కాల్వ శ్రీనివాసులు

కాల్వ శ్రీనివాసులు నాయుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.

కాల్వ శ్రీనివాసులు నాయుడు
కాల్వ శ్రీనివాసులు


రూరల్‌ హౌసింగ్‌ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2017 - 2019
ముందు కాపు రామచంద్రారెడ్డి
తరువాత కాపు రామచంద్రారెడ్డి
నియోజకవర్గం రాయదుర్గం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 జులై 1964
కె.కె.అగ్రహారం గ్రామం, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కెబి వెంకటస్వామి, పుల్లమ్మ
జీవిత భాగస్వామి కె విజయలక్ష్మి
సంతానం కె గౌతమి, కె భరత్
నివాసం కొవ్వురునగర్, అనంతపురం

జననం, విద్యాభాస్యం మార్చు

కాల్వ శ్రీనివాసులు 1 జులై 1964లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలం, కె.కె.అగ్రహారం గ్రామంలో కెబి వెంకటస్వామి, పుల్లమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన అనంతపూర్ లోని ఎస్.కె యూనివర్సిటీ నుండి ఎంఎ (సోషియాలజీ), డిప్లొమా (జర్నలిజం) పూర్తి చేశాడు.[1]

రాజకీయ జీవితం మార్చు

కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశంపార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1999లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి పై 21102 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2004, 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలై, 2014లో ఎమ్మెల్యేగా గెలిచి 21 జూన్ 2014 నుండి వరకు 02 ఏప్రిల్ 2017 వరకు ప్రభుత్వ చీఫ్ విప్‌‌గా,[2] 2017 నుండి 2019 వరకు మంత్రిగా పని చేశాడు.[3][4]

సంవత్సరం నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
1999 అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం కాల్వ శ్రీనివాసులు టీడీపీ 378488 అనంత వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ 357386
2004 అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం అనంత వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ 458925 కాల్వ శ్రీనివాసులు టీడీపీ 385521
2009 అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం అనంత వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ 457876 కాల్వ శ్రీనివాసులు టీడీపీ 379955
2014 రాయదుర్గం నియోజకవర్గం కాల్వ శ్రీనివాసులు టీడీపీ 92344 కాపు రామచంద్రారెడ్డి వైస్సార్సీపీ 90517
2019 రాయదుర్గం నియోజకవర్గం కాపు రామచంద్రారెడ్డి వైస్సార్సీపీ 109043 కాల్వ శ్రీనివాసులు టీడీపీ 94,994

మూలాలు మార్చు

  1. Andrabhoomi (3 April 2017). "కొత్త మంత్రుల పుట్టుపూర్వోత్తరాలు". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  2. Sakshi (16 March 2016). "ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ విఫలం: కాల్వ". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  3. Asianet News (2 April 2017). "ఇవీ ఆంధ్రా కొత్త మంత్రుల శాఖలు". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  4. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.