కిండర్ గార్టెన్ (బాల విహార్)

ఆఫ్ఘనిస్తాన్ లో ఒక కిండర్ గార్టెన్ తరగతి గది.

About this sound Kindergarten   (జర్మన్,లో అక్షరాలా దీని అర్ధం "పిల్లల తోట") చిన్నపిల్లల కొరకు ఇంటినుండి మరింత క్రమబద్ధమైన విద్యాభ్యాసమునకు పరివర్తనగా పనిచేసే ఒక విద్యావిధానం. పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రీస్కూల్ (పూర్వపాఠశాల) లతో సమన్వయం కలిగిన మరొక నిర్వచనం ప్రకారం, ఇది 6 లేదా 7 సంవత్సరముల కన్నా తక్కువ వయస్సు కలిగిన చదువుకోబోయే- మరియు చదువుకున్న-అక్షరాస్యులైన పిల్లల కొరకు రూపొందించిన విద్య. సృజనాత్మకమైన ఆటలు మరియు పదిమందితో మాట్లాడటం, అదేవిధంగా కొన్నిసార్లు సంప్రదాయక పాఠముల ద్వారా పిల్లలకు ప్రాథమిక నైపుణ్యములు మరియు జ్ఞానము పెంపొందించుకోవటంలో శిక్షణ ఇవ్వబడుతుంది.

చాలా దేశములలో కిండర్ గార్టెన్, పూర్వ ప్రాథమిక విద్య యొక్క ప్రీస్కూల్ వ్యవస్థ[1]లో భాగం. స్థానిక ఆచారము ప్రకారం, సాధారణంగా రెండు నుండి ఏడు సంవత్సరముల మధ్య వయస్సులో ఎప్పుడైనా పిల్లలు కిండర్ గార్టెన్ కు హాజరవుతారు.

యునైటెడ్ స్టేట్స్ మరియు ఆంగ్లము మాట్లాడే కెనడాలో, అదేవిధంగా ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతములలో (న్యూ సౌత్ వేల్స్, టాస్మానియా మరియు ఆస్ట్రేలియన్ కాపిటల్ టెర్రిటరీ) కిండర్ గార్టెన్ అనే పదం మొదటి విద్యా సంవత్సరము, లేదా ప్రాథమిక పాఠశాల వివరణలో ఎక్కువగా వినియోగించబడింది (కెనడాలో, మొదటి రెండు సంవత్సరములు). వీటిలో కొన్ని దేశములలో ఇది నిర్బంధం, అనగా తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలను వారి కిండర్ గార్టెన్ వయస్సులో అక్కడకు పంపాలి (సాధారణంగా, 5 సంవత్సరముల వయస్సులో). యునైటెడ్ స్టేట్స్ లో, అనేక రాష్ట్రములు ఐదు నుండి ఆరు సంవత్సరముల వయస్సు పిల్లలకు ఉచిత కిండర్ గార్టెన్ విద్యా సంవత్సరమును విస్తారముగా అందిస్తున్నాయి, కానీ దీనిని నిర్బంధం చేయలేదు, ఇది ఇలా ఉండగా ఇతర రాష్ట్రములలో ఐదు సంవత్సరముల వయస్సు వారందరూ కిండర్ గార్టెన్ లో చేరవలసి ఉంది. ప్రీస్కూల్ లేదా అరుదుగా ఉపయోగించే, "ప్రీ-K," అనే పదములు (పూర్వం, నర్సరీ పాఠశాల) U.S.లో పూర్వ వయస్సు వర్గపు విద్యను సూచించటానికి ఉపయోగించబడతాయి.

బ్రిటిష్ ఇంగ్లీష్ లో, నర్సరీ లేదా ప్లేగ్రూప్ అనేది ప్రీస్కూల్ విద్యకు సాధారణ పదం, మరియు స్టీనర్-వాల్డోర్ఫ్ ఎడ్యుకేషన్ (దీని విద్యా సిద్దాంతమును రుడోల్ఫ్ స్టీనర్ కనుగొన్నాడు) వంటి ప్రత్యేక విద్యా విధానముల సందర్భములలో తప్పించి, కిండర్ గార్టెన్ అనే పదాన్ని అరుదుగా ఉపయోగిస్తారు.

ఉద్దేశంసవరించు

పిల్లలు మాట్లాడటం, ఆడటం మరియు ఇతరులతో చక్కగా కలవటం నేర్చుకోవటానికి కిండర్ గార్టెన్ కు వెళతారు. భాష మరియు పఠనం యొక్క పదావళి, గణితము, మరియు సామాన్యశాస్త్రము, అదేవిధంగా సంగీతం, చిత్రలేఖనము, మరియు సాంఘిక ప్రవర్తనలను నేర్చుకోవటానికి పిల్లలను ప్రోత్సహించటానికి ఒక అధ్యాపకుడు వివిధ వస్తువులను మరియు కార్యక్రమములను అందిస్తాడు. పూర్వం ఇంటివద్ద ఎక్కువ సమయం గడిపిన పిల్లలు, కంగారు పడకుండా వారి తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండటానికి అలవాటు పడటంలో కిండర్ గార్టెన్ సహాయపడుతుంది. క్రమం తప్పకుండా అదే పిల్లలతో ఆడుకోవటానికి మరియు మాట్లాడటానికి ఇది వారికి తొలి అవకాశం కావచ్చు. కిండర్ గార్టెన్ తల్లులు, తండ్రులు లేదా ఇతర సంరక్షకులకు పాక్షిక సమయం (పార్ట్-టైం) లేదా పూర్తి సమయం (ఫుల్-టైం) ఉద్యోగములకు తిరిగి వెళ్ళే వీలు కూడా కల్పిస్తుంది.

చరిత్రసవరించు

 
ఫ్రీడ్రిక్ ఫ్రోబెల్ 1840 లో జర్మనీలో మొదటి కిండర్ గార్టెన్ ను ప్రారంభించాడు.

మొదటి కిండర్ గార్టెన్ కు అనేక మూలములు ఉన్నాయి. స్కాట్లాండ్ లో 1816 లో, తాత్వికుడు మరియు అధ్యాపకుడు అయిన రాబర్ట్ ఓవెన్, న్యూ లానర్క్లో పసిపిల్లల పాఠశాలను ప్రారంభించాడు.[2][3][4] మరియొక దానిని శామ్యూల్ వైల్డర్ స్పిన్ 1819 లో లండన్ లో ప్రారంభించాడు.[5] హంగరీలో మహారాణి థెరేసా బ్రన్స్జ్విక్ (1775–1861) బుడా నగరంలోని తన ఇంటిలో మొదటి కిండర్ గార్టెన్ ను 1828 మే 27 న ఆంగ్యాల్కెర్ట్ (దేవతల ఉద్యానవనం) అనే పేరుతో ప్రారంభించింది.[2][6] వెంటనే ఆ ఆలోచన గొప్పవారికి మరియు మధ్య తరగతి వారికి మధ్య జనరంజక సంస్థగా అవుతూ, హంగరీ రాజ్యమంతా ఉద్భవించింది.

తరువాత, గూటెన్బర్గ్ మూవబుల్ టైపు (ఒక రకమైన ముద్రణా విధానం) ఆవిష్కారం యొక్క నాలుగు వందల సంవత్సరపు వార్షికోత్సవానికి గుర్తుగా, ఫ్రీడ్రిక్ ఫ్రోబెల్ (1782-1852) 1840 జూన్ 28 న హంగరీ బయట మొదటి ప్రీస్కూల్ విద్యా సంస్థను ప్రారంభించాడు. ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ కొరకు ఫ్రోబెల్ కిండర్ గార్టెన్ (పిల్లల తోట) అనే పేరును మరియు పదాన్ని సృష్టించాడు, దీనిని అతను 1837లో జర్మనీలోని తురింజియాలో ఉన్న పూర్వపు చిన్న స్క్వార్జ్ బర్గ్-రుడోల్స్టాడ్త్ ప్రిన్సిపాలిటీ లోని బాడ్ బ్లాంకెన్బర్గ్, గ్రామంలో స్థాపించాడు. జర్మనీలో ఫ్రోబెల్స్ సంస్థ యొక్క ప్రీస్కూల్ విద్య సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన సంస్థలకు కిండర్ గార్టెన్ అనే పేరు తెచ్చిపెట్టింది, దీనితో అది యూరోప్ లో మిగిలిన ప్రాంతములకు మరియు మిగిలిన ప్రపంచానికి ఎగుమతి అయ్యింది.

యునైటెడ్ స్టేట్స్లో మొదటి కిండర్ గార్టెన్ ను 1856 లో మార్గరేత్ (మెయెర్) స్కర్జ్ (కార్యకర్త మరియు రాజ్యాంగవేత్త కార్ల్ స్కర్జ్ యొక్క సతీమణి) వాటర్ టౌన్, విస్కాన్సిన్లో స్థాపించింది. ఇది ఆమె యూరోప్ లో నేర్చుకున్న ఫ్రోబెలైట్ సిద్ధాంతముల పై ఆధారపడింది. స్కర్జ్ అక్క బెర్త మెయెర్ రోంజ్, లండన్ (1851), మాంచెస్టర్ (1859), మరియు లీడ్స్ (1860) లలో "ఇన్ఫాంట్ గార్డెన్స్" ప్రారంభించింది. మార్గరేత్ స్కర్జ్ మొట్టమొదట వాటర్ టౌన్, విస్కాన్సిన్ లోని తన ఇంటిలో ఐదుగురు పిల్లలకు శిక్షణ ఇచ్చింది (తన సొంత కుమార్తె, అగాథతో కలుపుకుని). ఆమె విజయం ఇతర పిల్లలకు కూడా తన విద్యను అందించేలా ఆమెను పురికొల్పింది. స్కర్జ్ యొక్క మొదటి కిండర్ గార్టెన్ జర్మన్-భాషది కాగా, ఆంగ్ల భాషా కిండర్ గార్టెన్ల స్థాపనను కూడా ఆమె సమర్ధించింది. 1859 లో బోస్టన్లో జరిగిన ఒక సమావేశంలో ఎలిజబెత్ పీబాడీని ఫ్రోబెల్ సిద్ధాంతము వైపు మార్చిన ఘనత ఆమెకు దక్కింది.

అదే సంవత్సరంలో తరువాత, స్కర్జ్ యొక్క నమూనాను అనుసరించి పీబాడీ అమెరికాలో మొట్టమొదటి ఆంగ్ల-భాష కిండర్ గార్టెన్ ను బోస్టన్ లో ప్రారంభించింది. అమెరికాలో మొదటి ఉచిత కిండర్ గార్టెన్ ను 1870 లో కాన్రాడ్ పాపెన్హుసేన్ స్థాపించాడు, ఇతను కాలేజ్ పాయింట్, NYలో స్థిరపడిన ఒక జర్మన్ పారిశ్రామికవేత్త మరియు లోకోపకారి, తను ఉన్నచోటే ఇతను పాపెన్హుసేన్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు, అది ఇప్పటికీ ఉంది. యునైటెడ్ స్టేట్స్ లో ప్రభుత్వం నిధులు సమకూర్చిన మొదటి కిండర్ గార్టెన్ ను 1873 లో సుసాన్ బ్లో సెయింట్ లూయిస్లో స్థాపించాడు. ఎలిజబెత్ హారిసన్ పూర్వ ప్రాథమిక విద్య సిద్ధాంతం గురించి విస్తృతంగా రాసాడు మరియు 1886 లో నేషనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను స్థాపించటం ద్వారా కిండర్ గార్టెన్ అధ్యాపకుల విద్యా ప్రమాణములను పెంపొందించటానికి కృషి చేసాడు.

