కింగ్ కోఠి ప్యాలెస్

కింగ్ కోఠి ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కింగ్ కోఠి ప్రాంతంలో ఉన్న ప్యాలస్.[1][2] హైదరబాదు శతాబ్దాల తరబడి రాజరిక వ్వవస్తలో ఉన్నందున ఇక్కడ అనేక అందమైన భవనాలు వెలిశాయి. వాటి వాస్తు శిల్ప రీత్యా, వాటిలోని అలంకరణల దృష్ట్యా ఎంతో అందమైనవి. ఇలాంటి భవనాలు చాలా వున్నాయి కాని వాటిలో అతి ముఖ్యమైనవి ఫలక్ నుమా ప్యాలెస్, చౌమహల్లా పాలస్, బషీర్ బాగ్ పాలెస్ లతో పాటు కింగ్ కోఠి ప్యాలెస్. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

కింగ్ కోఠి ప్యాలెస్
Kingkoti palace dwaramu cropped.jpg
కింగ్ కోఠి ప్యాలెస్ ముందరి గేటు
సాధారణ సమాచారం
స్థితినిజాం సొంతం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ప్రారంభం1911
యజమానినిజాం
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పికమల్ ఖాన్

చరిత్రసవరించు

కింగ్ కోఠి ప్యాలెస్ ను కమల్ ఖాన్ అనే అతను తన స్వంత అవసరాలకు ఈ ప్యాలెస్ ను నిర్మించాడు. కాని హైదరాబాద్ నిజాం (మీర్ ఉస్మాన్ అలీ ఖాన్) దీనిమీద మనసు పడగా దానిని నైజాము నవాబుకు అమ్మేశాడు. నైజాము నవాబు పదమూడు సంవత్సరాల వయస్సులో వుండగా ఈ ప్యాలెస్ లో అడుగు పెట్టాడు. 1911లో అతను రాజ్యాధికారానికొచ్చిన తర్వాత కూడా అందులోనే నివసించాడు. తన తండ్రి నివసిస్తున్న చౌమహల్లా ప్యాలెస్ కు వెళ్ళలేదు. కమల్ ఖాన్ తాను తన కొరకు నిర్మించుకున్న భవనమైనందున, ఆ భవనములోని అన్ని డోరు లకు, కిటికీలకు, ఆర్చీలకు తన పేరున 'K' అనే ఆంగ్ల అక్షరాన్ని చెక్కించు కున్నాడు. నైజాము స్వాధీనంలోనికి వచ్చిన తర్వాతా ఆ గుర్తును 'K K' అనగా కింగ్ కోటీగా మార్పించారు.[2][3] ఆ ప్యాలెస్సే అతని అధికార నివాసముగా వుండేది. అందుకే దాని పేరు కింగ్ కోఠి అని స్థిర పడింది. ఈ ప్యాలెస్ లో విలువైన రత్నాలు, మణి మాణిక్యాలు మొదలగు విలువైన వజ్రాలు ఇనుప పెట్టెలలో తాళం వేసి భద్ర పరచబడి వుండేవి.

ప్రధాన భవనాలుసవరించు

విశాలమైన ఈ కింగ్ కోటి ప్యాలెస్ ఆవరణములో మూడు ప్రధానమైన భవనములున్నవి. హైదరాబాద్ చివరి నైజాము తనకొరకు ఒక పెద్ద గ్రంథాలయాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేసుకున్నారు.[4] హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో విలీనమైన తర్వాత ఈ ప్యాలెస్ లోని తూర్పు వైపున వున్న భవనాలలో ప్రస్తుత ప్రభుత్వం ఆస్పత్రిని నడుపుతున్నది. ఈ భవనాలలో ఆ రోజుల్లో రాజరికపు ఉత్సవాల కొరకు ఉపయోగించే వారు. పశ్చిమ భాగాన వున్న భవనాలు నజరీ బాగ్ లేదా ముబారక్ భవనాలుగా పిలువ బడేవి. అవి నైజాము వారి వ్వక్తిగత భవనాలుగా ఈ నాటికి స్థిరంగా ఉన్నాయి.

