కొండమాల్

ఒడిశా లోని జిల్లా

ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో కొండమాల్ జిల్లా ఒకటి. ఫుల్బానీ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

కొండమాల్

କନ୍ଧମାଳ

Kandhamal
District
Jagannath temple in Phulbani, the headquarters of Kandhamal
Jagannath temple in Phulbani, the headquarters of Kandhamal
Location in Odisha, India
Location in Odisha, India
Country India
StateOdisha
HeadquartersPhulbani
ప్రభుత్వం
 • CollectorBhupender Singh Punia, IAS
 • Member of Lok SabhaRudra Madhab Ray, BJD
విస్తీర్ణం
 • మొత్తం8,021 కి.మీ2 (3,097 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
700 మీ (2,300 అ.)
జనాభా
(2011)[1]
 • మొత్తం7,31,952
 • సాంద్రత91/కి.మీ2 (240/చ. మై.)
Languages
 • OfficialOriya, English
 • Native TribalKui
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
762 0xx
వాహనాల నమోదు కోడ్OD-12
Sex ratio0.964 /
Literacy65.12%
Lok Sabha constituencyKandhamal
Vidhan Sabha constituency3, 102- Balliguda (S.T.), 103- G. Udayagiri (S.T), 104- Phulbani (S.C.)
ClimateAw (Köppen)
Precipitation1,587 milliమీటర్లు (62.5 అం.)
Avg. summer temperature40 °C (104 °F)
Avg. winter temperature5 °C (41 °F)
జాలస్థలిwww.kandhamal.nic.in

చరిత్రసవరించు

1994 జనవరి 1 న బౌధ్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి కొండమాల్ జిల్లా ఏర్పాటుచేయబడింది. గతంలో ఈ ప్రాంతం ఫుల్బానీ అని పిలువబడింది.

సాంఘిక అశాంతి, తిరుగుబాటుసవరించు

2007 డిసెంబరు 25న ఈ ప్రాంతంలో క్రైస్తవులు, హిందువులు, ఖొండ్ ప్రజలు, పనా జాతి ప్రజల మద్య అశాంతి చెలరేగింది. 2008 ఆగస్టు 23న విశ్వహిందూ పరిషద్ అధ్యక్షుడు స్వామి లక్ష్మణానంద సరస్వతిని మవోయిస్ట్ గన్‌మాన్ నలుగురు మనుషులతో కలిసి హత్యచేసాడు. మావోయిస్ట్ ఉద్యమకారులు హత్యలకు బాధ్యత వహించారు. ఈ సంఘటన హిందూ గిరిజనులు, క్రైస్తవ మిషనరీల మధ్య కలహానికి దారితీసింది. మావోయిస్ట్ ఎక్స్ట్రీమిస్టులలో క్రైస్తవులు అధికంగా ఉన్నారు. వారు హిందూ జాతీయవాదులను తమ శత్రువులుగా ప్రకటించారు.[2] హిందూ ఖొండ తెగ ప్రజలు, మతమార్పిడి చేయబడిన క్రైస్తవులలో పెద్ద ఎత్తున తిరుగుబాటుదారులను తయారుచేసింది. రాజకీయ, మత, సంప్రదాయ సరిహద్దులను చెరిపి వేస్తూ ఈ పోరాటం సాగింది.[3] భూమి ఆక్రమణలు కూడా ఉద్రిక్తలకు ఇతర కారణంగా భావించవచ్చు. 2010 ఏప్రిల్ మాసంలో ఫూల్‌బనిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక " ఫాస్ట్ ట్రాక్ " కోర్ట్ 150 మందిని ముద్దాయిలుగా నిర్ణయించింది.[4] 10 మంది మాత్రం సాక్ష్యాధారాలు లభించక నిర్ధోషులుగా విడుదల చేయబడ్డారు.ఈ జిల్లా ప్రస్తుతం " రెడ్ కార్పెట్‌"లో భాగంగానూ, మావోయిస్ట్ తిగుబాటు కార్యక్రమాలకు కేంద్రంగానూ ఉంది.[5]2010 మావోయిస్ట్ తిరుగుబాటు దారులుగా అనుమానిస్తున్న వారు " లాండ్ మైన్ " ఏర్పాటు చేసి అంబులెంసును పేల్చివేసారు. ఈ సంఘటనలో ఒక పేషంట్, ఒక పారా మెడికో విద్యార్థిమరియు వాహనచోదకుడు ప్రాణాలను కోల్పోయారు. [6]