ఆఫ్ఘనిస్తాన్సవరించు

మూస:Off-topic

ఆఫ్ఘనిస్తాన్ లో, కిండర్ గార్టెన్ కు సమానమైన పదం کودکستان, ఇది కుడకిస్తాన్గా ఉచ్చరించబడుతుంది (కుడాక్ – అనగా పిల్లవాడు మరియు స్తాన్ – అనగా భూమి అని అర్ధం) మరియు ఇది అసలైన విద్యా వ్యవస్థలో భాగం కాదు. 3 మరియు 6 సంవత్సరాల మధ్య వయస్సులో పిల్లలు ప్రభుత్వం నడిపే కిండర్ గార్టెన్స్ కు వెళతారు. చట్ట ప్రకారం, ప్రతి ప్రభుత్వ కార్యాలయములో తప్పనిసరిగా ఒక కిండర్ గార్టెన్ ఉండాలి.

=== ఆఫ్ఘనిస్తాన్ లో పూర్వ ప్రాథమిక విద్య

===

ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్ (ECD) (బాల్యపు తొలిదశలో ఎదుగుదల) కార్యక్రమములు పుట్టినప్పటి నుండి ఆరు సంవత్సరముల వయస్సు వరకు చిన్న పిల్లల అవసరములు మరియు అభివృద్ధి, మరియు వారి కుటుంబములు, మరియు వారి సమాజములను చూసుకుంటాయి. అవి బహుప్రమాణకమైనవి మరియు ఇవి పిల్లల ఆరోగ్యం, ఆహారం, అంతర్బుద్ధి, సామాజిక మరియు భావభరిత సామర్ధ్యములకు ఊతమివ్వటానికి రూపొందించబడ్డాయి, తద్వారా వీరిని రాబోయే కాలంలో మనగలిగేటట్లు మరియు వృద్ధి చెందేటట్లు చేస్తాయి. సాంప్రదాయ విలువలను ప్రతిబింబిస్తూ, పిల్లల పెంపకంలో ఒక పిల్లవాని అభివృద్ధికి ఊతమిచ్చే మరియు/లేదా మట్టుపరిచే సాంప్రదాయ పద్ధతుల యొక్క అవగాహనతో పిల్లలలో కోరుకునే అభివృద్ధిని పెంపొందించే వాతావరణముల గురించి తెలిసిన విషయములను కలుపుతూ, వాటిని కుటుంబములు మరియు సమాజములలో లోతుగా పాతాలి. ఒక కుటుంబము లోని పిల్లలు పాఠశాలకు వెళ్ళే వయస్సుకు చేరుకునే సమయానికి కేవలం ఆరోగ్యం మరియు మంచి పోషణతో ఉండటమే కాకుండా వివేచనాత్మకమైన ఉత్సుకతతో, పదిమందిలో ఆత్మవిశ్వాసముతో, మరియు జీవితకాల అధ్యయనానికి అవసరమైన మంచి పునాదితో ఉండటానికి సిద్ధం చేయటంలో ఆ కుటుంబములకు సహాయం చేయటం ECD తంత్రాంగం యొక్క లక్ష్యం. చిన్న వయస్సు పిల్లలు పాఠశాలలలో (కిండర్ గార్టెన్) చేరటానికి ముందే వారి జీవితాలకు మంచి ఆరంభాన్ని ఇవ్వటానికి కార్యక్రమములను రూపొందించి అమలుపరచటం అదేవిధంగా పాఠశాలకు వెళ్ళలేక విద్యను పొందలేని పాఠశాల-వయస్సు పిల్లలకు నాన్-ఫార్మల్ ఎడ్యుకేషన్ (సంప్రదాయేతర విద్య) మరియు వృత్తి విద్యా శిక్షణను అందించటం ద్వారా సహకారం ఇవ్వటం.

నేపథ్యంసవరించు

ECD క్రమణికలకు ఆఫ్ఘనిస్తాన్లో సాపేక్షముగా చిన్న చరిత్ర ఉంది. 1980 లో సోవియెట్ ఆక్రమణ సమయంలో 27 నాగరిక ప్రీస్కూల్స్, లేదా కొడకిస్తాన్ ల స్థాపనతో అవి మొదటిసారి ప్రారంభించబడ్డాయి. 1980లలో ప్రీస్కూల్స్ సంఖ్య స్థిరంగా పెరిగి, 1990 నాటికి 270 కి చేరుకుంది, వీటిలో 2,300 మంది ఉపాధ్యాయులు 21,000 కన్నా ఎక్కువ మంది పిల్లల బాగోగులు చూసుకుంటున్నారు. ఈ సదుపాయములు నాగరిక అంశములు, ఇవి ఎక్కువగా కాబుల్ లో ఉన్నాయి, మరియు ఇవి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయములు, లేదా పరిశ్రమలతో అనుసంధానించబడి ఉన్నాయి. సోవియెట్ నమూనా ఆధారంగా, శ్రామిక మరియు సాంఘిక సంక్షేమ శాఖ యొక్క ఆధ్వర్యములో వారు మూడు నెలల నుండి ఆరు సంవత్సరముల వయస్సు పిల్లలకు నర్సరీ కేర్, ప్రీస్కూల్, మరియుకిండర్ గార్టెన్ లను అందించారు. ఆఫ్ఘన్ లోని చాలా కుటుంబములు ఈ విధానాన్ని ఎప్పుడూ చూసి ఉండలేదు, మరియు ఈ విధానం కుటుంబం యొక్క ప్రధాన పాత్రను తగ్గించటం మరియు పిల్లలలో సోవియెట్ విలువలను బోధించటం వలన వారిలో చాలామంది దీనిని ఎప్పటికీ పూర్తిగా అంగీకరించలేదు. సోవియెట్ వెనుకకు మరలిన తరువాత అంతర్ యుద్ధం ప్రారంభమవగానే, కిండర్ గార్టెన్ ల సంఖ్య వేగంగా పడిపోయింది. 1995 నాటికి 2,110 మంది పిల్లలకు సేవలందిస్తూ కేవలం 88 పనిచేస్తున్న వసతులు మాత్రం మిగిలాయి, మరియు ఆడవారికి ఉద్యోగములు ఇవ్వటంపై తాలిబాన్ నిబంధనలు వారి ఆధీనంలో ఉన్న ప్రాంతములలో మిగిలిన కేంద్రములను తొలగించాయి. ప్రస్తుతం, ఎటువంటి కార్యక్రములు లేవు, వసతులు ధ్వంసం అయ్యాయి, మరియు శిక్షణ పొందిన వారు కరువయ్యారు. 2007 లో, అక్కడ 25000 కన్నా ఎక్కువ మంది పిల్లలకు పూర్వ విద్య యొక్క ప్రేరణను అందిస్తూ 260 కిండర్ గార్టెన్లు ఉన్నాయి.

ఆఫ్ఘన్ పిల్లలలో 2.5 మిలియన్ పిల్లలు ఆరు సంవత్సరముల వయస్సు లోపు వారు. ఆఫ్ఘన్ పిల్లవాని పెరుగుదల మరియు అభివృద్ధిపైన బలమైన చెడ్డ ప్రభావాన్ని కలిగించటానికి శారీరిక మరియు పర్యావరణ హాని కారకములు రెండూ కలిసి పనిచేస్తాయి. మతసంబంధ మరియు ఆదివాసీ ఆచారములు మరియు నమ్మకములు ఆఫ్ఘన్ సమాజమును ముంచెత్తాయి, చాలా ప్రాంతములలో చుట్టరికములు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం అయ్యాయి. బంధువర్గంపైన గట్టి అవధారణతో సమాజములన్నీ సాంప్రదాయబద్ధంగా దగ్గరగా చేరాయి. పాత్రలన్నీ స్పష్టంగా నిర్వచించబడ్డాయి మరియు ఇవి సాంఘిక క్రమానికి కేంద్రంగా ఉన్నాయి. దశాబ్దముల యుద్ధం, భారీ తరలింపు, మరియు మారుతున్న అధికార వ్యవస్థలు సమాజ-సేవా వలయములు కూలిపోవటానికి మరియు మరింత మౌలికమైన సాంప్రదాయ నిర్వహణ పద్ధతులలో ఒకటి అయిన బంధువర్గం యొక్క క్షయానికి కారణమయ్యాయి. ఎక్కువ మంది మహిళలు భర్తలను కోల్పోయి, కుటంబ పోషకులుగా అలవాటులేని మరియు సాంప్రదాయంకాని బాధ్యతలను మోయవలసివచ్చింది. జన్మ స్థాపం, చిన్నపిల్లల ధనుర్వాతం, అతిసారం, సన్నిపాతం మరియు వాక్సిన్ తో నివారించగలిగే వ్యాధుల కారణంగా మొత్తం పిల్లలలో నాలుగవ వంతు మంది ఐదు సంవత్సరముల వయస్సు లోపలే మరణిస్తున్నారు. ఇనుప ధాతు లోపంతో వచ్చే రక్త హీనత బాగా వ్యాపించి, ఐదు సంవత్సరముల లోపు పిల్లలలో సగం నుండి మూడింట రెండు వంతుల మందిని బాధిస్తోంది. గణాంకముల ప్రకారం అనేక మంది పిల్లలకు పోషకాహారం దొరకటంలేదు; 45–59% పిల్లలలో పెరుగుదల పూర్తిగా నిలిచిపోయింది. పోషణ సరిగాలేని ఆడపిల్లలందరిలో సగం మంది పద్దెనిమిది సంవత్సరముల లోపే వివాహం చేసుకుంటారు, మరియు చాలా మంది యుక్త వయస్సుకు వచ్చిన వెంటనే వివాహం చేసుకుంటారు. అభివృద్ధికి ఉన్న ఈ ఆటంకములను ఎదుర్కొని, అధ్యయన అవకాశముల యొక్క ప్రయోజనమును పొందలేక పిల్లలు పాఠశాలకు వస్తారు. చదువు మధ్యలో మానేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరం కాదు. రెండవ తరగతిలో ప్రతి నలుగురు పిల్లలలో ఒకరు మరియు మూడు మరియు నాలుగవ తరగతులలో ప్రతి ఇద్దరిలో ఒక్కరు పాఠశాల చదువు మానేసి వెళ్లిపోతున్నారని 1999 గణాంకములు చూపిస్తున్నాయి. పిల్లవాని శారీరిక మరియు ఆరోగ్య స్థితితో పాటు, చదువు మధ్యలో మానేసే వారి సంఖ్య అధికంగా ఉండటానికి కుటుంబ ఇబ్బందులు, మరియు పిల్లవానికి ఏది ముఖ్యమో తేల్చుకోలేని పరిస్థితులు, అధ్యాపకులు సక్రమంగా హాజరు కాకపోవటం, సంబంధంలేని పాఠములు, మరియు నాణ్యతలేని శిక్షణ కూడా కారణం అవుతాయి.

ప్రస్తుతం, బాల్యపు ప్రారంభానికి సంబంధించిన ఏ పాలసీలు లేవు మరియు ఏ సంస్థకు ఆ విధమైన సేవలను అందించే బాధ్యత కానీ సామర్ధ్యం కానీ లేవు. గతంలో, కిండర్ గార్టెన్లు, నర్సరీలు, మరియు క్రెచ్ లు శ్రామిక మరియు సాంఘిక వ్యవహారముల శాఖ అజమాయిషీలో ఉండగా, అనాథ శరణాలయములు MOE పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం, విద్య, శ్రామిక మరియు సాంఘిక వ్యవహారములు, మరియు మహిళా వ్యవహారముల మంత్రిత్వ శాఖలు పూర్వ బాల్య రంగమును అజమాయిషీ చేయటంపై ఆసక్తి వ్యక్తపరిచాయి. ప్రభుత్వం నిర్విరామంగా మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వచిస్తూ పనర్వ్యవస్థీకరిస్తూ ఉండటంతో, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ సంఘంతో సహా వివిధ ఎంపికల యొక్క బలములు మరియు పరిమితులను జాగ్రత్తగా పరిగణించాలి. సంప్రదాయ నిర్మాణములు లేకపోవటంతో, కుటుంబ సభ్యులు అందించేవి కాకుండా సమాజ స్థాయిలో ఏమైనా సాంప్రదాయేతర చైల్డ్ కేర్ ఏర్పాట్లు ఉన్నాయా అనేది స్పష్టంగా లేదు. స్త్రీలు పని ఒత్తిడిలోకి ప్రవేశించటంతో, నగర ప్రాంతములలో ప్రైవేటు ప్రీస్కూల్ సేవల యొక్క మార్కెట్ పుట్టుకురావటానికి ఆస్కారం ఉంది.

