ఖాండ్వా జిల్లా
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఖాండ్వా జిల్లా (హిందీ:खांडवा जिला) ఒకటి.ముందు ఇది " తూర్పు నిమర్ జిల్లా " అని పేరు ఉండేది. ఖాండ్వా జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లాలో ముండి, హర్షద్, పంధన, ఓంకారేశ్వర్ వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి.
ఖాండ్వా జిల్లా
खांडवा जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Indore |
ముఖ్య పట్టణం | Khandwa |
మండలాలు | Khandwa,Punasa(Mundi), Harsud, Pandhana |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Khandwa |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,206 కి.మీ2 (2,396 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 13,09,443 |
• జనసాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 67.53% |
• లింగ నిష్పత్తి | 944 |
Website | అధికారిక జాలస్థలి |
భౌగోళికం
మార్చుజిల్లా వైశాల్యం 6206 చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,309,443. ఖాండ్వా జిల్లా నిమర్ భూభాగంలో ఉంది. జిల్లాలో నర్మదా, ఖెర్ఖాలీ నదీలోయల ప్రాంతాలు భాగంగా ఉన్నాయి.
సరిహద్దులు
మార్చుజిల్లా ఉత్తర సరిహద్దులో నర్మదా నది ప్రవహిస్తుంది. జిల్లా దక్షిణ సరిహద్దులో సప్తపురా పర్వతశ్రేణి ఉంది. దక్షిణ సరిహద్దులో బుర్హాన్‌పూర్ జిల్లా, తపి నది మైదానం ఉంది. సాత్‌తపురా పాస్ ఖాండ్వా జిల్లాను బుర్హాన్‌పూర్ జిల్లాను అనుసంధానిస్తూ ఉంది. ఇది ఉత్తరభారతం, దక్షిణ భారతం కలిపే ప్రధాన మార్గం కనుక దీనిని " కీ టు ది దక్కన్ " అంటారు. తూర్పు సరిహద్దులో హర్దా జిల్లా, ఉత్తర సరిహద్దులో దేవాస్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఖర్‌గోన్ జిల్లా ఉన్నాయి.
చరిత్ర
మార్చు1818లో ఖాండ్వా జిల్లాను మరాఠీ పాలకుల నుండి బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తరువాత ఈ ప్రాంతం " సెంట్రల్ ప్రొవింస్ , బేరర్ "లో భాగంగా మారింది. జిల్లాకు పశ్చిమ భూభాగం (ప్రస్తుత ఖర్‌గోన్ జిల్లా) ఇండోర్ రాజ్యంలో భాగంగా ఉండేది. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత సెంట్రల్ ప్రొవింస్ , బేరర్ కొత్తగా రూపొందించిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా మారింది. 1956కు ముందు ఖాండ్వా జిల్లా నిమర్ జిల్లా అని పిలువబడేది. తరువాత మధ్యభారత్ రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంతో విలీనం చేయబడింది. మధ్యభారత్‌లోని ఖర్‌గోన్ జిల్లా కూడా నిమర్ అని పిలువబడేది. ఇవి తూర్పు , పశ్చిమ నిమర్ అని పిలువబడేవి. నిమర్ జిల్లా సెంట్రల్ ప్రొవింస్ , బేరర్ లోని నెర్బుడా డివిజన్‌లో భాగంగా ఉండేది. . 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఇది మధ్యభారత్ రాష్ట్రంలో భాగమై తరువాత 1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత మధ్యప్రదేశ్‌లో భాగంగా మారింది. .[1] సమీపకాలం ఖాండ్వా జిల్లా తూర్పు నిమర్ జిల్లాగా ఉండేది. 2003 ఆగస్ట్ 15 న ఖాండ్వా నుండి బుర్హాన్‌పూర్ జిల్లా రూపొందించబడింది. ఖాండ్వా జిల్లా ఇండోర్ డివిజన్‌లో భాగం అయింది. జిల్లాలో ప్రధానంగా తబిష్, ముండి, హర్సుద్, పంధన, ఓంకారేశ్వర్ మంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి.
ఆర్ధికం
మార్చు2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఖాండ్వా జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,309,443,[3] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 374వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 178 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.44%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 944:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 67.53%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు
మార్చుLanguages spoken include Nimadi, a Bhil language with approximately 64 000 speakers, written in the Devanagari script.[4]
ఖాండ్వా జిల్లాలోని నగరాలు లో రాంక్.
మార్చు- 1వ - ఖాండ్వా - 2,90,000.
- 2వ - మండి - 30,000.
