గాయత్రి భార్గవి

గాయత్రి భార్గవి దక్షిణ భారత సినిమా నటి, యాంకర్. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. గాయత్రి భార్గవి యాంకర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తరువాత 2008లో సినీరంగంలోకి అడుగుపెట్టి సినిమాలలో సహాయ నటి పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.[2]

పావని కరణం
జననం (1984-09-18) 1984 సెప్టెంబరు 18 (age 40)[1]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
జీవిత భాగస్వామివిక్రమ్‌ సుబ్రహ్మణ్యం
పిల్లలుఅక్షజ్‌ భావిక్‌, కృతిక్‌ భావిక్‌[1]
తల్లిదండ్రులురేవతి, సూర్య నారాయణ శర్మ
బంధువులుబాపు (తాతయ్య)

వ్యక్తిగత జీవితం

మార్చు

గాయత్రి భార్గవి 1984 సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె హబ్సిగూడలోని జహీర్ మెమోరియల్ ఐఐసిటీ క్యాంపస్ లో స్కూలింగ్ పూర్తి చేసి, పెళ్ళి తర్వాత ఎమ్.ఎ. ఎం.ఫిల్, బి.ఎడ్ పూర్తి చేసి, ఇఫ్లూలో ఎంఫిల్ లో బంగారు పతకం సాధించింది. గాయత్రి భార్గవికి 2004లో విక్రమ్‌ సుబ్రహ్మణ్యంతో వివాహం జరగగా ఈ దంపతులకి ఇద్దరు కుమారులు అక్షజ్‌ భావిక్‌, కృతిక్‌ భావిక్‌ ఉన్నారు.[3][4][5][6]

నటించిన సినిమాలు

మార్చు

గాయత్రి భార్గవి 18 ఏళ్ల వయసులో నటిగా ఆఫర్లు రాగా తన కుటుంబం సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ఆమె దానిని నిరాకరించింది. గాయత్రి భార్గవి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు టీవీ ఛానల్ వాళ్లు యాంకరింగ్ చేయమని అడగడంతో చదువుకు అంతరాయం కలగకుండా ఖాళీ సమయంలో వచ్చి ప్రోగ్రామ్స్ చేయొచ్చనే స్వేచ్ఛ ఇవ్వడంతో ఆమె యాంకర్‌గా వచ్చి ''ఆటకావాలా? పాటకా వాలా?'', అఫ్ టికెట్, డ్రీమ్ గాళ్ వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

గాయత్రి భార్గవి 'బలాదూర్' సినిమాతో నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 'తీన్‌మార్, 'గాలిపటం', 'ఒక లైలా కోసం' 'అత్తారింటికి దారేది' సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.[2]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర గమనికలు
2008 బలాదూర్ నటిగా తొలి సినిమా
2011 తీన్‌మార్
2012 అవును
2013 అత్తారింటికి దారేది
2014 గాలిపటం
ఒక లైలా కోసం
2015 అవును 2 స్వప్న
2016 జనతా గ్యారేజ్
2018 విజేత ఛైర్మన్ కోడలు
2019 విశ్వాసం
ప్రతి రోజు పండగే రఘు రామయ్య కూతురు [7]
2020 మర్డర్ వనజ, మాధ‌వ‌రావు భార్య [8]
ఎంత మంచివాడవురా నందిని చెల్లెలు
2022 గుడ్ లక్ సఖి
బింబిసారా
నచ్చింది గర్ల్ ఫ్రెండూ
2024 అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఝాన్సీ
లక్కీ భాస్కర్ బ్యాంక్ ఉద్యోగి [9]

వెబ్‌ సిరీస్‌

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2020 మెట్రో కథలు సల్మా ఆహా
లూజర్ 2 జీ5

మూలాలు

మార్చు
  1. "స్టార్ యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట్లో విషాదం". 10TV Telugu. 27 December 2023. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  2. "'OTT is the future': Anchor and actor Gayatri Bhargavi in conversation with TNM" (in ఇంగ్లీష్). The News Minute. 23 August 2020. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  3. "ఇది త్యాగం కాదు... బాధ్యత". Andhrajyothy. 26 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  4. "పడుకుంటే... బాంబుల చప్పుళ్లు". Eenadu. 15 August 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  5. "గుండెలదురుతూనే సాగనంపాను". Chitrajyothy. 26 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  6. "Proud mom Gayatri Bhargavi shares a heartwarming moment between husband Major Vikram and son". The Times of India. 6 June 2022. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  7. "Sai Dharam Tej's Prati Roju Pandaage release date announced". The Times of India. 16 October 2019. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  8. "Murder: Ram Gopal Varma's film about Miryalaguda honour killing gets green signal from Telangana High Court". The Times of India. 7 November 2020. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  9. "మా పక్కింట్లో ఉండేవారు.. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారు.. స్టార్ హీరోపై యాంకర్ వ్యాఖ్యలు." 10TV Telugu. 3 November 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.

బయటి లింకులు

మార్చు