అవరోధ అంశములుసవరించు

ఆరోగ్యం మరియు పోషణతో సంబంధములతో పాటు పూర్వ బాల్య రంగం, లింగం మరియు వికలాంగులైన పిల్లలతో సహా పలు అవరోధ అంశములను చర్చిస్తుంది. ఆడపిల్లలపైన వివక్షకు మూలములు, ఆడపిల్లలు మరియు మగ పిల్లలు ఈవిధంగానే ప్రవర్తించాలనే కచ్చితమైన నియమాలు, మరియు పురిషాధిక్యతను సమ్మతించటం, మరియు స్త్రీల పైన దౌర్జన్యము చాలాకాలం క్రితమే కుటుంబములో రూపొందాయి. పాఠశాలలలో, సమాజములలో, మరియు పిల్లలకు మరియు వారి కుటుంబములకు అండగా నిలిచే సంస్థలలో ఈ విలువలు బలపరచబడ్డాయి. విద్యలో లింగ-సమానత్వ అంశములు పూర్వ బాల్యంలో ప్రారంభమవటంతో, సాంప్రదాయేతర సమాజ-ఆధారిత కార్యక్రమం ఒకదానిని ఈ తంత్రాంగం సూచించింది, దీనిలో ఆడపిల్లలకు అదేవిధంగా మగపిల్లలకు ఒక మంచి ఆరంభాన్ని అందించటానికి కుటుంబముల మరియు సమాజముల స్తోమతకు సహాయం అందించటం, మరియు ఆడపిల్ల యొక్క సామర్ధ్యములను బాగా గ్రహించటంలో తల్లిదండ్రులకు సహాయం చేయటం, ఆవిధంగా ఎక్కువకాలం విద్య అభ్యసించే అవకాశాన్ని ఇవ్వటం మరియు ఆడపిల్లలు ప్రాథమిక పాఠశాలలో చేరి, అందులో కొనసాగే సంభావ్యతను పెంచటం వంటివి ఉన్నాయి. “లోపములతో ఉన్న పిల్లలు” అనే పదం స్వల్ప-కాల ప్రవర్తనా లోపముల నుండి దీర్ఘ-కాల శారీరిక, మానసిక, మరియు భావభరిత అశక్తతల వరకు పలు విలక్షణమైన రుగ్మతలను పరిగణలోకి తీసుకుంటోంది. దీని దృష్ట్యా, ఈ లోపములతో ఉన్న పిల్లలపై దృష్టి పెట్టవలసిన అవసరం చాలా ఉంది. పిల్లల సాధారణ పెరుగుదలకు వాడే సమగ్రమైన పరిణామ విధానం జీవితంలో ఈ విధమైన పిల్లలను ముందుగానే గుర్తించి వారికి తగిన సమయంలో తగిన చికిత్సను అందించటానికి ఇది ఒక అద్భుత అవకాశం అందిస్తుంది. వైకల్యముతో ఉన్న పిల్లలకు చికిత్స చేసే నిపుణులకు మరియు ఆ పిల్లల కుటుంబములకు ఆ లోపములను ముందుగా గుర్తించటానికి మరియు పసిపిల్లలతో మరియు చిన్న పిల్లలతో కలిసిపోవటానికి అవసరమైన సామర్ధాన్ని అందించటానికి సిపార్సు చేయబడిన యుక్తి.

ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్సవరించు

ఆస్ట్రేలియాలోని ప్రతి రాష్ట్రంలో, కిండర్ గార్టెన్ (సంక్షిప్తంగా 'కిండర్' లేదా 'కిండీ') అంటే కొద్దిగా విభిన్నంగా ఉండేది అని అర్ధం. న్యూ సౌత్ వేల్స్ మరియు ఆస్ట్రేలియన్ కాపిటల్ టెర్రిటరీలో, ఇది ప్రాథమిక పాఠశాల యొక్క మొదటి సంవత్సరము. విక్టోరియాలో, కిండర్ గార్టెన్ ఒక రకమైన ప్రీస్కూల్ మరియు దీనిని ప్రీస్కూల్ లేదా కిండర్ గార్టెన్ అని ఎలా అయినా పిలవవచ్చు. విక్టోరియాలో ప్రాథమిక పాఠశాల మొదటి సంవత్సరమును ప్రెప్ అని పిలుస్తారు ('ప్రిపరేటరీ' కి సంక్షిప్త రూపం), టాస్మేనియా మరియు క్వీన్స్ ల్యాండ్ లలో కూడా దీనిని అలానే పిలుస్తారు. క్వీన్స్ ల్యాండ్ లో, కిండర్ గార్టెన్ సాధారణంగా నాలుగు సంవత్సరముల వయస్సు పిల్లల కొరకు ఉన్న విద్యాసంస్థ, ఆవిధంగా ఇది ప్రీస్కూల్ మరియు ప్రాథమిక విద్యకు ముందు వచ్చేది. పశ్చిమ ఆస్ట్రేలియా, దక్షిణ ఆస్ట్రేలియా లేదా ఉత్తర టెర్రిటరీలలో ప్రాథమిక పాఠశాల విద్య మొదటి సంవత్సరం వరుసక్రమంలో పూర్వ-ప్రాథమిక, గ్రాహ్యత లేదా పరివర్తనగా ప్రస్తావించబడుతుంది.

న్యూజీలాండ్ లో, కిండర్ గార్టెన్ మూడు నుండి నాలుగు సంవత్సరముల వయస్సు వరకు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళటానికి ముందు రెండు సంవత్సరముల విద్యను సూచిస్తుంది. ప్రాథమిక విద్య 5 సంవత్సరముల వయస్సులో ప్రారంభమవుతుంది.

బల్గేరియాసవరించు

బల్గేరియా లో, డెట్స్కా గ్రాడిన (деτска градина) అనే పదం 3 నుండి 6 సంవత్సరముల వయస్సు పిల్లలు వెళ్ళే విద్యాలయమును సూచిస్తుంది. దీని తర్వాత ప్రీ-స్కూల్ తరగతి వస్తుంది, ప్రాథమిక పాఠశాలలో చేరటానికి ముందు ఒక సంవత్సరంపాటు దీనికి వెళతారు.

కెనడాసవరించు

 
1898 లో టొరంటో, కెనడాలో విద్యార్థి శిక్షకులు ఒక కిండర్ గార్టెన్ తరగతిలో శిక్షణ పొందటం.

ఓన్టారియోలో కిండర్ గార్టెన్ కు రెండు తరగతులు ఉంటాయి: జూనియర్ కిండర్ గార్టెన్ మరియు సీనియర్ కిండర్ గార్టెన్ (JK మరియు SK గా ప్రస్తావించబడతాయి). నాలుగు సంవత్సరములు వచ్చిన పిల్లలు ఆ సంవత్సరం జూనియర్ కిండర్ గార్టెన్ లో చేరవచ్చు.[7] కిండర్ గార్టెన్ తరగతులు రెండూ ఒంటి-పూట కానీ రోజు విడిచి రోజు విధానంలో కానీ నడుస్తాయి, అయినప్పటికీ సోమవారం నుండి శుక్రవారం వరకు రోజంతా నడిచే కిండర్ గార్టెన్ విధానం ప్రవేశ పెట్టబడుతోంది. ఓన్టారియోలో, "మొదటి సంవత్సరములు"గా కూడా పిలవబడే సీనియర్ మరియు జూనియర్ కిండర్ గార్టెన్ ప్రోగ్రాములు రెండూ ఐచ్చిక ప్రోగ్రాములు. తప్పనిసరి విద్య ఒకటవ తరగతిలో ప్రారంభమవుతుంది.

క్వెబెక్ ప్రాంతములోనే, జూనియర్ కిండర్ గార్టెన్ ను ప్రీమాటర్నెల్లే అని పిలుస్తారు (ఇది తప్పనిసరి కాదు), 4 సంవత్సరముల వయస్సు వారు దీనికి హాజరవుతారు, మరియు సీనియర్ కిండర్ గార్టెన్ ని మాటర్నెల్లే అని పిలుస్తారు, 5 సంవత్సరముల వయస్సు నాటికి ఇది తప్పనిసరి అవుతుంది, ఈ తరగతి ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానించబడింది. ఓన్టారియో పరగణాలోని ఫ్రెంచ్ విద్యా వ్యవస్థలో, జూనియర్ కిండర్ గార్టెన్ మరియు సీనియర్ కిండర్ గార్టెన్ మాటర్నెల్లే అని పిలవబడతాయి మరియు సీనియర్ కిండర్ గార్టెన్ కొన్నిసార్లు jardin d'enfants అని పిలవబడుతుంది, జర్మన్ పదమైన కిండర్ గార్టెన్కు ఇది అరువు పదం .

పశ్చిమ కెనడాలో మరియు న్యూఫౌండ్ల్యాండ్ అండ్ లెబ్రాడర్ లలో, కిండర్ గార్టెన్ కేవలం ఒక్క సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరం తర్వాత, పిల్లవాడు మొదటి తరగతి ప్రారంభిస్తాడు.

నోవా స్కాటియా ప్రాంతం కిండర్ గార్టెన్ ను ప్రాథమిక విద్యగా పరిగణిస్తుంది.

చైనాసవరించు

చైనాలో, కిండర్ గార్టెన్ కు సమానమైన పదం 幼儿园 (yòu ér yuán). రెండు సంవత్సరముల వయస్సు నుండి కనీసం ఆరు సంవత్సరములు వచ్చే వరకు పిల్లలు కిండర్ గార్టెన్ కు వెళుతూ ఉంటారు. చైనాలోని కిండర్ గార్టెన్స్ లో సాధారణంగా ఈ క్రింది తరగతులు ఉంటాయి: 1. నర్సరీ/ ప్లేగ్రూప్ (小班/xiăం bān): 2-3 సంవత్సరముల వయస్సు పిల్లలు 2. లోవర్ కిండర్ గార్టెన్/ LKG (中班/zhōng bān): 3-4 సంవత్సరముల వయస్సు పిల్లలు 3. అప్పర్ కిండర్ గార్టెన్/ UKG (大班/dà bān): 4-5 సంవత్సరముల వయస్సు పిల్లలు 4. ప్రీస్కూల్ (学前班/xué qián bān): 5-6 సంవత్సరముల వయస్సు పిల్లలు

కానీ, కొన్ని కిండర్ గార్టెన్స్ లో ప్రీస్కూల్ (学前班/xué qián bān) ఉండకపోవచ్చు. పిల్లలు ఏవిధంగా శిక్షణ పొందుతున్నారో పరిగణిస్తే చైనాలోని కిండర్ గార్టెన్ విద్య ప్రపంచములో ఉత్తమమైన వాటిలో ఒకటి.

డెన్మార్క్సవరించు

డెన్మార్క్లో పేరుపొందిన డే-కేర్ (పగటి పూట పిల్లల సంరక్షణ చేసేవి) సంస్థలలో మూడింట రెండు వంతులు మునిసిపల్ డే-కేర్ సెంటర్లు కాగా మిగిలినవి ప్రైవేటు యాజమాన్యం క్రింద ఉన్నవి మరియు వీటిని స్థానిక అధికారులతో ఒప్పందం చేసుకుని సంఘములు, తల్లిదండ్రులు, లేదా వ్యాపార సంస్థలు నడుపుతున్నాయి. రాబడులు మరియు పని తీరుల దృష్ట్యా, మునిసిపల్ మరియు ప్రైవేటు సంస్థలు ఒకే సిద్దాంతముల ప్రకారం పనిచేస్తున్నాయి.

