కుమ్మరి (కులం)
[[File:potter job.jpg|thumb|right|కుండలు తయారు చేస్తున్న మహిళలు]]
కుమ్మరి కులం ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 8వ కులము. ఈ కులాన్ని కులాల, శాలివాహన ప్రజాపతి పేర్లతో కూడా పిలుస్తారు. మట్టితో కుండలను చేయువారిని కుమ్మరి (Potter) అంటారు. కులాలుడు అన్న పదం కూడా సాహిత్యంలో వాడబడుతుంది. వీరి వృత్తిని కుమ్మరం (Pottery) అని అంటారు. ఈ వృత్తి వారసత్వముగా వచ్చునది. దీనిని చేయుటకు తగిన అనుభవము ఉండవలెను. మట్టి గురించి అవగాహన, చేయుపనిలో శ్రద్ధ, కళాదృష్టి లాంటివి ఈ పనికి తప్పనిసరి. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది. కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు.
ప్రదేశం
మార్చుఅతి పెద్ద కులాలలో కుమ్మరి ఒకటి. ఇది భారతదేశం లోని 773 జిల్లాలలో విస్తరించి ఉన్నది. ఈ కులంవారు అధిక సంఖ్యలో లైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రదేశాలు, ఆంధ్రప్రదేశ్,తెలంగాణలలో ఉన్నారు. ఈ కులంవారు వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల నామాలతో పిలువబడుతున్నారు.
మూల కథలు, చరిత్రలు
మార్చు- ప్రతీ రాష్ట్రంలో ఈ కులానికి సంబంధించి ఒక్కో చరిత్ర ఉంది. కుమ్మరులు భారతీయ హిందూ దేవతలైన త్రిమూర్తులు (బ్రహ్మ,విష్ణు, శివుడు) ఆశీస్సులతో భూమిపై అవతరించారని చెపుతారు.వారికి బ్రహ్మదేవుడు ఈ కళను అందిచాడనీ, విష్ణువు తన చక్రాన్ని అందించాడనీ, లయకారకుడైన శివుడు తన రూపాన్ని అందించాడని అంటారు. వారి మొదటి ఉత్పత్తి నీటి కుండ.
- ఒకరోజు బ్రహ్మ తన కుమారులకు చెరకు గడను భాగాలుగా చేసి యిచ్చాడు. వారిలో ప్రతీ ఒక్కరూ దానిని తిన్నారు. కానీ కుమ్మరి తన పనిలో నిమగ్నమై ఆ చెరకు ముక్కను తినడం మరచిపోయాడు.ఆ చెరకు ముక్క మట్టి కుప్పపై ఉంచాడు. అది వేర్లు తొడిగి చెరకు మొక్కగా పెరిగింది. కొన్ని రోజుల తరువాత బ్రహ్మ తన కుమారులను చెరకు గురించి అడిగాడు. కానీ ఎవరూ తిరిగి యివ్వలేకపోయారు. కానీ కుమ్మరి చెరకు పూర్తి మొక్కనే యిచ్చాడు. బ్రహ్మ కుమ్మరి యొక్క ఏకాగ్రతను మెచ్చుకొని ప్రజాపతి బిరుదు నిచ్చాడు.
- విక్రమాదిత్యుడితో’ యుద్దంలో శాలివాహనుడికి సైన్యం లేకపోతే శాలివాహనుడిది కుమ్మరి కులవృత్తి కాబట్టి తమ కులదేవత ’నాగేంద్ర స్వామి" మహిమతో అప్పట్టి కప్పుడు ’మట్టిబొమ్మలు " తయారు చేసి వాటికి ప్రాణం పోసి, ఆ బొమ్మల సైన్యం సహాయం తోనే యుద్దం చేసి, విక్రమాదిత్యుడిని ఓడించి "రాజ్యాధికారం" చేపట్టి మన జాతిని జనరంజకంగా పాలించాడట. ఆయన వంశమే తర్వాత "శాతవాహన వంశం" గా పేరుగాంచి నాలుగు వందల యేండ్లు తెలుగునాట రాజ్య పాలన చేసారు.
సంప్రదాయములు
మార్చుమన దేశములో కుమ్మరివారికి రెండు సంప్రదాయములు కలవు.
