కసిరెడ్డి వెంకటరెడ్డి

కసిరెడ్డి వెంకటరెడ్డి కవిగా, వక్తగా, వ్యాసకర్తగా, జానపద వాజ్మయ పరిశోధకుడిగా, ధార్మిక సామాజిక విజ్ఞాన వ్యాఖ్యాతగా వాసికెక్కాడు.[1]

కసిరెడ్డి వెంకటరెడ్డి
జననంకసిరెడ్డి వెంకటరెడ్డి
1946, ఆగష్టు నెల
మహబూబ్ నగర్ జిల్లా, ఆమనగల్లు మండలం పోలేపల్లి గ్రామం
వృత్తిఅధ్యాపకుడు
ప్రసిద్ధికవి, రచయిత, వక్త
మతంహిందూ
తండ్రికసిరెడ్డి మేఘారెడ్డి
తల్లిద్రౌపదమ్మ

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఇతడు 1946,ఆగష్టు నెలలో వ్యయనామ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి నాడు పాలమూరు జిల్లా, ఆమనగల్ మండలం, పోలేపల్లి గ్రామంలో మేఘారెడ్డి, ద్రౌపదమ్మ దంపతులకు జన్మించాడు. బాల్యంలో తండ్రి ఒడిలో ఆధ్యాత్మిక విషయాలు, కలకొండ సింగమ్మ, పెత్తల్లి శాంతమ్మ పెంపకంలో జానపద విజ్ఞాన విశేషాలు ఒంటపట్టించుకొన్నాడు. 1957-63 మధ్య కాలంలో కల్వకుర్తి ఉన్నతపాఠశాలలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాడు. 15 సంవత్సరాల ప్రాయంలో రైతుబిడ్డగా రాటుదేలుతూ కర్షక గీతాలతో కాలం గడిపాడు. పాలెం ప్రాచ్యకళాశాలలో చదివి డి.ఓ.ఎల్. పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ప్రైవేటుగా బి.ఓ.ఎల్, ఎం.ఓ.ఎల్ పరీక్షలు వ్రాసి రాష్ట్రప్రథమ శ్రేణిని సాధించాడు. తెలుగు, సంస్కృతాలలో ఎం.ఎ. చదివాడు. పండిత శిక్షణ కూడా గావించాడు. 1982లో తెలుగులో పొడుపు కథలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీ పొందాడు.

ఉద్యోగం మార్చు

డి.ఓ.ఎల్. ఉత్తీర్ణుడైన తర్వాత మాడ్గుల పాఠశాలలో ఆరు సంవత్సరాలు తెలుగు పండితునిగా పనిచేశాడు. 1973లో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా చేరాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా, తెలుగు శాఖ అధ్యక్షునిగ పదవీ బాధ్యతలు నిర్వహించాడు. ఇతని పర్యవేక్షణలో 18 మంది పి.హెచ్.డి., 14మంది ఎం.ఫిల్. చేశారు. 2007లో ఇతడు పదవీ విరమణ చేశాడు. తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక పరిషత్తు కార్యదర్శిగా కొనసాగాడు.

రచనలు మార్చు

ఇతని కలం నుండి అసంఖ్యాకమైన కావ్యాలు, శతకాలు, నవలలు, కథలు, వ్యాసాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. ఇతడు కస్తూరి అనే కలంపేరుతో కొన్ని వందల కథలు వ్రాశాడు. అతని రచనలలో కొన్ని:

పద్య సంపుటులు మార్చు

  1. చైతన్యశ్రీ
  2. సుభాషిత గీత త్రిశతి
  3. లేతమబ్బులు

గేయ సంపుటులు మార్చు

  1. సింహగర్జన
  2. ప్రబోధమాల
  3. మున్నూరు ముక్తకాలు
  4. శ్రీ భగవద్గీత

వచన కవితా సంపుటాలు మార్చు

  1. సింధూరం
  2. శ్రీ చందనం
  3. అమృతసూక్తం

శతకాలు మార్చు

  1. రెడ్డిమాట
  2. గాంధీతాత
  3. శాంతిదూత
  4. శ్రీ నరసింహ శ్రితార్తి భంజన శతకము
  5. పాలెము వేంకటేశ్వర శతకము
  6. శ్రీ కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి శతకము
  7. సిరసనగండ్ల రామ శతకము
  8. పిట్సుభర్గ వేంకటేశ శతకం
  9. వాజపేయి శతకం

కథా సంపుటాలు మార్చు

  1. అలక
  2. కస్తూరి కథలు
  3. కల్పిత కథలు
  4. అమాసపున్నాలు
  5. దయా నీ పేరు దయ్యమా?

