ఇల్లు

(కోరిల్లు నుండి దారిమార్పు చెందింది)

ఇల్లు లేదా గృహము (House) మనం నివసించే ప్రదేశం.

భారతదేశంలోని కొత్త ఇల్లు.
భారతదేశంలోని ఒక గుడిసె.
భారతదేశంలోని ఒక పెంకుటిల్లు.
గుడిసె
నమూనా ఇంటి ప్రణాళిక
తాటాకులపాక/ఇల్లు


వివిధరకాల ఇండ్లు

మార్చు
 • గుడిసె (హట్) : మట్టి గోడల ఇల్లు. (పూరి గుడిసె, పూరి పాక అని కూడా అంటారు) ఒక చిన్నదైన నివాస స్థలం. ఇవి ముఖ్యంగా చుట్టుపక్కల దొరికే గడ్డి, వెదుర్లు, కొబ్బరి/తాటి ఆకులు, కాండం మొదలైన వాటితో కట్టుకుంటారు. ఎక్కువగా పల్లెలలో ఇటువంటి ఇల్లు కనిపిస్తాయి. ఇవి కట్టుకోడానికి ఖర్చు తక్కువగా అవుతుంది.


 • పెంకుటిల్లు : ఒక మధ్యరకమైన నివాస స్థలం. ఇవి పల్లెలలోను, పట్టణాలలోను కనిపిస్తాయి. ఇవి పక్కా గోడలతో కట్టబడి, పైభాగంలో కలపతో నిర్మించి వాటిమీద పెంకులు పరిచి లోపలిభాగాన్ని రక్షిస్తారు.
 • మేడ ఇల్లు: ఇవి దృఢంగా నిర్మించబడిన పక్కా ఇల్లు. ఇవి ఎక్కువగా పట్టణాలలో కనిపిస్తాయి. ఇవి పక్కా గోడలతో కట్టబడి, పైభాగం కాంక్రీటుతో నిర్మించబడుతుంది. ఇవి కట్టుకోడానికి ఖర్చు ఎక్కువగా అవుతుంది.
 • భవనం : మేడ ఇల్లు ఒకటి కంటే ఎక్కువ అంతస్థులు ఉంటే దాన్ని భవనం అంటారు. పట్టణాలలోని ఎక్కువ ఇల్లు, అపార్టుమెంట్లు వీటికిందకు వస్తాయి.
 • ఎకో - ఫ్రెండ్లీ ఇల్లు :పర్యావరణానికి ఏమాత్రం హాని చెయ్యని పచ్చదనాన్ని కాపాడుతూ కట్టిన ఇల్లు.వాననీటిని వాడుకోవడం మొదలుకొని, కాచే ఎండను శక్తిగా మలచుకునే ఏర్పాట్ల దాకా అన్నీ మిళితమై ఉంటాయి.వాడుకున్న నీటిని శుభ్రపరిచి మళ్లీ ఆ నీటిని మరుగుదొడ్లులో వినియోగానికి ఉపయోగపడేలా చేసే వాటర్‌ రీ సైక్లింగ్‌ విధానాన్నీ అనుసరిస్తారు.నీటి వృధాను అరికట్టడమే కాక వాటర్‌ బిల్లునూ తగ్గించుకోవచ్చు.విషవాయువులు లేని యాంటీ బాక్టీరియల్‌ పెయింట్స్‌ వేస్తారు.ఈ ఇళ్ళను 'గ్రీన్‌ బిల్డింగ్స్‌'లేదా 'గ్రీన్‌ హోమ్‌'లంటారు. గ్రీన్‌ హౌజ్‌ నిర్మాణంలో వాడే డబుల్‌ గేజ్డ్‌ గ్లాస్‌ వేడినే కాదు బయటి శబ్దాలను కూడా లోనికి రానివ్వదు. దీనివల్ల శబ్దకాలుష్యం దరి చేరకుండా ఇల్లు, పరిసరాలు ప్రశాంతంగా ఉం టాయి. తాజా నీటి మీద ఆధారపడడం 80 శాతం తగ్గుతుంది. 15 శాతం దాకా కరెంట్‌ వినియోగాన్నీ తగ్గించవచ్చు.* గాలి, వెలుతురు చక్కగా ప్రసరించగలిగేలా ఇంటి నిర్మాణం ఉంటుంది కనుక ఏసీ, కూలర్ల అవసరం దాదాపూ ఉండదు.ఇంటికి యాంటీ బ్యాక్టీరియల్‌ పెయిటింగ్స్‌ వాడటం వల్ల రసాయనాల వాసనలు, విష వాయువుల కాలుష్యం ఉండదు. పైకప్పు చల్లగా ఉండేందుకు వాడే తెల్లటి పెయింట్‌ను నివారించడం వల్ల పైకప్పు గ్రహించే వేడిని 40 శాతానికి తగ్గించే వీలుంటుంది. నిర్మాణ ఖర్చే కాస్త ఎక్కువగా ఉంటుంది.
 • పూరిళ్ళు: మట్టి గోడలపైన గడ్డితో కప్పిన ఇళ్ళను పూరిళ్ళు అంటారు. పల్లెల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఆయా ప్రాంతాలలో ఎక్కువగా దొరికే కసువు, బోద, వరిగడ్డి, తాటాకులు ఇలా దేనితో నైన కప్పు వుంటే దానిని పూరిల్లు అంటారు. ఇందులో ఎండాకాలంలో కూడ చల్లగానె వుంటుంది. కాని వీటితో అగ్ని ప్రమాద భయం ఎక్కువ. తాటి ఆకులతో లేక గడ్డితో కప్పబడి నిర్మించిన ఇంటిని పూరిల్లు అంటారు.

