కోల్డు వెల్డింగు

కోల్డు వెల్డింగు అనగా లోహాలను సాధారణ ఉష్ణోగ్రతవద్దనే, కేవలం బలప్రయోగం ద్వారా అతుకు ప్రక్రియను కోల్డు వెల్డ్ లేదా కోల్డు వెల్డింగు అంటారు. తెలుగులో అయినచోశీతల టంకం అనవచ్చును.[1]

కోల్డు వెల్డింగు
కోల్డు వెల్డింగు
మిట్టపల్లాలుగా వున్న లోహా పలక ఉపరితలం
(పరిమాణాన్నిపెద్దగా చేసిచూసినప్పుడు)

లోహాలను అతకడం అనే ప్రక్రియ అధునాతనమైనది కాదు. పురాతనమైనది. మానవుడు ముడి ఖనిజంనుండి లోహంలను తయారుచెయ్యడం కనుగొన్నతరువాత, వాటి వాడకం అనివారమై, వాటినుండి ఆయుధాలు, వినియోగ వస్తువులను తయారుచెయ్యడం, లోహంలను అతకడం తెలియడం వలనే సాధ్యమైనది.ఇంచుమించు క్రీ.పూ.300 సంవత్సరాలనాటికే మానవుడు సుత్తులతో దుక్క ఇనుము లోహాలపై బలంగా మోది అతికినట్లుగా లభించిన ఆధారాలను బట్టి తెలుస్తున్నది. బ్రిటను పురాతన త్రవ్వకాలలో లభించిన బంగారు ఆభరణాలు, బంగారు మందసాలు (పెట్టెలు, కోల్డు వెల్డింగుతో చెయ్యబడినవని, అవి కంచుయుగపు చివరికాలం, అనగా క్రీ.పూ.700 నాటివని గుర్తించారు. కోల్డు వెల్డింగు ప్రక్రియను ఘనస్థితి అనగా solid state వెల్డింగు.అనగామెటల్ ఆర్కు వెల్డింగు, గ్యాసు వెల్డింగు, స్పాట్ వెల్డింగు, సిమ్‍ వెల్డింగు వంటి లోహాలను అతుకు విధానాలలో ఉష్ణోగ్రత, వత్తిడి లేదా బాహ్యా బలప్రయోగం అవసరం.ఆర్కు వెల్డింగు, గ్యాసు వెల్డింగులో అతుక వలసిన లోహ అంచులను ఉష్ణోగ్రత ద్వారా ద్రవీకరణ స్థితికి తెచ్చి, ద్రవీకరణ స్థితిలో రెండు లోహాలు సమ్మేళనం చెందేలా చేసి అతికెదరు.ఆర్కు వెల్డింగులో విద్యుత్తు ప్రవాహం ద్వారా లోహాలను వేడిచెయ్యగా, గ్యాసు వెల్డింగులో వాయువులను మండించి వెలువడు ఉష్ణశక్తిని ఉపయోగించి అతుకవలసిన లోహాలను వేడిచెయ్యుదురు.ఇక రెసిస్టన్సు వెల్డింగు (స్పాట్,, సిమ్‌ వెల్డింగు వంటివి) లో లోహలకున్న ఒక భౌతిక గుణమైన విద్యుత్తు వాహక నిరోధక తత్వాన్ని ఆసరా చేసుకొని లోహాలను అతికెదరు. కాని కోల్డు వెల్డింగులో లోహాల సాగే/తాంతవ (Ductile) గుణం ఆధారంగా ఒక లోహానికి మరొక లోహాన్ని మాములు సాధారణ ఉష్ణోగ్రత వద్దనే జోడించం జరుగుతుంది. చాలా లోహాలమీద బలంగా బాహ్యాబలాన్ని ప్రయోగించినప్పుడు అవి సాగుతాయి.

