కావలి గ్రీష్మ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ రాష్ట్ర చైర్‌పర్సన్‌గా భాద్యతలు చేపట్టింది.[1][2][3][4]

కావలి గ్రీష్మ
కావలి గ్రీష్మ


పదవీ కాలం
30 మార్చి 2025
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ రాష్ట్ర చైర్‌పర్సన్‌
పదవీ కాలం
2024 నవంబర్ 22 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కావలి ప్రతిభా భారతి
నివాసం ఇంటి.నెం. 77-8, శ్రీకాకుళం రోడ్, రాజాం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం [1]

రాజకీయ జీవితం

మార్చు

కావలి గ్రీష్మ తన తల్లి కావలి ప్రతిభా భారతి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా 2017లో రాజకీయాల్లోకి వచ్చి రాజాం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌గా ఆ తరువాత 2022లో పార్టీ అధికార ప్రతినిధిగా నియమితురాలై కొద్ది రోజులలోనే తన వాగ్ధాటితో ఒంగోలులో జరిగిన మహానాడు వేదికగా చేసిన ప్రసంగంతో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.[5][6] ఆమె 2024లో జరిగిన శాసనసభ  ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్  ఆశించగా అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ విజయానికి కృషి చేసింది.

కావలి గ్రీష్మ నవంబర్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ (మహిళా కో ఆపరేవటివ్ కార్పొరేషన్) చైర్‌పర్సన్‌గా నియమితురాలై,[7] నవంబర్ 22న భాద్యతలు చేపట్టింది.[8] ఆమెను 2025 మార్చి 20న జరుగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలలో టీడీపీ తరపున ఎమ్మెల్యే కోటా అభ్యర్థిగా ప్రకటించారు.[9][10]

ఆమె 2025లో శాసనమండలికి జరిగిన ఎన్నికలలో శాసనసభ్యుల కోటా నుండి మార్చి 13న తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైంది.[11][12]

మూలాలు

మార్చు
  1. "మహిళల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యం: కావలి గ్రీష్మ". Andhrajyothy. 22 November 2024. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
  2. Eenadu (10 November 2024). "ఏపీలో పదవుల పండగ". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
  3. "వీడిన ఉత్కంఠత.. అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ". Andhrajyothy. 9 March 2025. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
  4. "బలహీనవర్గాలకు పెద్దపీట". Eenadu. 10 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  5. "మహానాడులో వైసీపీపై తొడగొట్టి మరీ దుమ్మురేపిన ఈ యువతి ఎవరంటే." Andhrajyothy. 29 May 2022. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
  6. "2022లో ఏపీలో చాలానే జరిగాయిగా.. కానీ ఆ ఒక్క వీడియోతో నివ్వెరపోయిన జనాలు..!". Andhrajyothy. 28 December 2022. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
  7. "ఏపీలో నామినేటెడ్‌ పదవుల రెండో లిస్ట్ వచ్చేసింది..." TV9 Telugu. 9 November 2024. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
  8. "సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదు". Eenadu. 22 November 2024. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
  9. "టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?". ABP Desham. 9 March 2025. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
  10. "గ్రీష్మకు ఎమ్మెల్సీ సీటు". Prajasakti. 9 March 2025. Archived from the original on 9 March 2025. Retrieved 9 March 2025.
  11. "ఏపీలో కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలు వీరే". Eenadu. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
  12. "ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరే". Zee News Telugu. 13 March 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.