గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం)

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండల జనగణన పట్టణం

గుంటుపల్లి, కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గుంటుపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
Guntupalli census town informatory sign in Telugu, photo taken from National Highway 9, August 2011.jpg
గుంటుపల్లి is located in Andhra Pradesh
గుంటుపల్లి
గుంటుపల్లి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°00′17″N 81°08′20″E / 17.004611°N 81.138958°E / 17.004611; 81.138958
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ఇబ్రహీంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 11,187
 - పురుషుల సంఖ్య 5,573
 - స్త్రీల సంఖ్య 5,614
 - గృహాల సంఖ్య 3,121
పిన్ కోడ్ 521241
ఎస్.టి.డి కోడ్ 0866

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో ఎలప్రోలు, బత్తినపాడు, చిలుకూరు, ఇబ్రహింపట్నం, పైదురుపాడు గ్రామాలు ఉన్నాయి.

రవాణా సౌకర్యాలుసవరించు

గొల్లపూడి, ఇబ్రహీంపట్నం నుండి రోడ్దురవాఃణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 9 కి.మీ

విద్యాసౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:-ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015,మార్చి-2వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. [3]

మౌలిక సదుపాయాలుసవరించు

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (P.A.C.S)సవరించు

విద్యుత్తుసవరించు

ఈ గ్రామంలోని ఖాజీపేటలోని సామాజిక స్థలంలో, 1.25 కోట్ల రూపాయల వ్యయంతో ఒక 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణం పూర్తి అయినది. [4]

రాష్ట్ర ప్రభుత్వ కాల్ సెంటర్సవరించు

గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న భవనంలో ఏర్పాటు చేసిన ఈ కాల్‌సెంటర్‌ను, 2017 ఏప్రిల్-21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రారంభించారు. 46 ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా ఏర్పాటుచేసిన ఈ కాల్‌సెంటర్‌లో, 500 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. [5]

గ్రామ పంచాయతీసవరించు

  1. ఇది ఒక మేజరు పంచాయతీ. ఖాజీపేట, సత్యనారాయణపురం, రామకృష్ణాపురం, తిరుమలశెట్టినగర్, జయప్రద నగర్ ఈ గ్రామ శివారులు.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, దొప్పల రమణ సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా చెరుకూరి చిన్నవెంకయ్య ఎన్నికైనాడు [2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం.వేణు గోపాల స్వామి టెంపుల్,రామాలయం, చర్చి, మసీద్.

ప్రధాన పంటలసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12011. ఇందులో పురుషుల సంఖ్య 6088, స్త్రీల సంఖ్య 5923, గ్రామంలో నివాసగృహాలు 2783 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1026 హెక్టారులు.

మూలాలుసవరించు