ఖుస్రావ్ మీర్జా (ఉర్దూ: خسرو مِرزا) (16 ఆగస్టు 1587 – 26 జనవరి 1622) లేదా రాజకుమారుడు ఖుస్రావు మొఘలు చక్రవర్తి జహంగీరు పెద్ద కుమారుడు.[2]

Khusrau Mirza
Mirza[1]
Shahzada of the Mughal Empire
Emperor Jahangir receiving his two sons, Khusrau and Parviz, an album-painting in gouache on paper, c. 1605-06
జననం16 August 1587
Lahore, Mughal Empire
మరణం1622 జనవరి 26(1622-01-26) (వయసు 34)
Deccan
Burial
WivesDaughter of Mirza Aziz Koka
Daughter of Jani Beg Tarkhan of Thatta
Daughter of Muqim, son of Mihtar Fazil Rikabdar
వంశముDawar Bakhsh
Buland Akhtar Mirza
Gurshasp Mirza
Hoshmand Banu Begum
HouseTimurid
తండ్రిJahangir
తల్లిShah Begum
మతంIslam

ఆరంభకాల జీవితం

మార్చు

ఖుస్రావు ఆగస్టు 16, 1587 న లాహోర్లో జన్మించాడు.[3] ఆయన తల్లి మన్భవతి బాయి (ఆమె వివాహానంతరం ఆమెకు షా బేగం అనే బిరుదు ఇవ్వబడింది). కచ్వాహా రాజ్పుత్రుల వంశానికి అధిపతి అయిన అంబరు (జైపూరు) కు చెందిన రాజా భగవంతు దాసు కుమార్తె. 1605 మే 16 న నల్లమందు తినడం ద్వారా ఆత్మహత్య చేసుకుంది.[4]

కుటుంబం

మార్చు

ఖుస్రావు మొదటి భార్య పత్తమహిషి భార్య మిర్జా అజీజు కోకా (ఖాను అజాం)అత్యంత శక్తివంతుడు. ఆయన జిజి అంగ కుమారుడు. జిజి అంగ చక్రవర్తి అక్బరు పెంపుడు తల్లి. ఆమెతో ఖుస్రావు వివాహం ఏర్పాటు చేయబడినప్పుడు సాయిదు ఖాను అబ్దుల్లా ఖాను, మీర్ సదరు జహాను 1,00,000 రూపాయలు అందజేయాలని ఆదేశించబడింది.[5] సిహరు బహా ద్వారా మీర్జా ఇంటికి సాచాకుగా ఇవ్వమని ఒక ఉత్తర్వు ఇవ్వబడింది.[6]ఆమె ఆయన అభిమాన భార్య, ఆమె పెద్ద కుమారుడు దావారు బఖ్షి. [7] ఆయన రెండవ కుమారుడు రాజకుమారుడు బులాందు అక్తరు మీర్జా 1609 మార్చి 11 న జన్మించాడు. [8]ఆయన బాల్యంలోనే మరణించాడు.

ఖుస్రావు భార్యలలో మరొకరు తట్టాకు చెందిన జానీ బేగు. ఆమె తార్ఖాను కుమార్తె.[9] ఆమె మీర్జా ఘాజీ బేగు సోదరి. ఈ వివాహం ఖుస్రావు తాత చక్రవర్తి అక్బరు చేత ఏర్పాటు చేయబడింది.[10][11] ఆయన భార్యలలో మరొకరు మిహ్తారు ఫాజిలు రికాబ్దారు (స్టిరపు హోల్డరు) కుమారుడు ముకిం కుమార్తె. ఆమె ప్రింసు గుర్షాస్పు మీర్జా (1616 ఏప్రెలు 8 న జన్మించిన) తల్లి.[12][13] ఖుస్రావు కుమార్తె హోష్మండు బాను బేగం (1605 లో జన్మించిన). ఆమె రాజకుమారుడు డేనియలు మీర్జా కుమారుడు రాకుమారుడు హోషాంగును మీర్జాను వివాహం చేసుకున్నాది.[14]

తిరుగుబాటు తరువాత

మార్చు

1605 లో అక్బరు చక్రవర్తి మరణించాడు. ఖుస్రావ్వు తండ్రి జహంగీరు ప్రవర్తన పట్ల అక్బరు తీవ్ర అసంతృప్తి చెందాడు. బహుశా ఈ నేపథ్యం కారణంగా ఖుస్రావు 1606 లో తన తండ్రి మీద తిరుగుబాటు చేసి తన కొరకు సింహాసనాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నించాడు.

