హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 12 జిల్లాలలో కిన్నౌర్ జిల్లా ఒకటి. జిల్లాను 3 పాలనా విభాగాలు (పో, కిల్ప, నిచార్) 5 తాలూకాలుగా విభజించారు. రికాంగ్ పియో జిల్లా కేంద్రంగా ఉంది. కిన్నౌర్ కైలాష్ పరమశివుని నివాసం అని విశ్వసిస్తున్నారు. 2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో అతి తక్కువ జనసంఖ్య కలిగిన జిల్లాలలో కిన్నౌర్ రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో లాహౌల్, స్పితి ఉన్నాయి., [1] జిల్లాలో ప్రధానంగా 9 భాషలు వాడుకలో ఉండడం విశేషం.[2]

Kinnaur జిల్లా

किन्नौर كننور
Himachal Pradesh లో Kinnaur జిల్లా స్థానము
Himachal Pradesh లో Kinnaur జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంHimachal Pradesh
ముఖ్య పట్టణంReckong Peo
విస్తీర్ణం
 • మొత్తం6,401 కి.మీ2 (2,471 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం84,298

Male Population 46,364 or 42,173(2,001)

Female Population 37,934 or 36,161(2,001).
 • పట్టణ
0.00%
జనగణాంకాలు
 • అక్షరాస్యతAverage literacy rate of Kinnaur in 2011 were 80.77 compared to 75.20 of 2001. If things are looked out at gender wise, male and female literacy were 88.37 and 71.34 respectively. For 2001 census, same figures stood at 84.30 and 64.40 in Kinnaur District. Total literate in Kinnaur District were 61,639 of which male and female were 37,356 and 24,283 respectively. In 2001, Kinnaur District had 51,913 in its district.
 • లింగ నిష్పత్తిWith regards to Sex Ratio in Kinnaur, it stood at 818 per 1000 male compared to 2001 census figure of 857. The average national sex ratio in India is 940 as per latest reports of Census 2011 Directorate. In 2011 census, child sex ratio is 953 girls per 1000 boys compared to figure of 979 girls per 1000 boys of 2001 census data.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

భౌగోళికంసవరించు

కిన్నౌర్ తూర్పు సరిహద్దులో టిబెట్ దేశం ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఈశాన్యభూభాగంలో ఉంది. ఇది రాష్ట్రరాజధాని సిమ్లాకు 235 కి.మీ దూరంలో ఉంది. జిల్లాలో 3 ఎత్తైన పర్వతశ్రేణులు (జంస్కర్, హిమాలయాలు, దౌల్ధార్) ఉన్నాయి. జిల్లాలో సట్కైజ్ నదీలోయ, బస్పా నదీలోయ, స్పితి నదీలోయ ఉన్నాయి. జిల్లాలో నదులూ వాటి ఉపనదులు ఉన్నాయి.

భౌగోళికంసవరించు

ఏటవాలు భూభాగం దట్టమైన చెట్లు, తోటలు, పొలాలు, సుందరమైన గ్రామాలు ఉన్నాయి. కిన్నౌర్ కైలాష్ పర్వతశిఖరం మీద ప్రఖ్యాత శివాలయం ఉంది. 1889 నుండి జిల్లా భూభాగంలో వెలుపలి ప్రాంతాల ప్రజలకు ప్రవేశానుమతి లభించింది. హిందూస్థాన్- టిబెట్ పాత రహదారి కిన్నౌర్ జిల్లాను దాటి సట్లైజ్ నదీతీరం వెంట వెళుతూ టిబెట్ లోని షిప్కీలా పాస్‌లో చేరుతుంది. జిల్లా ప్రజలకు బలమైన సంస్కృతి, మతవిశ్వాసాలు ఉన్నాయి. జిల్లా ప్రజలు అధికంగా బౌద్ధ, హిందూ మతాన్ని అవలంబిస్తున్నారు. వనవాస సమయంలో పాండవులు జిల్లాలోని కమ్రు గ్రామంలో కొంతకాలం నువసించారని విశ్వసిస్తున్నారు. వేలాది సంవత్సరాల మ ఠాలు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. బౌద్ధులు, హిందువులు సహోదరభావం, మైత్రీ భావంతో జీవిస్తున్నారు. జిల్లాలో ఆఫిల్, చెస్ట్‌నట్, ఇతర డ్రై ఫ్రూట్స్ లభిస్తాయి. ఇక్కడ సాహసక్రీడలకు వసతి కల్పించబడుతుంది. కిన్నౌర్ పరిక్రమ పర్వతారోహణ మార్గం కూడా ఉంది.

