కాజీపేట (వరంగల్ అర్బన్)

"కాజీపేట" తెలంగాణ రాష్ట్రం, వరంగల్ పట్టణ జిల్లా, కాజీపేట మండలంలోని గ్రామం.[1]

ఖాజీపేట రైల్వేస్టేషనులో ముఖద్వారం

భారతదేశంనందలి ముఖ్యమైన రైల్వేస్టేషన్లులో కాజీపేట రైల్వేస్టేషన్ ఒకటి.

కొత్త మండల కేంద్రంగా ప్రకటనసవరించు

లోగడ కాజీపేట గ్రామం వరంగల్ జిల్లా, వరంగల్ రెవిన్యూ డివిజను పరిధిలోని హనుమకొండ మండలానికి చెందినది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత, మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కాజీపేట గ్రామాన్ని (1+09) పది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా, కొత్తగా ఏర్పడిన వరంగల్ పట్టణ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్సవరించు

ఇది ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలిపే ముఖ్యమైన రైల్వే జంక్షన్.1929 లో కాజీపేట - బల్హర్షా లింక్ పూర్తయిన తరువాత, చెన్నై నుండి నేరుగా డిల్లీ వెళ్లుటకు  అనుసంధానించబడింది.

వాడీ - సికింద్రాబాద్ లైన్‌ను 1874 లో హైదరాబాదు నిజాంచే నిర్మించబడింది. ఇది తరువాత నిజాం స్టేట్ రైల్వేలో భాగమైంది. 1889 లో నిజాం స్టేట్ రైల్వే ప్రధాన మార్గం విజయవాడ వరకు విస్తరించబడింది.

డోర్నకల్-కాజీపేట్ 1988-89లో, 1987-88లో కాజీపేట-రామగుండం, 1991-93లో కాజీపేట-సికింద్రాబాద్ రైల్వే మార్గాలను విద్యుదీకరించారు.

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-11-18. Retrieved 2018-01-26.

వెలుపలి లింకులుసవరించు