కోదాడ పురపాలకసంఘం
కోదాడ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] కోదాడ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం లోని కోదాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
కోదాడ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°00′24″N 79°58′31″E / 17.0066913°N 79.9752212°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట |
మండలం | కోదాడ |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | వనపర్తి శిరీష |
- వైస్ చైర్పర్సన్ | వెంపటి పద్మ |
వైశాల్యము | |
- మొత్తం | 49.83 km² (19.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 75,093 |
- పురుషుల సంఖ్య | 37,501 |
- స్త్రీల సంఖ్య | 37,592 |
- గృహాల సంఖ్య | 15,786 |
పిన్ కోడ్ - 508206 | |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న కోదాడ, 2011లో పురపాలక సంఘంగా ఏర్పాటు చేయబడింది.
భౌగోళికం
మార్చుకోదాడ 49.83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°59′38″N 79°58′30″E / 16.994°N 79.975°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 75093 మంది కాగా, అందులో 37501 మంది పురుషులు, 37592 మంది మహిళలు ఉన్నారు. 15786 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 6 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 35 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం వనపర్తి శిరీష చైర్‌పర్సన్‌గా, వెంపటి పద్మ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డుకౌన్సిలర్లు
మార్చు- అలవాల అపర్ణ
- వనపర్తి శిరీష (చైర్పర్సన్)
- సమినేని నరేష్
- సమినేని ప్రమీల
- కందుల చంద్రశేఖర్
- కోటేశ్వర్ రావు కందుల
- ధారావత్ కైలా
- బానోతు వెంకటరమణ
- షేక్ మాదర్ సాహెబ్
- మామిడి పద్మావతి
- నెమ్మడి వీరబాబు
- గుండపనేని పద్మావతి
- లంకెల రామదేవి
- కామదాన చందర్రావు
- షేక్ ఇమామ్ఎ షఫీ
- కల్లూరి పద్మజ
- బత్తినేని హనుమంతరావు
- కారి శివ
- ప్రసన్నలక్ష్మి కొల్లా
- శిరీష చింతా
- కట్టెబోయిన జ్యోతి
- కోట మధుసుధన్ రావు
- వెంపటి పద్మ (వైస్ చైర్పర్సన్)
- మైస రమేష్
- చింతల మణి
- మహ్మద్ ఫాతిమా
- షేక్ షాబుద్దీన్
- కలకొండ శ్రీను
- రామ వంతిపులి
- పెండెం వెంకటేశ్వరు
- తిపిరిశెట్టి సుశీల
- గుండెల సూర్యనారాయణ
- షేక్ ఖాదీర్ పాషా
- యాదగిరి గంధం
- లలిత మేదర
మూలాలు
మార్చు- ↑ "Kodada Municipality". kodadamunicipality.telangana.gov.in. Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 7 April 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 7 April 2021.
- ↑ "Basic Information of Municipality, Kodada Municipality". kodadamunicipality.telangana.gov.in. Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 7 April 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 7 April 2021.
- ↑ "Council, Kodada Municipality". kodadamunicipality.telangana.gov.in. Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 7 April 2021.
వెలుపలి లంకెలు
మార్చు- కోదాడ పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2021-04-21 at the Wayback Machine