భౌగోళికంసవరించు

 
Himalayan landscape, Nako Lake and village shown
 
Sutlej River in Kinnaur Valley, Himachal Pradesh

జిల్లాలోని పర్వత భూభాగం సముద్రమట్టానికి 2322 - 6816 మీ ఎత్తున ఉంది. జనసంఖ్యాపరంగా దేశంలోని చిన్న జిల్లాలలో ఒకటైన కిన్నౌర్ జిల్లాలో టిబెట్ సరిహద్దులో ప్రఖ్యాత కిన్నౌర్ కైలాష్ పర్వతం ఉంది. ఇది హిందువులకు అతి పవిత్ర పుణ్యక్షేత్రం.

వాతావరణంసవరించు

 
Hindustan-Tibet Highway in Kinnaur

కిన్నౌర్ జిల్లాలో అధికంగా ఆహ్లాదకరమైన పర్వతప్రాంత వాతావరణం ఉంటుంది. శీతాకాలం అక్టోబరు- జనవరి వరకు దీర్ఘంగా ఉంటుంది. వేవి కాలం జూన్- సెప్టెంబరు వరకు ఉంటుంది. సట్లైజ్ లోయ, బస్పా లోయ వర్షాకాలపు వర్షాన్ని అందుకుంటాయి. నదీలోయలకు ఎగువ భూమి రైన్ షాడో ప్రాంతంగా వర్గీకరించబడుతుంది. టిబెట్ వాతావరణంలా జిల్లా వతావరణం పొడిగా ఉంటుంది.

ప్రజలుసవరించు

ప్రస్తుత కిన్నౌర్ ప్రజలను వైవిధ్యమైన సంప్రదాయాలకు చెందిన వారు. సంప్రదాయ, సాంస్కృతిక వైవిధ్యం ఆధారంగా జిల్లా ప్రజలను మూడు విధాలుగా వర్గీకరించారు.

దిగువ కిన్నౌర్సవరించు

దిగువ కిన్నౌర్ ప్రజలప్రాంతం చొరా అంటారు. వీరు రాంపూర్ బుషర్, కల్పా, నిచార్, సంగ్లా లోయా ప్రాంతంలో నివసిస్తున్నారు. దిగువ భూభాగంలోని ప్రజలు ప్రారంభంలో హిందువులు అయినప్పటికీ వీరి మీద బౌద్ధమతప్రభావం కూడా తగినంత ఉంది.

మద్యకిన్నౌర్సవరించు

మురంగ్ తాలూకాతో చేరిన కల్ప, కనం మద్య ఉన్న భూభాగాన్ని మద్య కిన్నౌర్ అంటారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు పలు జాతులకు చెంది ఉన్నారు. ప్రజలలో అధికంగా మంగోలాయిడ్, కొంతమంది మధ్యధరా ప్రాంతీయులు ఉన్నారు. కొంతమంది మంగోలియన్, మధ్యధరా రెండుజాతిలకు చెందిన మిశ్రిత జాతికి చెందిన వారు ఉన్నారు. ప్రజలలో అధికంగా బౌద్ధులు, హిందువులు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న నివాసగృహాలలో బౌద్ధుల పతాకాలు కనిపించడం సహజం.

ఎగువ కిన్నౌర్సవరించు

మిగిలిన భూభాగాన్ని ఎగువ కిన్నౌర్‌ అంటారు. ఇది పూ పట్టణం, హంగ్రంగ్ లోయ టిబెట్ అంతర్జాతీయ సరిహద్దు వరకు విస్తరించి ఉంది. ఇక్కడ మధ్యధరా, మంగోలాయిడ్ ప్రజలు ప్రధానంగా పూ ప్రాంతంలో కనిపిస్తుంటారు. కొంతమంది మంగోలియన్, మధ్యధరా రెండుజాతిలకు చెందిన మిశ్రిత జాతికి చెందిన వారు ఉన్నారు. హంగ్రంగ్ ప్రాంతంలో అత్యధికంగా మంగోలియన్లు నివసిస్తున్నారు.

