కె.పి.జానకీ అమ్మాళ్

భారతీయ రాజకీయనేత

కె. పి. జానకి అమ్మల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు. [1] ఆమె 1967 లో తమిళనాడు శాసనసభలో మదురై తూర్పు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించింది.[2]

ప్రారంభ జీవితంసవరించు

ఆమె పద్మనాభం, లక్ష్మీ దంపతులకు 1917 లో ఏకైక కుమార్తెగా జన్మించింది. ఆమె ప్రారంభ జీవితం పేదరికంలో గడిచింది. ఆమె 8 సంవత్సరాల వయసులో ఆమె తల్లి మరణించింది. ఆమె అమ్మమ్మ పెంపకంలో పెరిగింది. సంగీతాన్ని అభ్యసించడానికి ఆమె ఎనిమిదవ తరగతిలో చదువు మానేసింది. నెలకు రూ .25 వేతనానికి ఆమె పళనియప్ప పిళ్లై బాయ్స్ కంపెనీలో చేరింది. తర్వాత ఆమె ప్రధాన నటిగా ఎదిగింది. ఆమె ఒక ప్రదర్శనకు 300 రూపాయలు సంపాదించేది. ఆమె ఎస్ఎస్ విశ్వనాథదాస్‌తో కలిసి వేదికపై, కుల వివక్ష, అంటరానితనం సమస్యతో ముడిపడి ఉండే నాటకాలలో నటించేది. [3]

జానకి అమ్మాళ్ తమ నాటక బృందంలోని హార్మోనియం వాద్యకారుడు గురుసామి నాయుడుని వివాహం చేసుకుంది. [3]

జీవిత విశేషాలుసవరించు

బ్రిటిష్ వారు అరెస్ట్ చేసిన మొదటి దక్షిణ భారత మహిళగా ఆమె గుర్తింపు పొందింది. ఆమె 1930 లో తిరునల్వేలిలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు మొదటిసారి అరెస్టయింది. ఒక సంవత్సరం జైలులో గడిపింది. [3] భారత రక్షణ నియమాల ప్రకారం, తిరుచ్చిలో యుద్ధ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నందుకు ఆమెను అరెస్టు చేశారు. [1] [4]

ఆమె వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం చేసిన క్రియాశీల రాజకీయ సభ్యురాలిగా గుర్తింపు పొందింది. [4] 1936 లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి, మదురై కాంగ్రెస్ కమిటీలో ఆఫీస్ బేరర్‌గా పనిచేసింది. తర్వాత ఆమె కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి మారింది. ఆమె 1940 లో భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరింది. పార్టీ చీలిపోయిన తర్వాత, ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)కు వెళ్లింది. [3]

జానకి అమ్మాళ్, పొన్మలై పాప ఉమనాథ్ తో కలసి 1974 లో తమిళనాడు డెమొక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ను స్థాపించారు. ఆ సంస్థకు ఆమె మాజీ అధ్యక్షురాలు అయింది. [3]

వ్యక్తిగత జీవితంసవరించు

ఎమర్జెన్సీ సమయంలో, ఆమె తన ఆభర ణాలు, పట్టు వస్త్రాలను విక్రయించి ఆహారం కోసం, పార్టీ కార్యకర్తల కోసం డబ్బును సేకరించింది. [3]

నిరంతరం అరెస్టుల కారణంగా, నిరంతరం శ్రమ వలన ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఆమె అస్తమా వ్యాధితో బాధపడుతూ 1992 మార్చి 1న మరణించింది..[3]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Madurai's very own freedom fighters". The Hindu. 23 July 2012. Retrieved 19 March 2014. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "A life of sacrifice". The Hindu. 6 March 2014. Retrieved 19 March 2014.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "A life of sacrifice". The Hindu. 6 March 2014. Retrieved 19 March 2014. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "A life of sacrifice" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "A life of sacrifice" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "A life of sacrifice" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "A life of sacrifice" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. 4.0 4.1 "Shodhganga" (PDF). ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు