గమళ్ళపాలెం(తోటపల్లిగూడూరు)

"గమళ్ళపాలెం(తోటపల్లిగూడూరు)"శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 524 311 ., ఎస్.టి.డి. కోడ్ = 0861.

గమళ్ళపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
గమళ్ళపాలెం is located in Andhra Pradesh
గమళ్ళపాలెం
గమళ్ళపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°29′07″N 80°07′51″E / 14.485182°N 80.130753°E / 14.485182; 80.130753
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం తోటపల్లిగూడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 524 311
ఎస్.టి.డి కోడ్ 0861

గమళ్ళపాలెం, నెల్లూరు జిల్లా, తోటపల్లిగూడూరు మండలానికి చెందిన గ్రామం

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలుసవరించు

ఈ గ్రామంలోని అంకమ్మ తల్లి నూతన ఆలయంలో శిలావిగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంల్, 2014,మే-11 ఆదివారం (వైశాఖ శుక్ల ద్వాదశి) నాడు వైభవంగా జరిగింది.స్థానికులు ముందుగా విశేషపూజలు నిర్వహించారు. అనంతరం శిలా విగ్రహ ప్రతిష్ఠాపనా కార్యక్రమాన్ని, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజాకార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. సోమవారం నాడు అమ్మవారి గ్రామోత్సవాన్ని తప్పెట్లు, తాళాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు గూడా పాల్గొన్నారు. [1]

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; మే-13,2014; 1వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.