కాశీ బుగ్గ ఆలయం, హైదరాబాదు

కాశీ బుగ్గ ఆలయం అనేది హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో మూసీ నది తీరాన నెలకొని ఉన్న శివాలయం. 1822లో నిర్మించబడిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శివలింగానికి సమీపంలో నిరంతరం నీరు ప్రవహిస్తూ సంవత్సరం పొడవునా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది.[1]

కాశీ బుగ్గ ఆలయం
పేరు
ఇతర పేర్లు:హైదరాబాద్ కాశీ
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హైదరాబాదు
ప్రదేశం:కిషన్ భాగ్‌
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శివుడు
ప్రధాన పండుగలు:మహాశివరాత్రి
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
1822
నిర్మాత:రాజా రాఘవ్ రామ్‌జీ

ఈ ఆలయానికి ప్రస్తుతం రాజ్‌కుమార్ భరత్ లాల్‌జీ ట్రస్టీగా ఉన్నాడు. కాగా 1965లో ఎండోమెంట్ ఆధీనంలోకి వెళ్ళింది.

విశిష్టత మార్చు

ఈ పురాతన కాశీబుగ్గ శివాలయం మూసీనది ఒడ్డున రాజా రాఘవ్ రామ్‌జీ నిర్మించాడు. ఈ ఆలయం ఇతర హిందూ దేవాలయాల మాదిరిగా కాకుండా బయటి నుండి ఇంటి రూపంలో నిర్మించబడి శివలింగం భూగర్భంలో ప్రతిష్టించారు. దీనికి కారణం అప్పట్లో దేవాలయాలను ధ్వంసం చేస్తున్న మొఘల్ ఆక్రమణదారుల నుండి ఆలయాన్ని రక్షించడమే అని అంటారు. శైవం, వైష్ణవం విరాజిల్లే క్షేత్ర నిర్మాణంలో అప్పటి ఇంజనీరింగ్ చాతుర్యాన్ని చాటింది. ఆ రోజుల్లోనే శివలింగానికి మానవ ప్రమేయం లేకుండా నిత్యం జలాభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. అయితే నేటికి అబ్బురపరిచే విషయం ఏంటంటే ఈ పవిత్రజలానికి మూలం ఏంటో తెలియదు. దీనిని కదు నీరు అంటారు. కాశీ జలం అని నమ్ముతారు. ఎన్నో ఔషద గుణాలు గల ఈ నీటిని సేవిస్తే పలు ఆరోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతక రోగాలు సైతం నయమవుతాయని భక్తుల విశ్వాసం. రోజూ తెల్లవారుజామునే మొదటగా నాగుపాములు ఆలయంలోకి చేరి గర్భగుడిలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాయని ఒక్కడ భక్తులు చెబుతూంటారు.[2]

కిషన్‌బాగ్‌ లోని శ్రీ మురళీమనోహర్ స్వామి దేవాలయానికి అరకిలోమీటరు దూరంలో కాశీబుగ్గ మందిర్ ఉంది. ఈ రెండు దేవాలయాలు రాజా రాఘవ్ రామ్‌జీ నిర్మించాడు. ఇక్కడ నిత్యం శివలింగార్చనలో తరించే గంగమ్మతో పాటు అంజనేయుడు, నారదుడు, దత్తాత్రేయస్వామి వార్లకు కూడా నిత్యం పూజలు నిర్వహిస్తూంటారు.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. "kashi bugga temple, శివ లింగానికి రోజూ అభిషేకం చేస్తున్న పాములు - maha shivaratri celebrations in kishan bagh kashi bugga temple hyderabad - Samayam Telugu". web.archive.org. 2023-06-08. Archived from the original on 2023-06-08. Retrieved 2023-06-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Hyderabad Shaan | History of Kishan Bhag Kashibugga Temple | V6 News, retrieved 2023-06-08