ప్రధాన మెనూను తెరువు

దివాన్ బహద్దూర్ కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తినాయుడుగారు 20వ శతాబ్దారంభంలో కాకినాడకు చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త, సాంఘిక సేవకుడు, రాజకీయవేత్త. ఆయన కాకినాడ పురపాలక సంఘానికి అధ్యక్షునిగా దాదాపుగా 13 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా పనిచేశారు.[1]

కుటుంబంసవరించు

కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తినాయుడుగారు అత్యంత సంపన్నమైన సుప్రసిద్ధ తెలగా కుటుంబంలో జన్మించారు. వీరి ముత్తాత శ్రీ కొమ్మిరెడ్డి బుచ్చెన్న నాయుడుగారు బందరు లో స్థిరపడెను వీరి పూర్వీకులు కర్నూలు ప్రాంతాన్నుండి వచ్చినారు. సూర్యనారాయణమూర్తినాయుడుగారి తాత కొమ్మిరెడ్డి వెంకన్ననాయుడుగారు బందరు నుంచి ఫ్రెంచి పరిపాలిత ప్రాంతమైన యానాంకు 19వ శతాబ్ది మొదట్లో వలసవచ్చారు. లెనారం అనే ఫ్రెంచి వ్యాపారవేత్త, వర్తకసంఘాధ్యక్షునికి తెలుగు రాకపోవడంతో అతనికి తెలుగు-ఫ్రెంచి దుబాసీగా పనిచేశారు. ఆయన కుమారులలో ఒకరైన నరసింగరావునాయుడు కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తినాయుడుగారి తండ్రి. నరసింగరావు నాయుడుగారు మొదట్లో అక్కౌంట్ల విభాగంలో ఉద్యోగిగా పనిచేసి అనంతర కాలంలో ఉద్యోగం వదిలి వ్యాపారములో ప్రవేశించి ఫ్రెంచివారితో కలిసి వ్యాపారాలు చేసి వ్యాపారవేత్తగా నిలదొక్కుకున్నారు. ఆయన యానాం పరిసర ప్రాంతాల్లోని రేవుల నుంచి వ్యాపార వ్యవహారాలు మందగించి, కాకినాడకు వ్యాపారపరంగా ప్రాముఖ్యత పెరుగుతూండడంతో ఆయన కాకినాడలో స్థిరనివాసం ఏర్పరుచుకుని, అక్కడ వ్యాపారాలు చేశారు.[1]

వాణిజ్యరంగంలోసవరించు

రాజకీయ రంగంలోసవరించు

  1. 1.0 1.1 బుద్ధవరపు, పట్టాభిరామయ్య (1927). కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారి జీవితము (PDF). రాజమండ్రి. Retrieved 11 April 2015.