కొండాజీ,గాబాజీ,తుకారాం

కొండాజీ ,గాబాజీ ,తుకారాం

కొండాజీ ,గాబాజీ ,తుకారాం అనే ముగ్గురు సోదరులు బాబాను శ్రద్ధతో సేవించేవారు . వీరు వడ్రంగి పని చేస్తూ జీవనం సాగించేవారు . ఒకసారి బాబా నివసించే మసీదు బాగా పాతదైపోయింది . దానిని మరమత్తు చేయించాలని భక్తలు నిర్ణయించారు . ఆ పనులలో ఈ సోదరులు ముగ్గురు ఎంతో భక్తితో సేవ చేశారు . అంతేకాదు ,అబ్దుల్లా అనే భక్తుడు బాబా దగ్గరకు వచ్చే వరకు వీరే మసీదులో అన్ని పనులూ చేసేవారు . మసీదు చిమ్మడము ,పాత్రలు తోమడము ,సాయికి స్నానానికి నీళ్ళు సిద్ధం చేయడమూ వంటి సేవలు తుకారామే చేసేవాడు . సాయి కూడా మరెవ్వరికీ ఆ అవకాశం ఇచ్చేవారు కాదు . శ్రీ రామనవమికి జండాలను ఊరేగిస్తారు కదా !వాటిని ఇప్పుడు కూడా వారిళ్ళవరకూ తీసుకువెళతారు . అలా వారు శ్రీ సాయి చరిత్రలో చిరస్ధాయిగా నిలిచారు .