కామారెడ్డి పురపాలక సంఘం

(కామారెడ్డి పురపాలక సంఘము నుండి దారిమార్పు చెందింది)

కామారెడ్డి పురపాలక సంఘం, కామారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘం.[1]ఇది 1987లో ఏర్పడింది.ప్రస్తుతం దీని పరిధిలో 33 వార్డులున్నాయి.[2] 2014 సవత్సరం, 2000 సంవత్సరంలలో జరిగిన ఎన్నికలలో చైర్మెన్ పదవి జనరల్ (మహిళ) కు కేటాయించబడింది.[3] గతంలో చివరిసారి ఎన్నికలు 2005లో జరిగాయి.2010 సెప్టెంబరు నుంచి 2019 వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది.దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.దీనికి చివరిసారిగా పాలకవర్గం ఎన్నికలు 2020 జనవరిలో జరిగినవి.[4]దీని వైశాల్యం (చ.కి.మీ.లో):14.11 చ. కి.మీ.రాష్ట్ర రాజధాని నుండి 110 కి.మీ. దూరంలో ఉంది.[1] కామారెడ్డి పురపాలక సంఘం జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలోని, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.

గణాంకాలుసవరించు

కామారెడ్డి పురపాలక సంఘంను 5 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.2011 భారత జనాభా గణాంకాల ప్రకారం కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో 80,315 జనాభా ఉంది. వీరిలో 39,660 మంది పురుషులు ఉండగా, 40,655 మంది మహిళలు ఉన్నారు.[5]

పురపాలక సంఘం పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 8772 మంది ఉన్నారు. ఇది కామారెడ్డి పురపాలక సంఘం మొత్తం జనాభాలో 10.92% గా ఉంది.స్త్రీల సెక్స్ నిష్పత్తి రాష్ట్ర సగటు 993 కు వ్యతిరేకంగా 1025 గా ఉంది. అంతేకాక, కామారెడ్డిలో పిల్లల సెక్స్ నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే 957 గా ఉంది. కామారెడ్డి నగర అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 79.44% ఎక్కువగా ఉంది. కామారెడ్డిలో పురుషుల అక్షరాస్యత 87.65% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 71.50%గా ఉంది.

కామారెడ్డి మునిసిపాలిటీలో మొత్తం 17,759 ఇళ్లకు పైగా పరిపాలన ఉంది. వాటికి నీరు సరఫరా, మురుగునీటి పారుదల,ఇతర ప్రాథమిక సౌకర్యాలను పురపాలక సంఘం ద్వారా జరుగుతాయి.మున్సిపాలిటీ పరిధిలో రహదారులను నిర్మించడానికి,నిర్వహణకు దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి పురపాలక సంఘానికి అధికారం ఉంది.[5]

2001 భారత జనాభా గణాంకాల ప్రకారం కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో 64,496 జనాభా ఉంది. వీరిలో 32,770 మంది పురుషులు ఉండగా, 31,726 మంది మహిళలు ఉన్నారు.గృహాలు సంఖ్య 11,124

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్సవరించు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా నిట్టు జాహ్నవి (టిఆర్ఎస్), వైస్ చైర్మన్‌గా గడ్డం ఇందుప్రియ (టిఆర్ఎస్) పనిచేస్తున్నారు.[6]

రవాణా సౌకర్యంసవరించు

కామారెడ్డి పురపాలక సంఘం పరిధిలో రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి.కామారెడ్డికి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించే ప్రధాన రహదారి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య నగరాలకు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని చాలా ప్రధాన నగరాలకు ఎన్ఎచ్44 (పాత ఎన్ఎచ్7) వంటి ప్రధాన రహదారులతో ఇది కలుపుతుంది.ఇది భారతదేశంలో అతి పొడవైన రహదారి. కనెక్టివిటీ ఉన్న రైల్వే స్టేషన్ ఉంది. కామారెడ్డికి ప్రధాన రైల్వే లైన్ సికందరాబాద్-మన్మాడ్ రైల్వే లైన్ ఉంది. కామారెడ్డి రైల్వే భారతదేశంలోని ప్రధాన నగరాలకు కలుపుతుంది.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Kamareddy Municipality". kamareddymunicipality.telangana.gov.in. Retrieved 2020-07-03.
  2. https://cdma.telangana.gov.in/election/GO%20160%20-%20KAMAREDDY%20MUNICIPALITY.pdf
  3. నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది 09-03-2014
  4. www.ETGovernment.com. "Telangana Municipal elections will be held on January 22 - ET Government". ETGovernment.com (in ఆంగ్లం). Retrieved 2020-07-03.
  5. 5.0 5.1 "Kamareddy Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-03.
  6. https://tsec.gov.in/pdf/mucipal_wardmember/2020/Mayer_chairperson_M_1426.pdf

బయటి లింకులుసవరించు