భౌగోళికంసవరించు

కొండమాల్ జిల్లా 19-34° ఉత్తరం నుండి 20-54° అక్ష్క్షాంశం, 83.30°తూర్పు నుండి 84-48° తూర్పు డిగ్రీల రేఖాంశం లోనూ ఉంది. జిల్లాలో బలిగుడ, జి. ఉదయగిరి, తికబలి, రైకియా మొదలైన ప్రబలమైన ప్రదేశాలు ఉన్నాయి.

 • జిల్లాలో అధికభూభాగం గ్రామీణ ప్రాంతం. జలపాతాలు, సెలయేర్లు, పురాతనమైన, చారిత్రకమైన ప్రదేశాలు ఉన్నాయి.
 • 'ఏరియా 8.021 చ.కి.మీ.
 • 'ఎత్తు' 300 1100 మీటర్
 • 'వర్షపాతం'
 • 'వాతావరణ' కనీస ఉష్ణోగ్రత (డిసెంబర్), గరిష్ట ఉష్ణోగ్రత (మే) 35 సెంటిగ్రేడ్.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 731,952,[1]
ఇది దాదాపు. గయానా దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమానం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 497వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 91 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.92%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 1037:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 65.12%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అల్పం

కొండమాల్ జిల్లాలో ఒరియా ఇంకా కోండు తెగ వాళ్ళ భాష అయిన కుయి భాషలు అత్యధికంగా వాడుకలో ఉన్నాయి. జిల్లాలో తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

సంస్కృతిసవరించు

పండుగలుసవరించు

కొండమాల్ జిల్లా ప్రజలు అన్ని హిందూ పండుగలను జరుపుకుంటారు. గిరిజన ప్రజలు ప్రధానంగా దండా నృత్యం చేస్తుంటారు. గిరిజనులు ఈ ఉత్సవాన్ని 13 రోజుల పాటు నిర్వహిస్తారు. తమజీవితాలలో సౌభాగ్యం అభివృద్ధి కావాలని కోరుకునే గిరిజనులు 13 రోజుల పాటు ఉపవాస దీక్ష వహిస్తారు. ఈ పండుగ ఏప్రిల్ 1వ తారీఖు నుండి ప్రారంభించి 13 తారీఖున పూర్తిచేస్తారు. ఈ పండుగ పరిపూర్తి ఉత్సవాన్ని " మెరు " అంటారు. జనవరి మాసంలో కొండాలు తమతమ గ్రామాలలో పంటకాలం ముగిసిన తరువాత ఈ పూజను నిర్వహిస్తారు. ఈ పూజను " సిసా లక " అంటారు. మార్చి మాసంలో గ్రామదేవతలు దామి పెను, పర్వత దేవత సారు పెను లను ఆరాధిస్తారు. మొహులా పూలు, మామిడి పండ్లు, అరణ్య ఉత్పత్తులు సురక్షితంగా సేకరించడానికి ఈ పూజను నిర్వహిస్తారు. దేవతలను పూజించిన తరువాత వారు వారి ఆహారం మొదలైన నిత్యావసరాలకు మాత్రమే అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. ఏప్రిల్ మారియు మే మాసాలలో గ్రామదేవతకు మొహులాపూల రొట్టెలను నివేదన చేస్తారు. దీనిని " మరంగ లక " అంటారు. ప్రత్యేక సందర్భాలలో గిరిజనులు భూమాతకు " కెడు లక " పూజను నిర్వహిస్తారు. ఈ పండుగ సమయాన్ని ప్రాంతీయ పూజారి " కూట గటంజు " నిర్ణయిస్తాడు. పంటకోత పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తరువాత భూమాతకు కృతఙత తెలిపే విధంగా పూజ నిర్వహిస్తారు. ఈ పూజను ప్రాంతీయ పురోహితుడు " జకేరా " గ్రామదేవత వద్ద నిర్వహిస్తాడు. ఈ పూజను " బొరా లక " అంటారు. ఈ పూజను సెప్టెంబరు - అక్టోబరు మాసాలలో నిర్వహించబడుతుంది. నవంబరు-డిసెంబరు మాసాలలో కొత్త పంట ఇంటికి వచ్చిన తరువాత చుడా, బియ్యం తయారుచేసి ఖిరి తయారుచేసి గ్రామదేవతకు నివేదన చేసి అందరూ ప్రసాదాన్ని తీసుకుంటారు. ఒడిషా పశ్చిమభాగంలో ఇదే విధానాన్ని నౌఖై పండుగ సందర్భాలలో ఆచరిస్తారు.

