కాఫీ విత్ ఏ కిల్లర్

కాఫీ విత్‌ ఏ కిల్లర్‌ 2025లో తెలుగులో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. షేక్ ఖాజా మొహియుద్దీన్ భాషా సమర్పణలో ది బెస్ట్ క్రియేషన్, సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్. పి. పట్నాయక్ దర్శకత్వం వహించాడు.[1] శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రఘు బాబు, రవిబాబు, టెంపర్ వంశీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 సెప్టెంబర్ 28న విడుదల చేసి,[2] సినిమాను జనవరి 31న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[3][4]

కాఫీ విత్ ఏ కిల్లర్
దర్శకత్వంఆర్. పి. పట్నాయక్
రచన
మాటలుతిరుమల్ నాగ్
నిర్మాత
  • సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
తారాగణం
ఛాయాగ్రహణంఅనుష్క గోరక్
కూర్పుఅనుష్క గోరక్
ఆర్ట్ డైరెక్టర్సంతోష్ కుమార్ ఉబలే
సంగీతం
  • పాటలు:
నిర్మాణ
సంస్థలు
  • ది బెస్ట్ క్రియేషన్
  • సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
31 జనవరి 2025 (2025-01-31)(ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒక కాఫీ షాప్‌లో కిల్లర్ (టెంపర్ వంశీ) ఉంటాడు. ఆ కాఫీ షాప్‌కు ఒక పోలీస్ ఆఫీసర్ (రవి ప్రకాష్) వస్తాడు. సెటిల్మెంట్ బ్యాచ్, జాతకాలు నమ్మే యువకుడు, తమ ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుకునేందుకు అబ్బాయి, అమ్మాయి ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. అక్కడికి వచ్చిన ఆ కిల్లర్ తనని నియమించిన వ్యక్తి ఇచ్చే ఆదేశం కోసం ఎదురుచూస్తూంటాడు. ఆ కిల్లర్ ను నియమించింది ఎవరు? ఎవరిని చంపడానికి వచ్చాడు? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా సినిమా కథ.

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • నేపథ్య సంగీతం: భరత్ మధుసూదనన్
  • ప్రొడక్షన్ డిజైనర్: సంతోష్ కుమార్ ఉబలే
  • సౌండ్ డిజైన్: ఈ. రాధా కృష్ణ (ప్రసాద్ ల్యాబ్స్)
  • పబ్లిసిటీ డిజైన్: ప్రణయ్ తేజ కొండా

మూలాలు

మార్చు
  1. "కిల్లర్‌తో కాఫీ". Eenadu. 1 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  2. "Music director RP Patnaik makes his directorial comeback with 'Coffee With A Killer'; Anil Ravipudi launches the trailer". The Times of India. 28 September 2022. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  3. "'కాఫీ విత్ ఏ కిల్లర్'... తొమ్మిదేళ్ల తర్వాత ఆర్పీ డైరెక్షన్... డైరెక్ట్‌గా ఓటీటీలోకి థ్రిల్లర్". A. B. P. Desam. 28 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  4. "ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ కాఫీ విత్ ఏ కిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి". TV9 Telugu. 31 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.

బయటి లింకులు

మార్చు