- 3వ - హర్సుద్ - 27,000.
- 4 వ - పంధన - 25,000.
- 5 వ - ఓంకారేశ్వర్ - 20,000.
ప్రముఖులు
మార్చుహిందీ చలనచిత్ర నడుడు అశోక్‌కుమార్ ఆయన సోదరుడు కిషోర్‌కుమార్ (హిందీ చలచిత్ర గాయకుడు, నటుడు) బొబాయి చిత్రపరిశ్రమలో ప్రవేశించే వరకు వారి స్వస్థలమైన ఖాండ్వాలో నివసించారు.
- మధ్యప్రదేశ్ ముఖ్యమత్రులలో ఒకరైన " భగవంత్రావ్ మండ్లోయి " ఖాండ్వాలో జన్మించాడు.
- హిందూ సన్యాసి దాదాజీ ధునివాలే ఇక్కడ నివసించాడు. ఆయన సమాధిని సందర్శించడానికి పలువురు భక్తులు గురుపూర్ణిమ నాడు ఇక్కడకు వస్తుంటారు.
- గొప్ప హిందీ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు పి.టి మఖన్లాల్ చతుర్వేది ఖాండ్వాను తన నివాస ప్రదేశంగా మార్చుకున్నాడు. ఆయన కర్మవీర్ వార్తా పత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు. ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధానపాత్ర వహించాడు. ఆయన రచనలలో " పుస్ప కీ అభిలాష " అధికంగా గుర్తింపును పొందింది.
సింఘాజీ
మార్చుసన్యాసి సింగజి :- కవి, సన్యాసి. కబీర్ దాస్ శిల్పంలా సిగజి శిల్పాలు ప్రతిష్ఠించబడ్డాయి. 15 వ శతాబ్దంలో ఆయన బర్వానీ రాజ్యం లోని ఖజురీ గ్రామంలో గవలీ (పశువుల కాపరి ) ఇంట జన్మించాడు. (ప్రస్తుతం బర్వానీ జిల్లా) [5] తరువాత ఆయన హర్షద్ తాలూకాలోని పిప్లి గ్రామానికి తరలి వెళ్ళాడు. తరువాత ఆయన సన్యాసి మాంరంగీర్ శిష్యుడయ్యాడు. తరువాత ఆయన భగవంతునికి జీవితం అర్పించాడు. ఆయన హిందూ మతంలోని నిర్గుణోపాసనను అవలంబించాడు. తరువాత ఆయన నిమర్ ప్రాంతంలోని గవలీలకు గురువయ్యాడు. సింగజి గౌరవార్ధం ప్రతిసంవత్సరం " శరత్‌పూర్ణిమ " నాడు ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవం 15 రోజులపాటు నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవానికి సామీపగ్రామాలనుండి సింగజి ఆలయానికి వచ్చి పూజలలో పాల్గింటారు. భక్తులు గ్రామాలలో సింగజీ భజనలు ఆలపిస్తుంటారు.
సరూ బ్రియర్లీ
మార్చుసరూ బ్రియర్లీ ఖాండ్వాలో జన్మించాడు. ఆయన ఇక్కడ 5 సంవత్సరాలు నివసించిన తరువాత నాటకీయంగా ఆస్ట్రేలియా కుటుంబానికి దత్తు ఇవ్వబడ్డాడు. ఆయనకు తాను జన్మించిన ప్రాంతం కచ్చితంగా తెలియదు. 25 సంవత్సరాల తరువాత ఆయన తన జన్మస్థలం తెలుసుకోవడానికి గూగుల్ సెర్చిని ఉపయోగించాడు. చివరకు తను తెలుసుకున్నదానిని అనుసరించి ఆయన ఖాండ్వాలోని గణేశ్ తాలైకి వెళ్ళాడు. బ్రియర్లీ తను వ్రాసిన పుస్తకం " ఎ లాంగ్ వే హోం "లో ఇండియాలో తన ఆరంభకాల జీవితం, దత్తు పోవడం తరువా ఆస్ట్రేలియా జీవితం విజయవంతమైన తన శోధన గురించి వర్ణించాడు.[6]
మూలాలు
మార్చు- ↑ Hunter, William Wilson, Sir, et al. (1908). Imperial Gazetteer of India, Volume 6. 1908-1931; Clarendon Press, Oxford
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ Wel-Come to Barwani (M.P.) Archived 2019-10-05 at the Wayback Machine. Barwani.nic.in. Retrieved on 2012-06-20.
- ↑ Brierley, Saroo (2013). A Long Way Home. Viking, Australia ISBN 9780670077045