- గుండయ్య లేదా గుండ్య సంప్రదాయము
- శాలివాహన సంప్రదాయము
ఈ రెండింటిలో పౌరాణికమైనది గుండ్య సంప్రదాయం. కొంత చారిత్రికంగా భాసించేది శాలివాహన సంప్రదాయం. శివభక్తుడగు కుమ్మరి గుండయ్య కథ పాల్కురికి సోమనాథుని బసవ పురాణమున కలదు. సా.శ.12వ శతాబ్దమునాటిది. పాల్కురికి సోమనాథుడు జైన తీర్థంకరుల చరిత్రములు పురాణములు అను పేరున ఉండుట గమనించి, తన గ్రంథమునకు పురాణము అని పేరు పెట్టినాడు. దానికిని మన సంప్రదాయిక పురాణమునకు ఏసంబంధము లేదు. ఇందులో కుమ్మరికి సంబంధించిన పదములు వివరించబడినవి. రెండవది అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతి. ఇందు కుమ్మరి వృత్తికి సంబంధించిన పదజాలము మూడు పద్యములలో కలదు. శాలివాహన సంప్రదాయము ఇది అచ్చముగా చారిత్రకమే. శాలివాహనుడు బ్రాహ్మణ కన్యకు కుమ్మరి వలన జన్మించి, కుమ్మరుల కందరకును నాయకుడై, వారి సహాయమున - ఆకాలమున రాజైన విక్రమార్కుని జయించి, ఆరాజ్యమున వశపరచుకొని, రాజ్యమును పాలించి తన పేర శకమును నెలకొల్పెను. ఆ శకమునకే "శాలివాహన శకము" అను పేరు ఇది. క్రీ. శ. 78లో ప్రారంభమైనది. అంతకుముందు విక్రమార్కుని పేర-విక్రమార్క శకము వాడుకలో ఉండేది. ఈ శక కాలమునకే క్రీ.పూ.57 శాలివాహనుడు విక్రమార్కుని జయించి, రాజైన కాలమునుండియు, విక్రమశకము పోయి శాలివాహన శకము వ్యాప్తిలోనికి వచ్చినది.
శాలివాహనులు
మార్చు1995 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 28, బిసిడబ్ల్యు (ఎమ్‌ఐ) శాఖ, ప్రకారం శాలివాహన కులం కూడా కుమ్మరి కులంగా పరిగణించబడినది. భారతీయ శాసనాలు, ఇండోనేషియా, ఇండో చైనాలలోని ప్రాచీన సంస్కృత శాసనాలు ప్రకారం ఈ విషయం చెప్పబడింది. శాలివాహన శకాన్ని తెలియజేసే కాలెండరును భారత ప్రభుత్వం 1957 నుండి తొలగించింది. దీనిని కనిష్క మహారాజు స్థాపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు(ఆలం+ఊరు=యుద్దం జరిగిన ఊరు) దగ్గర శాతవాహనుడు విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన రాజ్యాన్ని స్థాపించాడని,శాతవాహనుడు కుమ్మరి కులస్తుడని ఒక నానుడి. బౌద్ధ సాహిత్యాన్ని బట్టి దక్షిణ దేశ చరిత్రను క్రీ.పూ 6వ శతాబ్దం నుంచి మనం అంచనా వేయవచ్చు. శాతవాహనులు రూపొందిన విధానం గురించి కె.కె రంగనాథాచార్యులు ఇలా విశ్లేషిస్తున్నారు.కోసల దేశానికి సంబంధించిన బావరి అనే బ్రాహ్మణుడు దక్షిణాపథానికి వచ్చి గోదావరీ తీరంలో అస్సక జాతివారు నివసించే ప్రాంతంలో స్థిరపడ్డాడు. అతను తన శిష్యులతో బాటు ఊంఛ వృత్తితో జీవించే వాడు. క్రమంగా ఒక గ్రామం వెలసింది. ఒక మహాయజ్ఞం కూడా నిర్వహించాడు. ముసలితనంలో తన శిష్యులను బుద్ధుడి దగ్గరకు పంపించి సందేహాలను తీర్చుకుని బౌద్ధుడయ్యాడు. బావరి దక్షిణానికి వచ్చిన తర్వాతనే దక్షిణదేశం ఆహారాన్ని సేకరించుకునే దశనుంచి అహోరోత్పత్తి చేసుకునే దశకు వచ్చివుండాలని చారిత్రకుల ఊహ. పైన పేర్కొన్న అస్సక జాతివారే తరువాత శాతవాహన వంశంగా రూపుదిద్దుకున్నారు. బావరి సాంప్రదాయంలో శాతవాహనులు బ్రాహ్మణులను గౌరవించి యజ్ఞాలు చేశారు. ( తెలుగు సాహిత్యం మరోచూపు, కె.కె.రంగనాథాచార్యులు పేజి: 2)--కత్తిపద్మారావు (విశాలాంధ్ర 25.7.2010)
