గణేశ దమనపూజ ఎలా చేయాలి

గణేశ దమన పూజ చేయించడం వల్ల విజ్ఞానాలు తొలగి అభీష్టాలు సిద్ధిస్తాయి.

చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ప్రతి తిథి నాడు ఒక్కో దేవతను దమనపత్రితో ఆరాధించే సంప్రదాయం ఉంది.

అందులో భాగంగా చైత్ర శుద్ధ చవితి / చతుర్థి నాడు శ్రీ మహా గణపతిని దమనము (అంటే మరువముతో) ఆరాధిస్తే , ఆ ఏడాదంతా కలిగే విఘ్నాలు తొలగిపోతాయని శాస్త్రవాక్కు. కావున విఘ్ననివారణ జరగాలని కోరుకునే వారంతా ఈ రోజు గణపతిని మరువముతో తప్పక ఆరాధించండి.

ఈ పూజ ప్రదానముగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా ఆచరిస్తారు. వినాయకున్ని ప్రతిష్టించి, షోడోపచారములతో పూజ చేయాలి. షోడోపచార పూజలో దమనము చాలా ముఖ్యమైనది. గణేశుడుని దమనము ఆకులతోను మరియు దమనము మాలలతో అలంకరించాలి. పాయసం,మోదకాలు వంటి తీపి పదార్థాలను సమర్పించాలి.

దమన పూజ ద్వారా గణేశుడుని ప్రసన్నం చేసుకుని, ఆయన అనుగ్రహం పొందాలనేది పూజకు గల ఉద్దేశం.