కోడిపుంజు (2011 సినిమా)

కోడిపుంజు 2011లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్‌పై ఎస్.ఎస్. బుజ్జిబాబు నిర్మించిన ఈ సినిమాకు బివివి చౌదరి దర్శకత్వం వహించాడు. తనీష్, శోభన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను 22 జూలై 2011న విడుదలైంది.

కోడిపుంజు
దర్శకత్వంబి.వి.వి.చౌదరి
రచనబి.వి.వి.చౌదరి
నిర్మాతఎస్‌.ఎస్‌.బుజ్జి బాబు
తారాగణంతనీష్ , శోభన, రోజా
ఛాయాగ్రహణంజి.శివ కుమార్
కూర్పువి.నాగిరెడ్డి
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
శ్రీ శైలేంద్ర సినిమాస్
విడుదల తేదీ
2011 జూలై 22 (2011-07-22)
సినిమా నిడివి
143 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

దగ్గుబాటి అభిమన్యు(తనీష్) కి తల్లి దగ్గుబాటి సీతారత్నం (రోజా) మాటే వేద వాక్కు. కాలేజీలో చదువుతుండగా రామచంద్ర రావు (శివ కృష్ణ) కూతురు నందిని (శోభన)తో ప్రేమలో పడతాడు. ఆ క్రమంలో ఆ కుటుంబ పరువుకు సంబంధించి అనుకోని విధంగా ఓ సంఘటన జరుగుతుంది. అది వాళ్ల ప్రేమకి అడ్డంకిగా మారుతుంది. ప్రేమకి పరువుకి మధ్య జరిగిన ఈ పోరాటం చివరికి ఏమైంది అనేది మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

 • బ్యానర్: శ్రీ శైలేంద్ర సినిమాస్
 • నిర్మాత: ఎస్.ఎస్. బుజ్జిబాబు
 • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: బివివి చౌదరి
 • సంగీతం: అనూప్ రూబెన్స్
 • సినిమాటోగ్రఫీ: జి.శివ కుమార్
 • సహా నిర్మాతలు: సుదర్శన్ రెడ్డి, ఈశ్వర్
 • ఆర్ట్ డైరెక్టర్: హరి కుంట్ల
 • మాటలు: శ్రీరామ్ చౌదరి
 • పాటలు: భాస్కరభట్ల రవి కుమార్, కృష్ణ చైతన్య (వాలే వాలే )
 • ఫైట్స్: నందు

మూలాలు సవరించు

 1. 123telugu (22 July 2021). "Kodi Punju Movie Review - Tanish, Anchal, Roja". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
 2. Telugucinemass (2011). "Kodipunju telugu movie review". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.