డెన్మార్క్ వృద్ధి చెందుతున్న (ఆవిష్కరించబడక పోయినప్పటికీ) ఫారెస్ట్ కిండర్ గార్టెన్లకు ఖ్యాతి పొందింది, ఇక్కడ పిల్లలు ప్రతి రోజూ ఎక్కువ సమయం బయట సహజ వాతావరణములో గడుపుతారు.

ఈజిప్ట్సవరించు

ఈజిప్ట్ లో, నాలుగు మరియు ఆరు సంవత్సరముల వయస్సులో పిల్లలు రెండు సంవత్సరములు కిండర్ గార్టెన్స్ (KG1 మరియు KG2) కు వెళతారు.

ఫ్రాన్స్సవరించు

ఫ్రాన్సులో, ప్రీ-స్కూల్ ఏకోల్ మాటర్నెల్లే ("నర్సరీ స్కూల్"కు ఫ్రెంచ్ పదం) గా పిలవబడుతుంది . రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యములో నడిచే, ఉచిత మాటర్నెల్లే పాఠశాలలు దేశమంతటా ఉన్నాయి, ఇవి 2 నుండి 5 సంవత్సరముల వయస్సు కలిగిన పిల్లలను చేర్చుకుంటాయి (అయినప్పటికీ చాలా ప్రాంతములలో, మూడు సంవత్సరములలోపు పిల్లలను చేర్చుకోరు). వయస్సుని బట్టి వారిని ఈవిధంగా విభజిస్తారు గ్రాండే సెక్షన్ (GS: 5 సంవత్సరముల వయస్సు వారు), Moyenne సెక్షన్ (MS: 4 సంవత్సరముల వయస్సు వారు), పెటిట్ సెక్షన్ (PS: 3 సంవత్సరముల వయస్సు వారు) మరియు టౌట్ పెటిట్ సెక్షన్ (TPS: 2 సంవత్సరముల వయస్సు వారు). ఇది తప్పనిసరి కాకపోయినప్పటికీ, 3 నుండి 5 సంవత్సరముల వయస్సువారిలో దాదాపు 100% మంది స్కూలుకు వెళతారు. దీనిని మునిసిపాలిటీలు నిర్వహిస్తాయి (ప్రాథమిక పాఠశాల లాగా).

జర్మనీసవరించు

జర్మన్ ప్రీస్కూల్ కిండర్ గార్టెన్ (బహువచనంకిండర్ ) లేదా కిట (కి న్డర్ గెస్స్తేట్టె కి సంక్షిప్త రూపం) అని పిలవబడుతుంది, దీనికి ‘పిల్లల డేకేర్ సెంటర్’ అని అర్ధం. 3 మరియు 6 సంవత్సరముల మధ్య వయస్సు పిల్లలు కిండర్ గార్టెన్కు హాజరవుతారు, ఇవి పాఠశాల వ్యవస్థలో భాగం కాదు. వీటిని ఎక్కువగా నగర లేదా పట్టణ మంత్రివర్గములు, చర్చిలు, లేదా నమోదైన సంస్థలు నిర్వహిస్తున్నాయి, వీటిలో చాలా వరకు వర్ణించినట్లుగానే ఒక ప్రత్యేక విద్యావిధానమును అనుసరిస్తాయి, ఉదాహరణకు మాంటిస్సోరి లేదా రెగ్జియో ఎమిలియా రూపొందించిన విధానములు. ఫారెస్ట్ కిండర్ గార్టెన్లు బాగా స్థిరపడ్డాయి. కిండర్ గార్టెన్కు వెళ్ళటం తప్పనిసరి కాదు లేదా ఉచితము కాదు, కానీ స్థానిక ప్రభుత్వం మరియు తల్లిదండ్రుల రాబడి ఆధారంగా ఇవి పాక్షికంగా లేదా పూర్తిగా నిధులను అందికుంటాయి.

కిండర్ గార్టెన్ ఉదయం 7 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పనిచేస్తుంది మరియు తొమ్మిది నెలలు మరియు రెండు సంవత్సరముల మధ్య వయస్సు పిల్లల కొరకు క్రెచ్ అని అర్ధం వచ్చే కిండర్ క్రిప్ మరియు 6 నుండి 10 సంవత్సరముల వయస్సులోని పాఠశాల విద్యార్థులు వారి పాఠములు ముగిసిన తర్వాత అక్కడ గడపటానికి మధ్యాహ్నసమయంలో ఒక హోర్ట్ (ఎక్కువగా ప్రాథమిక పాఠశాలతో అనుబంధంగా ఉంటుంది)ను కూడా కలిగి ఉంటుంది. నర్సరీలతోపాటు, అక్కడ ఏ ప్రీ-స్కూల్ సంస్థతోనూ సంబంధం లేకుండా వారి వారి ఇండ్లలో మూడు సంవత్సరముల వయస్సు పిల్లలను ముగ్గురు నుండి ఐదుగురిని చూసుకునే డే-కేర్ నర్సులు (టేగ్స్ మట్టర్, బహువచనంలో టేగ్స్ ముట్టర్ అని పిలవబడతారు - సాధారణమైన, లింగ-తటస్థ రూపు టేగ్స్ప్ఫ్లెజ్పర్సన్ (ఎన్) ) కూడా ఉంటారు. స్థానిక ప్రభుత్వములు ఈ నర్సులకు సహకారం అందిస్తూ వారిని పర్యవేక్షిస్తూ ఉంటాయి.

‘ప్రీ-స్కూల్’ అని అర్ధం వచ్చే వర్స్కూల్ అనే పదం, కిండర్ గార్టెన్ లోని విద్యా ప్రయత్నములకు మరియు సాధారణంగా ఒక ప్రాథమిక పాఠశాలతో అనుసంధానించబడిన తప్పనిసరి తరగతుల కొరకు, రెండిటికీ ఉపయోగించబడుతుంది. ప్రతి జర్మన్ రాష్ట్రములో రెండు విధానములు భిన్నంగా నిర్వహించబడతాయి. స్కూల్ కిండర్ గార్టెన్ ఒక రకమైన వర్స్కూల్.

హాంగ్ కాంగ్సవరించు

హాంగ్ కాంగ్ లో పూర్వ-ప్రాథమిక సేవలు అనగా కిండర్ గార్టెన్లు మరియు పిల్లల సంరక్షణా కేంద్రముల ద్వారా చిన్న పిల్లలకు విద్యను మరియు రక్షణను అందించటం. విద్యా శాఖతో నమోదుచేయబడిన కిండర్ గార్టెన్లు, మూడు నుండి ఆరు సంవత్సరముల వయస్సు పిల్లలకు సేవలను అందిస్తాయి. మరొక వైపు, సాంఘిక సంక్షేమ శాఖతో నమోదుకాబడిన చైల్డ్ కేర్ సెంటర్లలో, రెండు నుండి మూడు సంవత్సరముల వయస్సు పిల్లల అవసరములు తీర్చే నర్సరీలు, మరియు పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరముల వరకు పసి పిల్లల ఆలనా పాలనా చూసుకునే క్రెచ్ లు ఉంటాయి.

ప్రస్తుతం, చాలా కిండర్ గార్టెన్లు ఒంటి పూట పనిచేస్తున్నాయి, ఇవి అప్పర్, లోవర్ కిండర్ గార్టెన్ తరగతులు మరియు నర్సరీ తరగతులను అందిస్తాయి. కొన్ని కిండర్ గార్టెన్లు రోజంతా కూడా కిండర్ గార్టెన్ తరగతులను నడుపుతాయి. చైల్డ్ కేర్ సెంటర్లు కూడా ఫుల్-డే (రోజు మొత్తం) మరియు హాఫ్-డే (ఒంటి పూట) సర్వీసులను అందిస్తున్నాయి, వీటిలో చాలా సెంటర్లు ఫుల్-డే సర్వీసులను అందిస్తున్నాయి.

పిల్లల పెరుగుదలకు అవసరమైన శారీరిక, వివేచనాత్మక, భాష, సాంఘిక, భావాత్మక మరియు అలంకరణాత్మక విషయముల వంటి విభిన్న అంశములలో తులనాత్మక అభివృద్ధిని పెంపొందించటానికి ప్రశాంతమైన మరియు మనోహరమైన వాతావరణమును పిల్లలకు అందించటం హాంగ్ కాంగ్ లో పూర్వ-ప్రాథమిక విద్య లక్ష్యం.

కిండర్ గార్టెన్లలో స్వీయ-పరిశీలనా సంస్కృతిని స్థాపించటం మరియు పూర్వ-ప్రాథమిక విద్య యొక్క నాణ్యతను మరియు ప్రమాణాన్ని బేరీజు వేయటంలో ప్రజలకు ఉపప్రమాణములను అందించటంలో సహాయం చేయటానికి, విద్యా శాఖ హాంగ్ కాంగ్ లోని పూర్వ-ప్రాథమిక విద్యా సంస్థల కొరకు పెర్ఫార్మన్స్ ఇండికేటర్ (పనితీరు సూచీ) లను రూపొందించింది 2000/01 విద్యా సంవత్సరము నుండి, పూర్వ ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరచటానికి మరింత ప్రోత్సహించటానికి క్వాలిటీ అస్యూరెన్స్ ఇన్స్పెక్షన్ ప్రారంభమైంది.

హంగరీసవరించు

 
బాహ్య కార్యక్రమములు కలిగిన ఒక హంగేరియన్ ప్రీ-స్కూల్ తరగతి.

పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించిన మొదటి దేశములలో ఒకటైన హంగరీలో, ఈ విద్యా సంస్థ పిల్లలకు మరియు ఉపాధ్యాయులు ఇద్దరికీ బాగా కష్టతరమైనది. ఈ వృత్తి ఎక్కువగా కేవలం మహిళల కొరకు ప్రత్యేకించబడింది.[ఉల్లేఖన అవసరం] నర్సరీ ఉపాధ్యాయులుగా అంగీకరించబడటానికి, మహిళలు గణనీయమైన గాన నైపుణ్యాన్ని మరియు పద్యములను గుర్తుంచుకునే సామర్ధ్యాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది.[ఉల్లేఖన అవసరం] ఫలితంగా, ఆ వృత్తిలోకి ప్రవేశము చాలా పోటీతో కూడి ఉంటుంది.

3 మరియు 6 సంవత్సరముల మధ్య వయస్సు పిల్లలు ప్రీ-స్కూల్ కు హాజరవుతారు (ఇది హంగేరియన్లో ఒవోడ గా, లేదా రక్షణ స్థలముగా పిలవబడుతుంది). పిల్లలు ఉదయం ఏడు గంటలకు ఒవోడకు వస్తారు మరియు వారి తల్లిదండ్రులు సాయంత్రం మూడు గంటలకు వారిని తీసుకు వెళతారు, అయినప్పటికీ ఒకవేళ వారి తల్లిదండ్రులు ఆ సమయమును దాటి పనిచేయవలసి వస్తే మూడు గంటల తర్వాత కూడా వారు అక్కడే ఉండవచ్చు.

హంగరీలో, ఒవోడ పిల్లలలో కళా నైపుణ్యములను పెంపొందించే స్థానము, ఇక్కడ పందొమ్మిద శతాబ్దములోని పద్యముల సంగ్రహములతో, జానపద గేయములతో, మరియు అన్ని రకముల సంగీత వాయిద్యములతో వారిని పూర్తిగా నిమగ్నమయ్యేటట్లు చేస్తారు. హంగేరియన్ సమాజములు భాషను మరియు జానపదసాహిత్యమును నిలుపుకుంటూ, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, అర్జెంటీనా, బ్రజిల్ మరియు వెనిజులా వంటి దేశములలో గౌరవనీయమైన స్థానాన్ని కలిగిఉండి, హంగేరియన్ ఒవోడా సంస్థను ప్రపంచం మొత్తానికి కూడా ఎగుమతి చేసాయి.

