కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం సమీపాన ఉన్న ఒక వన్యప్రాణుల అభయారణ్యం.[2] ఇది మడ అడవులకు ప్రసిద్ధి. ఈ అడవులు దక్షిణ భారతదేశంలోవేగంగా అంతరించిపోతుండటంతో వీటిని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.[3]

కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
IUCN category IV (habitat/species management area)
Mangroves in Krishna Wildlife Sanctuary, Andhra Pradesh, India
Map showing the location of కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ పటంలో కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
ప్రదేశంఆంధ్రప్రదేశ్
సమీప నగరంమచిలీపట్నం
భౌగోళికాంశాలు15°46′27″N 80°56′39″E / 15.77417°N 80.94417°E / 15.77417; 80.94417[1]
విస్తీర్ణం194.81 km2 (48,140 acres)
పాలకమండలిఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ

భౌగోళికం మార్చు

ఇది 15° 2' N నుంచి 15° 55' N ఉత్తర అక్షాంశాల మధ్యన, 80° 42'- 81° 01' తూర్పు రేఖాంశాల మధ్యన కృష్ణా జిల్లాలో వ్యాపించి ఉన్నది. సొర్లగుండ, నాచుగుంట, ఎలిచెట్లదిబ్బ, కొత్తపాళెం, మోలగుంట, అడవులడివి, లంకివానిదిబ్బ అటవీ కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి.

జంతు, వృక్ష జాతులు మార్చు

కృష్ణా నది ఈ కేంద్రం లోని మడ అడవుల గుండా ప్రయాణిస్తుంది. ఈ అడవుల్లో అరుదుగా కనిపించే చేపలు పట్టే అడవి పిల్లులు (ఫిషింగ్ క్యాట్స్) అధిక సంఖ్యలో ఉన్నాయి.[4] తుమ్మ, మర్రి, రావి, మామిడి మొదలైన చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. గార్డెన్ లిజార్డ్, వాల్ లిజార్డ్, తాబేళ్ళు, అనేక రకాలైన పాములు కనిపిస్తాయి.

మూలాలు మార్చు

  1. "ATLAS OF MANGROVE WETLANDS OF INDIA" (PDF). Retrieved 2012-07-30.[permanent dead link]
  2. "APFD Website". Forest.ap.nic.in. Archived from the original on 2012-05-22. Retrieved 2012-07-30.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2016-10-23.
  4. "ఫిషింగ్ క్యాట్స్ వెబ్ సైటు". Archived from the original on 2015-10-21. Retrieved 2016-10-23.