కే. సీతారామారావు

కుసుంబ సీతారామరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌. ఆయన 2021, మే 21న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము వైస్ చాన్స్‌లర్‌గా నియమితుడయ్యాడు. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నాడు. ఆయన ఈ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా 2016 జూలై నుంచి 2019 జూలై వరకు పనిచేశాడు.[1][2][3]

కే. సీతారామారావు
Seethramarao.jpg
జననం
కుసుంబ సీతారామరావు

జాతీయత భారతదేశం
వృత్తిడాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌

జననం, విద్యాభాస్యంసవరించు

సీతారామారావు వరంగల్ జిల్లా హన్మకొండలో జన్మించాడు. ఆయన కాకతీయ విశ్వవిద్యాలయము నుండి 1977లో పీజీ, 1981లో ఎంఫిల్, 1999లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[4]

వృత్తి జీవితంసవరించు

సీతారామారావు 1978లో కాకతీయ యూనివర్సిటీలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితుడయ్యాడు. అనంతరం ఆయన ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది విభాగాధిపతిగా, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, సోషల్‌ సైన్స్‌ డీన్‌గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించాడు. సీతారామారావు 2015లో ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశాక, 2016లో అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు. ఆయన 2016 జూలై నుంచి 2019 జూలై వరకు మూడేళ్ల పాటు వీసీగా బాధ్యతలు నిర్వహించాడు.[5].ఆయన 2017లో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ బోధనా సిబ్బంది నియామకాల్లో పాటించాల్సిన విధానాలపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడిగా నియమితుడయ్యాడు.[6]ఆయన 2021, మే 21న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా తిరిగి రెండవసారి నియమితుడయ్యాడు.[7][8]

వైస్‌చాన్సలర్‌గా భాద్యతలుసవరించు

కే. సీతారామారావు 2021, మే 24న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[9]అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ప్రొఫెసర్ కే. సీతారామారావు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మే 27న మర్యాద పూర్వకంగా కలిశాడు.[10]

మూలాలుసవరించు

  1. Namasthe Telangana (22 May 2021). "10 వర్సిటీలకు సారథులు". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  2. The New Indian Express (23 May 2021). "After two years, 10 Telangana state universities finally get new Vice-Chancellors". The New Indian Express. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021. Missing |author1= (help)
  3. TV9 Telugu, TV9 (22 May 2021). "Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ - telangana government announced universities new vice chancellors". TV9 Telugu. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  4. Andhrajyothy (23 May 2021). "ఉప'కుల'పతులు". www.andhrajyothy.com. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  5. Telugu One India, Srinivas (28 July 2016). "మీకు అంత తొందరెందుకు: కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్". https://telugu.oneindia.com. Retrieved 28 May 2021. External link in |work= (help)
  6. Sakshi (17 July 2017). "వర్సిటీల్లో నియామకాలపై మరో కమిటీ". Sakshi. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  7. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  8. Eenadu (23 May 2021). "TS News: 10 వర్సిటీలకు కొత్త వీసీలు". EENADU. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  9. Namasthe Telangana (25 May 2021). "యూనివర్సిటీలలో 1,050 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తాం". Namasthe Telangana. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  10. Namasthe Telangana (27 May 2021). "మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన వీసీలు". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.