కాకర్ల శ్రీరాములు

కాకర్ల శ్రీరాములు (1877 - 1933) మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.[1]

వీరు 1877 వ సంత్సరములో, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకువీడు గ్రామములో జన్మించిరి. 1895 వ సం.లో అనగా తన 18 వ ఏట, 5 గురు పిల్లలతో ఒక రిజల్టు గరల్సు స్కూలు వీరు ప్రారంభించిరి. అప్పటినుండి, స్త్రీవిద్య గురించి పాటుపడి, అధికారుల మన్నన పొందుచు, ఆ స్కూలును 1909వ సం.వరకు నడపిరి. 1909వ సం.లో, 150 మంది పిల్లలతోను, 4 గురు ఉపాధ్యాయులతోను, ఆ స్కూలును నర్సాపురం బోర్డువారికి అప్పగించారు. అప్పటినుండి, 1932 అక్టోబరు వరకు పనిచేసి రిటైరు అయినారు. అనగా, మొత్తము 37 సంవత్సరములు స్త్రీవిద్య గురించి పాటుపటి, మొన్నటి వైకుంఠ ఏకాదశి నాడు, 27-12-1933 సం.న కాలముచేసారు.

ఈయన నిష్కపటి, రామభక్తుడు, సర్వీలెక్కలలోను, వైద్యమునందును, కవిత్వమునందును ఈయనకు ప్రవేశముండెను. మట్టితో బొమ్మలను ఆయన అభిమానముగ చేయుచుండెడివారు. "స్త్రీవిద్య" అను సంగతి తెలియని కాలములో వీరు ఆ విషయమున పాటుపడియుండుటవల్ల భీమవరము తాలూకాలోని పెద్దలు చాలామంది వీరి నెరుగుదురు.

మూలాలు మార్చు

  1. "కీ. శే. బ్రహ్మశ్రీ కాకర్ల శ్రీరాములుగారు". గృహలక్ష్మి సచిత్ర మాసపత్రిక. 7 (1): 20. 1934.