కళలుసవరించు

కిన్నౌర్లు సంగీతం, నృత్యాన్ని అధికంగా అభిమానిస్తారు. కిన్నౌర్ ప్రజలు సామాజికంగా రెండు వృత్తి ఆధారిత సమూహాలుగా (రైతులు - కళాకారులు) వర్గీకరించబడతారు. ఈ సమూహాలలో గుజార్లు, రాజపుత్రులు, షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఉంటారు.

కులవర్గీకరణసవరించు

కనెట్స్ ప్రధానంగా వ్యవసాయం జీవనోపాధిగా ఎంచుకుంటారు. వీరికి నేగి అనే ఉపనామం ఉంటుంది. కనెట్లలో మూడు తెగలు ఉంటాయి. మొదటి తెగలో 50 కులాలు ఉంటాయి. రెండవ తెగలో 17 కులాలు ఉంటాయి. మూడవ తెగకు చెందిన కుమ్మరి వారిలో మూడు ఉప కులాలు ఉంటాయి. వాజా కనెట్లు అనబడే మూడవ తెగకు చెందిన కనెట్లు తక్కువజాతిగా భావించబడతారు. వృత్తి ఆధారంగా 2 షెడ్యూల్డ్ కులాల వర్గీకరించబడ్డాయి. ఒక జాతి వారు సంప్రదాయంగా నేత పని చేస్తారు. రెండవ జాతి ప్రధానంగా కమ్మరి పని చేస్తారు. ఇది కాక మూడవ జాతి వారు వడ్రంగి పని చేస్తారు. ఓర్ల ప్రధాన వృత్తి వడ్రంగి పని. ఓర్లు, కమ్మరి సాంఘిక సమాన అంతస్తు కలిగి ఉంటారు. షెడ్యూల్డ్ తరగతులలో నేత వారికంటే కమ్మరి, వడ్రిగి వారు తమకుతాము అధికులమని భావిస్తారు.

భాషలుసవరించు

ప్రాంతీయ, సామాజిక జిల్లా భాషల మీద ప్రభావితం చేసింది. గ్రామప్రాంతాలు రాజపుత్ర, కమ్మరి, వడ్రంగి జాతులకు ప్రత్యేకమైన భాషలు వాడుకలో ఉన్నాయి. భాషలలో ప్రాంతీయ సామాజిక వ్యత్యాసాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 9 భాషలు వాడుకలో ఉన్నాయి. వీటిలో 6 ప్రాంతీయ వ్యత్యాసాలు రెండు సామాజిక వ్యత్యాసాలు ఉన్నాయి. 9 భాషలలో 7 టిబెటన్ - బర్మన్ - ఆర్యన్ భాషా సంబంధితమై ఉన్నాయి. జిల్లా లోని రెకాంగ్ పియోలో ఈ భాషలన్ని కుటుంబాలలో వాడుకలో ఉన్నాయి.

క్రింది జాబితాలో జిల్లాలోని భాషల వివరణలు ఉన్నాయి.[3]

సీ. సంఖ్య భాష పేరు గ్రామాలు ISO 639-3 జనాభా సామాజిక / ప్రాంతీయ
1 జంగ్‌షంగ్ భాష మొరంగ్ తాలూకా, జంగి, లిప్ప, అస్రంగ్ గ్రామాలు 1,990 ప్రాంతీయ జె.ఎన్.ఎ
2 కిన్నౌరీ భాష చౌర సాంగ్ల, ఉత్తర సట్లెజ్ పాటు మొరంగ్ నది ఎగువ రొప నది లోయ గ్రామాలు కె.ఎఫ్.కె 65.100 సంఘ
3 భొతి కిన్నౌరి భాష స్పితి నది, మొరంగ్ తాలూకా, నెసంగ్ గ్రామం పి.యు.హెచ్ తాలూకా, పి.యు.హెచ్ గ్రామం మొరంగ్ తాలూకా, ఎగువ కిన్నౌరీ సట్లెజ్ నది బేసిన్. బహుశా నోర్స్, చరంగ్బ్ గ్రామాలు ఎ.ఇ.ఎస్ 6.790 ప్రాంతీయ లో
4 చిత్కులి కిన్నౌరీ భాష సి.ఐ.కె 1,060 ప్రాంతీయ నిచార్ ఉపవిభాగం, సంగ్లా వాలీ, .బాస్పా నదీ ప్రాంతం, చిత్కుల్, రక్చం గ్రామాలు
5 కిన్నౌరీ, లోహరి కిన్నౌర్ మొత్తం జిల్లా - - సంఘ
6 పహారి భాషలు కిన్నౌర్ జిల్లాలో కె.జె.ఒ 6.330 సంఘ మొత్తం
7 షుంచొ భాష పుచ్ తాలూకా, కనం, లబ్రంగ్, స్పిలో, షయాసొ, తలింగ్, రుష్కలింగ్ గ్రామాలు ఎస్.యు.యు 2,170 ప్రాంతీయ
8 సునం భాష పి.యు.హెచ్ తాలూకా, సునం గ్రామం ఎస్.ఎస్.కె 560 ప్రాంతీయ
9 తుక్ప భాష నెసంగ్, చంగ్, కున్ను గ్రామాలు టి.పి.క్వి. 610 ప్రాంతీయ