పర్యాటక ఆకర్షణలుసవరించు

బలస్కుంపసవరించు

కొండమాల్ జిల్లా ఆగ్నేయంలో ఫూల్బనీ ఉపవిభాగంలో 20-25’ఉత్తర అక్షాంశం, 84-21 తూర్పు రేఖాంశంలో ఉంది. బలస్కుంప గ్రామం ఉంది. ఇది కొండలలోని రెండు శెలయేర్ల మద్య ఉంది. ఈ సెలఏర్లు సల్కి నదిలో సంగమిస్తున్నాయి. గ్రామంలో చిన్న గుడి ఉంది. ఇక్కడి ప్రధాన గ్రామదేవత కొండమాల్. ప్రతి సంవత్సరం అస్విని మాసం శుక్లపక్షంలో (సెప్టెంబరు- అక్టోబరు) ఈ గ్రామదేవతకు ఉత్సవాలు నిర్వహిస్తారు. జిల్లాకేంద్రం ఫుల్బానీ పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి రహదారి మార్గంలో చేరుకోవచ్చు.

బెల్ఘర్సవరించు

బెల్ఘర్ సముద్రమట్టానికి 2,000 అడుగుల ఎత్తున ఉంది. ఇది బెల్గుడా ఉపవిభాగంలో ఉంది. ఇది బల్లిగూడాకు 70కి.మీ దూరం, ఫుల్బానీకి 155 కి.మీ దూరంలో ఉంది. ఇది రహదారితో అనుసంధానితమై ఉంది. పర్వతాలు, ప్రకృతిదృశ్యాలు, వన్యమృగాలతో ఉన్న సహజసౌందర్యం కలిగిన ప్రాంతమిది. ఇక్కడ ప్రత్యేకంగా ఏనుగులు అధికంగా ఉన్నాయి. కుటియా కంధాల స్వంత ప్రాతం (హోంలాండ్) అని విశ్వసిస్తున్నారు. కుటియా కంధాలు ఈ ప్రాంతానికి చెందిన ఆదిమవాసుల వారసులని విశ్వసిస్తున్నారు. ఇక్కడ చెక్కతో నిర్మించిన అటవీశాఖ పర్యవేక్షణ భవనం ఉంది. సూర్యశక్తిని ఉపయోగించి ఈ భనానికి దీపాలను వెలిగిస్తున్నారు. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న ఉషాబలి అరుదైన సౌందర్యం కలిగిన హిల్ స్టేషంగా గుర్తించబడుతుంది. ఒక్కోసారి గుంపులు గుంపులుగా నెమళ్ళు రహదారి పక్కన కనిపిస్తుంటాయి. వీటిని ఏనుగులు తరిమికొడుతుంటాయి.

చకపాడ్సవరించు

చకపాడ్ సముద్రమట్టానికి 243.84 అడుగుల ఎత్తున ఉంటుంది. ఇది జి.ఉదయగిరి తాలూకాలో ఉంటుంది. ఈ ప్రాంతంలో కొలువైన దైవం బిరూపాఖ్యుడు (శివుడు). ఇక్కడ చరిత్రాత్మకమైన బ్రుతంగ నది ప్రవహిస్తుంది. వృక్షాలమద్య ఉన్న శివాలయంలోని శివలింగం దక్షిణ ముఖంగా ఉంటుంది.

అండేశ్వర్, జోగేశ్వర్సవరించు

అండేశ్వర్, జోగేశ్వర్ ఆలయంలో శివరాత్రి నాడు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. దట్టమైన అరణ్యాల మద్య ప్రకృతి సౌందర్యం అలరారే ప్రదేశంలో ఈ ఆలయం ఉపస్థితమై ఉంది.

