కౌశాంబి

ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో కైశాంబి జిల్లా ఒకటి. కైశాంబి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కైశాంబి జిల్లా అలహాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది.

Kaushambi జిల్లా

कौशाम्बी ज़िला
کوشامبی ضلع
Uttar Pradesh లో Kaushambi జిల్లా స్థానము
Uttar Pradesh లో Kaushambi జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముAllahabad
ముఖ్య పట్టణంManjhanpur
మండలాలు3
విస్తీర్ణం
 • మొత్తం1,903.17 కి.మీ2 (734.82 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం15,96,909
 • సాంద్రత840/కి.మీ2 (2,200/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత63.69 per cent
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చరిత్రసవరించు

పురాతన భారతదేశంలో కైశాంబి వత్సా మహాజనపదాలకు రాజధానిగా ఉండేది., [1][2][3] వత్స రాజా సంబంధిత 16 ప్రదేశాలలో ఇది ఒకటి.[4]

పురాణ కథనాలుసవరించు

రామాయణ, మహాభారత కావ్యాలలో ఈ ప్రాంతం గురించిన ప్రస్తావన ఉంది. చేది రాజ్యం గురించిన ప్రస్తావనలో ఈ ప్రాంతం కుశంబి అని ఉంది. పురాణాలలో పాండవుల మునిమనుమడు జనమేజయుడు గంగానది వరదలలో మునిగిపోయిన హస్థినాపురాన్ని వదిలి చేధిరాజ్యంలోని కుశంభి నగరాన్ని రాజధానిగా చేసుకున్నట్లు ప్రస్తావించబడి ఉంది. స్వప్నవాసవ దత్త, యుగంధరాయణ దీనిని బలపరుస్తున్నాయి. రెండు గ్రంథాలు రాజా ఉదయన భరతవశానికి చెందిన వాడని వర్ణిస్తున్నాయి. పురాణాలు వంశానుగతంగా రాజా క్సెమక వరకు వర్ణన ఉంది. [5]

గౌతమ బుద్ధాసవరించు

రాజా ఉదయనుని కాలంలో గౌతమ బుద్ధుడు ఈ నగరాన్ని సందర్శించి ధర్మప్రబోధం చేసాడని. రాజా ఉదయనుడు బౌద్ధ ఉపాసకుడు. ఉదయనుడు బుద్ధుని గంధపు శిల్పాన్ని నిర్మింపజేసాడని భావిస్తున్నారు. పురాణకథనాలను అనుసరించి వాహినర, దండపాణి, నిరమిత్ర, క్సెమక రాజులు ఉదయనుని సంతతి వారని భావిస్తున్నారు. తరువాత వత్స అవంతితో విలీనం చేయబడింది. అవంతి రాజకుమారుడు ప్రద్యోత మునిమనుమడు మణిప్రభ కౌశుంభను పాలించాడు. అశోకుడు కౌశుంభనగరానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కౌశుంభిలో స్తంభాలను నిర్మింపజేసాడు. వాటి మీద పాలి అక్షరాలు చెక్కించబడ్డాయి. కౌశుంబిలో ఒక జైన దెరసర్ కూడా నిర్మించబడింది. స్తంభాలు, ఆలయం ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఆర్కియాలజిస్టులు వత్స రాజ్య శిథిలాలు, విశ్వవిద్యాలయం వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. 6వ జైన తీర్ధంకరుడు పదం ప్రభూజి కౌశుంభిలో జన్మించాడు.

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కౌశాంబి జిల్లా ఒకటి అని గుర్తించింది. .[6] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[6]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,596,909, [7]
ఇది దాదాపు. గునియా- బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం..[9]
640 భారతదేశ జిల్లాలలో. 313 వ స్థానంలో ఉంది.[7]
1చ.కి.మీ జనసాంద్రత. 897 .[7]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.49%.[7]
స్త్రీ పురుష నిష్పత్తి. 905: 1000[7]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 63.69%.[7]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ప్రత్యేకతలుసవరించు

 • అలహాబాద్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి కైశాంబి జిల్లా రూపొందించబడింది.
 • జిల్లాలో చైల్, ఉత్తర ప్రదేశ్, మంఝాన్పూర్, భర్వరి, కషియ, మురత్గంజ్, సిరథు, కరారి, కారా (ఉత్తర ప్రదేశ్ ) వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి.
 • కౌశాంబి నగరం అలహాబాద్‌కు 45 కి.మీ దూరంలో ఉంది. పురాతన చరిత్ర ఆరాధకులకు ఈ నగరం ఆసక్తికరమైనది. అలహాబాద్ నుండి కైశాంబికి రోడ్డు మార్గంలో సులువుగా చేరుకోవచ్చు.

కౌశాంబి త్రవ్వకాలలో లభించిన పలు కళాఖండాలను అలహాబాద్ మ్యూజియంలో భద్రపరచబడిఉన్నాయి. జిల్లాలోపాలి శిలాక్షరాలు ఉన్న అశోక స్తంభాలు ఉన్నాయి. వీటికి సమీప ప్రాంతంలో వాత్సా మహాజనపదాలు, జపదాల విశ్వవిద్యాలయం ఉన్నాయి. జిల్లాలోని సరై అకిల్ నుండి 14 కి.మీ దూరంలో జైన దెరసర్ ఉంది.

వ్యవసాయంసవరించు

జిల్లా భూభాగంలోని మట్టి చాలా సారవంతమైంది. సుర్క గువా మామిడి పంటకు ప్రసిద్ధి చెందింది. మామిడి పంటకు సుర్కా గువా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. నాణ్యమైన మామిడి పండుతున్న ప్రదేశాల జాబితాలో సుర్కాగువా చోటుచేసుకుంది.

మూలాలుసవరించు

 1. Geographical Review of India. Original from the University of Michigan: Geographical Society of India. 1951. p. 27.
 2. Hermann Kulke, Dietmar Rothermund (2004). A History of India. Routledge. p. 52. ISBN 0-415-32920-5.
 3. http://books.google.co.in/books?id=VnwXuJaeDvgC&lpg=PA53&ots=CcwVswgxOj&dq=Kaushambi%20mahajanapada&pg=PA53#v=onepage&q=Kaushambi%20mahajanapada&f=false
 4. Pargiter, F.E. (1972) Ancient Indian Historical Tradition, Motilal Banarasidass, Delhi, pp.269-70
 5. Raychaudhuri, Hemchandra (1972) Political History of Ancient India, University of Calcutta, Calcutta, p.117-8
 6. 6.0 6.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "Kaushambi District Population Census 2011, Uttar Pradesh literacy sex ratio and density". Census Organization of India. 2012. Archived from the original on 3 జనవరి 2013. Retrieved 16 డిసెంబర్ 2014. Check date values in: |access-date=, |archivedate= (help)
 8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est. line feed character in |quote= at position 14 (help)
 9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Idaho 1,567,582 line feed character in |quote= at position 6 (help)

బయటి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కౌశాంబి&oldid=2977888" నుండి వెలికితీశారు