కొలను పాక భాగవతులు

(కొలనుపాక భాగవతులు నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర ప్రాంతంలో వున్న గంటె భాగవతులకూ, తెలంగాణా గంటె భాగవతులకు వ్యత్యాసం ఉంది. ఈ గంటె భాగవతులు కరీంనగర్ జిల్లా కొలను పాకలో ఉన్నారు. వీరి ప్రదర్శనమూ రాత్రి పూటే జరుగుతుంది. వీరి ప్రదర్శన సాహిత్యం అంతగా తెలియక పోయినా, వీరి ప్రదర్శనం మాత్రం ప్రాముఖ్యంగా ప్రదర్శిచ టానికి ఈ గరిటెలను ఉపయోగిస్తారు. వీరి ప్రదర్శనంలో వచ్చే ప్రతి పాత్ర ధారి చేతిలోనూ ఒక గరిటె వుంటుంది. అందులో చమురు పోసి వత్తి వేసి వెలిగిస్తారు. ప్రతి పాత్ర యొక్క హావ భావాలూ, ఆంగిక చలనాలు,, ఈ గరిటె వెలుతురు వల్ల ప్రేక్షకులకు విశదంగా వెల్లడౌతాయి. మధ్య మధ్య నటనను సాగిస్తూ గంటెల లోని వచ్చిని ఎదగోస్తూ వుంటారు. ఈ వత్తుల వెలుగురు వల్ల ముఖంలో ప్రతి బింబించే సాత్వికాభినయానికి ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తారు. ప్రాచీనులు ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరించే వారు. అంటే ఆ నాటికే ముఖాభి నాయనానికే ఎక్కువ ప్రాధాన్య ఇచ్చి నట్లు మనం తెలుసుకోవచ్చు. ప్రతి వారి చేతిలోను గరిటె వుంటుంది కాబట్టి, ఆ గరిట ప్రాముఖ్యంతోనే నాటకాలను ప్రదర్శిస్తారు. అందుకే వారిని గరిటె భాగవతులనీ, గంటె భాగవతులనీ పేరు వచ్చింది.

సూచికలు మార్చు

యితర లింకులు మార్చు