ఖుర్దా జిల్లా
ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో ఖుర్దా జిల్లా ఒకటి. 1993లో పూరి జిల్లా నుండి నయాగఢ్, ఖుర్దా, పూరి జిల్లాలు రుఒందించబడ్డాయి. 2000లో ఖుర్దా అనే పేరు ఖుర్దాగా మార్చబడింది. ఖుర్దా పట్టణం జిల్లకేంద్రంగా ఉంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ ఈ జిల్లాలోనే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా నగరీకరణ చేయబడిన జిల్లాగా ఖుర్దా గుర్తుంచబడుతుంది. ఖుర్దా రోడ్డులో ఉన్న రైల్వేస్టేషన్ " భారతీయ తూర్పు తీర రైల్వే విభాగం " నికి ప్రధాన కేంద్రంగా సేవలందిస్తుంది. ఖుర్దా జిల్లాలో ఇత్తడి పాత్రల తయారీ, కుటీరపతిశ్రమలు, రైలుపెట్టెల తయారీ, కేబుల్ తయారీకి ప్రత్యేకత సంతరించుకుంది.
ఖుర్దా జిల్లా ఖొర్దా | |
---|---|
జిల్లా | |
![]() ఒడిశా పటంలో జిల్లా స్థానం | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఒడిశా |
ప్రధాన కార్యాలయం | ఖుర్దా |
ప్రభుత్వం | |
• కలెక్టరు | Niranjan Sahoo (OAS)[1] |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,887.5 కి.మీ2 (1,114.9 చ. మై) |
జనాభా వివరాలు (2001) | |
• మొత్తం | 18,77,395 |
• సాంద్రత | 650/కి.మీ2 (1,700/చ. మై.) |
భాషలు | |
• అధికార | ఒరియా, హిందీ,ఇంగ్లీషు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 751 xxx |
టెలిఫోన్ కోడ్ | 674 |
వాహనాల నమోదు కోడ్ | OD-02/OD-33 |
సమీప పట్టణం | Bhubaneswar |
లింగ నిష్పత్తి | 1.108 ♂/♀ |
అక్షరాస్యత | 80.19% |
లోక్‌సభ నియోజకవర్గం | 2 |
Vidhan Sabha constituency | 6 |
శీతోష్ణస్థితి | Aw (Köppen) |
అవపాతం | 1,443 milliమీటర్లు (56.8 అం.) |
సగటు వేసవి ఉష్ణోగ్రత | 41.4 °C (106.5 °F) |
సగటు శీతాకాల ఉష్ణోగ్రత | 9.5 °C (49.1 °F) |
జాలస్థలి | www |
చరిత్రసవరించు
1568 నుండి 1803 వరకు ఖుర్దా ఒడిషా రాజధానిగా ఉండేది. ఖుర్దాలో ఉన్న కోట " చివరి స్వతంత్ర కోట" అనే ప్రత్యేక గుర్తింపును పొందింది. బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఈ రాజాస్థానాన్ని స్వతంత్రంగా ఉంచిన ఘనత బక్షి జగబంధు కే చెందుతుంది. ఆయనను ప్రజలు అభిమానంగా "పైకా బక్షి " అని పిలిచేవారు. ఖుర్దా జిల్లాలో ఒకప్పుడు అధికంగా నివసించిన సవర గిరిజన ప్రజలు ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తున్నారు. 16వ శతాబ్దం చివరి దశలో ఖుర్దా రాజవంశ మొదటి రాజులైన రాజా రామచంద్రదేవ ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలన కొనసాగించాడు. ఖుర్దా ప్రాంతం నిరంతర ముస్లిములు, మరాఠీ పాలకుల దాడికి గురైనప్పటికీ రాజ్యం 1804 వరకు స్వతంత్రంగానే ఉంది. రెండవ ఆంగ్లో - మరాఠీ సమయంలో ఈ ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలోకి మారింది. ఒడిషా చరిత్రలో ఖుర్దాకు ప్రత్యేక స్థానం ఉంది. 1568 వరకు ఒడిషా సామ్రాజ్యానికి ఖుర్దా రాజధానిగా ఉండేది. 1803 నాటికి ఒడిషా భూభాగాన్ని బ్రిటిష్ ప్రభుత్వం స్వంతం చేసుకున్నప్పటికీ 1827 వరకు ఖుర్దా మాత్రం స్వతంత్రంగానే ఉంది. ఖుర్దాకు చెందిన పైకాలు బ్రిటిష్ ఒడిషా ప్రభుత్వాన్ని కుదిపివేసేలా వ్యతిరేక అభిప్రాయం వెలిబుచ్చారు. భారతదేశ చివరి స్వతంత్ర కోటగా ఖుర్దాగదా గుర్తించబడింది. ఈ కోట శిథిలాలు భారతీయ గతవైభవానికి ప్రతీకగా నిలిచి ఉన్నాయి. ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ ఈ జిల్లాలోనే ఉంది.
