ప్రధాన మెనూను తెరువు

కానూన్ (హిందీ: कानून, ఉర్దూ: کانون) (శీర్షిక అనువాదం: చట్టం) 1960ల నాటి భారతీయ హిందీ చిత్రం. దీనికి బి. ఆర్. చోప్రా దర్శకత్వం వహించారు. ఈ చిత్ర నటులు రాజేంద్ర కుమార్, నందా, అశోక్ కుమార్, మెహమూద్, శశికళ, జీవన్ మరియు ఓం ప్రకాష్. ఈ చిత్రం ఆసక్తికరమైన కథ ద్వారా, మరణ శిక్షకు వ్యతిరేకంగా ఒక కేసును ప్రదర్సిస్తుంది, కేసులో సాక్షి నిజాయతీపరుడు కాడని, సందర్భానుసారం వారు చెప్పే తప్పుడు సాక్ష్యం వల్ల ఒకరు తప్పుగా ఉరి తీయబడవచ్చని ఇది వాదిస్తుంది.

Kanoon
దస్త్రం:Kanoon film poster.jpg
Film poster
దర్శకత్వము B. R. Chopra
నిర్మాత Anano
B. R. Chopra
Sarup Singh
రచన Akhtar-Ul-Iman
C. J. Pavri
తారాగణం Rajendra Kumar
Ashok Kumar
Nanda
సంగీతం Salil Choudhury
సినిమెటోగ్రఫీ M. N. Malhotra
కూర్పు Pran Mehra
Ramlal
Krishnan Sachdeva
విడుదలైన తేదీలు 1960
నిడివి 150 min.
దేశము India
భాష Hindi

ఈ చిత్రం ఒక హత్యకేసుకు సంబంధించిన న్యాయస్థాన డ్రామాగా నడుస్తుంది, దీంట్లో న్యాయమూర్తికి కాబోయే అల్లుడు (రాజేంద్రకుమార్) ఒక హత్యకేసులో డిఫెన్స్ లాయర్‌గా ఉంటూ తన మామగారినే అనుమానిస్తుంటాడు. ఈ సినిమా పాటలు లేని భారతీయ ప్రప్రథమ టాకీ చిత్రం [1].

ఇతివత్తం వివరాలుసవరించు

కాళిదాస్ (జీవన్‌)ని గణపత్ అనే వ్యక్తిని హత్య చేసినందుకు గాను న్యాయస్థానం ముందు హాజరు పరుస్తారు. అతడు నేరం చేశానని ఒప్పుకున్నాడు కాని, అదే వ్యక్తిని హత్య చేసినందుకు గాను తాను ఇప్పటికే శిక్ష అనుభవించాను కాబట్టి తనకు కోర్టు ఎలాంటి హానీ చేయదని భావిస్తున్నట్లు చెప్పాడు. ఉద్వేగంతో కదిలిపోయిన కాళిదాస్ కుప్పగూలిపోయి మరణించక ముందు న్యాయమూర్తి బద్రీప్రసాద్ (అశోక్ కుమార్‌)ని అడుగుతాడు. తనకు ఎన్నడూ వెనక్కురాని దాన్ని ఒక అమాయకుడికి ఇవ్వకుండా చేసే హక్కును చట్టానికి ఎవరిచ్చారంటూ ప్రశ్నిస్తాడు.

దిగ్భ్రాంతి కలిగించిన ఈ ఘటన ప్రత్రికలకు చేరి, నగరంలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇద్దరు న్యాయమూర్తులు మిస్టర్ ఝా మరియు మిస్టర్ సవాల్కర్ (ఇఫ్తికార్ అతిథి పాత్రలో కనిపిస్తారు) బద్రీ ప్రసాద్, మరణశిక్ష ఎన్నటికీ వేయని న్యాయమూర్తిగా సుప్రసిద్ధుడు, ఇతడు ఝాతో మిత్రపూర్వకంగా వాదిస్తాడు, హంతకుడు శిక్ష పడకుండా తప్పించుకునే అవకాశం ఉందనే దానిపై ఇద్దరిమధ్యా పందెం జరుగుతుంది.

