కాల్షియం ఫ్లోరైడ్

కాల్షియం ఫ్లోరైడ్ ఒక రసాయన సమ్మేళనపదార్థం.ఇది ఒక ఆకర్బన రసాయన సంయోగ పదార్థం. కాల్సియం, ఫ్లోరిన్ పరమాణువుల సమ్మేళనం వలన కాల్షియం ఫ్లోరైడ్ సంయోగ పదార్థం ఏర్పడినది. కాల్షియం ఫ్లోరైడ్ రసాయనానిక ఫార్ములా CaF2. అనగా ఒక అణువు కాల్షియం ఫ్లోరైడ్ లో ఒకపరమాణువు కాల్సియం, రెండు ఫ్లోరిన్ పరమాణువులు బంధంఏర్పరచుకొని ఉండును.కాల్షియం ఫ్లోరైడ్ రసాయనం, ఫ్లోరైట్ (ఫ్లోర్ స్పర్ (fluorspar) అనికూడాపిలుస్తారు) ఖనిజరుపంలో లభిస్తుంది. ఫ్లోరైట్ ఖనిజం, దానిలోని మలినాల కారణంగా ముదురు రంగుకల్గి ఉండును.

కాల్షియం ఫ్లోరైడ్
Calcium fluoride.jpg
Fluorite-unit-cell-3D-ionic.png
Fluorid vápenatý.PNG
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7789-75-5]
పబ్ కెమ్ 24617
యూరోపియన్ కమిషన్ సంఖ్య 232-188-7
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:35437
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య EW1760000
SMILES [Ca+2].[F-].[F-]
ధర్మములు
CaF2
మోలార్ ద్రవ్యరాశి 78.07 g·mol−1
స్వరూపం White crystalline solid (single crystals are transparent)
సాంద్రత 3.18 g/cm3
ద్రవీభవన స్థానం 1,418 °C (2,584 °F; 1,691 K)
బాష్పీభవన స్థానం 2,533 °C (4,591 °F; 2,806 K)
0.0015 g/100 mL (18 °C)
0.0016 g/100 mL (20 °C)
Solubility product, Ksp 3.9 × 10−11 [1]
ద్రావణీయత insoluble in acetone
slightly soluble in acid
వక్రీభవన గుణకం (nD) 1.4338
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
cubic crystal system, cF12[2]
Fm3m, #225
కోఆర్డినేషన్ జ్యామితి
Ca, 8, cubic
F, 4, tetrahedral
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Reacts with conc. sulfuric acid to produce hydrofluoric acid
భద్రత సమాచార పత్రము ICSC 1323
R-పదబంధాలు R20

, R22 , R36

, R37

, R38

S-పదబంధాలు S26

, S36

జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
>5000 mg/kg (oral, guinea pig)
4250 mg/kg (oral, rat)[3]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Beryllium fluoride
Magnesium fluoride
Strontium fluoride
Barium fluoride
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☑Y verify (what is ☑Y

☒N ?)

Infobox references

భౌతిక లక్షణాలుసవరించు

భౌతిక స్థితిసవరించు

కాల్షియం ఫ్లోరైడ్ తెల్లని స్పటిక నిర్మాణ రసాయన పదార్థం.ఏకస్పటిక నిర్మాణ కాల్షియం ఫ్లోరైడ్ రంగులేని ఘనపదార్థం. బహుస్పటికయుత కాల్షియం ఫ్లోరైడ్ తెల్లగా కనపడును. కాల్షియం ఫ్లోరైడ్ అణుభారం78.07 గ్రాములు/మోల్−1. ఘనాకృతి స్పటిక అణుసౌష్టవాన్ని పొందియున్నది.

సాంద్రతసవరించు

సాధారణ ఉష్ణోగ్రత (25 °C) వద్ద కాల్షియం ఫ్లోరైడ్ సాంద్రత 3.18 గ్రాములు/సెం.మీ3.