ఆహార సంస్కృతిసవరించు

ప్రజల ప్రధాన ఆహారం గోధుమ, ఒగ్లా, ఫఫ్రా, బార్లీ. ఇవి ప్రాంతీయంగా పండించబడుతున్నాయి. వీటితో కంకాణి, చీనా, మొక్కజొన్న, చొల్లైర్, బాథు ధాన్యాలు కూడా వాడుకలో ఉన్నాయి. బఠాణీ, నల్ల బఠాణీ, పెసలు, రాజ్మా మొదలైన పప్పుధాన్యాలు కూడా వాడుకలో ఉన్నాయి. క్యాబేజి, టర్నిప్స్, బఠాణీ, గుమ్మడి, ఉర్లగడ్డలు, ఒక్ర, టమాటా మొదలైన కూరగాయలు కూడా వాడుకలో ఉన్నాయి. ప్రాంతీయంగా లభ్యం ఔతున్న విల్డ్ గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరలు కూడా ప్రజలలో వాడుకలో ఉంది. మైదాన ప్రాంతాల నుండి దిగుమతి చేయబడుతున్న బియ్యం అంటే ప్రజలు అధికంగా అభిమానిస్తుంటారు. కన్నౌరా ప్రజలకు ఉదయం, సాయంకాలపు వేళలలో ఉప్పు వేసిన టీ (చా) త్రాగే అలవాటు ఉంది. సాధారణంగా బార్లీ పిండితో చేసిన సత్తుతో చా త్రాగే అలవాటు ఉంది. ప్రజలు మేక, రాం మాసం తింటారు. ఆల్కహాలతో చేరిన మత్తు పదార్ధాలను దినసరి జీవితం, వివాహాది వేడుకలు, పండుగలలో సాధారణం. ప్రాంతీయంగా పండించబడుతున్న బార్లి, ఆఫిల్, ద్రాక్ష, పియర్ పండ్లతో గృహాలలో మద్యం తయారు చేయబడుతుంది. .

మతంసవరించు

 
Buildings in Kalpa show strong Hindu and Buddhist influence.

దిగువ కిన్నౌర్‌లో హిందువులు అధికంగా ఉన్నారు. హిందువులకు ప్రధానదైవాలు దుర్గా, (చండి), భైరన్, ఉష (ఉఖ), నారాయణ్, విష్ణు, బద్రినాథ్, భీమకలి. కమ్మరి, వడ్రంగి జాతిప్రజలకు వారి నగదేవత వంటి ప్రత్యేక ఇష్టదైవం ఉంటుంది. అదనంగా ఒక్కొక్క గ్రామానికి ఒక గ్రమదేవత ఉంటుంది.

మద్య కిన్నౌర్సవరించు

మద్య కిన్నౌర్‌లో బౌద్ధులు అధికంగా ఉన్నారు. మద్య కిన్నౌర్ ప్రజలలో హిందువులకు చండి, గౌరి, కంస, నారాయణ్జి ఆరాధ్యదైవాలుగా ఉంటారు. కనం గ్రామం గ్రామదేవత బాన్ మతానికి సంబంధించిన దేవత. కనంలో దబ్లా మద్యలో ప్రతిష్ఠితమైన గురురింపోచే (పద్మసంభవ) ఇక్కడ ఉన్న బౌద్ధ మఠాలలో ఒకటి.

