ఖుషీ మురళి

భారతీయ నేపథ్య గాయకుడు.

ఖుషి మురళి (1963 - 2013, జనవరి 11) గా ప్రసిద్ధి చెందిన కొరివి మురళీధర్ భారతీయ నేపథ్య గాయకుడు. ఖుషి సినిమాలోని "ఆడవారి మాటలకు" అనే హిట్ పాట ద్వారా ప్రజాదరణ పొందాడు.[1]

ఖుషీ మురళి
జననం
కొరివి మురళీధర్

1963
మరణం2013, జనవరి 11
వృత్తినేపథ్య గాయకుడు
పిల్లలుసాయి వెంకట్, హరిప్రియ

మురళి 1963లో చిత్తూరు జిల్లా, రేణిగుంటలో జన్మించాడు. సినిమా రంగంలో అవకాశాల కోసం చెన్నై వెళ్లాడు.

రెండు దశాబ్దాలపాటు తన కెరీర్‌లో ప్రైవేట్ ఆల్బమ్‌ల కోసం 500 సినిమా పాటలు, 1,000 భక్తి పాటలు పాడారు. ఆయన కూతురు హరిప్రియ కూడా నేపథ్య గాయని.

అతను 2013, జనవరి 11న కాకినాడ బీచ్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళుతున్న సమయంలో గుండెపోటుతో మరణించాడు.[2]

మూలాలు

మార్చు
  1. "The Hindu : States / Andhra Pradesh : Singer Muralidhar dies during train journey". The Hindu. Archived from the original on 2013-01-14.
  2. "Singer 'Kushi' Murali dies of cardiac arrest". The Times of India. Archived from the original on 3 February 2013. Retrieved 17 January 2022.