కుంచము
(కుంచం నుండి దారిమార్పు చెందింది)
కుంచం అనేది ఘనపరిమాణం కొలవడానికి వాడే పరికరము. పల్లెలలో ధాన్యం, బియ్యం, పప్పులు వంటి వాటిని కొలవడానికి గుండ్రంగా ఉండే లోతైన పాత్రల వాడుక కలదు. వాటిలో తవ్వ, శేరు, అడ్డ, కుంచం వంటివి వాడుకలలో ఉన్నాయి. వాటిలో ఉండే పెద్ద కొలతను కుంచంగా వ్యవహరిస్తారు. దీనికి వాడు పాత్ర కూడా పెద్దగా లోతైనదిగ ఉంటుంది.
వాడుక
మార్చుది పల్లెటూర్లలో వాడతారు ధాన్యాన్ని కొలుస్తారు పాతకాలంలో తరాజు కు బదులుగా వాడేవాళ్ళు ఇప్పటికి ఊర్లల్లో ఇవి ఉన్నాయి.
ఇది ధాన్యం అంటే వడ్లు లేదా వేరే గింజలను కొలిచే ఒక పరిమాణము (a small measuring vessel) ఇది ఒకొక ప్రాంతం లో ఒక తీరుగా వాడుకలో ఉంటుంది . కుంచం , గిద్ద, సేరు , సోల, తవ్వ అలాగా .
కొలత
మార్చుకుంచం ఒక కొలమానం కుంచం అంటే నాలుగు మానికలు పదహారు సోలలు. సోల పావుతో సమానం వరుస ఇలా ఉంటుంది.
- తవ్వ
- సేరు
- సోల
- వీసె
- మానువు, మానెడు
- పంపు
- సితం
- తులుము
- బస్తా
విశేషాలు
మార్చు- కుంచం పేరుతో కొన్ని సంస్థలూ ఉన్నాయి.. ఉదా: కుంచం సాప్ట్వేర్ సొల్యూషన్ (http://kunchams.com/)
- కొండప్రాంతపు సంతల్లో గిరిజనులు గిద్ద, మానిక, కుంచం కొలతలనే ఇప్పటికీ వాడుతుంటారు.
- కుంచం అనే పేరుతో తెలుగు నాట ఒక ఇంటి పేరు ఉంది.
- నేలను కొలిచే సంధర్భాలలో కుంచం భూమి, నేల అని వ్యవహరిస్తారు.
ఇతర పేర్లు
మార్చు- కుండ
- కుంచా
- చట్టి
మూలాలు, ఆధారాలు
మార్చు- http://indianbazaars.blogspot.com/2010/06/weights-measures.html (మార్కెట్ వాడుకలో)
- http://www.hextobinary.com/unit/area/from/kuncham (కుంచపు కొలమానం)
- http://ykantiques.com/2012/12/antique-brass-rice-cooking-pots.html Archived 2020-01-28 at the Wayback Machine (వివిద కొలతలు కలిగిన పాత్రల వివరణ)
- http://kunchams.com/
బాహ్య లంకెలు
మార్చుLook up కుంచము in Wiktionary, the free dictionary.