భారతదేశంసవరించు

ఇండియాలో, ప్రీ-స్కూల్ మూడు దశలుగా విభజించబడింది - ప్లేగ్రూప్, జూనియర్ కిండర్ గార్టెన్ (Jr. KG) or లోవర్ కిండర్ గార్టెన్ (LKG) and సీనియర్ కిండర్ గార్టెన్ (Sr. KG) లేదా అప్పర్ కిండర్ గార్టెన్ (UKG). విలక్షణముగా, ఒక ప్లేగ్రూప్ లో ఒకటిన్నర నుండి రెండున్నర సంవత్సరముల వయస్సు కలిగిన పిల్లలు ఉంటారు. Jr. KG తరగతిలో మూడున్నర నుండి నాలుగున్నర సంవత్సరముల వయస్సు పిల్లలు ఉంటారు, మరియు Sr. KG తరగతిలో నాలుగున్నర నుండి ఐదున్నర సంవత్సరముల వయస్సు పిల్లలు ఉంటారు.

కిండర్ గార్టెన్ అనేది చిన్నపిల్లలు వస్తువులతో ఆడుకుంటూ నేర్చుకుని మరియు ఇతర పిల్లలతో మరియు ఉపాధ్యాయులతో కలిసి ఉండగలిగేలాగా చేసే ప్రదేశము. ఇది పెద్దలు కూడా నేర్చుకోగలిగిన ప్రదేశం; వారు పిల్లలను గమనించి వారితో పాలుపంచుకుంటారు. మానవ సంబంధముల అధ్యయనానికి ఇది ఒక ప్రయోగశాలగా పనిచేయగలదు.

ప్రజల గురించి అధ్యయనం చేయటానికి ఒక ప్రయోగశాలగా కిండర్ గార్టెన్ యొక్క విలువ కొంతవరకు పిల్లలకు అక్కడ ఆడుకోవటానికి మరియు ఇతరులతో సంబంధాలకు ఉండే అవకాశములపై ఆధారపడుతుంది.

కిండర్ గార్టెన్ పాఠశాల యొక్క ముఖ్య లక్ష్యములు:

 • పిల్లలలో మంచి శరీరాకృతి, సరిపడినంత కండర సమన్వయము మరియు మౌలిక కదలికలను పెంపొందించటం.
 • మంచి ఆరోగ్య అలవాట్లను అలవరుచుకోవటానికి మరియు స్వయంగా దుస్తులు ధరించటం, మూత్రశాలకు వెళ్ళటం మరియు ఆహార అలవాట్ల వంటి వ్యక్తిగత సర్దుబాట్లకు అవసరమైన మౌలిక నేర్పులను వృద్ధిచేసుకోవటానికి.
 • భావ వ్యక్తీకరణ, అర్ధం చేసుకోవటం, అంగీకరించటం మరియు తన భావములను మరియు ఉద్వేగములను అదుపు చేసుకోవటంలో పిల్లలకు మార్గదర్శకత్వం చేయటం ద్వారా భావ పరిణితిని పెంపొందించటం.
 • అభిలషనీయమైన మంచి సాంఘిక వైఖరులను, అలవాట్లను పెంపొందించటం మరియు ఆరోగ్యకరమైన సామూహిక బాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం.
 • కళాత్మక దృష్టిని ప్రోత్సహించటం (చిత్రలేఖనము, సంగీతం, అందం మొదలైనవి)
 • తన చుట్టుపక్కల ఉన్న వాతావరణము గురించి పిల్లవానిలో వివేచనాత్మక ఉత్సుకతల ప్రారంభాన్ని ప్రేరేపించటం.
 • తగినన్ని అవకాశములు అందించటం ద్వారా పిల్లల స్వతంత్రాన్ని మరియు సృజనాత్మకతను ప్రోత్సహించటం.'

“విద్యార్థి అభివృద్ధికి పాఠశాల ఒక అవకాశం. స్వేచ్చగా వృద్ధి చెందటానికి ప్రతి ఒక్కరికీ స్వేచ్చ ఉంటుంది.”

చాలా సందర్భములలో ప్రీ-స్కూల్ ఒక ప్రైవేటు పాఠశాలగా నడుపబడుతుంది. చిన్నపిల్లలు రెండు సంవత్సరముల వయస్సులో ప్రత్యేకమైన టాడ్లర్/నర్సరీ గ్రూప్ లో చేర్చబడతారు. ఇది కిండర్ గార్టెన్ లో ఒక భాగంగా నడుస్తుంది.

సీనియర్ కిండర్ గార్టెన్ పూర్తిచేసిన తర్వాత, పిల్లవాడు ప్రాథమిక పాఠశాల యొక్క ఒకటవ క్లాస్ లేదా మొదటి స్టాండర్డ్ లోకి ప్రవేశిస్తాడు. కిండర్ గార్టెన్ ఎక్కువగా సాధారణ పాఠశాలల యొక్క అంతర్భాగం, అయినప్పటికీ కొన్నిసార్లు అవి స్వతంత్ర సంస్థలుగా ఉంటాయి మరియు ఎక్కువగా పెద్ద సంస్థలలో భాగములుగా ఉంటాయి.

ఇజ్రాయెల్సవరించు

ఇజ్రాయెల్ లో, 2 రకములు ఉన్నాయి, ప్రైవేటు యాజమాన్యముతో నడిచేవి మరియు ప్రభుత్వ నిధులతో పనిచేసేవి. ఐదు సంవత్సరముల వయస్సు నుండి కిండర్ గార్టెన్ కు హాజరవటం తప్పనిసరి. ప్రైవేటు కిండర్ గార్టెన్లను మినిస్ట్రీ అఫ్ ఎడ్యుకేషన్ (విద్యా మంత్రిత్వశాఖ) పర్యవేక్షిస్తుంది మరియు 3 నెలల నుండి 5 సంవత్సరములవరకు పిల్లల ఆలనా పాలనా చూస్తుంది. రాష్ట్ర కిండర్ గార్టెన్లు 4 సంవత్సరములు శిక్షణ పొందిన అర్హత పొందిన కిండర్ గార్టెన్ అధ్యాపకులచే నిర్వహించబడతాయి. అవి పిల్లల వయస్సుని బట్టి మూడు వర్గములుగా 3 నుండి 6 సంవత్సరముల వయస్సు కలిగిన పిల్లల అవసరములు తీరుస్తాయి; 3–4 సంవత్సరముల వయస్సు (ట్రాం ట్రాం హోవ), 4-5 (ట్రాం హోవ), 5-6 (హోవ). హోవ విద్యా సంవత్సరం (5-6) పూర్తి అవగానే పిల్లలు ప్రాథమిక పాఠశాలలో చేరతారు లేదా ఒకవేళ మానసికంగా మరియు జ్ఞాపక శక్తి దృష్ట్యా వారు ప్రాథమిక పాఠశాలలో చేరటానికి సిద్ధంగా లేకపోతే హోవా సంవత్సరమును తిరిగి చదువుతారు.

జపాన్సవరించు

 
వార్షిక క్రీడా దినం నాడు అభినయిస్తున్న జపనీస్ డే కేర్ విద్యార్ధులు.

పూర్వ ప్రాథమిక విద్య ఇంటివద్దే ప్రారంభమవుతుంది, మరియు ప్రీస్కూల్ పిల్లల తల్లిదండ్రులకు వారి పిల్లలకు విద్య నేర్పటంలో మరియు తల్లిదండ్రులగా తమ బాధ్యత మరింత సమర్ధవంతంగా నిర్వహించటంలో సహాయం చేసే ఉద్దేశంతో అనేక పుస్తకములు మరియు దూరదర్శన్ కార్యక్రమములు ఉన్నాయి. ఇంటివద్ద పొందే శిక్షణలో ఎక్కువగా అలవాట్లు, సరైన సాంఘిక ప్రవర్తన, మరియు తీరైన ఆటలు నేర్పించబడతాయి, అయినప్పటికీ వాచక మరియు సంఖ్యా నైపుణ్యములు కూడా నేర్పబడతాయి. తల్లిదండ్రులు పూర్వ విద్యపై గట్టి నమ్మకంతో ఉన్నారు మరియు వారి పిల్లలను ప్రీస్కూల్స్ లో చేరుస్తున్నారు.

ఎక్కువగా జూనియర్ కాలేజీ గ్రాడ్యుయేట్లు అయిన యువతులు సిబ్బందిగా ఉండే కిండర్ గార్టెన్స్ (yochien 幼稚園), మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో ఉంటాయి, కానీ అవి అధికారిక విద్యా వ్యవస్థలో భాగం కాదు. 58 శాతం ప్రైవేటు కిండర్ గార్టెన్స్ నమోదు చేసుకున్న పిల్లలందరిలో 77 శాతానికి బాధ్యత వహిస్తాయి. కిండర్ గార్టెన్స్ తో పాటు అక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే డే-కేర్ సెంటర్ల అభివృద్ధి చెందిన వ్యవస్థ ఉంది (hoikuen 保育園), దీనిని శ్రామిక మంత్రి వర్గం పర్యవేక్షిస్తుంది. కిండర్ గార్టెన్స్ విద్యా లక్ష్యములను అనుసరిస్తూ ఉండగా, ప్రీస్కూల్స్ ఎక్కువగా పసివారికి మరియు తప్పటడుగులు వేసేవారికి రక్షణ ఇవ్వటానికి ప్రాధాన్యతనిస్తోంది. కిండర్ గార్టెన్స్ లాగానే అక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహించబడే ప్రీస్కూల్స్ ఉన్నాయి. ఈ రెండు రకాల విద్యా సంస్థలు కలిసి ప్రీస్కూల్-వయస్సులో ఉన్న పిల్లలందరిలో 90 శాతం మందిని వారు సంప్రదాయక విద్యా విధానంలో ఒకటవ తరగతిలోకి ప్రవేశించే ముందు ఇక్కడ చేర్చుకుంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (విద్యా మంత్రిత్వశాఖ) 1990 లో ప్రీస్కూల్స్ కొరకు రూపొందించిన బోధనాంశములు, మానవ సంబంధములు, ఆరోగ్యం, పర్యావరణము, పదములు (భాష), మరియు వ్యక్తీకరణ వంటి అంశములను ప్రస్తావిస్తుంది, ఇది రెండు రకాల విద్యావిధానములకు వర్తిస్తుంది. కిండర్ గార్టెన్లు మరియు ప్రీస్కూల్స్ కొరకు కొత్తగా సవరించబడిన బోధనాంశముల నియమావళి మార్చి 2008 నుండి అమలులోకి వచ్చింది.

దక్షిణ కొరియాసవరించు

దక్షిణ కొరియాలో, పశ్చిమ దేశముల వయస్సు విధానములో పిల్లలు సాధారణంగా మూడు మరియు ఆరు సంవత్సరముల మధ్య వయస్సులో కిండర్ గార్టెన్ కు హాజరవుతారు. (కొరియన్ పిల్లల వయస్సులు పశ్చిమ దేశముల పిల్లల వయస్సులతో పోల్చితే భిన్నంగా గణించబడతాయి: వారు జన్మించినప్పుడు వారికి ఒక రోజు కాకుండా, ఒక సంవత్సరం వయస్సు ఉన్నట్లు. ఇంకా, ప్రతి జనవరి 1 కి ప్రతి ఒక్కరి వయస్సు వారి జన్మదినంతో సంబంధం లేకుండా ఒక సంవత్సరం పెరుగుతుంది. అందువలన కొరియాలో, కిండర్ గార్టెన్ పిల్లలు "ఐదు, ఆరు మరియు ఏడు" సంవత్సరముల వయస్సు వారిగా పిలవబడతారు.) విద్యా సంవత్సరము మార్చిలో ప్రారంభమవుతుంది. దీని తర్వాత ప్రాథమిక పాఠశాల ఉంటుంది. సాధారణంగా కిండర్ గార్టెన్లు మూడు తరగతులుగా వర్గీకరించబడతాయి. వాటిని"యుచి వోన్" అని పిలుస్తారు (Korean: 유치원).