 
ఖుస్రౌవును బంధించి జహంగీరుకు సమర్పించారు
 
ఖుస్రౌ మద్దతుదారుల మరణశిక్షను వీక్షించాలని బలవంతపరచబడ్డాడు

సమీపంలోని సికంద్ర వద్ద ఉన్న అక్బరు సమాధిని సందర్శించే నెపంతో ఖుస్రావు 1606 ఏప్రిల్ 6 న [15] 350 గుర్రాలతో ఆగ్రా నుండి బయలుదేరాడు. మధురలో హుస్సేను బేగు సుమారు 3000 గుర్రాలతో అశ్వసైనికులు చేరారు. పానిపట్టులో లాహోరు ప్రాంతీయ రాజప్రతినిధి అబ్దురు రహీం చేరాడు. ఖుస్రావు అమృత్సరు సమీపంలోని తరణు తరను చేరుకున్నసమయంలో ఆయన గురు అర్జన దేవు ఆశీర్వాదం పొందాడు.[16]

ఖిస్రౌవు లాహోరును ముట్టడించాడు. దీనిని దిలావరు ఖాను సమర్థించాడు. జహంగీరు త్వరలోనే పెద్ద సైన్యంతో లాహోరు చేరుకున్నాడు. భైరోవాలు యుద్ధంలో ఖుస్రౌవు ఓడిపోయాడు. ఆయన, ఆయన అనుచరులు కాబూలు వైపు పారిపోవడానికి ప్రయత్నించారు. కాని వారు చెనాబు నది దాటినసమయంలో వారు జహంగీరు సైన్యానికి పట్టుబడ్డారు.[17]

ఖుస్రౌను మొదట ఢిల్లీకి తీసుకువచ్చారు. అక్కడ ఆయనకు ఒక సరికొత్త శిక్ష విధించబడింది. అతను ఏనుగు దీద కూర్చుని చాందిని చౌకులో ఉరేపులా కదిలాడు. ఇరుకైన వీధికి ఇరువైపులా ఆయనకు మద్దతు ఇచ్చిన కులీనులు వేదికలపై కత్తిమొన మీద ఉంచారు. ఏనుగు వేదిక వద్దకు చేరుకున్నప్పుడు దురదృష్టవంతుడైన మద్దతుదారుని ఒక కొయ్యతో కొట్టారు. ఖుస్రావుకు ఈ భయంకరమైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడవలసిన అగత్యం ఏర్పడింది. అలాగే తనకు మద్దతు ఇచ్చిన వారి అరుపులు, విన్నపాలను వినవలసి వచ్చింది. చాందిని చౌకు మొత్తం పొడవులో ఇది చాలాసార్లు పునరావృతమైంది.

 
అలహాబాదులోని ఖుస్రోవు బాగులోని ఖుస్రావు మీర్జా సమాధి

అప్పుడు ఖుస్రావు అంధుడుగా (1607 లో) ఆగ్రాలో ఖైదు చేయబడ్డాడు. అయినప్పటికీ ఆయన పూర్తిగా కంటి చూపును పూర్తిగా కోల్పోలేదు. తరువాత 1616 లో ఆయనను ఆయన సవతి తల్లి నూర్జెహాను సోదరుడు అసఫు ఖానుకు అప్పగించారు. 1620 లో ఆయనను ఆయన తమ్ముడు రాకుమారుడు ఖుర్రాం (తరువాత చక్రవర్తి ఆయనను షాజహాను అని పిలుస్తారు) కు అప్పగించారు. ఆయన యాసఫు ఖాను అల్లుడు. 1622 లో రాకుమారుడు ఖుర్రాం ఆదేశాల మేరకు ఖుస్రౌవు చంపబడ్డాడు.[18][19]

భావితరాలు

మార్చు

జహంగీరు మరణం తరువాత ఖుస్రౌవు కుమారుడు రాకుమారుడు దావారు మొఘలు సామ్రాజ్యానికి స్వల్పకాలం పాలకుడయ్యాడు. తరువాత అసఫు ఖాను మద్ధతుతో షాజహాన్ మొఘల్ సింహాసనాన్ని దక్కించుకున్నాడు.

జుమాడా-ఎల్ అవ్వాలు 2న 1037 ఎ.హెచ్. (డిసెంబరు 30, 1627 డిసెంబరు 30) న [20]),షాజహాన్ లాహోరులో చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు. జుమాడా-ఎల్ అవ్వాలు 26, 1037 ఎ.హెచ్.(జనవరి 23, 1628 జనవరి 23) లో[20])దావారు ఆయన సోదరుడు గార్షాస్పు, మామ షహర్యారు, అలాగే మరణించిన రాకుమారుడు డేనియలు కుమారులు తహ్మురాసు, హోషాంగుతో సహా అందరినీ అసఫు ఖాను చంపాడు.[21] షాజహాన్ వారిని "ప్రపంచం నుండి" పంపమని ఆదేశించి తరువాత ఆయన ధైర్యంగా అధికారం చేపట్టాడు.[22]

