కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి. ప్రధాన వృత్తి వ్యవసాయం. 1996 సంవత్సరంలో కోనసీమలో తుఫాను వచ్చి పెను నస్టాన్ని కలిగించింది.[1] మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి ఉంది. అమలాపురం నుంచి కాకినాడ రూటులో ముమ్మిడివరం తరువాత మురమళ్ళ గ్రామం ఉంది. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మీ. ప్రయాణించి ఈ గుడికి వెళ్ళాలి.

కోనసీమ ముఖద్వారం
కోనసీమ
గౌతమీనది దృశ్యము.అప్పనపల్లివద్ద

చరిత్రసవరించు

సంస్కృతిసవరించు

ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సంప్రదాయాలు చూడవచ్చు. అతిథి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. కోనసీమ గ్రామాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ కనబడుతుంది. వివాహ సంబంధ విషయాల్లో కోనసీమకు చెందిన అమ్మాయిలంటే చాలా డిమాండ్.

వ్యవసాయంసవరించు

 
కోనసీమ
 
అమలాపురంలో కొబ్బరి చెట్లు

కోరమాండల్ తీరంలో ఆత్యంత సారవంతమైన ప్రదేశం. కోనసీమలో పండించని పంట కానరాదు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి బొప్పాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.

వ్యవసాయ ఎగుమతులు

కొబ్బరి, పీచు, కూరగాయలు, పూలు, పండ్లు, కోడి గుడ్లు.

పరిశ్రమలుసవరించు

కోళ్ళ పారమ్స్, కొబ్బరి ఉత్పత్తులు, చేతి బొమ్మల తయారీ.

కోనసీమ లొని పల్లె ప్రజల మాండలికంసవరించు

  • రేవు - తీరం.
  • గోదారి - గోదావరి నది
  • లంక - దీవి
  • డిబ్బ/తిప్ప - నది పరీవాహకం వల్ల లంకలో ఏర్పడిన చిన్న మైదానం
  • మేట - పెద్ద డిబ్బ లేదా తిప్పని మేట అని పిలుస్తారు
  • పేట/పాలెం - పల్లె/పట్టణం.
  • కోత - గోదారి తాకిడి లేదా వరదకి నేల (మైదాన ప్రాంతం) అరిగి పోవడం
మాండలికపు ఒక సంభాషణ.

నేను ముందే సెప్పేను (చెప్పాను). సంతకెళ్ళి సేపలట్రమ్మంటే (చేపలు) సింతసిగురట్టుకొచ్చి పులుసెట్టమన్నాడు. కాలవాతల (కాలువ అవతల) పుంతలో పాములున్నయంట. అటేపు ఎల్లొద్దంటే అటేపేఎల్తానంటాడు. తేన్లో నిమ్మరసం పిండి పొద్దేల పరగడుపునే ఏణ్ణీళ్ళతో తాగితే మంచిదంట. ఆడ్ని గోకితే ఊరుకుంటాడా మద్దిలోకెల్లిన ఆడ్ని నిన్ను ఇద్దర్నీ ఇరగతన్నేడు. కొత్తపెల్లికొడుకు పొద్దెరగడు.

ప్రధాన నగరాలుసవరించు

కోనసీమలో ఉన్న ప్రధాన ప్రదేశాలు

రవాణాసవరించు

హైదరాబాద్ నుండి కోనసీమలోని ప్రతి నగరానికీ హైటెక్ బస్సు సర్వీసులు ఉన్నాయి. రాజమహేంద్రవరం కోనసీమకు ప్రక్కనే కల పెద్ద నగరం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం మధ్య ఉన్న చించినాడ వంతెన మీదుగా రాజోలు పట్టాణానికి ప్రవేశించవచ్చు.

ఆలయములుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-01-24. Retrieved 2007-08-14.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కోనసీమ&oldid=2973935" నుండి వెలికితీశారు