గిన్నికోడి (ఆంగ్లం Guineafowl) ఒక రకమైన పక్షి జాతికి చెందినది. మామూలు కోళ్ల వలెనే వీటిని కూడ రైతులు తమ ఇళ్ల వద్ద పెంచుకుంటారు. ఇవి కూడ గ్రుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. కాని అన్ని కోళ్ల కన్నా ఇవి కొంచె ప్రత్యేకంగా వుంటాయి. అన్ని కోళ్ల లాగ వీనిని గూళ్లలోను, గంపల కింద పెట్టరు. ఇవి ఇళ్ల దగ్గర ఉన్న చెట్ల కొమ్మల మీద రాత్రులందు నివిసిస్తాయి. వీటి అరుపు నెమలి అరుపు లాగ వుంటుంది. ఇవి వున్న ఇంటి యందు పాములు రావు. వీటిని సీటి కోళ్లు లేదా సీమ కోళ్లు అని కూడా అంటారు.

గిన్నికోడి
Helmeted guineafowl kruger00.jpg
Helmeted Guineafowl, Numida meleagris
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Numididae

Genera
టెక్సాస్లోని ఒక గడ్డిబీడులో స్వేచ్ఛగా తిరుగుతున్న గినియాఫౌల్ మంద