మూలాలు

మార్చు
  1. Mughla title Mirza, the title of Mirza and not Khan or Padshah, which were the titles of the Mongol rulers.
  2. The Grandees of the Empire Archived 2016-10-24 at the Wayback Machine Ain-i-Akbari, by Abul Fazl, Volume I, Chpt. 30.
  3. Beveridge, H. (tr.) (1939, reprint 2000) The Akbar Nama of Abu'l-Fazl, Vol.III, Calcutta: The Asiatic Society, ISBN 81-7236-094-0, p.799
  4. Beveridge, H. (tr.) (1939, reprint 2000) The Akbar Nama of Abu'l-Fazl, Vol.III, Calcutta: The Asiatic Society,ISBN 81-7236-094-0, p.1239
  5. Smart, Ellen S.; Walker, Daniel S. (1985). Pride of the princes: Indian art of the Mughal era in the Cincinnati Art Museum. Cincinnati Art Museum. p. 27.
  6. Mukhia, Harbans (April 15, 2008). The Mughals of India. John Wiley & Sons. p. 151. ISBN 978-0-470-75815-1.
  7. Shujauddin, Mohammad; Shujauddin, Razia (1967). The Life and Times of Noor Jahan. Caravan Book House. p. 70.
  8. Jahangir, Rogers & Beveridge 1909, p. 153.
  9. Habib, Irfan (1997). Akbar and His India. Oxford University Press. pp. 50.
  10. Jahangir, Emperor; Thackston, Wheeler McIntosh (1999). The Jahangirnama : memoirs of Jahangir, Emperor of India. Washington, D. C.: Freer Gallery of Art, Arthur M. Sackler Gallery, Smithsonian Institution; New York: Oxford University Press. pp. 30, 136. ISBN 978-0-19-512718-8.
  11. Hasan Siddiqi, Mahmudul (1972). History of the Arghuns and Tarkhans of Sindh, 1507–1593: An Annotated Translation of the Relevant Parts of Mir Ma'sums Ta'rikh-i-Sindh, with an Introduction & Appendices. Institute of Sindhology, University of Sind. p. 205.
  12. Jahangir, Rogers & Beveridge 1909, p. 321.
  13. Jahangir, Emperor; Thackston, Wheeler McIntosh (1999). The Jahangirnama : memoirs of Jahangir, Emperor of India. Washington, D. C.: Freer Gallery of Art, Arthur M. Sackler Gallery, Smithsonian Institution; New York: Oxford University Press. pp. 192. ISBN 978-0-19-512718-8.
  14. Jahangir, Emperor; Thackston, Wheeler McIntosh (1999). The Jahangirnama : memoirs of Jahangir, Emperor of India. Washington, D. C.: Freer Gallery of Art, Arthur M. Sackler Gallery, Smithsonian Institution; New York: Oxford University Press. pp. 97, 436. ISBN 978-0-19-512718-8.
  15. Majumdar, R.C. (ed.)(2007). The Mughul Empire, Mumbai: Bharatiya Vidya Bhavan, p.179
  16. Melton, J. Gordon (Jan 15, 2014). Faiths Across Time: 5,000 Years of Religious History. ABC-CLIO. p. 1163. ISBN 978-1-61069-026-3. Retrieved Nov 3, 2014.
  17. The Flight of Khusrau Archived 2014-12-28 at the Wayback Machine The Tuzk-e-Jahangiri Or Memoirs Of Jahangir, Alexander Rogers and Henry Beveridge. Royal Asiatic Society, 1909–1914. Vol. I, Chapter 3. p 51, 62-72., Volume 1, chpt. 20
  18. Mahajan V.D. (1991, reprint 2007) History of Medieval India, Part II, New Delhi: S. Chand, ISBN 81-219-0364-5, pp.126-7
  19. Ellison Banks Findly (25 March 1993). Nur Jahan: Empress of Mughal India. Oxford University Press. pp. 170–172. ISBN 978-0-19-536060-8.
  20. 20.0 20.1 Taylor, G.P. (1907). Some Dates Relating to the Mughal Emperors of India in Journal and Proceedings of the Asiatic Society of Bengal, New Series, Vol.3, Calcutta: The Asiatic Society of Bengal, p.59
  21. Death of the Emperor (Jahangir) Archived 2012-02-09 at the Wayback Machine The History of India, as Told by Its Own Historians. The Muhammadan Period, Sir H. M. Elliot, London, 1867–1877, vol 6.
  22. Majumdar, R.C. (ed.)(2007). The Mughul Empire, Mumbai: Bharatiya Vidya Bhavan, pp.197-8

వెలుపలి లింకులు

మార్చు