కొరియన్ కిండర్ గార్టెన్లు ప్రైవేటు పాఠశాలలు. ఖర్చులు ప్రతి నెలా మారుతూ ఉంటాయి. కొరియన్ తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆంగ్లములో మంచి ఆరంభం ఇవ్వటానికి వారి పిల్లలను ఇంగ్లీష్ కిండర్ గార్టెన్లకు పంపుతారు. ఆ విధమైన ప్రత్యేకమైన కిండర్ గార్టెన్లు కొన్ని ఆంగ్ల పాఠములతో ఎక్కువగా కొరియా భాషలో బోధించబడవచ్చు, కొన్ని కొరియన్ పాఠములతో ఎక్కువగా ఆంగ్లములో బోధించబడవచ్చు, లేదా పూర్తిగా ఆంగ్లములోనే బోధించబడవచ్చు. దాదాపు మధ్య తరగతి తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను కిండర్ గార్టెన్ కు పంపుతారు.

దక్షిణ కొరియాలో కిండర్ గార్టెన్ కార్యక్రమములు ఉల్లాసభరితమైన కార్యక్రమములతో పాటు మరింత విద్యాసంబంధమైన శిక్షణను అందించటానికి ప్రయత్నం చేస్తాయి. కొరియన్ కిండర్ గార్టెన్ లో చదివేవారు చదవటం, వ్రాయటం (ఎక్కువగా ఇంగ్లీష్ అదేవిధంగా కొరియన్ లలో) మరియు సులభమైన లెక్కలు నేర్చుకుంటారు. సాంప్రదాయక రీతిలో సిద్ధం చేయబడిన తరగతి గదులలో తరగతులు జరుగుతాయి, ఇక్కడ పిల్లల దృష్టి అధ్యాపకునిపై కేంద్రీకరించబడుతుంది మరియు ఒక సమయంలో ఒక కార్యక్రమం లేదా ఒక పాఠము జరుగుతాయి. ప్రతి పిల్లవాని యొక్క జ్ఞానము లేదా నైపుణ్యంలో బలహీన అంశములను అధిగమించటం ఉపాధ్యాయుని లక్ష్యము.

కొరియాలో విద్యా వ్యవస్థ చాలా పోటీతో కూడుకున్నది కావటంతో, కిండర్ గార్టెన్లు చదువుపైన ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. చాలా చిన్న వయస్సులోనే పిల్లలు చదవటం వ్రాయటం చేయవలసి వస్తోంది. క్రమమైన మరియు తగు మాత్రపు హోం వర్క్ (ఇంటి వద్ద చేయవలసిన పాఠములు) కు కూడా వారు అలవాటుపడిపోయారు. ఈ చిన్న పిల్లలు మధ్యాహ్న సమయములలో చిత్రలేఖనము, పియానో లేదా వయలిన్, థైక్వాండో, బాలే, సాకర్ లేదా గణితములలో శిక్ష పొందటానికి ప్రత్యేక తరగతులకు కూడా హాజరవుతారు.

ఉత్తర కొరియాలో, నాలుగు మరియు ఐదు సంవత్సరముల మధ్య వయస్సులో పిల్లలు కిండర్ గార్టెన్ కు హాజరవుతారు. కిండర్ గార్టెన్లు పై (పార్టీ) తరగతి మరియు దిగువ (శ్రామిక) తరగతి మధ్య వర్గీకరించబడ్డాయి, పై-తరగతి కిండర్ గార్టెన్లు పూర్తిగా విద్యా సంబంధమైనవి కాగా, దిగువ తరగతి కిండర్ గార్టెన్లలో కొద్దిపాటి విద్య ఉంటుంది.

కువైట్సవరించు

కువైట్ లో, కువైటి పిల్లలు నాలుగు మరియు ఆరు సంవత్సరముల మధ్య వయస్సులో రెండు సంవత్సరములు ఉచిత కిండర్ గార్టెన్స్ కు వెళతారు (K1 మరియు K2).

మలావిసవరించు

మలావిలో, సియవో భాష మాట్లాడే ప్రదేశములలో కిండర్ గార్టెన్ ను "ఒబుకో" అని పిలుస్తారు మరియు సాధారణంగా నాలుగు మరియు ఐదు సంవత్సరముల వయస్సు పిల్లలు ఇక్కడ చేరుతారు. దేశ మంతటా అనేక ఇంగ్లీష్ కిండర్ గార్టెన్స్ కూడా పనిచేస్తున్నాయి.

మెక్సికోసవరించు

మెక్సికో లో, కిండర్ గార్టెన్ "కిండర్ గార్డెన్" లేదా "కిండర్" అని పిలవబడుతుంది, దీనిలో ఆఖరి సంవత్సరమును కొన్నిసార్లు "ప్రీప్రైమేరియా" అని పిలుస్తారు (1 నుండి 6 తరగతులకు ప్రైమేరియా అనే పేరు పెట్టబడింది, కావున ఆ పేరుకి అర్ధం "ప్రాథమిక పాఠశాలకు ముందు"). ఇందులో మూడు సంవత్సరముల ప్రీ-స్కూల్ విద్య ఉంటుంది, ఇవి ప్రాథమిక పాఠశాలలో చేరటానికి ముందు తప్పనిసరి. మునుపటి నర్సరీ ఐచ్చికం, మరియు ఇది ప్రైవేటు పాఠశాలలు లేదా ప్రభుత్వ పాఠశాలలలో అందించబడుతుంది.

ప్రైవేటు పాఠశాలలలో, కిండర్స్ లో సాధారణంగా మూడు తరగతులు ఉంటాయి, మరియు నాలుగవది నర్సరీ కొరకు చేర్చబడవచ్చు. మొదటి తరగతి ప్లేగ్రూప్ కాగా, మిగిలిన రెండూ తరగతిలో చదువుకునే చదువులు.

ప్రొఫెసర్ రోసురా జాపాట (1876–1963) మెక్సికోలో కిండర్ గార్టెన్ విధానాన్ని ప్రారంభించాడు, ఆ పనికి అతను ఆ దేశపు అత్యున్నత గౌరవాన్ని అందుకున్నాడు.

2002 లో, కాంగ్రెస్ ఆఫ్ ది యూనియన్ లా ఆఫ్ ఆబ్లిగేటరీ ప్రీ-స్కూలింగ్ను అనుమతించింది, అప్పటికే ఇది మూడు నుండి ఆరు సంవత్సరముల వయస్సు వారికి ప్రీ-స్కూల్ విద్యను విధిగా చేసింది, మరియు దీనిని సంయుక్త మరియు ప్రభుత్వ విద్యా మంత్రిత్వం యొక్క ఆధ్వర్యములో ఉంచింది.[2][3]

మొరాకోసవరించు

మొరాకోలో, ప్రీ-స్కూల్ ఏకోల్ మాటర్నెల్లే, కుట్టాబ్ లేదా ఆర్-రావ్డ్గా ప్రసిద్ధం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే, ఉచిత మాటర్నెల్లే పాఠశాలలు 2 నుండి 5 సంవత్సరముల వయస్సు పిల్లలను చేర్చుకుంటూ రాజ్యమంతటా ఉన్నాయి. (అయినప్పటికీ చాలా ప్రదేశములలో, మూడు సంవత్సరముల లోపు పిల్లలను చేర్చుకోరు). ఇది తప్పనిసరి కాకపోయినప్పటికీ, 3 నుండి 5 సంవత్సరముల వయస్సు పిల్లలలో దాదాపు 80% మంది హాజరవుతారు. మొరాకన్ విద్యా విభాగం దీనిని సవరించింది.

నేపాల్సవరించు

నేపాల్ లో, కిండర్ గార్టెన్ ను "కిండర్ గార్టెన్" అనే పిలుస్తారు. కిండర్ గార్టెన్ ఒక ప్రైవేటు విద్యా సంస్థగా నడుస్తుంది మరియు ప్రైవేటుగా నడిచే విద్యా సంస్థలన్నీ ఆంగ్ల మాధ్యమములో ఉన్నాయి. కావున, నేపాల్ లో కిండర్ గార్టెన్ విద్య కూడా ఆంగ్ల మాధ్యమములో ఉంది. పిల్లాలు రెండు సంవత్సరముల వయస్సులో ప్రారంభించి కనీసం ఐదు సంవత్సరములు వచ్చేవరకు కిండర్ గార్టెన్ లో చేరుతూనే ఉంటారు. నేపాల్ లోని కిండర్ గార్టెన్స్ లో ఈ క్రింది తరగతులు ఉన్నాయి: 1. నర్సరీ/ ప్లేగ్రూప్: 2-3 సంవత్సరముల వయస్సు పిల్లలు 2. లోవర్ కిండర్ గార్టెన్/ LKG: 3-4 సంవత్సరముల వయస్సు పిల్లలు 3. అప్పర్ కిండర్ గార్టెన్/ UKG: 4-5 సంవత్సరముల వయస్సు పిల్లలు

నేపాల్ లోని కిండర్ గార్టెన్ విద్య దాదాపు హాంగ్ కాంగ్ మరియు ఇండియాలలో లాగానే ఉంటుంది. ప్రైవేటు విద్యా సంస్థలలోని పుస్తకములన్నీ తప్పనిసరైన ఒక్క నేపాలీ మినహాఆంగ్లములోనే ఉంటాయి. నేపాలీస్ కిండర్ గార్టెన్స్ లో పిల్లలు సమగ్ర శిక్షణ పొందుతారు.

నెదర్లాండ్స్సవరించు

నెదర్లాండ్స్ లో, కిండర్ గార్టెన్ కు సమానమైన పదం క్లూటర్స్కూల్ . పందొమ్మిదవ శతాబ్దం మధ్య నుండి ఇరవయ్యవ శతాబ్దం మధ్య వరకు ఫ్రీడ్రిక్ ఫ్రోబెల్ జ్ఞాపకార్ధం ఫ్రోబెల్స్కూల్ కూడా సాధారణంగా ఉండేది. అయినప్పటికీ రోజువారీ భాషలో ఫ్రోబెలేన్ అనే క్రియాపదము కొద్దిగా అమర్యాదకరమైన అర్ధాన్ని పొందటంతో, ఈ పదం యొక్క వాడుక క్రమంగా మరుగైపోయింది. 1985 వరకు, ఇది ఒక ప్రత్యేకమైన నిర్బంధం కాని విద్యా విధానముగా ఉండేది (4–6 సంవత్సరముల వయస్సు పిల్లల కొరకు), దీని తర్వాత పిల్లలు (6–12 సంవత్సరముల వయస్సు) ప్రాథమిక పాఠశాలకు (లగేర్ పాఠశాల ) వెళతారు. 1985 తర్వాత, రెండు విధానములు ఒక దానిలోకి చేర్చబడ్డాయి, దీనినే బసిస్ఓన్డెర్విజ్స్ అని పిలుస్తారు (ప్రాథమిక విద్యకు డచ్ పదం). ఈ దేశంలో ప్రైవేటు మరియు రాయితీ పొందిన డే కేర్లు రెండూ కూడా ఉన్నాయి, ఇవి తప్పనిసరి కాదు, కానీ ఏదిఏమైనప్పటికీ బాగా జనాదరణ పొందాయి.