 
కింగ్ కోటి ప్యాలెస్ ప్రథాన ద్వారము. స్వంత కృతి

పరదా గేట్సవరించు

ఈ కింగ్ కోటి ప్యాలెస్ ప్రాంగణానికి వున్న ప్రధాన ద్వారానికి ఎప్పుడు ఒక పరదా వేలాడేసి వుంటుంది. అందుకే దానికి పరదా ద్వారము అని పేరు స్థిర పడి పోయింది. ఆ రోజుల్లో నైజాము అంతఃపురంలో లేకుంటే ఈ పరదా పైకి లేపి వుంచే వారు. లోపల వుంటే పరదా క్రిందికి దించి వుంచే వారు. ఈ ద్వారానికి ఆయుధాలు కలిగిన సైనికులు కాపలా దారులుగా వుండేవారు.[5] ప్రస్తుతం ఈ పరదా గేటుకు పరదా ఎల్లప్పుడు క్రిందికి దించే వుంటుండి. చిత్రములో చూడ వచ్చు.

ప్రభుత్వ ఆస్పత్రిసవరించు

మూడవ భవనమైన ఉస్మాన్ మేన్షన్ ను 1980వ సంవత్సరంలో కూలగొట్టి దాని స్థానంలో కొత్తగా ఒక హాస్పిటల్ ను ప్రభుత్వము నడుపుతున్నది. ముబారక్ మేన్షన్ భవనానికి పైన పెద్ద గడియారమున్నందున దాని ఘడియల్ గేట్ అని అంటారు. ఇందులోనె జుడి మస్జిద్ ఉంది. హైదరాబాదు చివరీ నైజాము (1911 - 1948) ఈ భవనములోనే పిబ్రవరి 24, 1967లో మరణించారు.[2] ఈ భవనాలన్నీ ముఖ్యంగా యూరోపియన్ వాస్తు కళా రీతులు ఎక్కువగా ప్రస్పుటిస్తున్నాయి. చుట్టూ అతి ఎత్తైన ప్రహరీ గోడతో పరివేష్టితమై భలంగా ఉంది.

కింగ్ కోఠి పేరు మీదనే నేటి 'కోఠి 'సవరించు

ఈ ప్రాంతము రామ్ కోఠి ప్రాంతంలో ఉంది. హైదరాబాదులో కోఠి అనే ప్రాంతం ఆ కింగ్ కోఠి పేరుమీదనే ప్రస్తుతం కూడా పిలువ బడుతున్నది.

వివాదాల్లో కింగ్‌కోఠి ప్యాలెస్‌సవరించు

2022లో సరిగ్గా ప్రతియేటా ఏప్రిల్ 18న జరుపుకునే అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం ముందు రోజే కింగ్‌కోఠి ప్యాలెస్‌ కూల్చివేత ప్రచారం స్థానికంగా కలకలం రేపింది. నిజాం వారసుల నుంచి స్థలాన్ని తాము కొనుగోలు చేశామని మహారాష్ట్రకు చెందిన ఓ నిర్మాణ సంస్థ, ఆ సంస్థ నుంచి తాము కొనుగోలు చేశామని కశ్మీర్‌కు చెందిన మరో సంస్థ వాదిస్తోంది. తాజాగా ఇరు కంపెనీల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసులు నమోదు చేశారు.[6]

మూలాలుసవరించు

  1. "No takers for Nazri Bagh Palace". Times of India. Archived from the original on 2012-11-05. Retrieved 2021-01-16.
  2. 2.0 2.1 2.2 Bhavani, Divya Kala (2017-05-31). "Fading Palatial Facade". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-16.
  3. Khalidi, Omar (2009). A Guide to Architecture in Hyderabad, Deccan, India (PDF). p. 163. Archived from the original (PDF) on 25 September 2019. Retrieved 2021-01-16.
  4. "A peek into the royal library". Times of India. Archived from the original on 2013-12-18. Retrieved 7 March 2012.
  5. The King Kothi Palace[permanent dead link]
  6. "కింగ్‌కోఠి ప్యాలెస్‌పై రగడ". Sakshi. 2022-04-12. Retrieved 2022-04-18.