భౌగోళికంసవరించు
ఖుర్దా జిల్లా 20.11° డిగ్రీల ఉత్తర అక్షాంశం 85.40° తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లాలో దయా, కుయాఖల్ నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లాలో 618.67 చ.కి.మీ వైశాల్యంలో అటవీప్రాంతం ఉంది.[2]
వాతావరణంసవరించు
Bhubaneswar | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ఆర్ధికంసవరించు
ఖుర్దా జిల్లా ఇత్తడి వస్తువుల తయారీ, కేబుల్ ఫ్యాక్టరీ, స్పిన్నింగ్ మిల్స్, వాచ్ రిపెయిరింగ్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఇండస్ట్రీలు, కోకోకోలా బాటిలింగ్ ప్లాంట్, చిన్నతరహా మెటల్ ఇండస్ట్రీలు ఉన్నాయి.
విభాగాలుసవరించు
- పార్లిమెంటరీ నియోజకవర్గాలు : 2
- అసెంబ్లీ నియోజకవర్గాలు : 6
- ఉపవిభాగాలు: 2[2]
- గ్రామాలు : 1,561[2]
- బ్లాకులు : 10[2]
- గ్రామ పంచాయితీలు : 168[2]
- తాలూకాలు : 8[2]
- పట్టణాలు : 5[2]
తాలూకాలుసవరించు
- బలియంత
- బలిపట్న
- బాణపూర్
- బెగునియా
- భువనేశ్వర్
- బొలాగర్
- చిల్కా
- జతని
- ఖుర్దా
- తంగి (ఒడిషా)
ఉపవిభాగాలుసవరించు
- భువనేశ్వర్ : 4 మండలాలు ఉన్నాయి : బలియానా, బలిపటన, జతని, భువనేశ్వర్.
- ఖుర్ద : 6 బ్లాకులు ఉన్నాయి : బాణపూర్, బెగునియా, బొల్గర్, చిలిక, ఖుర్ద సాదర్, తంగి.
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,246,341,[3] |
ఇది దాదాపు. | లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 201వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 799 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.65%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 925:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 87.51%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
పర్యాటక ఆకర్షణలుసవరించు
అరికమసవరించు
అరికమ గ్రామం బోలాగర్ మండలంలో ఉంది. ఇక్కడ అరణ్యంలో " మా కోషల్సుని " మందిరం ఉంది. అరణ్యం అరికమ, తనపల్లి గ్రామవాసులు సంరక్షణలో ఉంది. ఇది విహార కేంద్రం. ఇక్కడ వార్షికంగా మహాష్టమి, రాజా ఫెస్టివల్, వార్షిక యఙం మొదలైన పండుగలను గ్రామవాసులు ఉత్సాహంగా జరుపుకుంటారు. కుర్ధా నుండి ఇది 28 కి.మీ దూరంలో రాజసుంకల దలపతర్ రహదారి మార్గంలో ఉంది. ఇది దలపతూర్ నుండి 5 కి.మీ దూరం, రాజసుంకలకు 9కి.మీ దూరంలో ఉంది.
అత్రిసవరించు
అత్రి ఉష్ణగుండం భగమరి గ్రామంలో ఉంది. ఇది భువనేశ్వర్ నుండి 42 కి.మీ దూరంలో, ఖోద్రా నుండి 14 కి.మీ దూరంలోఉంది. ఇక్కడ ప్రత్యేకత కలిగిన సల్ఫర్ వాటర్ ఉష్ణగుండం, హటకేశ్వరాలయం (ప్రధాన దైవం శివుడు) ఉంది.