ఈలోపున, బద్రీ ప్రసాద్ కూతురు మీనా (నందా) మరియు కైలాష్ ఖన్నా (రాజేంద్ర కుమార్) మధ్య ప్రేమ చిగురిస్తుంది, ఇతడు న్యాయవాదుల్లో ఉదయతారలలో ఒకరు మరియు బద్రీ ప్రసాద్ మద్దతు కూడా ఇతడిని ఉంటుంది. ఈ యువ జంట ఒక బ్యాలెట్‌ను సందర్శించడం సాధారణంగా జరిగిపోతుంది కాని అశోకు కుమార్ అక్కడ అనుకోకుండా తారసపడతాడు, ఇతడు ఒక ప్రైవేట్ గదిలో అపరిచిత మహిళ (శశికళ)తో ప్రేమకలాపం సాగిస్తుండటాన్ని చూస్తాడు. అయితే హత్యచేయబడిన గణపత్ ఆమె భర్తే. తన మొదటి భర్త (గణపత్) జీవిత కాలంలోనే ఈమె ఒక సంపన్నుడిని పెళ్లాడింది, అతడి ఆస్తికి కూడా వారసురాలైంది. ఇది చట్టవిరుద్ధమైన వివాహం, ధనిరామ్ ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు, ఎందుకంటే ఈ సమాచారాన్ని తెలిసిన వ్యక్తి ఇతడే మరి.

బద్రీ ప్రసాద్ కుమారుడు విజయ్ (మెహమూద్) స్థానిక వడ్డీ వ్యాపారి ధనిరామ్ (ఓం ప్రకాష్‌)కి భారీగా అప్పుపడి ఉంటాడు. ఈ వ్యాపారి తెల్ల కాగితంపై విజయ్ సంతకాన్ని చేయించుకుని ఉంటాడు, అతడి మొత్తం ఆస్తిని స్వాధీనిపర్చుకుంటానని వ్యాపారి బెదిరిస్తుంటాడు. తన సవతి తండ్రికి నిజం చెప్పాలంటే భయపడిన విజయ్, ఆ వడ్డీ వ్యాపారితో తన తరపున మాట్లాడవలసిందిగా కైలాష్‌ని అభ్యర్థిస్తాడు. మొదట్లో వ్యతిరేకించినప్పటికీ, కైలాష్ ఇందుకు అంగీకరించాడు.

వడ్డీవ్యాపారితో మాట్లాడేందుకు కైలాష్ అతడి ఇంటికి వెళ్లాడు. బద్రీనాద్ లాంటి రూపం కలగిన వ్యక్తి రాకతో వారి మధ్య మాటలకు అంతరాయం కలిగింది (వడ్డీవ్యాపారిని వాస్తవంగా చంపిన వ్యక్తి ఇతడే). ధనిరామ్‌తో తాను మాట్లాడుతున్నట్లు కనబడటం కైలాష్‌కి ఇష్టంలేదు దీంతో అతడు పక్కగదిలో దాక్కున్నాడు, తాను అక్కడికి వచ్చినట్లు న్యాయమూర్తికి చెప్పవద్దని ధనిరామ్‌కి అతడు సూచించాడు.

అనుకోకుండా వచ్చిన అతిథిని ధనిరామ్ అప్పటికే తెరిచి ఉన్న తలుపు గుండా ఆహ్వానించాడు. అనుకోని సందర్శకుడు (అశోక్ కుమార్) తన అతిథేయిని పొడిచి చంపటాన్ని కైలాష్ లోపలి గదినుంచి భయంతో గమనించాడు. ఏం చేయాలో అతనికి అర్థం కాక అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. దురదృష్టవశాత్తూ చిన్న దొంగ కాలియా (నానా పాల్సికార్) దొంగతనం చేయాలని అక్కడికి వచ్చాడు, అయితే హత్య జరిగిన స్థలం వద్దకు రాగానే అతడిని పట్టుకుని బద్రి ప్రసాద్ న్యాయస్థానంలో హాజరుపర్చారు. సబ్ ఇన్‌స్పెక్టర్ దాస్ (జగదీష్ రాజ్) హవల్దార్ రామ్ సింగ్ ఇతడిని పట్టుకున్నట్లు చూపించారు. కాలియా చేతులు పూర్తిగా రక్తంతో తడిసిపోయి కనిపించాయి.