ఆర్య గురుకుల ఆశ్రమంసవరించు

ఆర్య గురుకుల ఆశ్రమం (వేదవ్యాస్) సుందర్ఘర్ జిల్లా ఇక్కడ " బనబాసి కల్యాణ్ ఆశ్రమం " పేరిట ఒక ఆశ్రమం స్థాపించింది. ఆశ్రమవాసులు అధికంగా ఆదిమవాస సంతతికి చెందిన బాలురే. వీరికి సాధారణ విద్య, శారీరక వ్యాయామ శిక్షణ, వేదాధ్యయనం " నేర్పబతాయి. ఇది ఫుల్బానీ ప్రాంతానికి 70కి.మీ దూరంలో ఉంది. ఈ ఆశ్రమాన్ని స్వామి లక్ష్మణానంద్ సరస్వతి స్థాపించాడు. ఆయన ఆదిమవాసుల అభిమాన పాత్రుడు, మంచి ఉపన్యాదకుడు. 2008 ఆగస్ట్ మాసంలో నక్సలైట్ల చేతిలో ఆయన మరణించాడు.

డారింగ్బాడిసవరించు

డారింగ్బాద్ సముద్రమట్టానికి 3,000 అడుగుల ఎత్తున ఇంది. ఇది బల్లింగుడా ఉపవిభాగంలో ఉంది. ఇది ఫుల్బానీ నుండి 105కి.మీ దూరంలో ఉంది. బరంపురం నుండి ఇక్కడకు నేరుగా చేరుకోవచ్చు. ఉష్ణోగ్రతలు తక్కుగా ఉండడం కారణంగా ఇక్కడ వేసవిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. డారింగ్బాడి వద్ద పర్వతవీక్షణం (హిల్ వ్యూ) కేంద్రం ఉంది. పర్యాటకులు ఇక్కడి నుండి పర్వతాలను లోయలను చూసి ఆనందించవచ్చు. పర్యాటకులు బసచేయడానికి డారింగ్బాడి వద్ద ఒక టూరింగ్ కాంప్లెక్స్ నిర్మించబడింది. ఇక్కడ విస్తారంగా ఉన్న కాఫీ ప్లాంటేషన్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. డారింగ్బాడిలో సంవత్సరమంతా పర్యటనకు అనుకూల వాతావరణం ఉంటుంది.

డుంగిసవరించు

డుంగి ఫుల్బానీ నుండి 45కి.మీ దూరంలో ఉంది. ఇది ఫుల్బానీ- బరంపురం రహదారి మార్గంలో జి.ఉదయపూర్ తాలూకాలో ఉంది. కొండమాల్ జిల్లాలోని ఒకేఒక ఆర్కియాలజికల్ ప్రాంతం ఇదే. ఇక్కడ 11వ శతాబ్ధానికి చెందిన ఒక బౌద్ధవిహారం ఉందేది. అది శిధిలం అయిన తరువాత ఆప్రదేశంలో ఒక శివాలయం నిర్మించబడింది. కొత్తా ఆలయం నిర్మించబడుతున్న సమయంలో త్రవ్వకాలలో లభించిన అవశేషాలు ఆలయ ప్రాంగణంలో ఉంచబడ్డాయి. ఒక బుద్ధుని విగ్రహం " ఒడిషా స్టేట్ మ్యూజియానికి " తరలించబడింది. ఇది భువనేశ్వర్ సమీపంలో ఉంది.

జలేస్పేటసవరించు

జలేస్పేట ఫుల్బానీ నుండి 127 కి.మీ దూరంలో తుముడిబంథ్ సమీపంలో ఉంది. వేదాంతకేశరి స్వామీ లక్ష్మణానంద్ సరస్వతి ఇక్కడ " శంకరాచార్య కన్యాశ్రమం " నిర్మించాడు. ఇక్కడ గిరిజన బాలుకల కొరకు " రెసిడెంషియల్ సాంస్క్రీట్ స్కూల్ " (ఆశ్రమ సంస్కృత పాఠశాల) ఉంది. జన్మాష్టమీ రోజున స్వామీ లక్ష్మణానంద్ సరస్వతి అమానుషంగా హత్యచేయబడ్డాడు.