బాణపూర్సవరించు
బాణపూర్ మాభగబతి (దుర్గాదేవి అవతారాలలో ఒకటి) ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బరువైన ఇనుప వస్తువు నీటి మీద తేలుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత.
మా బరునై ఆలయంసవరించు
మా బరునై ఆలయం ప్రఖ్యాత బరినై కొండల మీద ఉంది. ఇది భువనేశ్వర్‌కు 28కి.మీ దూరంలో ఉంది. ఖుర్ధా ప్రాంతంలో బరునై దేవి ప్రధాన దైవంగా ఉంది. ఇక్కడ కొండల నుండి " స్వర్ణగంగ " అనే అందమైన శెలయేరు ప్రవహిస్తుంది. ఇది ఈ ప్రాంతం అందానికి మరింత వన్నె తీసుకు వస్తుంది. ఇది గుర్తించతగిన ఒడిషా చారిత్రక ప్రదేశాలలో ఒకటి.
భువనేశ్వర్సవరించు
ఒడిషా రాజధాని భువనేశ్వర్ గతంలో కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. భువనేశ్వర్ " భారతీయ దేవాలయ నగరం " అనే ప్రత్యేక నామం ఉంది. పురాతన కాలం నుండి ఇక్కడ అనేక ఆలయాలు నిర్మించబడ్డాయి. వీటిలో లింగరాజ్ ఆలయం, కందగిరి, కేదార్ గౌరి, రాంమదిర్ మొదలైనవి ప్రధానమైనవి. నగరంలో ఒడిషా స్టేట్ మ్యూజియం, బిందుసాగర్ సరోవరం, రబీంద్ర మండపం), రాజభవనం, లెజిస్లేటివ్ అసెంబ్లీ, నదంకనన్, సిటీ పార్కులు, గార్డెన్లు మొదలైనవి ఉన్నాయి. భువనేశ్వర్ ఒడిషాలోని ప్రధాన షాపింగ్ కేంద్రంగా గుర్తించబడుతుంది.
చిలికా సరస్సుసవరించు
చిలికా సరస్సు రాష్ట్రరాజధాని భువనేశ్వర్‌కు 100 కి.మీ దూరంలో ఉంది. చిలికా సరస్సు భారతదేశంలో అతి పెద్ద సరస్సుగా గుర్తించబడుతుంది. శీతాకాలంలో ఈ సరస్సు పక్షుల శరణాలయంగా ప్రకటించబడుతుంది. ఇక్కడికి పలు జాతుల వలస పక్షులు వస్తుంటాయి. ఈ సరసును ఒడిషా పక్షుల శరణాలయంగా ప్రకటించింది. సరసులో పలు దీవులు ఉన్నాయి. వీటిలో కలిజై దీవి చాలా అందమైనది. ఇక్కడ కలిజై ఆలయం ఉంది. సమీపంలోని ప్రజలు ఈ ఆలయ దైవాన్ని దర్శించడానికి వస్తుంటారు. దీనికి సమీపంలో భారతీయ నౌకాదళ శిక్షణాకేంద్రం ఉంది.
డీర్స్ & ఝంకసవరించు
డీర్స్ & ఝంక ఇవి రెండు విహారకేంద్రాలుగా ఉన్నాయి. ఇది భువనేశ్వర్‌కు 15కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ దట్టమైన అరణ్యం మద్య రెండు ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ప్రకృతి అందంతో తొణికిసలాడే ఈ ప్రాంతానికి వేల సంఖ్యలో పర్యాటకులు వద్తుంటారు.
ధౌలిగిరిసవరించు
ధౌలిగిరి వద్ద ఉన్న శిలాక్షరాలు అశోకచక్రవరి కాలం నాటివని భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న శిలాక్షరాలు కళింగ రాజుల వివరాలు లిఖించబడి ఉన్నాయి. ఇది భువనేశ్వర్ నుండి 15 కి.మీ దూరంలో ఉంది.
గరమనిత్రిసవరించు
గరమనిత్రి వద్ద ప్రముఖ రామచండి ఆలయం ఉంది. ఇది ఒక విహారకేంద్రంగా కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది.
