కొత్తగా మా ప్రయాణం

కొత్తగా మా ప్రయాణం 2019, జనవరి 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమణ మొగిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంత్, యామిని భాస్కర్, భాను, కారుణ్య చౌదరి, జీవ ముఖ్యపాత్రల్లో నటించగా, రాజేంద్ర భరద్వాజ్ స్క్రీన్ ప్లే,మాటలు అందించాడు. నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ & శ్రీనిధి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కుమార్ రొడ్రీగ్ సంగీతం,అరుణ్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.[1][2]

కొత్తగా మా ప్రయాణం
దర్శకత్వంరమణ మొగిలి
రచనరాజేంద్ర భరద్వాజ్
తారాగణంప్రియాంత్
యామిని భాస్కర్
ఛాయాగ్రహణంఅరుణ్ కుమార్
కూర్పున‌ంద‌మూరి హ‌రి
సంగీతంకార్తీక్ కుమార్ రొడ్రీగ్
నిర్మాణ
సంస్థ
నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్
విడుదల తేదీ
25 జనవరి 2019
సినిమా నిడివి
136 నిమిషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

కథ మార్చు

కార్తీక్ (ప్రియాంత్‌) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి, వీక్ ఎండ్స్ లో అమ్మాయిలతో పబ్బులకు,లాంగ్ డ్రైవ్స్ కు తిరుగుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఆఫీస్ లో కోతగా చేరిన కీర్తి (యామిని భాస్కర్)ను చూసి ఇష్టపడతాడు.అయితే ప్రేమా పెళ్లి పై అస్సలు నమ్మకం లేని కార్తీక్, కీర్తితో కలిసి సహాజీవనం చేద్దామని ఆమె వెంట పడుతూ ఉంటాడు. మనిషి మంచోడే కానీ మెంటాల్టీనే తేడా అనుకుని కార్తీక్ కి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటుంది కీర్తి. ఈక్రమంలో స్నేహితురాలు పవిత్ర (భాను) భర్త (గిరిధర్) వల్ల పడే భాధను చూసి పెళ్లి స్త్రీ స్వేచ్ఛను హరిస్తుందని బావిస్తోంది. కీర్తికి కూడా వివాహం పై సదాభిప్రాయం పోతుంది.దాంతో కార్తిక్ తో సహాజీవనం చెయ్యడానికి అంగికరిస్తోంది. ఒకరిమీద ఒకరికి అధికారం లేకుండా ఎవరి పనూలు వారే చేసుకుంటూ ఎవరి ఖర్చులు వారే భరిస్తూ భార్యా భర్తల్లా బ్రతికేస్తుంటారు.కాలక్రమేణా జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వస్తాయి. వాటికీ తోడు ఆ తర్వాత జరిగే కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఇద్దరు విడిపోతారు.సంతోషంగా లేకపోవడమే దుఃఖానికి మూలం అని భావించే కార్తీక్ గతంలో మాదిరే లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ప్రయత్నించి విఫలమవుతాడు. కార్తీక్ ఆలోచనలన్నీ కీర్తి చుట్టే తిరుగుతుంటాయి.ఆసమయంలో స్నేహితుడు(విజయ్ సాయి)కలిసి ‘మనం ఒకరిగురించి మర్చిపోలేక పోవడమే ప్రేమ’ అని తెలియ చేస్తాడు. కీర్తి లేకపోతె జీవితమంతా దుఃఖమే మిగులుతుందని హెచ్చరిస్తాడు.ఆ తరువాత కార్తీక్ కీర్తి ని ఎలా కలిసాడు ? అభిప్రాయ భేదాలను ఇద్దరూ ఎలా సాల్వ్ చేసుకున్నారు ? అన్నదే చిత్రం తదుపరి కథ.చివరికి ఇద్దరు మనుషులను రెండు మనసులను కలిపి ముడివేసేది మంగళసూత్రం అని తెలుసుకున్న కార్తీక్ కీర్తి పెళ్లితో మొదలు పెట్టిన జీవితమే‘కొత్తగా మా ప్రయాణం.[3]

తారాగణం మార్చు

  • ప్రియాంత్ (కార్తీక్‌ )
  • యామిని భాస్కర్(కీర్తి)
  • భాను (పవిత్ర)
  • గిరిధర్
  • విజయ్ సాయి (తెలుగు హాస్యనటుడు)
  • కారుణ్య చౌదరి (సులోచన )
  • జీవా
  • జాకీ
  • సారికా రామచంద్రన్
  • పద్మ జయంతి
  • సాయి
  • FM బాబాయి

సంగీతం మార్చు

ఈ చిత్రానికి సాహిత్యం కరుణాకర్ అందించగా కార్తీక్ కుమార్ రొడ్రిగో స్వరాలు,సునీల్ కశ్యప్ నేపధ్య సంగీతం అందించారు.ఈ సంగీతాన్ని ఆదిత్య మ్యూజిక్ కంపెనీ 22 డిసెంబర్ 2018 న విడుదల చేసింది.[4]

సం.పాటSinger(s)పాట నిడివి
1."జై భోలో"హేమచంద్ర3:42
2."కొత్తగా నీతో"లిప్సిక4:17
3."గుండెల్లో దాచలేని"హేమచంద్ర, మనీషా ఈరబతిని3:20
4."తెలిసిందే నాధని నేరం"అనురాగ్ కులకర్ణి3:17

విమర్శకుల మాటలలో మార్చు

"టాలీవుడ్ నెట్ 3/ 5 రేటింగు ఇస్తూ ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియాంత్‌ నటన పరంగా ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఎంతో అనుభవం ఉన్న నటుడిలా ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా ఫ్రెండ్స్ తో సాగే సన్నివేశాల్లో గాని, అలాగే హీరోయిన్ తో సాగే రొమాంటిక్ సన్నివేశాల్లో గాని.. ప్రియాంత్‌ నటన ఆకట్టుకుంటుంది. ఇక ఎక్కువుగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే కీర్తి పాత్రలో నటించిన హీరోయిన్ యామిని భాస్కర్ తన నటనతో పాటు, రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు, క్లైమాక్స్ లో ఆమె నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించిన భాను బాధ్యత గల భార్యగా, కథలో కాస్త సీరియస్ నెస్ తో పాటుగా.. కాస్త సెంటిమెంట్ ను కూడా పండించే ప్రయత్నం చేసింది. ఇక మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో బాగానే చేశారు. దర్శకుడు కథలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో ఆకట్టుకున్నే ప్రయత్నం అయితే చేసాడు అని తెలిపింది.[5]

మూలాలు మార్చు

  1. " ప్రొడక్షన్ క్రెడిట్స్ Archived 2020-06-14 at the Wayback Machine, ‘’సినిస్తాన్. Retrieved july 10 2020.
  2. సక్సెస్‌ఫుల్ ప్రయాణం,‘’ఆంధ్రభూమి’’. 4 February 2019. Retrieved july 10 2020.
  3. "కొత్తగా మా ప్రయాణం సమీక్ష,‘’123తెలుగు’’.Jan 26, 2019. Retrieved july 10 2020.
  4. "కొత్తగా మా ప్రయాణం పాటలు,‘’ఆదిత్య మ్యూజిక్ యు ట్యూబ్ చానెల్ ’’.Retrieved july 10 2020.
  5. యువతకు నచ్చే కొత్తగా మా ప్రయాణం Archived 2020-07-08 at the Wayback Machine,‘’టాలీవుడ్ నెట్ ’’. Jan 26, 2019. Retrieved july10 2020.

ఇతర లంకెలు మార్చు

|