తన బోధకుడు మరియు అదేసమయంలో తన కాబోయే మామయ్య పట్ల విశ్వాసానికి మరియు ఒక అమాయక వ్యక్తిని ఉరితీస్తుండటంలో తాను చేస్తున్న నైతిక నేరానికి మధ్య నలిగిపోతూ, కైలాష్ నిందితుడిని కాపాడాలని నిశ్చయించుకున్నాడు, కాని అదే సమయంలో ఈ బాధాకరమైన నిజాన్ని బహిరంగపర్చకుండా ఉండిపోయాడు. చివరకు జరిగిందేమేటంటే అనూహ్యమైన ముగింపుతో కూడిన ఉద్రిక్తభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్.

హత్య మరియు ఫొరెన్సిక్స్సవరించు

ఈ హత్యకు సంబంధించి పొరెన్సిక్ పరిశీలనలో ఆసక్తికరమైన వివరాలు తెలిశాయి. బద్రీనాథ్‌లా కనిపించి హత్య చేసిన వ్యక్తి ముందు వాకిలి గుండా వచ్చి, ధనిరామ్‌ను పొత్తికడుపులో పొడిచి, బల్బును స్విచ్ఛాఫ్ చేసి అదే తలుపు గుండా వెళ్లిపోయాడు.

ఆ తర్వాత చిల్లర దొంగ కాలియా, గొట్టం ద్వారా ఎక్కివచ్చి తర్వాత తెరిచి ఉన్న కిటికీ ద్వారా ధనిరామ్ ఇంటిలో తొలి అంతస్తులో అడుగుపెట్టాడు. దీపాలు ఆర్పివేయబడి ఉన్నాయి. కింద పడిన పాలలో అడుగు పడి అతడు జారిపడ్డాడు. పాల గ్లాసుపైకి నల్లపిల్లి దుమకడంతో పాలు ఒలికిపోయాయి, (హత్య తరువాత, కైలాష్ ఖన్నా పక్కనున్న గది నుంచి బయటకు వస్తూ, ఏం జరుగిందని చూస్తున్నప్పుడు పిల్లి పరుగెత్తడం కనిపించింది. నిజానికి ఆ స్థలం నుంచి పరిగెత్తి పోయేలా కైలాష్‌ని అదే అప్రమత్తం చేసింది).

పబ్లిక్ ప్రాసిక్యూటర్ కైలాష్ ఖన్నా, ధనిరామ్ ఇంటికి జూన్ 30న సరిగ్గా రాత్రి 11 గంటలకు వచ్చాడు. ఇది రెండు అంశాలతో రుజువయింది (i) ధనిరామ్ ఇంటినుంచి నేరారోపణ పత్రాన్ని సేకరించి తీసుకురమ్మని మీనా, కైలాష్‌ని అడిగినప్పడు, కైలాష్ తాను ఆ రోజు బార్ అసోసియేషన్ విందుకు హాజరు కావలసి ఉందని ఆమెతో చెప్పాడు. కాబట్టి రాత్రి 10.30 గంటలకు ముందు లేదా 11 గంటలకు తనకు ఖాళీ ఉండదని చెప్పాడు. తర్వాత అతడు ధనిరామ్ ఇంటివైపు నడుస్తున్నప్పడు, నేపథ్యంలో ఒక గడియారం గంట కొడుతున్నట్లు వినిపించింది. కైలాష్, ధనిరామ్ ఇంటికి నడచి వెళుతూ, తలుపు తెరిచినప్పుడు, గడియారం గంట 11 సార్లు కొట్టుకున్నట్లు ఎవరైనా సులువుగా గమనించవచ్చు, (తర్వాత గంట కొట్టడం ఆగిపోయింది). కాబట్టి ఘటన 11 గంటలకు మొదలైంది.