ద్రవీభవన స్థానంసవరించు

కాల్షియం ఫ్లోరైడ్ రసాయన పదార్థం ద్రవీభవన స్థానం 1,418 °C (2,584 °F; 1,691K)

బాష్పీభవన ఉష్ణోగ్రతసవరించు

కాల్షియం ఫ్లోరైడ్ రసాయన పదార్థం బాష్పీభవన స్థానం 2,533 °C (4,591 °F; 2,806K)

ద్రావణీయతసవరించు

నీటిలో కాల్షియం ఫ్లోరైడ్ అత్యల్ప ప్రమాణంలో కరుగును. 18 °C వద్ద 100 మీ.లీ, ల నీటిలో 0.0015 గ్రాములు. 20 °C వద్ద 0.0016 గ్రాములు కరుగును.అసిటోన్ లో కరుగదు.ఆమ్లాలలో కొద్దిగా కరుగును.

వక్రీభవన గుణకంసవరించు

కాల్షియం ఫ్లోరైడ్ వక్రీభవన సూచిక 1.4338

సహజ వనరుగా లభ్యతసవరించు

కాల్షియం ఫ్లోరైడ్ ను కలిగిన ఖనిజం ఫ్లోరైట్ అధికమొత్తంలో, ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా లభిస్యున్నది.ముఖ్యంగా ఫ్లోరైట్ ఖనిజాన్ని హైడ్రోజన్ ఫ్లోరైట్ కు పూర్వగామి (precursor).

ఉత్పత్తిసవరించు

అత్యంతశుద్ధత కల్గిన కాల్షియం ఫ్లోరైడ్ ను కాల్షియం కార్బోనేట్ రసాయనాన్ని హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లోంతో రసాయన చర్యకు లోను కావించి ఉత్పత్తి కావింతురు.

CaCO3 + 2 HF → CaF2 + CO2 + H2O

రసాయన చర్యలుసవరించు

స్వాభావికంగా లభించు కాల్షియంఫ్లోరైడ్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఉత్పత్తికి ముఖ్యమూల వనరు.ఫ్లోరైట్ ఖనిజంలోని ఫ్లోరైట్ వ్యాపార, వాణిజ్య పరంగా ప్రాముఖ్యత కల్గిఉన్నది.ఫ్లోరైట్ ఖనిజాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య వలన హైడ్రోజన్ ఫ్లోరైడ్ జనించును/విడుదల అగును.

CaF2 + H2SO4 → CaSO4(solid) + 2 HF

ఉపయోగాలుసవరించు

కాల్షియం ఫ్లోరైడ్ ను కిటికిల అద్దాలు, కటకాలువంటి దృశ్యసంబంధిత పరికరాల, వస్తువుల నిర్మాణంలో, తయారీలో ఉపయోగిస్తారు.ఈ రసాయనాన్ని థెర్మల్ఇమేజింగ్ సిస్టం, స్పెక్ట్రోస్కోపి,, ఎక్సైమిర్ లేసర్ లలో ఉపయోగిస్తారు. కాల్షియం ఫ్లోరైడ్ తక్కువ వక్రీభావన గుణకం కల్గి ఉన్నందున దీనితో చేయు వాటికి అంటిరిఫ్లేక్సన్ కోటింగ్ అవసరం లేదు.

భద్రతసవరించు

కాల్షియం ఫ్లోరైడ్ ప్రమాద/అపాయ రహిత రసాయన పదార్థంగావర్గీకరణచేసారు.అయినప్పటికీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య వలన విషపూరిత హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లం ఏర్పడును. NIOSH అనుమతించినప్రమాణం ప్రకారం లోపలి పిల్చుగాలిలోని, కాల్షియం ఫ్లోరైడ్ రసాయన ఆవిరుల మోతాదు 2.5 మీ.గ్రా/మీ3 దాటరాదు

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Pradyot Patnaik. Handbook of Inorganic Chemicals. McGraw-Hill, 2002, ISBN 0-07-049439-8
  2. X-ray Diffraction Investigations of CaF2 at High Pressure, L. Gerward, J. S. Olsen, S. Steenstrup, M. Malinowski, S. Åsbrink and A. Waskowska, Journal of Applied Crystallography (1992), 25, 578-581 doi:10.1107/S0021889892004096
  3. "Fluorides (as F)". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).