గణపతిరావు దేశ్‌ముఖ్

గణపత్రావ్ దేశ్‌ముఖ్ (10 ఆగష్టు 1927 - 30 జూలై 2021) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు సంగోలా శాసనసభ నియోజకవర్గం నుండి పదకొండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]

గణపతిరావు దేశ్‌ముఖ్

పదవీ కాలం
1999 – 2019
ముందు షాహాజీబాపు పాటిల్
తరువాత షాహాజీబాపు పాటిల్
నియోజకవర్గం సంగోలా
పదవీ కాలం
1974 – 1995
ముందు ఎస్. బాపూసాహెబ్ పాటిల్
తరువాత షాహాజీబాపు పాటిల్
నియోజకవర్గం సంగోలా
పదవీ కాలం
1962 – 1972
ముందు మారుతీ కాంబ్లే
తరువాత ఎస్. బాపూసాహెబ్ పాటిల్
నియోజకవర్గం సంగోలా

వ్యక్తిగత వివరాలు

జననం 1927 ఆగస్టు 10
పెనూర్, మోహోల్ , షోలాపూర్ , బ్రిటిష్ రాజ్
మరణం 2021 జూలై 30(2021-07-30) (వయసు: 93)
షోలాపూర్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ది పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామి రతన్బాయి దేశ్‌ముఖ్
సంతానం 3
నివాసం సంగోలా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

గణపతిరావు దేశ్‌ముఖ్ ది పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1962 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సంగోలా శాసనసభ నియోజకవర్గం నుండి పిడబ్ల్యూపి అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1967 ఎన్నికలలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1972 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు.

గణపతిరావు దేశ్‌ముఖ్ 1974లో జరిగిన ఉప ఎన్నికలో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1978, 1980, 1985, 1990 ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 1995 ఎన్నికల్లో 192 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2004, 2009, 2014, 2019 ఎన్నికలలో గెలిచి 54 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేశాడు.

గణపతిరావు దేశ్‌ముఖ్ పిడబ్ల్యూపి - కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మద్దతునిచ్చినప్పుడు 1978లో శరద్ పవర్ మంత్రివర్గంలో, 1999లో విలాస్రావ్ దేశ్‌ముఖ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశాడు.

గణపత్రావ్ దేశ్‌ముఖ్ 94 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ షోలాపూర్లోని అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 జూలై 30న మరణించాడు.[2][3][4] ఆయన అంత్యక్రియలు సంగోల కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు మైదానంలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.[5]

మూలాలు

మార్చు
  1. "Longest-serving MLA in Maharashtra Ganpatrao Deshmukh creates record, wins 11th time" (in ఇంగ్లీష్). The Indian Express. 19 October 2014. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
  2. "Veteran PWP leader Ganpatrao Deshmukh dies at 94" (in ఇంగ్లీష్). The Indian Express. 31 July 2021. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
  3. "Maharashtra's 11-term MLA and former minister Ganpatrao Deshmukh dead" (in Indian English). The Hindu. 31 July 2021. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
  4. "Former Maharashtra MLA Ganpatrao Deshmukh passes away at 94" (in ఇంగ్లీష్). India Today. 31 July 2021. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
  5. "11-time MLA Ganpatrao Deshmukh cremated with state honours" (in ఇంగ్లీష్). The Indian Express. 1 August 2021. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.