పెరూసవరించు

పెరూలో, నిడో అనే పదం 3 నుండి 6 సంవత్సరముల వయస్సు పిల్లలు చదివే చదువును సూచిస్తుంది. దీని తర్వాత ప్రాథమిక పాఠశాల తరగతులు వస్తాయి, ఇవి నాలుగు సంవత్సరములపాటు ఉంటాయి. కొన్ని కుటుంబములవారు వైర్ పిల్లలను ఆరు సంవత్సరముల వయస్సులో ప్రాథమిక పాఠశాలకు పంపాలని భావిస్తారు. 1902 లో ఎల్విరా గార్సియా అనే టీచర్ మరియు పైన పేర్కొన్న సంఘం యొక్క ఉప-వ్యవస్థాపకురాలు గార్సియా, మహిళా సంఘములకు అభిమానులను చేర్చుతూ, 2 నుండి 8 సంవత్సరముల వయస్సు పిల్లల కొరకు మొదటి కిండర్ గార్టెన్ ను ఏర్పాటుచేశారు. ఆమె చదువు మరియు పిల్లలపై ఆమె ధ్యాస, సమావేశములు మరియు అనేక దస్తావేజుల ద్వారా, పిల్లల సంరక్షణకు గల ప్రాముఖ్యాన్ని మరియు న్యాయము మరియు అర్ధం చేసుకోవటం ఆధారంగా ఒక వ్యక్తిత్వం రూపొందటానికి స్పందించటాన్ని, అదేవిధంగా ఫ్రోబెల్ విధానములను మరియు మాంటిస్సోరీ విధానములను ఉపయోగించటాన్ని మరియు ఈ విద్యా లక్ష్యములో తల్లిదండ్రులు పాల్గొనేటట్లు చేయటాన్ని బాగా వ్యాప్తి చేయటానికి దోహదం చేసింది.

ఫిలిప్పీన్స్సవరించు

ఫిలిప్పీన్స్ లో, చదువు అధికారికంగా ప్రాథమిక స్థాయిలో ప్రారంభమవుతుంది మరియు కిండర్ గార్టెన్ ద్వారా పిల్లలను పూర్వ ప్రాథమిక విద్యలో చేర్చటం తల్లిదండ్రుల ఐచ్చికం. ఫిలిప్పీన్స్ లో పూర్వ ప్రాథమిక విద్య ఈ విధంగా వర్గీకరించబడింది:

 • సంస్థ-ఆధారిత కార్యక్రమములు, బరంగే డే కేర్ సర్వీసు, ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రీ-స్కూల్స్, కిండర్ గార్టెన్ లేదా పాఠశాల-ఆధారిత కార్యక్రమములు, ప్రభుత్వేతర సంస్థలు లేదా ప్రజా సంస్థలచే ప్రారంభించబడిన సమాజ లేదా చర్చి-ఆధారిత పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమములు, కార్యాలయమునకు సంబంధించిన పిల్లల రక్షణ మరియు విద్యా కార్యక్రమములు, పిల్లల-పర్యవేక్షణా కేంద్రములు, ఆరోగ్య కేంద్రములు మరియు స్టేషన్లు మొదలైనవి; మరియు
 • గృహ-సంబంధ కార్యక్రమములు, ఒక ప్రదేశానికి చెందిన ప్లే గ్రూపులు, ఫ్యామిలీ డే కేర్ కార్యక్రమములు, తల్లిదండ్రుల విద్య మరియు ఇంటికి వచ్చి చెప్పే కార్యక్రమములు మొదలైనవి.

రిపబ్లిక్ యాక్ట్ No. 8980 రూపొందించటం ద్వారా లేదా 2000 సంవత్సరంలో వచ్చిన ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ద్వారా పూర్వ ప్రాథమిక విద్య బలపడింది.

రొమేనియాసవరించు

రోమానియాలో, "చిన్న తోట" అని అర్ధం వచ్చే grădiniţă, ప్రీస్కూల్ (6 సంవత్సరముల లోపు లేదా 7 సంవత్సరముల లోపు) పిల్లల కొరకు జనాదరణ పొందిన విద్యావిధానం. పిల్లలు "లిటిల్ గ్రూప్" (గ్రూప మైకా 3-4 సంవత్సరముల వయస్సు), "మీడియం గ్రూప్" (గ్రూప మిజ్లోసీ 5 సంవత్సరముల వయస్సు వరకు) మరియు "బిగ్ గ్రూప్" (గ్రూప మరే 6 లేదా 7 సంవత్సరముల వయస్సు వరకు) లుగా విభజించబడతారు. గడిచిన కొద్ది సంవత్సరములలో, ప్రభుత్వ పూర్వపాఠశాల విద్యా విధానము స్థానంలో, ప్రైవేటు కిండర్ గార్టెన్లు జనాదరణ పొందాయి.

రష్యాసవరించు

రష్యన్ ఫెడరేషన్లో Детский сад (పిల్లల ఉపవనం లేదా తోటకు అక్షర అనువాదం) అనేది 3 నుండి 7 సంవత్సరముల వయస్సు పిల్లల కొరకు ఉన్న ఒక విద్యాసంస్థ. ఇది ఒక Детское дошкольное учреждение (పిల్లల ప్రీస్కూల్ సంస్థ).

సింగపూర్సవరించు

సింగపూర్ లోని కిండర్ గార్టెన్లు మూడు మరియు ఆరు సంవత్సరముల మధ్య వయస్సు పిల్లలకు మూడు సంవత్సరముల ప్రీ-స్కూల్ విద్యనూ అందిస్తాయి. నర్సరీ, కిండర్ గార్టెన్ 1 (K1) మరియు కిండర్ గార్టెన్ 2 (K2)గా ప్రసిద్ధమైన ఈ మూడు సంవత్సరముల కార్యక్రమం, పిల్లలను ప్రాథమిక విద్యలో వారి మొదటి సంవత్సరానికి సంసిద్ధులను చేస్తుంది. కొన్ని కిండర్ గార్టెన్స్ నర్సరీని N1 మరియు N2 గా తిరిగి విభజిస్తాయి.

యునైటెడ్ కింగ్‌డమ్సవరించు

కిండర్ గార్టెన్ అనే పదం ప్రీ-స్కూల్ విద్యను వర్ణించటానికి బ్రిటిన్లో అరుదుగా ఉపయోగించబడుతుంది; ప్రీ-స్కూల్స్ సాధారణంగా నర్సరీ స్కూల్స్ లేదా ప్లేగ్రూప్స్గా పిలవబడతాయి. అయినప్పటికీ, "కిండర్ గార్టెన్" అనే పదం ఫారెస్ట్ కిండర్ గార్టెన్స్ వంటి మరింత ప్రత్యేక సంస్థల కొరకు ఉపయోగించబడుతుంది, మరియు ఇది కొన్నిసార్లు ఉద్యోగస్థులైన తల్లిదండ్రుల కొరకు రోజంతా పిల్లలకు సంరక్షణ ఇచ్చే ప్రైవేటు నర్సరీలకు పేరుపెట్టటంలో ఉపయోగపడుతుంది.

UK లో నిర్బంధ విద్య ప్రారంభించటానికి ముందు మూడు మరియు ఐదు సంవత్సరముల మధ్య వయస్సులో పిల్లలకు నర్సరీకి వెళ్ళాలో వద్దో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. దానికి ముందు, ప్రైవేటు యాజమాన్యంలో ఎక్కువ క్రమబద్ధంకాని చైల్డ్ కేర్ (పిల్లల సంరక్షణ) ఉంది. స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్ మరియు నార్తర్న్ ఐర్లాండ్ మధ్య వివరములలో కొద్దిగా తేడా ఉంటుంది.

కొన్ని నర్సరీలు రాష్ట్ర శైశవ లేదా ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానించబడి ఉంటాయి, కానీ చాలావాటిని ప్రైవేటు రంగం అందిస్తుంది. ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది[8] దాని వలన పిల్లలందరూ మూడు సంవత్సరముల వయస్సు నుండి నిర్బంధ విద్యను ప్రారంభించే వరకు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యములో నడిచే నర్సీలకు కానీ లేదా ప్రైవేటు నర్సరీలకు కానీ రోజుకు రెండున్నర గంటల చొప్పున వారానికి ఐదు రోజులు హాజరవవచ్చు. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు ఆదాయ పన్ను లేకుండా వారానికి £55 కూడా ఖర్చుపెట్టవచ్చు[9], ఇది వారానికి ఒకటి లేదా రెండు రోజులకు ఫీజు చెల్లించటానికి కచ్చితంగా సరిపోతుంది.

స్కాటిష్ గవర్నమెంట్ నర్సరీ పాఠశాలల కొరకు తనకు కావలసిన వాటిని ఎర్లీ ఇయర్స్ ఫ్రేంవర్క్[10] మరియు కరికులం ఫర్ ఎక్సెలెన్స్ లలో వివరించింది. ప్రతి పాఠశాల వీటిని కొద్దో గొప్పో స్వతంత్రముతో వివరిస్తుంది (వారి పాలనా నిర్మాణం ఆధారంగా), కానీ వాటిని నడపటానికి కావలసిన లైసెన్సును నిలుపుకోవటానికి కేర్ కమీషన్ను తప్పనిసరిగా తృప్తి పరచాలి. ఈ క్రింది వాటిని తయారుచేయటం కరికులం లక్ష్యం:

 • సఫలమైన అభ్యాసులు
 • ఆత్మా విశ్వాసం కలిగిన వ్యక్తులు
 • బాధ్యతగల పౌరులు
 • ప్రభావవంతమైన దోహదకారులు

నర్సరీ, విద్య యొక్క మూల దశలో భాగం అవుతుంది. 1980లలో ఇంగ్లాండ్ మరియు వేల్స్ నార్తర్న్ ఐరిష్ విధానమును అవలంబించాయి, దీనిమూలంగా స్థానిక విద్యాధికారుల యొక్క పాలసీ ప్రకారం పిల్లలకు ఏ సంవత్సరంలో అయితే ఐదు ఏండ్లు నిండుతాయో అదే సంవత్సరంలో వారు పాఠశాల చదువు ప్రారంభించవచ్చు. స్కాట్లాండ్ లో, వారి జన్మ తేదీని బట్టి (గడిచిన ఫిబ్రవరి చివరలో నాలుగు సంవత్సరములు నిండిన పిల్లలకు ఆగస్టులో పాఠశాల ప్రారంభమవుతుంది) 4½ మరియు 5½ సంవత్సరముల మధ్య వయస్సులో చదువు నిర్బంధం అవుతుంది. నిర్బంధ విద్య యొక్క మొదటి సంవత్సరాన్ని ఇంగ్లాండ్ లో రిసెప్షన్, వెల్ష్లో దోస్బర్త్ డెర్బిన్ మరియు స్కాట్లాండ్ మరియు నార్తర్న్ ఐర్లాండ్ లో ప్రైమరీ వన్ అని పిలుస్తారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాలుసవరించు

యునైటెడ్ స్టేట్స్లో కిండర్ గార్టెన్లు సాధారణంగా K-12 విద్యావ్యవస్థలో భాగం. ఇది కేవలం ఒకే ఒక విద్యా-సంవత్సరం. సాధారణంగా పిల్లలు 5 నుండి 6 సంవత్సరముల వయస్సులో కిండర్ గార్టెన్ కు వెళతారు. పిల్లవాడు ప్రీస్కూల్ లేదా ప్రీ-K కి, (పూర్వం నర్సరీ స్కూల్) వెళ్లి ఉండినప్పటికీ, కిండర్ గార్టెన్ సంప్రదాయక విద్య యొక్క మొదటి సంవత్సరంగా పరిగణించబడుతుంది. కిండర్ గార్టెన్ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో ఒక ప్రత్యేక భాగముగా పరిగణించబడినప్పటికీ, ప్రస్తుతం ఇది విద్యా వ్యవస్థలో పూర్తిగా అనుసంధానించబడింది మరియు శిక్షణలో పూర్తి భాగస్వామి, కానీ చాలా ప్రదేశములలో ఇది కేవలం అర పూట మాత్రమే ఉంటుంది. రాష్ట్రాన్ని బట్టి పిల్లలు వారి కిండర్ గార్టెన్ విద్యా సంవత్సరానికి హాజరు కావలసి రావచ్చు, ఎందుకనగా చాలా రాష్ట్రములలో నిర్బంధ శిక్షణా చట్టములు ఐదు సంవత్సరముల వయస్సులో ప్రారంభమవుతాయి. ఇతర రాష్ట్రములలో నిర్బంధ చట్టములు 6 లేదా 7 సంవత్సరముల వయస్సులో ప్రారంభమవుతాయి, అయినప్పటికీ ఈ రాష్ట్రములు ఇంకా ఉచిత కిండర్ గార్టెన్ విద్యను అందిస్తున్నాయి. ఆచరణలో, సాదాపు అందరు పిల్లలు వారి కిండర్ గార్టెన్ చదువుకు హాజరవుతారు.

