కేవల్ ఆనందాదేవి
కేవల్ ఆనందాదేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) రాజకీయ నాయకురాలు. ఆమె మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి 1962లో ఎమ్మెల్యేగా గెలిచింది. ఆనందా దేవి, తెలంగాణ సాయుధపోరాట యోధుడు, ఉద్యమకారుడైన కేవల్ కిషన్‌రావు సతీమణి. 1960లో అనుమానాస్పద పరిస్థితుల్లో భర్త మరణించిన తర్వాత, ఆనందాదేవి, మెదక్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్ధి షామక్కగారి కొండల్‌రెడ్డిపై అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. ఆ తర్వాత 1964-65 విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమంలో, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసింది.[1]
కేవల్ ఆనందాదేవి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1962 - 1972 | |||
నియోజకవర్గం | మెదక్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | సి.పి.ఐ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
మూలాలు
మార్చు- ↑ "అలుపెరగని యోధుడు కిషన్". సాక్షి. 25 December 2013. Retrieved 17 August 2024.