పోలీస్ సర్జన్ (ఫొరెన్సిక్ నిపుణుడి) నివేదిక ప్రకారం ధనిరామ్ 11.30 నిమిషాలకు మరియు అర్ధరాత్రి 12 గంటలకు (30వ తేదీ రాత్రి) మధ్యన చనిపోయినట్లు తెలుపుతోంది.

జూలై 1న 00.08 గంటలకు వడివడిగా గొట్టం పట్టుకుని కిందికి దిగుతున్నప్పుడు కాలియా పట్టుబడ్డాడు.

ప్రాసిక్యూషన్ హేతువులో బలహీనతసవరించు

  • ప్రాసిక్యూషన్ అటార్నీ (మన్మోహన్ కృష్ణ) ఈ కేసు ప్రారంభంలో, ధనిరామ్ నిద్రపోతున్నట్లు చెప్పాడు (ఎందుకంటే అతడి ఇంటిలో ఉన్న దీపాలు ఆపివేయబడి ఉన్నట్లు కనిపించాయి). అయితే ఇంటి ముందువాకిలి తెరిచి ఉంది (బద్రీనాధ్‌ని పోలిన వ్యక్తి దీనిగుండానే ఇంటిలోనికి వచ్చి వెళ్ళిపోయాడు, ధనిరామ్ శవం తలుపును మూసివేసే అవకాశమే లేదు). ప్రశ్న తలెత్తింది, వేళ కాని వేళలో (అర్ధరాత్రి 12 గంటలకు) తలుపు ఎందుకు తెరిచి ఉంచబడింది. అప్పుడు ప్రాసిక్యూషన్ కథ మార్చింది, ఆ సమయంలో ధనిరామ్ మేల్కొని ఉన్నాడని, అందుకే ముందువాకిలి తెరుచుకుని ఉందని చెప్పింది. అయితే ధనిరామ్ నిజంగానే మేల్కొని ఉంటే లైట్లు వెలుగుతూ ఉండేవని కైలాష్ వెంటనే అడ్డుకున్నాడు.