ఎగువ కన్నౌర్సవరించు

ఎగువ కిన్నౌర్ ప్రజలు అధికంగా టిబెటన్ బౌద్ధులు ఉన్నారు. అన్ని గ్రామాలకు ఒక మఠం ఉంది. సాధారణంగా కనెట్ నుండి సన్యాసులను ఎన్నిక చేస్తూ ఉంటారు.

ఇతర మతాలుసవరించు

కిన్నౌర్ జిల్లాలో టిబెటన్ బౌద్ధ మతం తరువాత అధికంగా అవలంబించే మతం హిందూమతం. తరువాత స్థానంలో బాన్ మతం ఉంది. ఈ మూడు మతాల మిశ్రితంగా షమానిస్టిక్ మతం అవలంభించబడుతుంది. దిగువ కిన్నౌర్‌లో హిందువుల మీద బౌద్ధమత ప్రభావం అధికంగా ఉంది. మద్య కిన్నౌర్‌లో హిందూ, బౌద్ధ మతప్రభావం ఉంది. ఎగువ కిన్నౌర్‌లో పూ ప్రాంతంలో హిందూ, బౌద్ధ మత ప్రభావం అధికంగా ఉంది. ఏది ఏమైనా జిల్లాలో బౌద్ధ మతం హిందూ మత ప్రభావితం కాకుండా ప్రత్యేకంగా ఉంది.

మత సమైఖ్యతసవరించు

హిందూ దేవతలు, క్రైస్తవ దేవతలు పక్కపక్కనే ఆలయాలలో ఆరాధించబడుతుంటారు. బాన్ ప్రధాన దైవంగా ఉన్న ప్రదేశాలలో దాబ్లా ఒకటి. కిన్నౌర్లు ప్రాముఖ్యత ఇచ్చే ప్రదేశాలలో దాబ్లా ఒకటి. మద్య, దిగువ కిన్నౌరులలో హిందూదేవతలు అధికంగా ఆరాధించబడురుంటారు. జానపద దైవాలకు కూడా ప్రజాజీవితంలో అధిక ప్రాధాన్యత ఉంది.

దయ్యాలుసవరించు

దయ్యాలు (బంచిర్, రాక్షస, ఖుంకచ్ ) కూడా మొదలైన మూఢవిశ్వాసాలు కిన్నౌర్ ప్రజల విశ్వాసాలలో చోటుచేసుకుని ఉన్నాయి. దయ్యాలను పారద్రోలడానికి పూజా విధానం, జంతువుల కొమ్ములను ఉపయోగిస్తారు.

లామాలుసవరించు

బౌద్ధలామాలు కిన్నౌర్ ప్రజాజీవితంలో ప్రధానపాత్ర వహిస్తున్నారు. ఎగువ, దిగువ కిన్నౌర్ యువ సన్యాసులకు చిన్నవయసు నుండి మతాచారాల శిక్షణ ఇవ్వబడుతుంది. వారు బౌద్ధమతానికి జీవితాన్ని అర్పిస్తారు. వారు బౌద్ధమత నిబంధనలు, శీలాశాసనాలు వంటివి అధ్యయనం చేయడానికి శిక్షణ తీసుకుంటారు. వారు లామా (పురుష సన్యాసి), చోమా (స్త్రీ సన్యాసిని) అయిన తరువాత వారికి మతసంబంధిత బాధ్యతలు అప్పగించబడతాయి. అవి మతసంబధిత, లౌకిక సంబంధిత బాధ్యతలుగా ఉంటాయి. అవి సాధారణంగా రెండుగా (సెలిబేట్ జియో లాంగ్ అంటే శిరోముండనం చేసినవారు, నాన్ సెలిబేట్ దుర్పు అంటే శిరోజాలను కత్తిరించని వారు) విభజించబడతారు. కిన్నౌర్ కైలాష్ కిన్నౌరుల అతి పవిత్రమైన పర్వతశిఖరం. ప్రతి సంవత్సరం ఈ శిఖరాన్ని అనేక మంది యాత్ర నిమిత్తమై దర్సుస్తుంటారు.