ఇంటిలోని భాగాలు

మార్చు

చాలావరకు ఇల్లు కొన్ని గదులుగా చేయబడి ఉంటుంది. ఒక్కొక్క గది ఒక్కొక్క పనికోసం కేటాయించబడుతుంది. ఒక నమూనా ఆధునిక ఇల్లు కనీసం నాలుగు గదులు కలిగి ఉంటుంది. నివాస స్థలం, వంటకోసం వంటగది, నిద్రపోవడానికి పడకగది, స్నానాల గది మొదలైనవి. పెంపుడు జంతువుల కోసం గూడు, కారు వంటి వాహనాల కోసం గేరేజి, గ్రంథాలయం, అటక లాంటివి పెద్దపెద్ద ఇళ్ళల్లో ఉంటాయి.

 • అటక : పాత వస్తువులు, ఎక్కువగా ఉపయోగించని వస్తువులను పెట్టుకోవడానికి వీలుగా ఎత్తుగా, ఇంటి పై కప్పు పై భాగంగా ఉండే అలమర.
 • స్నానాల గది: స్నానం చేసేందుకని ఉపయోగించే గది. పూర్వం ఇంటికి కొంచం దూరంగా తడికలతో కట్టేవారు . ప్రస్తుతం ఇవి ఇంటిలో ఒక భాగమై పోయాయి అని అనవచ్చు. అలంకరణ వస్తువులు కూడా స్నానాలగదిలోకి చేరిపోతున్నాయి.
 • మరుగు దొడ్డి : పూర్వం ఇళ్ళకు దూరంగా ఉండేవి. పంపుల సౌకర్యం లేక పోతే దగ్గరలో గాబులతో నీళ్ళను పెట్టేవారు.
 • పడక గది : ప్రధానంగా పడుకునేందుకు ఉపయోగించే గది
 • పూజ గది: కొంతమంది పూజ కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తే, ఇంకొంతమంది వంట గదిలో లేదా హాల్‌లో ఓ పక్కగా చిన్న అల్మరాను కేటాయిస్తారు. పూజామందిరాన్ని వాస్తు ప్రకారం ఈశాన్య దిశగా పెట్టుకోవడం చాలా మంచిది.[1] వంటగది లేదా బాల్కనీలో పూజగదిని ఏర్పాటు చేయడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయని కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది కాబట్టి, అలా చేయకపోవడం మంచిది. ఈ గదిలో ఈశాన్య దిశగా నాలుగు అంగుళాల ఎత్తులో పీట‌ లాగా కట్టి దాని మీద దేవుని పటాలు పెట్టుకోవాలి. కూర్చునేందుకు అక్కడ చిన్న చిన్న చాపలు కూడా పెట్టుకోవచ్చు. గోడలకు వినాయకుడు, రాధాకృష్ణ మొదలైన ఇష్టదేవతల చిత్రపటాలు అలంకరించవచ్చు. గదికి ఈశాన్య దిశలో ఓమూలగా దీపాల స్టాండ్‌ను అమర్చితే పూజగది చాలా అందంగా ఉంటుంది.
 • వంట గది :
 • గ్రంథాలయము
 • వరండా

ఇందిరమ్మ ఇళ్ళు

మార్చు

పూర్వం ఇందిరా ఆవాస్ యోజన పేరుతో అగ్ని ప్రమాదాలలో ఇళ్ళు కాలిపోయిన వారికీ వితంతువులకు కుష్టు వ్యాధిగ్రస్తులకు ఇళ్ళు మంజూరు చేసేవారు.ఎన్.టి.రామారావు పాలనలో కూడా భారీ ఎత్తున పేదలకు ఇళ్ళు కట్టించారు. వై.యస్. రాజశేఖరరెడ్డి పాలనలో ఇందిరమ్మ ఇళ్ళు బాగా ప్రాచుర్యం పొందాయి. గుజరాత్ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ శాఖ నుంచి నగరపాలక ఆధీనంలోకి తెచ్చింది. వారు మూడు, నాలుగు అంతస్తుల్లో తాగునీరు, విద్యుత్తు తదితర మౌలిక వసతులతో ఇళ్లు నిర్మించి పేదలను తరలిస్తారు. రూ.లక్షతో ఒక్కొక్కరికి ఇల్లు నిర్మించే పథకమిది. అందులో రూ.80 వేలను కేంద్రం, రూ.10 వేలను రాష్ట్రం, రూ.10 వేలను లబ్ధిదారులు సమకూర్చాలి. పది వేలు కూడా ఇవ్వలేని పేదకు బ్యాంకు రుణాన్ని అందేలా నగర పాలక సంస్థ సహకరిస్తుంది.

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో గృహము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[2] గృహము సంస్కృతంలో ప్రకృతి: గేహము; ఆంగ్లంలో 'Home'] n. A house, abode, dwelling. ఇల్లు. గృహకలహములు domestic troubles or quarrels గృహకృత్యములు household affairs. గృహపతి n. A householder, the head of a family, యజమాని. గృహ ప్రవేశము entering a new house. గృహమృగము అనగా a dog కుక్క. గృహస్థుడు, గృహస్థు, గృహమేధి or గృహి n. A householder ఇలురేడు An honest man, a good citizen. A respectable man. గృహస్థాస్రయము householdership, the state of being a householder. గృహాయమాన habitable, used as a house. గృహారామ క్షేత్రములు house, grove and field, i.e., one's entire property, one's all. గృహిణి n. అనగా A mistress of a house, a wife. ఇల్లాలు. గృహోపకరణములు furniture, chattels, goods, utensils. గృహ్యము gṛihayamu. adj. Dependant, పరాధీనమైన. n. A tame or domesticated animal. పెంపుడు మృగము.

 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఇల్లు&oldid=3917523" నుండి వెలికితీశారు