కుట్ర సిద్ధాంతం

ఒక సంఘటనను వివరించే సందర్భంలో దానిలో దాగి ఉన్న కుట్రను ప్రేరేపించటం కుట్ర సిద్దాంతం

కుట్రవాదం https://www.universalis.fr/encyclopedie/conspirationnisme/ ఒక సంఘటననుగానీ, లేదా పరిస్థితిని గానీ విశ్లేషించే క్రమంలో, దానికి కుట్ర కోణాన్ని ఆపాదిస్తూ చెప్పడమే కుట్ర సిద్ధాంతం. ఈ కుట్ర సిద్ధాంతంలో సాధారణంగా ప్రభుత్వంగానీ, బాగా శక్తిమంతులైన వ్యక్తులుగానీ చేసిన చట్టవ్యతిరేకమైన పని గురించిన వివరణ ఉంటుంది. కుట్ర సిద్ధాంతాలు చరిత్ర గురించి, సార్వత్రిక వాస్తవాల గురించీ ప్రజల్లో ఉన్న అవగాహనను వ్యతిరేకిస్తూ ఉంటాయి.

The Eye of Providence, or the all-seeing eye of God, seen here on the US $1 bill, has been taken by some to be evidence of a conspiracy involving the founders of the United States and the Illuminati.[1]: 58 [2]: 47–49 

ఈ మాట నిందాపూర్వకమైనది.[3]

రాజకీయ శాస్త్రవేత్త మైకెల్ బార్కన్ ప్రకారం, విశ్వం మూడు సూత్రాలపై పనిచేస్తుంది అని కుట్ర సిద్ధాంతాలు నమ్ముతాయి: దానంతటదే ఏదీ జరగదు. ఏదీ కూడా మనకు కనబడుతున్నట్లుగా ఉండదు, ప్రతిదీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది.[1]: 3–4  మరో సామాన్య అంశం ఏంటంటే, ఈ కుట్ర సిద్ధాంతాలు తమకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను కూడా కలుపుకుని తయారవుతాయి. ఈ పద్ధతిలో అవి కల్పన అని చెప్పలేనంత కట్టుదిట్టంగా, ఓ ప్రబల విశ్వాసంగా  తయారవుతాయి అని బార్కన్ చెప్పాడు.[1]: 7 [4]: 10  

పదం వాడుక

మార్చు

సామాజిక వర్గాల మధ్య సంబంధాలు, దుష్టశక్తుల ఉనికీ లాంటి వాటిని వివరించేందుకు కుట్ర సిద్ధాంతాలను కల్పిస్తూ ఉంటారు.[a][1][5][6] ప్రధానంగా కుట్ర సిద్ధాంతాలకు మూలాలు మానసిక, సామాజిక రాజకీయ రంగాల్లో ఉన్నాయి. ఒక విశిష్ట సంఘటనను ఒక విశిష్ట కారణంతో ముడిపెట్టి వివరించాలనే వ్యక్తిగత ఆవశ్యకత, మానసిక మూలాల్లో ఒకటి. బాగా ముదిరినపుడు దీన్ని మానసిక జాడ్యంగా భావించవచ్చు. అనుకోకుండా జరిగే సంఘటనలకు సామాజిక రాజకీయ కారణాలను ఆపాదించి విశ్లేషిస్తూంటారు, కొందరు.[7][8][9][10][11][12] కుట్ర సిద్ధాంతాలను నమ్మడంలోనూ సంబద్ధత ఉండవచ్చని కొందరు తాత్వికులు వాదిస్తారు.[13][14][మూలాన్ని నిర్థారించాలి]


చరిత్ర

మార్చు

ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు నిఘంటువు కుట్ర సిద్ధాంతాన్ని స్థూలంగా ఇలా నిర్వచిస్తోంది: "పరస్పర ప్రయోజనాలున్న వర్గాలు కుట్ర చేయడం వలననే ఫలానా ఘటన లేదా పరిణామాలు సంభవించాయనే సిద్ధాంతం. హేతువు తెలియని సంఘటనకు కారణం, ప్రచ్ఛన్నంగా ఉన్న ఏదైనా సంస్థ అని నమ్మడం." దీనికి తొట్టతొలి ఉదాహరణగా 1909 నాటి ది అమెరికన్ హిస్టారికల్ రివ్యూలో వచ్చిన వ్యాసాన్ని ఈ నిఘంటువు పేర్కొంది.[15][16] 