! నిజంగానే నేర స్థలంలో రెండు విభిన్న విషయాలు ఉంటున్నాయి, లైట్లు ఆపివేసి ఉన్నాయి కాబట్టి ఇంటి యజమాని నిద్రపోతున్నాడు. మరోవైపు ముందువాకిలి తెరిచి ఉన్నది, అంటే ఇంటి యజమాని మేల్కొని ఉన్నాడు. వాస్తవంగా, విజయ్ (మెహమూద్) రాసిన సంతకం పెట్టిన తెల్లకాగితాన్ని తెచ్చుకోవడానికి కైలాష్ ఖన్నా అచడి ఇంట్లోకి వెళ్లినప్పుడు ధనిరామ్ ఇంటి తలుపును తెరిచాడు (తర్వాత అది మూసివేయబడలేదు) కైలాష్ ఖన్నా ధనిరామ్ ఇంటి తలుపు తట్టినప్పుడు, ధనిరామ్ గ్లాసులో పాలు పోసుకుని తాగుతున్నట్లు కనబడింది (అయితే అతడు ఆ పాలను తాగనేలేదు, ఈ గ్లాసులోని పాలే తర్వాత బహుశా ఎలుక వల్ల ఒలికిపోయాయి. వీటిమీదే కాలియా కాలిముద్రలు పడ్డాయి. అతడు తలుపును తెరిచినప్పుడు, అటువంటి గౌరవనీయ అతిథికి కృతజ్ఞతాపూర్వకంగా, కైలాష్‌కి ఒక గ్లాసు షర్బత్‌ని అందించాడు. వారి సంభాషణ మధ్యలో కైలాష్ కిటికీ గుండా వెలుపలికి చూసి, బద్రీనాథ్ (వాస్తవానికి బద్రీనాథ్‌‍ని పోలిన వ్యక్తి) తలుపువేపు రావడం చూశాడు. ధనిరామ్‌తో కలిసి తాను ఉండటం ఇతరులకు తెలియడం కైలాష్‌కి ఇష్టంలేదు, అందుకే, అతడు పక్కగదిలోకి వెళ్లి దాక్కున్నాడు. బద్రీనాథ్‌ని పోలిన వ్యక్తిని ధనిరామ్ సాదరంగా అప్పటికే తెరిచి ఉన్న తలుపు గుండా ఆహ్వానించాడు (కైలాష్ లోపలకి ప్రవేశించిన తర్వాత అతడు ఆ తలుపును అస్సలు మూయలేదు). ఒక్కమాట కూడా మాట్లాడకుండా, కొత్తగా వచ్చిన ఆ వ్యక్తి ధనిరామ్‌ పొత్తికడుపుపై పొడిచాడు, తర్వాత లైట్లు ఆఫ్ చేసి తలుపులు మూయకుండానే వెళ్లిపోయాడు. కైలాష్ దీన్నంతా పక్క గది నుంచి చూస్తుండిపోయాడు. తర్వాత అతడు కూడా తలుపు మూయకుండానే, ఇంటినుంచి బయటకు జారుకున్నాడు. ఇది నేరస్థలాన్ని రెండు విభిన్న పరిస్థితులలోకి నెట్టింది - బల్పు ఆపివేసి ఉండటం, తలుపు తెరిచి ఉండటం. ఈ విభిన్న పరిస్థితిని ప్రాసిక్యూషన్ ఎన్నడూ సంతృప్తికరంగా వివరించలేదు. అది ఉత్తమంగా చెబుతున్నదేమిటంటే, కాలియా పైపు ఎక్కి పైకి వచ్చినప్పుడు తలుపు, లైట్లు రెండూ తెరుచుకుని ఉన్నాయనే. కాలియా, ధనిరామ్‌ని చంపి తర్వాత లైట్లు ఆర్పివేశాడు. అయితే కైలాష్ సరిగ్గానే ఈ విషయాన్ని ఎత్తి చూపాడు, కాలియా నిజంగానే లైట్లు ఆర్పివేసి ఉంటే, స్విచ్ బోర్డ్‌కి రక్తం అంటుకుని ఉండేది (ఎందుకంటే కాలియా పట్టుబడినప్పుడు అతడి చేతులకు పూర్తిగా రక్తం అంటుకుని ఉండింది). అయితే స్విచ్ బోర్డులో ఎలాంటి రక్తపు మరకా కనిపించలేదు. ఇది ప్రాసిక్యూషన్ కథను లోతుగా పరిశీలించడానికి కైలాష్‌కి అవకాశం కల్పించింది. న్యాయస్థానంలో హాజరైన వ్యక్తులు కైలాష్ హేతుపూర్వక వాదనను ప్రశంసించారు.

డిఫెన్స్ వాదనలో బలహీనతసవరించు

కైలాష్ ఖన్నా నేతృత్వంలో డిఫెన్స్ వాదన పలు తీవ్రలోపాలను కలిగి ఉంది, అయితే ఈ లోపాలను ప్రాసిక్యూషన్ పక్షం నుంచి న్యాయస్థానం ముందుకు ఎన్నడూ సమర్పించబడలేదు. వాటిలో కొన్ని:

  • కాలియాను సబ్ ఇన్‌స్పెక్టర్ దాస్ 11.55 నిమిషాలకు పట్టుకున్నట్లు చూపించారు. ఈ సమయం దాస్ స్వంత గడియారం నుంచి నోట్ చేయబడింది. భారత్‌లో సాధారణంగా హత్య కేసు విచారణ నెలల తరబడి, లేదా హత్య జరిగిన తర్వాత సంవత్సరాల తరబడి సాగుతుంది. విచారణ కాలంలో, దాస్ గడియారం 13 నిమిషాలు ఆలస్యంగా నడుస్తోందని కైలాష్ నిరూపించాడు (ఇది దురదృష్ట సంఖ్య) అతడు దాస్‌ని టైమ్ ఎంత అని అడిగాడు. హత్య జరిగిన సమయంలో తాను ధరించిన గడియారాన్నే కోర్టుకు చూపించిన దాస్, అప్పుడు సమయం సాయంత్రం 3.55 నిమిషాలని చెప్పాడు. అదే సమయంలో, కోర్టు గడియారం 4.08 గంటలుగా చూపిస్తోంది, అంటే దాస్ గడియారం 13 నిమిషాలు నిదానంగా నడుస్తోందన్నమాట. ఈ వాస్తవం ద్వారానే, కాలియా జూన్ 30 రాత్రి 11.55 గంటలకు కాకుండా (జూలై 1న) రాత్రి 12.08 నిమిషాలకు పట్టుబడ్డాడని కైలాష్ నిరూపించాడు. దీంతో కాలియా మీద అనుమానం దాదాపుగా పోయింది. సబ్ ఇన్‌స్పెక్టర్ దాస్ ఈ కేసు విచారణకు వచ్చిన నెలల తర్వాత కూడా తన గడియారాన్ని వెనక్కు తిప్పి ఉంచడమన్నదే అసంబద్ధమైన విషయంగా ఉంటోంది.
  • పోలీస్ సర్జన్ తన పోస్ట్‌మార్టమ్ నివేదికలో హత్య రాత్రి 11.30 గంటలకు మరియు 12.00 గంటలకు మధ్య జరిగిందని చెప్పిన విషయాన్ని కైలాష్ పరిగణనలోకి తీసుకున్నాడు. హత్య 12.00 గంటలకు కూడా జరిగి ఉండే అవకాశం ఉంది. హత్య జరిగిన సరైన సమయం ఇదేనని నిర్ధారించబడితే, కాలియా అరెస్ట్ 12.08గంటలకు జరిగి ఉంటుందిని సులువుగా చెప్పవచ్చు. కాని కైలాష్ ఈ నివేదికలో సూచించబడిన రెండు వ్యతిరేక సమయాల అంక గణితాన్ని తీసుకుని దీని ఆధారంగా, (ప్రాసిక్యూషన్ నుంచి అభ్యంతరం లేకుండానే) హత్య (జూన్ 30) రాత్రి 11. 45 గంటలకు జరిగిందని నిర్ధారించాడు. తర్వాత ఇతడు కాలియా శవంతో 23 నిమిషాల పాటు గడిపాడని (ఇతడు జూలై 1న 00.08 గంటలకు పట్టుబడ్డాడు) అతడి చేతులు రక్తంతో తడిసి ఉన్నాయని వాదించాడు. ఇది ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. అందుచేత కాలియా హంతకుడు కాడని తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా డిఫెన్స్ వైపు నుంచి ఈ లోపాన్ని ప్రాసిక్యూషన్ ఎన్నడూ సవాలు చేయలేదు.
  • కాలియా పైపుద్వారా ధనిరామ్ ఇంటిలోకి వెళ్లి, (తెరిచి ఉన్న కిటికీ గుండా) దేన్నో దొంగిలించబోయాడని ప్రాసిక్యూషన్ కథనం నడిపింది. ఆసమయంలో మేల్కొని ఉన్న ధనిరామ్, కాలియాను పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఈ ఘర్షణలో పాలు కింద ఒలికిపోయి ఉంటాయి (వాస్తవానికి కాలియా అక్కడికి వెళ్లేసరికే పాలు ఒలికిపోయి ఉన్నాయి). కాలియా, ధనిరామ్‌ని పొడిచి చంపి అక్కడినుంచి వెళ్లిపోయేందుకు కిటికీవద్దకు వెళ్లాడు, ఈ క్రమంలో ఒలికిపోయిన పాలమీద అతడి కాలిముద్రలు పడ్డాయి. ఈ కథనలోని లోపాలను కైలాష్ సులువుగా గుర్తించగలిగేవాడు, కాలి ముద్రలు నేరుగా (ధనిరామ్ శవం పడి ఉన్న గది మధ్యలోకి వెళుతున్నట్లు సూచిస్తున్నాయిని) సూచించడం ద్వారా అతడీ పనిచేసి ఉండవచ్చు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, పాదముద్రలు గది అవతలివైపుకు (కాలియా వాస్తవంగా అడుగుపెట్టిన కిటికీవైపుకు) సూచించబడి ఉండాలి. ఆసక్తికరమైన ఈ వాస్తవం కోర్టు దృష్టికి ఎన్నడూ తీసుకురాలేదు. పైగా, కాలియా లోపలికి ప్రవేశించినప్పుడు, అతడు కాలి వేళ్లపై నడిచాడు (అతడి పాదాల సవ్వడి ఎవరూ వినబడకూడదని అలా చేశాడు). దీంతో అతి సమీపంలో రెండు పాద ముద్రలు వరుసగా కనిపించాయి. ఒక వ్యక్తి పరుగెడుతున్నప్పుడు (కాలియా, ధనిరామ్‌ని హత్య చేసిన తర్వాత ఆ గదినుంచి పరుగెత్తుతున్నట్లు కేసులో చూపించబడి ఉండాలి), పక్కపక్కనే ఉన్న కాలిముద్రలు మరింత దూరంగా కనిపించి ఉండాలి. ఈ వాస్తవం కూడూ ఎన్నడూ కోర్టు ముందుకు తీసుకురాలేదు.