1. 'సామ్రాజ్య ఐక్యత యుగం' ప్రకారం శాతవాహనులు చంద్రవంశ యాదవ వంశానికి చెందినవారు. 2.చరిత్రకారుడు 'డా.భండార్కర్ ప్రకారం, శాతవాహనులు యాదవులు. 3. జై నారాయణసింగ్ యాదవ్‌ల ప్రకారం 'యాదవోంక బహుత్ ఇతిహాస్' శాతవాహనులు చంద్రవంశ యాదవ్ వంశానికి చెందినవారు. 4. v.v.మిరాషి ప్రకారం, ఒక మరాఠా చరిత్రకారుడు శాతవాహనులు యాదవులకు చెందినవారు. 5 విష్ణు పురాణం, వాయు పురాణం, మత్స పురాణం, భాగవత పురాణంలో శాతవాహనుల గురించి ప్రస్తావించబడింది. పురాణాలలో యాదవులు 'వృషలా' అనే పదంతో సూచించబడ్డారు, శాతవాహనులను వృషలా కూడా పేర్కొన్నారు. 6.యాదవ వంశానికి చెందిన 'వృషల' పదం ద్వారా మౌర్య చంద్రగుప్తుడు కూడా సూచించబడ్డాడు. 7.ద్వారక అరేబియా సముద్రంలో మునిగిన తర్వాత పద్దెనిమిది మంది యాదవులను ద్వారక నుండి దక్షిణానికి 'అగస్త్యుడు' తీసుకువచ్చాడు. 8 ఆ శాఖలు 'అంధక, వృష్టి, భోజి మొదలైనవి... 9. శాతవాహనులు అంధక యాదవుల శాఖకు చెందినవారు. 10. 'అంధకులు' పాలించినందున ఆ రాష్ట్రానికి ఆంధ్ర ప్రదేశ్ అని పేరు పెట్టారు.
శాతవాహన యుగం
మార్చుశాలివాహన యుగం "శక యుగం"గా కూడా పిలువబడుతుంది. ఇది హిందూ కాలెండరులలో, భారతీయ జాతీయ కాలెండరు, బాలినేసె కాలెండరు, జవనీస్ కాలెండరు, కంబోడియన్ కాలెండరులలో వాడుతారు. ఈ యుగం యొక్క శూన్యం వెర్నల్ ఈక్వినాక్స్ సంవత్సరం యొక్క 78 నుండి సుమారు ప్రారంభమైనది.[ఆధారం చూపాలి]
పశ్చిమ క్షత్రపాస్ (35–405 BCE) దక్షిణ భారతదేశానికి (సౌరాష్ట్ర, మాల్వా నవీన గుజరాత్, దక్షిణ సింద్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేస్ లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక) పాలకులుగా ఉండేవారు. వీరు ఇండో-సైథియన్లు తరువాతి వారు. వారు శక యుగాన్ని ప్రారంభించారు.
శాతవాహన రాజు (గౌతమీపుత్ర శాతకర్ణి "శాలివాహన"గా పిలువబడేవాడు) శాలివాహన శకాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. సా.శ. 78లో ఆయన విజయానికి గుర్తిగా ఈ యుగాన్ని ప్రారంభించాడు. "శాలివాహన చక్రవర్తి" తెలుగు వారి తొలి చక్రవర్తి, "శక పురుషుడు" కూడా. తెలుగు పంచాంగ కాలెండర్ ఈయన జన్మ తేది ననుసరించే గుణించబడుతుంది. దీనినే భారత ప్రభుత్వం అధికారిక కాలెండర్ గా ప్రకటించింది.
ఒడయార్ కులం మైసూర్ రాష్ట్రంలో ప్రధానమైన కులం. మైసూర్ లో ఒడయారు సంస్థానం ఉండేది. మైసూరు ప్యాలెస్ లో యిప్పటికి కూడా బంగారు కుండను ఆనాటి పాలకుల నైపుణ్యానికి గుర్తుగా ఉంచబడింది. ఈ కులం యొక్క వివిధ శాఖలు ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశంలో విస్తరించినవి
ప్రముఖులు
మార్చు- శాలివాహన శాతకర్ణి చక్రవర్తి
- వుడయార్ మైసూర్ మహారాజు
- మొల్ల కవయిత్రి
- యల్లా వెంకటేశ్వరరావు మృదంగ విద్వాంసుడు