గంభీరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల)

తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండలం


గంభీరావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

గంభీరావుపేట మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°18′00″N 78°35′00″E / 18.30000°N 78.58330°E / 18.30000; 78.58330
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రం గంభీరావుపేట్ (రాజన్న జిల్లా)
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 155 km² (59.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 46,878
 - పురుషులు 23,064
 - స్త్రీలు 23,814
పిన్‌కోడ్ 505304

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 155 చ.కి.మీ. కాగా, జనాభా 46,878. జనాభాలో పురుషులు 23,064 కాగా, స్త్రీల సంఖ్య 23,814. మండలంలో 11,602 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం
 1. గజసింగారం
 2. గోరంటియల్
 3. సముద్రలింగాపురం
 4. దమ్మన్నపేట
 5. ఖుర్దులింగంపల్లి
 6. లక్ష్మీపురం
 7. రామాంజపురం
 8. మల్లారెడ్డిపేట్
 9. గంభీరావుపేట్
 10. ముస్తఫానగర్
 11. నర్మల
 12. దేశాయిపేట్
 13. కొల్లమద్ది
 14. శ్రీగద
 15. కొత్తపల్లి
 16. లింగన్నపేట
 17. ముచ్చర్ల

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.