కళింగ లోయసవరించు

జిల్లాకేద్రం ఫుల్బని నుండి కళింగ లోయ 48కి.మీ దూరంలో ఫుల్బానీ - బరంపురం మార్గంలో ఉంది. కళింగ లోయ దాష్పల్లా సమీపంలో ఉంది. ఈ లోయ సిల్వి కల్చర్, మెడిసినల్ ప్లాంట్ కల్టివేషన్‌లకు ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. సిల్వికల్చర్ తోటలో రబ్బర్ మొక్కలు, మనిషి మందం ఉండే వెదురు మొక్కలు ఉన్నాయి. ఈ తోట మనసుకు మెదడుకు ఆహ్లాదం కలిగించే సువాసనతో ఉంటుంది.

లుడుసవరించు

లుడు బల్లిగుడా కోటఘర్ మండలం నుండి 100కి.మీ దూరంలో, ఫుల్బానీ నుండి 150కి.మీ దూరంలో ఉంది. ఇది ఏనుగులు అధికంగా నివసిస్తున్న దట్టమైన అరణ్యం మద్య ఉంది. ఇక్కడి నుండి ఒక కాలిబాట సుబర్నగిరి వరకు ఉంది. ఇక్కడ 100 అడుగుల ఎత్తైన జలపాతం ఉంది.

మందసరు కుటిసవరించు

మందసరు కుటి ఫుల్బానీ నుండి 100కి.మీ దూరంలో రైకియా మండలంలో ఉంది. ఇక్కడ ఊరికి వెలుపల పర్వతాలమద్య ఒక చర్చి ఉంది.

పకదఝర్సవరించు

పకదఝర్ ఫుల్బానీ నుండి 30కి.మీ దూరంలో సుద్రుకుంప గ్రామంలో ఫుల్బానీ- బౌధ్ రహదారి మార్గంలో ఉంది. ఇక్కడ సహజమైన అరణ్యనేపథ్యంలో 60 అడుగుల ఎత్తైన జలపాతం ఒకటి ఉంది. ఇక్కడ నుండి సుద్రుకుంప వరకు ఒక కాలిబాట ఉంది. సమీపకాలంలో రహదారి మార్గం సుగమం చేసిన తరువాత ఈ ప్రాంతానికి పర్యాటకులు వనవిహారం కొరకు అధికంగా వస్తున్నారు. నవంబర్ - ఫిబ్రవరి వరకు ఇక్కడకు పర్యాటకులు అధికంగా వస్తుంటారు.

పుతుడిసవరించు

పుతుడి ఫుల్బని నుండి 18 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ దట్టమైన అరణ్యం మద్య 100కి.మీ ఎత్తైన జలపాతం ఉంది. జలపాతానికి చేరడానికి కాలిబాట ఉంది. సలుంకి నదిమీద ఉన్న ఈ జలపాతం చలనచిత్ర చిత్రీకరణకు అనుకూలప్రాంతం.

ఋషిమల్సవరించు

ఋషిమల్ డారింగ్బాడి నుండి 50 కి.మీ దూరంలో తమంగి గ్రామం సమీపంలో ఉంది. ఇక్కడ ఉన్న ౠషిమల్ కొండలలో ౠషికుల్యా నది జన్మించింది. ౠషికుల్యా నదీ జలాలతో " ౠషికుండ " రిజర్వాయర్ ఏర్పడింది. కొండమీద " ఋషిగుంఫా " అనే గుహ ఉంది. ఈ ప్రాంతం బారుణియాత్రకు ప్రసిద్ధి చెందింది.

ఉర్మగడసవరించు

ఉర్మగడ ఫుల్బానీ నుండి 17 కి.మీ దూరంలో ఫుల్బానీ- గొచపడ రహదారి మార్గంలో ఫుల్బానీ తాలూకాలో ఉంది. ఇక్కడ ఉన్న జలపాతం ఎత్తు 50అడుగులు. ఈ జలపాతం చేరడానికి కాలిబాట ఉంది. ఇది దట్టమైన అరణ్యం మద్యన ఉంది.