నవలలు మార్చు

  1. వయసు-వలపు
  2. రాగజ్వాల
  3. సంస్కర్త
  4. సుడిగుండాల్లో సూరీడు

వ్యాస సంపుటాలు మార్చు

  1. జాగృత సాహితి
  2. జాతీయ సాహితి
  3. ప్రేరణ సాహితి
  4. భారతీయ మహిళ
  5. జానపద సాహిత్యం- అధ్యయనం - అనుశీలనం
  6. పార్థసారథీయం
  7. భగవద్గీత-మానవధర్మం
  8. భగవద్గీత-ధర్మరక్షణ
  9. నిత్యజీవితంలో భగవద్గీత
  10. ఆధ్యాత్మిక జీవనం
  11. ధర్మసారథి
  12. మన ఆలయాలు-మానవతా వికాసకేంద్రాలు

అనువాదాలు మార్చు

  1. జాతి జీవనంపై రామాయణ ప్రభావం
  2. భగవద్గీత
  3. భజగోవిందం
  4. అండమాన్లో ఆజన్మాంతం
  5. ఆర్యులెవరు?
  6. దారితప్పిన పంజాబ్
  7. దివ్యోపదేశం

బాలసాహిత్యం మార్చు

  1. నూరు చిన్నకథలు

వ్యాఖ్యానాలు మార్చు

  1. కాపుబిడ్డ
  2. దాశరథి శతకం
  3. వేమన వేదాంతం

పరిశోధన మార్చు

  1. తెలుగు పొడుపుకథలు
  2. పొడుపుకథలు - ఒక పరిశీలన[2]
  3. జానపద కళాదర్శనం

యాత్రా చరిత్ర మార్చు

  1. శివమెత్తిన చికాగో

సాహిత్య సేవ మార్చు

ఇతడు సాధన, గీతాజ్ఞాన యోగసమాచార్, శివానంద భారతి,పుష్పగిరి భారతి, విశ్వహిందు,ధర్మసారథి, రసవాహిని, మాతృఅర్చన మొదలైన పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. జాగృతి వారపత్రిక సంపాదకవర్గంలో సభ్యుడిగా ఉన్నాడు. జాతీయ సాహిత్య పరిషత్తు ప్రాంత అధ్యక్షుడిగా, జానపద సాహిత్య పరిషత్తు ఉపాధ్యక్షుడిగా, కేంద్ర సాహిత్య అకాడెమీ సభ్యుడిగా, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, వివేకానంద యువకేంద్ర సలహాదారుగా, సరస్వతీవిద్యాపీఠం విద్వత్సమితి సభ్యుడిగా వివిధ సంస్థల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నాడు. ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలపై సుమారు ఎనిమిది వేల ఉపన్యాసాలు చేశాడు. అనేక ధార్మిక, సాహిత్య సభల వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. బ్రహ్మోత్సవాలు, వినాయకచవితి ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలపై రేడియో, టీవీలలో వ్యాఖ్యానం చేశాడు. అనేక సాహిత్య సదస్సులు నిర్వహించాడు. గోలకొండ విజయం, కవన విజయం, వందేమాతరం, పత్రికాదర్బార్ మొదలైన సాహిత్య రూపకాలలో పాల్గొన్నాడు.

పురస్కారాలు మార్చు

  1. తుమ్మల పద్యకవితా పురస్కారం
  2. తుమ్మల సంప్రదాయ సాహితీ పురస్కారం
  3. వానమామలై స్మారక పురస్కారం
  4. గరిశకుర్తి సాహిత్య పురస్కారం
  5. నోరి నరసింహశాస్త్రి స్మారక పురస్కారం
  6. దాశరథి పురస్కారం మొదలైనవి.

బిరుదులు మార్చు

  1. ఉపన్యాస కేసరి
  2. ఉపన్యాస కళానిధి
  3. జాతీయ సాహిత్య రథ సారథి
  4. సాహిత్య ధర్మసేనాని

మూలాలు మార్చు

  1. ఆచార్య ఎస్వీ రామారావు (2015-02-01). "పాలమూరు జిల్లా సమకాలీన కవులు - కసిరెడ్డి వెంకటరెడ్డి". మూసీ. 17 (4): 18.
  2. కసిరెడ్డి, వెంకటరెడ్డి (1986-12-01). పొడుపుకథలు ఒక పరిశీలన (1 ed.). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్.