అప్రముఖ విషయాలుసవరించు

  • ధనిరామ్ (ఓం ప్రకాష్) హత్య జరిగిన సంవత్సరం సినిమాలో పేర్కొనబడలేదు, కాని సినిమాలోని విషయాలను బట్టి దీన్ని తెలుసుకోవచ్చు. ఇతడు 1959 జూన్ 30 రాత్రి హత్య చేయబడి ఉండవచ్చు. ఎందుకంటే, హత్య జరిగిన మరుసటి దినం, బద్రీ ప్రసాద్ కూతురు మీనా (నందా) తన తండ్రికి ఉపాహారం అందిస్తున్నప్పుడు, నేపథ్యంలో రేడియో హిందీలో ఇలా ప్రకటించింది - "ఆజ్ బుధవార్ హై ఔర్ జూలై కి పెహ్లి తారీఖ్ " [ఈ రోజు బుధవారం, మరియు జూలై ఒకటవ తేదీ]. ఈ సినిమాను 1960లో నిర్మించారు. ఈ సంవత్సరానికి ముందు, 1959 చాలా దగ్గరి సంవత్సరం, ఆ ఏడు బుధవారం జూలై 1న వస్తుంది.
  • ఉరితీయబడకుండా ఎవరైనా హత్య చేసే అవకాశంపై బద్రీ ప్రసాద్ (అశోక్ కుమార్) న్యాయమూర్తి ఝా మధ్య పందెం జూన్ 28 అంటే రెండు రోజుల ముందు జరిగింది. సినిమా ముగింపులో కైలాష్ ఖన్నా కోర్టుకు బద్రీ ప్రసాద్ డైరీని సమర్పించినప్పుడు, అతడు ఈ తేదీని పేర్కొన్నాడు.

పురస్కారాలుసవరించు

  • 1962: ఫిలింపేర్ ఉత్తమ దర్శకుడి అవార్డు: బి ఆర్ చోప్రా
  • 1962: ఫిలింపేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డు: నానా పల్సికార్ [2]

సూచనలుసవరించు

  1. ఫిల్మ్స్ ట్రాన్స్‌ఫార్మ్‌డ్ చోప్రా'స్ డెస్టినీ అండ్ వైస్ వెర్సా టైమ్స్ ఆఫ్ ఇండియా, 6 నవంబర్ 2008.
  2. అవార్డులు ఇంటర్నెట్ మూవీ డేటాబేస్.

బాహ్య లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కానూన్&oldid=2502615" నుండి వెలికితీశారు