ప్రయాణ సౌకర్యాలుసవరించు

వాయుసవరించు

సమీపంలో ఉన్న విమానాశ్రయం భువనేశ్వర్ వద్ద ఉంది. ఫుల్బానీ పట్టణానికి 5కి.మీ దూరంలో గుడారి వద్ద " ఎయిర్ స్ట్రిప్ " ఉంది. ఇక్కడ చిన్నతరహా విమానాలు దిగడానికి అవసరమైన సదుపాయాం ఉంది.

రైలుసవరించు

రైరఖొలి వద్ద రైల్వే స్టేషను ఉంది. ఈ రైల్వే స్టేషను సంబల్పూర్ - భువనేశ్వర్ రైలు మార్గంలో ఉంది. ఇది ఫుల్బానీ నుండి 99 కి.మీ దూరంలో ఉంది. బరంపురం రైలు స్టేషను మరొక వసతిగా భావించవచ్చు.

రహదారిసవరించు

సంబల్పూర్ నుండి బౌధ్ మీదుగా 170 కి.మీ దూరం ప్రయాణించి జిల్లాకేంద్రానికి చేరుకోవచ్చు. ఇక్కడి నుండి బరంపురం 165 కి.మీ దూరంలో, భువనేశ్వర్ 210కి.మీ దూరంలో, బొలంగిర్ 170 కి.మీ దూరంలో ఉంది. జిల్లాలో పర్యాటక బసులు ఏమీ లేవు. బాడుగ టక్సీలు లభిస్తుంటయి. కొండమాల్ జిల్లలో రైలుమార్గం లేదు.

ఆరోగ్యం సౌకర్యాలుసవరించు

 • జిల్లాలో ఐదు ఆసుపత్రులు ఉన్నాయి:
 • జిల్లా కేంద్రం ఆస్పత్రి, ఫుల్బాని.
 • ప్రభుత్వ ఆసుపత్రి, బల్లిగూడా
 • ప్రభుత్వ ఆసుపత్రి, జి ఉదయగిరి.
 • ప్రభుత్వ ఆసుపత్రి, తికబలి .
 • ప్రభుత్వ ఆసుపత్రి, దరింగిబది.
 • ప్రభుత్వ ఆసుపత్రి, ఫిరింగియా .
 • ప్రభుత్వ ఆసుపత్రి, తుముదిబంధ .

రాజకీయాలుసవరించు

అసెంబ్లీ నియోజకవర్గాలుసవరించు

The following is the 3 Vidhan sabha constituencies[9][10] of Kandhamal district and the elected members[11] of that area

No. Constituency Reservation Extent of the Assembly Constituency (Blocks) Member of 14th Assembly Party
82 బలిగుడా షెడ్యూల్డ్ తెగలు Baliguda, K. Nuagam, Kotagarh, Tumudibandh Karendra Majhi బి.జె.పి
83 జి. ఉదయగిరి షెడ్యూల్డ్ తెగలు రైకియా, దరింగ్బది, జి.ఉదయతిరి, తికబలి, జి.ఉదయతిరి (ఎన్.ఎ.సి) మనోజ్ కుమార్ ప్రధాన్ బి.జె.పి
84 ఫుల్బానీ షెడ్యూల్డ్ తెగలు చకపద, ఫుల్బానీ, ఖజురిపద, ఫిరింగియా, ఫుల్బానీ (ఎన్.ఎ.సి) దేబేంద్ర కంహర్ బి.జె.డి

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. The Hindu
 3. "India's remote faith battleground". BBC News. 26 September 2008.
 4. Sib Kumar Das (1 April 2010). "7 sentenced in Kandhamal riots cases". Chennai, India: The Hindu.
 5. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17.
 6. "Report: Suspected rebels kill 3 in eastern India". London: The Guardian. 28 November 2010.
 7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guyana 744,768 line feed character in |quote= at position 7 (help)
 8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Alaska 710,231 line feed character in |quote= at position 7 (help)
 9. Assembly Constituencies and their EXtent
 10. Seats of Odisha
 11. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME Check date values in: |archive-date= (help)

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కొండమాల్&oldid=3398824" నుండి వెలికితీశారు