జంతుజాలం, జంతుజాలంసవరించు

కిన్నర్ జిల్లా హిమాలయ పర్వత ఎగువ ప్రాంతంలో ఉంది. సాధారణంగా గడ్డి అధికంగా వృక్షజాలం తక్కువగా ఉంటుంది. జూనిపర్ మొదలైన ఆల్పైన్ వృక్షాలు, పైన్, ఫిర్, సైప్రస్, రోడోడెండ్రన్ మొదలైన వృక్షాలు 3,500- 5,000 అడుగుల ఎత్తులో (ప్రధానంగా మద్య కిన్నౌర్) కనిపిస్తుంటాయి. దిగువ ప్రాంతాలలో టెంపరేట్ - క్లైమాట్ ఓక్, చెస్ట్ నట్, మాపిల్, బిర్చ్, అల్డర్, మంగోలియా, ఆఫిల్, ఆప్రికాట్ వృక్షాలు కనిపిస్తుంటాయి. యాక్, డ్జొ మొదలైన పెంపుడు జంతువులను రైతులు చేత పెంచబడుతున్నాయి. అరుదైన నల్ల ఎలుగు, పోనీలు కనిపిస్తూ ఉంటాయి.

ప్రజలుసవరించు

 
Farm worker wearing traditional Kinnaur cap with bright green flap.

పురాణకథనాలను అనుసరించి కిన్నౌరులు పాండవుల సంతతి వారని భావిస్తున్నారు. వీరు మానవ, దేవతల మిశ్రితజాతివారుగా అతీంద్రియ శక్తులు కలిగి ఉన్నారు. వీరిని రాజపుత్ర, ఖిసియాస్, బెరు జాతులకు చెందినవారుగా కూడా భావిస్తున్నారు.

ఇతర కథనాలను అనుసరించి కిన్నౌరులు ఇండో ఆర్యన్లు కారని భావిస్తున్నారు. వీరు పశ్చిమ హిమాలయాలలో నివసిస్తున్న దరాడ (ఇరానియన్ సంతతి) సంతతికి చెందిన వారని కూడా భావిస్తున్నారు. దరాడాలలో పర్షియన్ సంబంధిత భాష వాడుకలో ఉంది. పురాతన కాలంలో కిన్నౌరులకు దరాడ భాష వాడుకలో ఉందని భావిస్తున్నారు. తరువాత టిబెట్ హిమాలయ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తరువాత కిన్నర్, స్పితి, లడక్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. తరువాత వారు కొత్తపాలకుల భాషను అలవాటు చేసుకుని వారి పాత భాషను విడిచి ఉంటారని భావిస్తున్నారు.

జీవనశైలిసవరించు

కిన్నౌర్ నివాసగృహాలలో ధాన్యాలు, శోషితఫలాలు (డ్రై ఫ్రూట్స్) భద్రపరచడానికి ప్రత్యేకమైన గదులను నిర్మిస్తారు. అంతేకాక ధాన్యాలు, శోషితఫలాలు భద్రపరచడానికి చెక్కతో చేసిన సమానును కూడా ఉపయోగించే వారు. వీటిని కథార్, పక్ప అంటారు.

పాత్రలుసవరించు

కిన్నౌర్ ప్రజలు సాధారణంగా ఇత్తడి, కంచు పాత్రలను ఉపయోగిస్తారు. ఆధునికంగా చైనీయుల పింగాణీ పాత్రలు, స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియం పాత్రలు వాడుకలోకి వచ్చాయి.

దుస్తులుసవరించు

దుస్తులలో ఉన్ని వస్త్రాలు ఆధిక్యత అధికంగా ఉంటుంది. తెల్లని వెల్వెట్ బంధంతో కూడిన బూడిదరంగు ఉన్ని టోపీ ధరిస్తారు. టిబెటన్ చుబ్బా (పొడవైన ఉన్ని కోటు), చేతులు లేని జుబ్బా ధరిస్తారు. పురుషులు ఉన్ని చుడిదార్, పైజామా, ఉలెన్ షర్టులు, చాం కుర్తీలు ధరిస్తారు. స్త్రీలు దొహ్రు ధరిస్తారు. దొరు వస్త్రాల అంచులకు ఎంబ్రాయిడరీ డిజైన్ చేస్తారు. వెనుక వైపు ధరించే ఈ వస్త్రం వెనుక చీలమండలం తాకుతూ ఉంటుంది. దొరులను ముదురు రంగులలో ఎన్నిక చేస్తారు. ఇతర వర్ణరంజితమైన షాల్స్‌ను భుజం మీద వేసుకుంటారు.స్త్రీలు చోళీ ధరిస్తారు. కిన్నౌర్లు రెండు తరగతులుగా వర్గీకరించబడతారు. మద్య, దిగువ కిన్నౌర్ భూభాగంలో కులవ్యవస్థ బలంగా ఉంది.