ఉదాహరణలు

మార్చు

ఎన్నో కుట్ర సిద్ధాంతాలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి -బాగా ప్రచారం పొందినవి, తక్కువగా ప్రచారంలో ఉన్నవీను. ప్రభుత్వాల రహస్య ప్రణాళికలు, హత్యల కుట్రలు, అత్యద్భుత సాంకేతిక ఆవిష్కరణలను తొక్కిపెట్టడం, పెద్ద పెద్ద సంఘటనలకు అసలు కారణం ఫలానా పన్నాగాలు అని చెప్పడం లాంటి కుట్ర సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. సాధారణంగా కుట్ర సిద్ధాంతాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి విరుద్ధంగాఉంటాయి. వాటిని నిరూపించలేం.

ప్రస్తుతం, కుట్ర సిద్ధాంతాలు అంతర్జాలంలో బ్లాగులు, యూ ట్యూబ్ వీడియోల రూపంలో, సామాజిక మధ్యమాల్లోనూ విస్తృతంగా ఉన్నాయి. అసలు అంతర్జాలం కారణంగానే కుట్ర సిద్ధాంతాలు పెరిగాయా అనేది శోధించాల్సిన సంగతి. సెర్చి ఇంజన్ల ఫలితాల్లో వచ్చే కుట్ర సిద్ధాంతాలను పర్యవేక్షించి, పరిశీలించగా, వాటిలో మంచి, నాణ్యమైన లింకులు తక్కువగా ఉన్నట్లు తెలిసింది.

గమనికలు

మార్చు
  1. Barkun 2003: "The essence of conspiracy beliefs lies in attempts to delineate and explain evil. At their broadest, conspiracy theories 'view history as controlled by massive, demonic forces.' ... For our purposes, a conspiracy belief is the belief that an organization made up of individuals or groups was or is acting covertly to achieve a malevolent end."[1]: 3 

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Barkun, Michael (2003).
  2. Micah Issitt and Carlyn Main.
  3. Ayto, John (1999).20th Century Words.
  4. Barkun, Michael (2011).
  5. Link text, Türkay Salim Nefes (2013) The Sociological Review Volume 61, Issue 2, pp. 247–64.
  6. Link text, Türkay Salim Nefes (2012), Journal of Historical Sociology, Volume 25, Issue 3, pp. 413–39, September 2012.
  7. Justin Fox: "Wall Streeters like conspiracy theories.
  8. Goertzel (1994). "Belief in Conspiracy Theories". Political Psychology. 15 (4): 1, 12, 13. doi:10.2307/3791630. JSTOR 3791630. Archived from the original on 31 ఆగస్టు 2006. Retrieved 7 August 2006.
  9. Douglas, Karen; Sutton, Robbie (2008). "The hidden impact of conspiracy theories: Perceived and actual influence of theories surrounding the death of Princess Diana". Journal of Social Psychology. 148 (2): 210–22. doi:10.3200/SOCP.148.2.210-222.
  10. Hofstadter, Richard (November 1964). "The Paranoid Style in American Politics". Harper's Magazine. pp. 77–86. Retrieved 4 December 2013.{{cite news}}: CS1 maint: url-status (link)
  11. Hodapp, Christopher; Alice Von Kannon (2008). Conspiracy Theories & Secret Societies For Dummies. John Wiley & Sons. ISBN 978-0-470-18408-0.
  12. Cohen, Roger (20 December 2010). "The Captive Arab Mind". The New York Times.
  13. Coady, David (2012). "Chapter 5: Conspiracy Theories and Conspiracy Theorists". What to believe now: applying epistemology to contemporary issues. Chichester, West Sussex: Wiley-Blackwell.
  14. Basham, Lee (2011). "Conspiracy Theory and Rationality". In Jensen, Carl; Harré, Rome (eds.). Beyond Rationality. Newcastle on Tyne: Cambridge Scholars Publishing.
  15. Oxford English Dictionary Second Edition on CD-ROM (v. 4.0), Oxford University Press, 2009, s.v. 4
  16. Johnson, Allen (July 1909). "Reviewed Work: The Repeal of the Missouri Compromise: Its Origin and Authorship by P. Orman Ray". The American Historical Review. 14 (4). Oxford Journals for the American Historical Association via JSTOR: 836. doi:10.2307/1837085. JSTOR 1837085. The claim that [David R.] Atchison was the originator of the [Missouri Compromise] repeal may be termed a recrudescence of the conspiracy theory first asserted by Colonel John A. Parker of Virginia in 1880{{cite journal}}: CS1 maint: postscript (link)