ప్రధాన మెనూను తెరువు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో కాన్పూర్ దేహత్ జిల్లా (హిందీ:) ఒకటి. మతి, అక్బర్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కాన్పూర్ దేహత్ జిల్లా కాన్పూర్ డివిషన్‌లో భాగంగా ఉంది.

Kanpur Dehat జిల్లా

कानपुर देहात जिला
کانپور دیہات
Uttar Pradesh లో Kanpur Dehat జిల్లా స్థానము
Uttar Pradesh లో Kanpur Dehat జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముKanpur
ముఖ్య పట్టణంAkbarpur, Kanpur Dehat
మండలాలు1. Akbarpur, 2. Bhognipur, 3. Rasoolabad, 4. Derapur and 5. Sikandara
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుAkbarpur
 • శాసనసభ నియోజకవర్గాలు1. Rasulabad, 2. Akbarpur-Raniya, 3. Sikandra and 4. Bhognipur
విస్తీర్ణం
 • మొత్తం3,021 కి.మీ2 (1,166 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం17,95,092.[1]
జనగణాంకాలు
 • అక్షరాస్యత77.52%
అక్షాంశరేఖాంశాలు26°20′39″N 79°58′02″E / 26.3443°N 79.96718°E / 26.3443; 79.96718Coordinates: 26°20′39″N 79°58′02″E / 26.3443°N 79.96718°E / 26.3443; 79.96718 - 26°18′07″N 79°58′01″E / 26.302°N 79.967°E / 26.302; 79.967
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చరిత్రసవరించు

1977లో కాన్పూర్ జిల్లా రెండు జిల్లాలుగా విభజించబడింది. (కాన్పూర్ నగర్, కాన్పూర్ దేహత్). 1979లో రెండు తిరిగి సమైక్యం అయ్యాయి. 1981లో తిరిగి విభజించబడ్డాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దానికి కాన్పూర్ దేహత్ జిల్లా అని పేరును నిర్ణయించింది. 2010 జూలై 1న రమాబాయ్ నగర్ జిల్లా పేరు నిర్ణయించింది. 2012లో తిరిగి కాన్పూర్ దేహత్ అని నిర్ణయించబడింది.[2]

ప్రయాణ వసతులుసవరించు

జిల్లా రైలు మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. కాన్పూర్ దేహత్ జిల్లా నుండి మూడు రైలు మార్గాలు ఉన్నాయి. " నార్త్ సెంట్రల్ జోనుకు " చెందిన రైలు మార్గం జిల్లా నుండి పయనిస్తుంది.

  • ఢిల్లీ- హౌరా రైలు మార్గం (నార్త్ సెంట్రల్ జోనుకు):- కాన్పూర్ మీదుగా పయనిస్తుంది. ఈ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం పూర్తిగా విద్యుదీకరణ చేయబడి ఉంది. ఈ మార్గంలో

భౌపుర్, మైథ, రోషన్ మౌ, హాల్ట్, రుర, అంబియపుర్, ఝింఝక్ మరియు పర్జని హల్త్ వద్ద రైలు స్టేషన్లు ఉన్నాయి.

  • రెండవది కాన్పూర్ రైలు మార్గం :- బినౌర్, రసుల్పుర్ గొగుమౌ, తిలౌంచి,పమన్,లల్పుర్ (కాన్పూర్ దేహత్ జిల్లా), మలస, పుఖ్రయన్ మరియు చౌన్రహ్ వద్ద రైలు స్టేషన్లు ఉన్నాయి.

ఈ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం పూర్తిగా విద్యుదీకరణ చేయబడి ఉంది.

  • మూడవది నేరో గేజ్ రైలు మార్గం:- ఇది ప్రస్తుతం బ్రాడ్ గేజ్ రైలు మార్గంగా చేయబడింది. నార్త్ ఈస్టర్న్ జోనుకు చెందినది. ఈ మార్గం గంగనదికి సమాంతరంగా పయనిస్తుంది. ఈ మర్గం విద్యుదీకరణ చేయబడుతూ ఉంది.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,795,092,[1]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 268వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 594 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.82%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 862:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 77.52%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

క్రీడలుసవరించు

జిల్లాలో క్రికెట్ ప్రధాన క్రీడగా ఉంది. లోకల్ క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజ్ పలు విధములైన టోర్నమెంట్లు నిర్వహిస్తుంది. " రాధేశ్యాం లీగ్ " అనే ప్రముఖ క్రికెట్ లీగ్ ఇక్కడ క్రీడలలో పాల్గొంటూ ఉంది.

మినార్లుసవరించు

జిల్లాలోని మొగల్ రోడ్డు (గ్రాండ్ ట్రంక్ రోడ్) నుండి పలు కోస్ మినార్లు ఉన్నాయి. వాటిలో కొన్ని సురక్షిత స్మారకచిహ్నాలుగా సంరక్షించబడుతున్నాయి. వీటిలో భొగ్నిపూర్, చాపర్ ఘట, డియోసర్, గౌర్, హలియా, జల్లపూర్, సికందర, పైల్వర్, పితంపూర్, రైగవన్, రాజ్‌పూర్ (కాన్పూర్ దేహత్), సంఖిల్న్, బుజర్గ్, సర్దార్పూర్ ప్రధానమైనవి.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. "Kanpur Dehat". District administration. Retrieved 2010-08-18. Cite web requires |website= (help)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est. line feed character in |quote= at position 12 (help); Cite web requires |website= (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nebraska 1,826,341 line feed character in |quote= at position 9 (help); Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు