కో-షింటో, (Ko-Shintō (古神道)) అనేది ఆధునిక షింటోకి మూలమైన జపానుకు చెందిన జోమోన్ కాలం నాటి అసలైన సర్వాత్మవాదం. ఇది నేటి ఆధునిక షింటో కి మూలంగా పేర్కొంటారు. కోషింటో జాడల అన్వేషణ ఎడో కాలంలో షింటో పునరుద్ధరణతో ప్రారంభమైంది. ఉద్యమ వాదులు కొందరు, ఈ ప్రాచీన ఆలోచనా విధాన కర్తలు ఊమోటో, ఇజుమో-తైషాక్యో లని వాదిస్తారు.

ఈ క్రింద పేర్కొన్నవి ఏ చైనీస్ తత్వ శాస్త్రాలలోను కనిపించని కోజికి,నిహోన్ షోకి భాషల అధ్యయనాంశాలు:

కోషింటో లో, శాశ్వతమైన ప్రపంచం లేదా టోకోయోకి విరుద్ధంగా ప్రస్తుత ప్రపంచం లేదా ఉత్సుషియో (utsushiyo) ఉంటుంది. వ్యక్తులందరూ తమషీ (tamashii)ని, అంటే మనస్సు, హృదయం లేదా ఆత్మను కలిగి ఉంటారు. శరీరం లేని ఒక తమషీ ని మిటమ (mitama) అంటారు. ఎవరి తమషీ అయితే కమీ స్వభావాన్ని కలిగి ఉంటుందో వారిని మికోటో అంటారు.

కామి లేదా కమియో యుగంలో, ఈ భూమి పై కామి పాలన సాగింది. వీరి రూపాలు మానవులను పోలి ఉంటాయి, కానీ హృదయాలు మాత్రం స్వచ్ఛమైనవిగా ఉంటాయి, వీరు మాట్లాడే భాష కోటోడమా.

కోషింటో పరిశోధనా చరిత్ర మార్చు

ప్రారంభపు జపాన్ సాహిత్యంలో "స్వచ్ఛమైన" కోషింటో కు సంబంధించి ఎటువంటి దాఖలాలు లేవు. జపాన్ సాహిత్యం రూపుదిద్దుకుంటున్న సమయానికి ముందే, టావోయిజం, బౌద్ధమతంతో స్థానిక మతం కలిసిపోయింది. షింటో బౌద్ధమత సంకేతశాస్త్రంలో విలీనం కావటమే మధ్యయుగపు అభివృద్ధి.

ప్రారంభపు బౌద్ధ మత పరీక్షలతోనే కోషింటో పరిశోధన ప్రారంభమైంది. ఈ యుగంలోనే , జపాన్ పుణ్యక్షేత్ర ఆచారాలు వారి మతపరమైన స్వభావం నుండి "శుద్ధి" పొంది, జాతీయ రూపాలుగా మారాయి. ఈ ప్రక్రియనే నేటి స్టేట్ షింటో గా వ్యవహరిస్తారు. మతవాదులు ఆదిమ " ప్రకృతి మతం "లో ఈ రూపాల మూలాన్ని వెతకడం ప్రారంభించారు. స్వచ్ఛమైన పారంపరిక జపాన్ సంప్రదాయం కావాలని, కునియో యనగీతా వంటి ప్రారంభ జానపద రచయితలు కూడా కోరుతున్నారు.

ఇంపీరియల్ కాలంలో కోషింటో పై జరిగిన పరిశోధనల ను అత్యంత ప్రభావితం చేసిన పరిశోధకుడు ఊమోటో (Oomoto) స్థాపకుడు, ఓనిసాబురో డేగుచి, తకుమా హిసా మినహా ఆధునిక కోషింటో లోని దాదాపు అన్ని పంక్తులను అతను ప్రభావితం చేశాడు. ఇటువంటి పరిశోధనలు నేటికీ కొనసాగుతున్నాయి. ఎక్కువగా అవి, ఐకిడో కు , ఇతర యుద్ధ కళలకు సంబంధించినవిగా ఉంటాయి.

మూలాలు మార్చు

బాహ్య లింకులు మార్చు

  • కోషింటో - షింటో ఆర్గనైజేషన్ ఫర్ సౌత్ ఆస్ట్రేలియా
  • కోర్నికి, పీటర్, IJ మెక్‌ముల్లెన్ (Ed), రెలిజియన్ ఇన్ జపాన్: యారోస్ టూ హెవెన్ అండ్ ఎర్త్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, (1996), ISBN 978-0-521-55028-4
"https://te.wikipedia.org/w/index.php?title=కో-షింటో&oldid=3470492" నుండి వెలికితీశారు