గొలబైసవరించు
గొలబై సాసన్ మద్యయుగ ఆలయ నిర్మాణశైలి ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఈ గ్రామం మదాకినీ నది (ప్రాంతీయ వాసులు మల్లగుని అంటారు) తీరంలో చిలికా సరోవర సమీపంలో ఉంది. 1991లో ట్రియల్ త్రవ్వకాలలో చాల్కోలిథిక్, ఇరన్ యుగానికి చెందిన అవశేషాలు లభ్యం అయ్యాయి. ఇవి క్రీ.పూ 2-1 వ శతాబ్ధానికి చెందినవని భావిస్తున్నారు. లేత ఎరుపు, బూడిద వర్ణానికి చెందిన మట్టి పాత్రలు లభిస్తున్నాయి. భూ అంతర్గత శిలలు తూర్పు, దక్షిణాసియాకు చెందినవని తెలియజేస్తున్నాయి. ఒడిషాలో ఈ కాలానికి చెందిన ప్రాంతాలలో " శంకర్జంగ్ " ప్రధానమైనదని భావిస్తున్నారు.
గౌపూర్సవరించు
గౌపూర్ భువనేశ్వర్- పూరీ రహదారి మార్గంలో ఉంది. తూర్పు రహదారి మార్గం ద్వారా ఈ ప్రశాంతమైన గ్రామానికి సులువుగా చేరుకోవచ్చు. ఈ గ్రామం భువనేశ్వర్ నుండి 20కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న వరిపొలాలు, ప్రశాంతమైన ఆలయాలు పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తున్నాయి.
హతబస్తసవరించు
హతబస్త గ్రామం (శ్రీచంద్రపూర్ పట్నం) రాజ్-సునఖేలాకు 3 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ప్రబలమౌన " మాజోగమాయా " ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న కొలనులో సంవత్సరం అంతా తామరపుష్పాలు వికసించి ఉంటాయి. హతబస్తా గ్రామవాసుల పూజలు అందుకుంటున్న సపనేశ్వర్ ఆలయ పరిసరాలు బహుసుందరంగా ఉంటాయి. ఇక్కడ ఝాముయాత్ర, రామలీల, కార్తిక పూర్ణిమ మొదలైన ఉత్సవాలను అత్యుత్సాహంగా నిర్వహించబడుతుంటాయి.
కైపదర్సవరించు
కైపదర్ ఖుర్ధాకు 15 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ అందమైన మసీదు ఉంది. ఇది హిందు ముస్లిములు సమైక్యంగా కూడే ప్రదేశం.
కందగిరి, ఉదయగిరిసవరించు
కందగిరి, ఉదయగిరి ఈ జంట పర్వతాలు భువనేశ్వర్‌లో ఉన్నాయి. ఈ కొండలలో 17 గుహలు ఉన్నాయి. వీటిలో ఉదయగిరిలో ఉన్న రాణి గుంఫా పెద్దది. మరొక గుర్తింపు పొందిన హుహ హాతి గుంఫా. ఇక్కడ ఉన్న శిలాక్షరాలను రాజా కరివేలా చెక్కించాడని భావిస్తున్నారు. వీటిని హతిగుంఫా శిలాక్షరాలు అని అంటారు. ఈ గుహలలో బారభుజ ఆలయం, జైన్ మందిరం ఉన్నాయి.
లిగరై ఆలయంసవరించు
లిగరై ఆలయం ఒడిషాలో అత్యంత విశాలమైనది, అత్యంత ప్రబలమైనదిగా భావించచబడుతుంది. ఈ ప్రాంతంలో ఇతర పురాతన ఆలయాలు కూడా ఉనికిలో ఉన్నాయి..
మా ఉగ్ర తారాసవరించు
మా ఉగ్ర తారా ఆలయం రామేశ్వర్ చౌక్ - చాంద్‌పూర్ ( తంగి మండలంలో) ఉంది. ఇది భువనేశ్వర్‌కు 55కి.మీ దూరంలో, బలుగావ్‌కు 35కి.మీ దూరంలో ఉంది. ప్రకృతిసౌందర్యంతో అలరారే ఈ ప్రాంతం విహారకేంద్రంగా అలరాతుతుంది. ఇక్కడ చలనచిత్ర చిత్రీకరణ జరుగుతూ ఉంటుంది. తంగి మండలం అంతా మా ఉగ్ర తారా దేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. సమీపంలో ఉన్న భూషణపూర్ గ్రామం ఒడిషా రాష్ట్రంలో పెద్దదిగా గుర్తించబడుతుంది. ఈ గ్రామం ఇది మత్యకారుల గ్రామంగా గుర్తించబడుతుంది, పక్కన చిలికా సరసు ఉండడమే ఇందుకు కారణం.