చరిత్రసవరించు

కిన్నౌర్ చరిత్ర గురించిన సమాచారం స్వల్పంగానే లభిస్తుంది. దీనిని కనౌరా కినౌరా అని కూడా అంటారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలగురించి పురాణ కథనాలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాంతం మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేదని భావిస్తున్నారు. 6 వ శతాబ్దంలో ఇది మౌర్యుల ఆధీనంలో ఉండేది. ఇది పూర్వం కిరాత, కాంభోజ, పనసిక, వల్హిక ప్రజలు నివసించే వారు. 9-12 శతాబ్ధాలలో కిన్నౌర్ టిబెట్‌ను పాలించిన గుజ్ పాలకుల ఆధీనంలో ఉండేది.

సాత్ కుండ్సవరించు

కిన్నౌర్ తరువాత సాత్ కుండ్ పేరిట 7 భాగాలుగా విభజించబడింది. ఈ ప్రాంతంలో సంభవించిన కలహాలు పలు రాజ్యాల స్థాపనకు దారితీసాయి. వారి రాజ్యాధికారం కొరకు ఒకరితో ఒకరు తరచుగా కలహించుకునేవారు. పొతుగున ఉన్న బోటేలు కూడా ఈ కలహాలలో పాల్గొనేవారు. ఈ ప్రాంతంలో పాలకులు రక్షణ కొరకు నిర్మించిన లబ్రంగ్, మొరంగ్, కంరు మొదలైన కోటలు ఈ ప్రాంత చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. అక్బర్ చక్రవర్తి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే వరకు కలహాలు కొనసాగాయి. అక్బర్ విజయంతో ఈ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యంలో భాగం అయింది.

మొఘల్ పతనం తరువాతసవరించు

మొఘల్ సామ్రాజ్యపతనం తరువాత కిన్నర్ లోయ ప్రాంతం (చిని తాలూకా) ఈ ప్రాంతం చరిత్రలో ప్రధాన పాత్ర వహించింది. తరువాత ఈ ప్రాంతం మహాసు జిల్లాలో విలీనం చేయబడింది. 1960 నాటికి ఈ ప్రాంతంలో పలు రాజకీయ, సంప్రదాయ, సాంస్కృతిక మార్పులు సంభవించాయి. 1975 కిన్నౌర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. కిన్నౌర్ సంస్కృతిలో గిరిజన, భాతృత్వ, బహుభార్యత్వ సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. పురాతన కాలంలో వ్యవసాయ జీవితానికి అనుగుణంగా జీవనశైలికి బహుభార్యాత్వం అనుసరించబడింది. ప్రస్తుతం విద్యా, ఆధునిక భావాల కారణంగా బహుభార్యాత్వం జాడలు మరుగునపడుతున్నాయి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 84,298, [4]
ఇది దాదాపు. ఆండొర్రా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 620వ స్థానంలో ఉంది..[4]
1చ.కి.మీ జనసాంద్రత. 13 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 7.61%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 818:1000[4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 80.77%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

f

ఇవి కూడా చూడండిసవరించు

కిన్నౌర్ జిల్లాలో కిన్నౌర్ భాష వాడుకలో ఉంది. జిల్లా మొత్తంలో పలు ప్రాంతీయ భాషలు వాడుకలో ఉన్నాయి.

మూలాలుసవరించు

[6]

  1. "District Census 2011". Registrar General of India.
  2. "Language Map". Kinnaura Masihi Lok Sahitya Manch. Retrieved 6 November 2013.
  3. http://www.ethnologue.com/map/IN_01. Missing or empty |title= (help)
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. 198 Andorra 84,825 July 2011 est. line feed character in |quote= at position 4 (help)
  6. Lewis M, Paul. "Editor". SIL. Retrieved 5 November 2013.

బయటి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కిన్నౌర్&oldid=2861470" నుండి వెలికితీశారు