అధునాతకాలంలో కోల్డు వెల్డింగు చరిత

మార్చు

అధునాతన, శాస్త్రీయమైన కోల్డు వెల్డింగు విధానాన్ని1724 లో రెవ.జె.ఐ.డెసగులైర్స్ (Reverend J I Desaguliers) కనుగొన్నాడు.తాను కనుగొన్న వెల్డింగు విధానాన్నిరాయలు సొసైటిలో ప్రదర్శించాడు, తన పరిశోధన ఫలితాలను శాస్త్రీయ వార్తా పత్రికలలో ప్రచురించాడు.ఆయన 25సెం.మీ వ్యాసం వున్న రెండు సీసపు గోళాలమీద ఈ ప్రయోగం చేశాడు[2]

కోల్డు వెల్డింగు

మార్చు

కోల్డు వెల్డింగు పద్ధతిలో లోహాలను వేడి చెయ్యకుండ, కేవలం అతుకు లోహాల మీద వత్తిడి ప్రయోగం ద్వారా అతకడం జరుగుతుంది. ఇది లోహాలకు ఉన్న సాగేడి గుణం వలన సాధ్యం. అందు వలన కోల్డు వెల్డింగు పద్ధతిలో ఎదైన రెండు లోహాలను అతుకవలెనన్న అందులో ఒక లోహం ఎక్కువ సాగే (ductile) లక్షణాన్ని కలిగివుండాలి. లోహాల ఉపరితలం మాములుగా కంటితో చూచినప్పుడు నునుపుగా కనిపించును. కాని వాటి ఉపరితలాన్ని ఏదైన భూతద్దం లేదా దుర్భిణి (Magnifier) ద్వారా చూచినప్పుడు ఉపరితలం పైన అనేక మిట్టపల్లాలు/హెచ్చుతగ్గులు వుండును. లోహ పలకల లేదా లోహ వస్తువుల ఉపరితలం ఇలా మిట్టపల్లాలు కలిగి వుండటమే కోల్డు వెల్డింగు చెయ్యుటకు అనుకూలమైన అంశం .ఒక లోహ పలకపై మరొక లోహ పలకను వుంచి ఒక అచ్చు/ముద్రిక (die) ని గట్టిగా దానిమీద వత్తడం వలన, వత్తిడి వలన పలక సాగి రెండో పలకతో కలసిపోవును. అతుకబడు ఉపరితలంభాగాలను భాగా శుభ్రపరచి వుంఛాలి.వీలున్నంత వరకు ఉపరితలం గరుకుగా వున్నచో, అతుకు బలిష్టంగా వుండును.

కోల్డు వెల్డింగును రెండు రకాలుగా చెయ్యుదురు. ఒకటి బట్ (Butt) /కుందా వెల్డింగు, రెండవది ఒవరు ల్యాపింగ్ (over lapping) /పరస్పరవ్యాప్తి. ఈ రెండు రకాల అతుకు విధానాలకు వేర్వేరు అచ్చులు, ముద్రికలు (die) వుండును[3].అచ్చును పంచ్ (punch) అనికూడా అంటారు.

 • ప్లాస్టిక్ వస్తువులు కోల్డు వెల్డింగు చేయుటకు మిక్కిలి అనుకూలం.
 • ఉక్కేతర (ఉక్కుకాని) లోహాలు కోల్డు వెల్డింగునకు చాలా అనువైనవి.

కోల్డు వెల్డింగు-నూతన ఆవిష్కరణలు

మార్చు
 • పీడన రహిత స్థితిలో కోల్డు వెల్డింగు చెయ్యడంవలన అతుకు నాణ్యతగా, దృఢంగా ఏర్పడునని పరిశోధనలలో తెలింది.
 • ప్లాస్టికు వస్తువులను మరమత్తు చేయుటకు అతుకుటకు కోల్డు వెల్డింగు విధానాన్ని ఉపయోగిస్తున్నారు[4].
 • నానొ ఫ్యాబ్రికెసనులో కూడా కోల్డు వెల్డింగు ఉపయోగం మొదలైనది.
 • అంతరిక్షంలో కోల్డు వెల్డింగు పద్ధతిలో రెండు లోహాలను అతికి ఉపయోగించారు అని నిరూపితమైనది[5]

కోల్డు వెల్డింగుకు అనువైన లోహాలు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు
 1. వెల్డింగ్

బయటి లింకులు

మార్చు
 • [1] కోల్డు వెల్డింగు

సూచికలు

మార్చు
 1. "cold welding". dictionary.reference.com. Retrieved 2014-03-05.
 2. "What is Cold Pressure Welding?". coldpressurewelding.com. Archived from the original on 2014-05-05. Retrieved 2014-03-05.
 3. Welding Technology-Solid state welding process,By O.P.khanna
 4. "Plastic Repair-Cold weld" (PDF). morelli.co.uk. Retrieved 2014-03-06.[permanent dead link]
 5. "In space, two pieces of metal can weld together with no heat or other substances present!". omg-facts.com. Archived from the original on 2013-07-16. Retrieved 2014-03-06.