కిండర్ గార్టెన్ క్రమణికలలో పిల్లల కొరకు పలు మంచి అధ్యయన మరియు సాంఘిక/స్వాభావిక ప్రయోజనములు ఉన్నాయి. అదే సమయంలో, కిండర్ గార్టెన్ సమయంలో పిల్లలు ఏమి చేస్తున్నారనేది రోజులో ఆ విద్యాసంస్థ ఎంతసేపు పనిచేస్తుంది అనే దాని కన్నా మరింత ముఖ్యమైనది అని ఎక్కువగా భావిస్తారు.

"ఉన్నత/పరిధి అభ్యాసం" అనేది యునైటెడ్ స్టేట్స్ లో చాలా కిండర్ గార్టెన్స్ లో ఉపయోగించే ఒక రకము అధ్యయనము.[ఉల్లేఖన అవసరం] ఈ అధ్యయన పధ్ధతిలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి మరియు దీనికి పిల్లలు మరియు అధ్యాపకుల భాగస్వామ్యం ఎక్కువగా అవసరం. ఇది వారి అధ్యయనానికి పిల్లలే బాధ్యత స్వీకరించేటట్లు చేసే "ప్లాన్, డూ, రివ్యూ" (ఆలోచన, అనుసరణ, సమీక్ష) విధానాన్ని అమలుచేస్తుంది. మొదట పిల్లలు వారి కార్యక్రమాలను ఆలోచించుకుంటారు ("ప్లాన్"). అధ్యాపకుడు పిల్లలకు వారి వయస్సుకు సరిపోయే కార్యక్రమములను ఎంచుకునే అవకాశం ఇస్తాడు మరియు సమస్యా పూరణం, చదువు, భాష, గణితం, మానిపులేటివ్స్ (చేతితో పిసుకుతూ ఆకృతులు మార్చగాలిగేవి) మొదలైన వాటి ద్వారా శిక్షణ ప్రారంభిస్తాడు. అప్పుడు వారు వారి పని చేస్తారు ("do"). వీటిలో కొన్ని కార్యక్రమములలో వాటర్ టేబుల్, బిల్డింగ్ బ్లాక్స్, సృజనాత్మక నృత్య ప్రదేశం, "అలంకరణ" ప్రదేశం, పటన ప్రదేశం, మరియు ఒక రాసుకునే బల్ల వంటివి ఉంటాయి. పిల్లలు ఎక్కువ సమయం ఈ "do" కార్యక్రమంలోనే గడుపుతారు. ఈ పద్ధతిలో ఆఖరి భాగం సమీక్షా భాగం (రివ్యూ). ఇక్కడే పిల్లలు మరియు అధ్యాపకుడు ఆ రోజులో వారు ఏమిచేసారో చూసుకుంటారు. పిల్లలను ఒక పెద్ద బృందముగా ఏర్పరిచి ఇది చేయవచ్చు, ముఖ్యంగా ఆ రోజుకి అన్ని కార్యక్రములలో, లేదా ప్రత్యేకంగా ఒక్కదానిలో ఉపయోగించిన ఒక ఇతివృత్తం ఉండిఉంటే ఇది చేయవచ్చు. పిల్లలు వాళ్ళు ఏమి చేసారో మరియు దానిని వాళ్ళు ఏవిధంగా ఇష్టపడ్డారో మరియు దాని నుండి వాళ్ళు ఏమి నేర్చుకున్నారో చర్చిస్తారు. ఈ ఉన్నత/అవకాశ శిక్షణ బాగా జనాదరణ పొందింది మరియు ఇది పిల్లలను వారి స్వీయ చదువుకు బాధ్యులుగా ఉండేటట్లు చేయటంతో ఎక్కువగా ఆమోదించబడింది.

కిండర్ గార్టెన్ లేదా ప్రీస్కూల్ అవకాశములు బాగా విస్తరించటానికి ముందు నిర్బంధ విద్యా చట్టములు అమలయ్యాయి. కొన్ని రాష్ట్రములలో, పిల్లలు కిండర్ గార్టెన్ కు వెళ్ళవలసిన అవసరం లేదు.[11] నమోదు చేసుకోవలసిన తప్పనిసరి వయస్సు ప్రతి రాష్ట్రంలో 5 మరియు 7 సంవత్సరముల మధ్య మారుతూ ఉంటుంది. ఒక రాష్ట్రం నిర్ణయించిన తేదీకి, సాధారణంగా గ్రీష్మ లేదా శిశిర ఋతువులలో ఐదు సంవత్సరముల వయస్సు ఉంటే, అన్ని రాష్ట్రములలో సాధారణంగా శిశిర ఋతువు సమయంలో పిల్లవాడు కిండర్ గార్టెన్ లో చేరవచ్చు. తప్పనిసరికాని రాష్ట్రములలో ఒకవేళ వాళ్ళ వయస్సు ఐదు సంవత్సరముల కన్నా ఎక్కువ అయితే, వారు కిండర్ గార్టెన్ కు వెళ్లకపోయినా, వారు నేరుగా నిర్బంధ విద్య కొరకు మొదటి తరగతిలో చేరవచ్చు.

వీటిని కూడా చూడండిసవరించు

సూచనలుసవరించు

 1. కిండర్ గార్టెన్ definition from Microsoft Encarta CD edition, 2004.
 2. 2.0 2.1 Vag, Otto (March 1975). "The Influence of the English Infant School in Hungary". International Journal of Early Childhood. Springer. 7 (1): 132–136.
 3. New Lanark Kids: Robert Owen
 4. education in robert owen's new society: the new lanark institute and పాఠశాలs
 5. Wilderspin, Samuel (1823). The Importance of Educating the Infant Poor. London.
 6. Budapest Lexikon, 1993
 7. Ontario's పాఠశాల system Archived 2008-05-16 at the Wayback Machine., accessed March 5, 2008
 8. Childcare regulations of the Scottish Government
 9. Tax Free Childcare Regulations, UK government HMRC
 10. Early Years Framework, Scottish Government, January 2009
 11. [1] accessed December 23, 2008

మరింత చదవడానికిసవరించు

ఈ క్రింది పుస్తముల జాబితా ప్రత్యేకముగా ఉత్తర అమెరికాలోని కిండర్ గార్టెన్ కు సంబంధించినది, ఇక్కడ ఇది సంప్రదాయ విద్యలో మొదటి సంవత్సరము కానీ ప్రపంచములో మిగిలిన ప్రాంతములలో లాగా ప్రీ-స్కూల్ వ్యవస్థలో భాగం కాదు:

 • క్రియాన్, J. R., షీహన్, R., వీచల్, J., & బండి-హెద్దెన్, I. G. (1992). "ఫుల్-డే కిండర్ గార్టెన్ యొక్క సఫల ఫలితములు: మరింత మంచి ప్రవర్తన మరియు రాబోయే సంవత్సరములలో సాధించే విజయములలో పెరుగుదల." ఎర్లీ చైల్డ్ హుడ్ రీసెర్చ్ మూడునెలలకు ఒకసారి, 7 (2),187-203. EJ 450 525.
 • ఎలికర్, J., & మాథుర్, S. (1997). "రోజంతా వారు ఏమి చేస్తారు? ఫుల్-డే కిండర్ గార్టెన్ యొక్క సమగ్ర మూల్యాంకనం." ఎర్లీ చైల్డ్ హుడ్ రీసెర్చ్ మూడునెలలకు ఒకసారి, 12 (4), 459-480. EJ 563 073.
 • ఫుసారో, J. A. (1997). "విద్యార్థి సాధించిన దాని పైన ఫుల్-డే కిండర్ గార్టెన్ ప్రభావము: ఒక ఉన్నత-పరిశీలన." చైల్డ్ స్టడీ జర్నల్, 27 (4), 269-277. EJ 561 697.
 • Gullo, D. F. (1990). "మారుతున్న కుటుంబ ఉద్దేశం: ఆల్-డే కిండర్ గార్టెన్ యొక్క వృద్ధి కొరకు అన్యాపదేశములు." చిన్న పిల్లలు, 45 (4), 35-39. EJ 409 110.
 • హౌస్డెన్, T., & కాం, R. (1992). "ఫుల్-డే కిండర్ గార్టెన్: పరిశోధన యొక్క సారాంశం." కార్మిచేల్, CA: శాన్ జుఆన్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్. ED 345 868.
 • కార్వీట్, N. (1992). "కిండర్ గార్టెన్ అనుభవం." ఎడ్యుకేషనల్ లీడర్షిప్, 49 (6), 82-86. EJ 441 182.
 • కూప్మన్స్, M. (1991). "longitudal effects of బృహత్ కార్యం పైన ఆల్-డే కిండర్ గార్టెన్ హాజరీ యొక్క నిడివి ప్రభావముల అధ్యయనం." నెవార్క్, NJ: నెవార్క్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ED 336 494..
 • మారో, L. M., స్ట్రిక్ ల్యాండ్, D. S., & వూ, D. G. (1998). "హాఫ్- మరియు హోల్-డే కిండర్ గార్టెన్ లో విద్యా శిక్షణ." నెవార్క్, DE: ఇంటర్నేషనల్ రీడింగ్ అసోసియేషన్. ED 436 756.
 • ఒల్సెన్, D., & జిగ్లర్, E. (1989). "ఆల్-డే కిండర్ గార్టెన్ ఉద్యమం యొక్క బేరీజు." ఎర్లీ చైల్డ్ హుడ్ రీసెర్చ్ క్వార్టర్లీ, 4 (2), 167-186. EJ 394 085.
 • పులియో, V. T. (1988). "ఫుల్-డే కిండర్ గార్టెన్ పైన పరిశోధన యొక్క సమీక్ష మరియు విమర్శ." ఎలిమెంటరీ పాఠశాల జర్నల్, 88 (4), 427-439. EJ 367 934.
 • టవర్స్, J. M. (1991). "ఆల్-డే, ప్రతి రోజు కిండర్ గార్టెన్ వైపు వైఖరి." చిల్డ్రన్ టుడే, 20 (1), 25-28. EJ 431 720.
 • వెస్ట్, J., డెంటన్, K., & జెర్మినో-హాస్కెన్, E. (2000). "అమెరికా యొక్క కిండర్ గార్ట్నర్లు." వాషింగ్టన్, DC: నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్.[http://nces.ed.gov/pubs2000/2000070
 • మాక్ గిల్-ఫ్రాన్జెన్, A. (2006). "కిండర్ గార్టెన్ అక్షరాస్యత: కిండర్ గార్టెన్ లో అంచనా మరియు శిక్షణను జత చేయటం." న్యూయార్క్: స్కొలాస్టిక్.
 • వెస్ట్ ఎడ్ (2005). "ఫుల్-డే కిండర్ గార్టెన్: పెరుగుతున్న అధ్యయన అవకాశములు." శాన్ ఫ్రాన్సిస్కో: వెస్ట్ ఎడ్.

బాహ్య లింకులుసవరించు