నందంకనన్ జూసవరించు
ఒడిషాలోని నందంకనన్ జూ భువనేశ్వర్‌కు 29కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ బొటానికల్ గార్డెన్, జూ, సహజసిద్ధమైన సరోవరం వంటి ప్రత్యేతలతో ఇలాంటి జూ కలో ఇది భారతదేశంలో పెద్దదిగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇక్కడ ఉన్న తెల్లని పులులు ఈ జూకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకు వస్తున్నాయి. .
షిషుపాల్గర్సవరించు
షిషుపాల్గర్ ఒక శిథిలమైన ఓడరేవుగా గుర్తించబడుతుంది. శిథిలమైన షిషుపాలగర్ ఓడరేవు, పురాతన కళింగ రాజధానిగా భావించబడుతున్న తోషలి లలు " ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా " చేత కనిపెట్టబడ్డాయి.
షిఖర్ చండిసవరించు
షిఖర్ చండి భువనేశ్వరుకు 15 కి.మీ దూరంలో భువనేశ్వర్ - నందంకనన్ మార్గంలో ఉంది. ఇక్కడ కొండ శిఖరం మీద చండీ ఆలయం ఉంది. ఈ ప్రాంతపు ప్రకృతి సౌందర్యం పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.
రాజకీయాలుసవరించు
అసెంబ్లీ నియోజక వర్గాలుసవరించు
The following is the 8 Vidhan sabha constituencies[6][7] of Khordha district and the elected members[8] of that area
క్ర.సం | నియోజకవర్గం | రిజర్వేషను | పరిధి | 14 వ శాసనసభ సభ్యులు | పార్టీ |
---|---|---|---|---|---|
111 | Jayadev | SC | Balianta, Balipatna | Arabinda Dhali | BJD |
112 | భువనేశ్వర్ సెంట్రల్ | లేదు | భువనేశ్వర్ ఎం.సి వార్డ్, 16 నుండి 29, 35,36,37 | బిజయకుమార్ మహోనీ | బి.జె.పి |
113 | ఉత్తర భువనేశ్వర్ | లేదు | భువనేశ్వర్ (భాగం) ,భువనేశ్వర్ | Bhagirathi Badajena | బి.జె.డి |
114 | ఎక్మర- భువనేశ్వర్ | లేదు | భువనేశ్వర్ (ఎం.సి) (భాగం) , భువనృశ్వర్ (భాగం) | అశోక్ చంద్రా పాండా | బి.జె.డి |
115 | జతని | లేదు | జతని (ఎం),ఖుర్ద భాగం , Bhubaneswar (part) | బిభుతి భూషణ బలబంతరే | బి.జె.డి |
116 | బెగునియా | లేదు | బెగునియా, బొలోగర్ | ప్రశాంత నందా | బి.జె.డి |
117 | ఖుర్దా | లేదు | ఖుర్దా (ఎం ), తంగి, ఖుర్దా భాగం | రాజేంద్ర కుమార్ సాహూ | స్వతంత్ర Independent |
118 | చిలిక | లేదు | బాలుగావ్ (ఎన్.ఎ.సి), బాణపూర్ (ఎన్.ఎ.సి), చిలిక, బాణపూర్, | రఘునాథ్ సాహు | బి.జె.డి |
మూలాలుసవరించు
- ↑ http://www.odisha.gov.in/ga/notifications/gnotification/Pdf/2013/19643.pdf
- ↑ 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 "Introduction". Khordha district official website. Archived from the original on 2008-10-02. Retrieved 2008-09-12.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
{{cite web}}
: line feed character in|quote=
at position 7 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179
- ↑ Assembly Constituencies and their EXtent
- ↑ Seats of Odisha
- ↑ "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013.
MEMBER NAME
{{cite web}}
: Check date values in:|archive-date=
(help)
వెలుపలి లింకులుసవరించు
వెలుపలి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Khordha district. |