1922 –2011) ఒక కర్ణాటక శాస్త్రీయ సంగీత వైణికురాలు.

కల్పకం స్వామినాథన్
Kalpakam-Swaminathan.png
వ్యక్తిగత సమాచారం
జననం(1922-08-15)1922 ఆగస్టు 15
సేతలపతి, తిరువారూర్ జిల్లా, తమిళనాడు
మరణం2011 ఏప్రిల్ 6(2011-04-06) (వయస్సు 88)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివైణికురాలు
వాయిద్యాలువీణ

విశేషాలుసవరించు

ఈమె తమిళనాడు రాష్ట్రం, తిరువారూర్ జిల్లా సేతలపతి అనే గ్రామంలో 1922, ఆగష్టు 15న జన్మించింది. ఈమె తల్లి అభయాంబాళ్ ఈమె 8వ యేటి నుండే కర్ణాటక సంగీతాన్ని నేర్పించడం ప్రారంభించింది. ఈమె కల్లిదరైకురుచి అనంతకృష్ణ అయ్యర్,[1] టి.ఎల్.వెంకటరామ అయ్యర్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి, టైగర్ వరదాచారి, మైసూరు వాసుదేవాచార్యల వద్ద సంగీతాన్ని అభ్యసించింది.

ఈమె వీణా వాదనలో తంజావూరు బాణీని అనుసరించింది. ఈమె ముత్తుస్వామి దీక్షితుల కృతులు, అభయాంబ, కమలాంబ, నీలోత్పలాంబ, త్యాగరాజ విభక్తి కృతులు, వర కృతులు, పంచలింగ కృతులు మొదలైన అనేక కీర్తనలను తన వీణా కచేరీలలో ఆలపించింది. గోటువాద్య విద్వాంసుడు బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రితో కలిసి పలు సందర్భాలలో జంటగా కచేరీలు చేసింది.[2]

టైగర్ వరదాచారి ఈమెను కళాక్షేత్రలో సంగీత అధ్యాపకురాలిగా చేర్చుకున్నాడు. అక్కడ ఈమె 1940-40 దశకాలలో అనేక సంవత్సరాలు పనిచేసింది. 1964 నుండి ఈమె తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో విద్యార్థులకు వీణ నేర్పించసాగింది. అక్కడ 1980లో ప్రొఫెసర్‌గా పదవీవిరమణ చేసింది. ఈమె వద్ద వీణ నేర్చుకున్న శిష్యులలో ఎస్.ఆర్.జానకీరామన్, కమలా అశ్వత్థామ (ఇ.గాయత్రి తల్లి), నిర్మలా రాజశేఖర్, సుభద్ర, ఎస్.ఆర్.పద్మావతి, సుజాత, ఎల్.రామకృష్ణన్, వి.హేమలత, విజయలక్ష్మి విశ్వనాథన్, కె.సరస్వతి వాసుదేవ్ మొదలైన వారున్నారు.

పురస్కారాలుసవరించు

ఈమెకు "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ కళైమామణి పురస్కారాన్ని, మద్రాసు సంగీత అకాడమీ "సంగీత కళాచార్య" బిరుదును, శ్రీత్యాగరాజ విద్వత్సమాజం "సంగీత సేవానిరత" బిరుదును, శ్రీకృష్ణ గానసభ "ఆచార్య చూడామణి" బిరుదును ప్రదానం చేశాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1993లో ఈమెకు అవార్డును ప్రకటించింది.[1] 2010లో ఈమెకు వీణశేషణ్ణ స్మారక పురస్కారం లభించింది.

మరణంసవరించు

ఈమె 2011, ఏప్రిల్ 6న తన 88వ యేట చెన్నైలో మరణించింది.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 RAMNARAYAN, GOWRI (27 July 2007). "Gifted, self-effacing". The Hindu. Archived from the original on 15 అక్టోబర్ 2007. Retrieved 14 January 2011. Check date values in: |archive-date= (help)
  2. "Budaloor Krishnamurthy Shastri", Wikipedia (in ఇంగ్లీష్), 2020-07-07, retrieved 2020-10-08

బయటి లింకులుసవరించు