1949 జనవరి 12 న జన్మించిన గండప్ప రంగన్న విశ్వనాథ్ (Gundappa Rangnath Viswanath) (Kannada:ಗುಂಡಪ್ಪ ರಂಗನಾಥ್‌ ವಿಶ್ವನಾಥ್‌) భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. 1970 దశాబ్దపు భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. 1969 నుంచి 1983 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 91 టెస్టులు ఆడి 6080 పరుగులు సాధించాడు. 1974, 1982 మధ్యలో వన్డే పోటీలను కూడా ఆడినాడు. 1975, 1979 ప్రపంచ కప్ క్రికెట్లో భారత్ రతఫున పాల్గొన్నాడు. దేశవాళి క్రికెట్ లో అతను కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇతను సునీల్ గవాస్కర్ సోదరిని వివాహం చేసుకున్నాడు.

Gundappa Viswanath
వ్యక్తిగత సమాచారం
జననం (1949-02-12) 1949 ఫిబ్రవరి 12 (వయస్సు: 71  సంవత్సరాలు)
Bhadravathi, Mysore, Karnataka, India
బ్యాటింగ్ శైలి Right-hand bat
బౌలింగ్ శైలి Legbreak
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు India
టెస్టు అరంగ్రేటం(cap 124) 15 November 1969 v Australia
చివరి టెస్టు 30 January 1983 v Pakistan
వన్డే లలో ప్రవేశం(cap 10) 3 April 1974 v England
చివరి వన్డే 2 June 1982 v England
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODIs
మ్యాచులు 91 25
చేసిన పరుగులు 6080 439
బ్యాటింగ్ సరాసరి 41.93 19.95
100s/50s 14/35 -/2
అత్యధిక స్కోరు 222 75
బౌలింగ్ చేసిన బంతులు 70
వికెట్లు 1
Bowling average 46.00
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు
మ్యాచ్ లో 10 వికెట్లు n/a
Best bowling 1/11
క్యాచులు/స్టంపులు 63/- 3/-
Source: CricInfo, 4 February 2006

1969లో కాన్పూర్లో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అదే మ్యాచ్ లో సున్నాకే అవుటై, ఈ విధంగా ఒకే మ్యాచ్‌లో సెంచరీ, డకౌట్ రికార్డు చేసిన బ్యాట్స్‌మెన్లలో ఇతను మూడోవాడు మాత్రమే. అతను టెస్ట్ క్రికెట్ లో మొత్తం 14 సెంచరీలు సాధించగా వాటిలో భారత్ ఒక్కటి కూడా ఓటమి చెందకపోవడం గమనార్హం. ఆ కాలంలో బ్యాట్స్‌మెన్లపై విరుచుకుపడే ఆస్ట్రేలియా, వెస్ట్‌ఇండీస్ బౌలర్లను ఎదుర్కొని ఆ దేశాలపై 50 కి పైగా సగటు సాధించడం సామాన్యం కాదు[1]. అతని అత్యున్నత ఇన్నింగ్సులలో ఒకటైన మద్రాసు టెస్ట్ లో వెస్ట్‌ఇండీస్ పై ఆండీ రాబర్ట్స్ బౌలింగ్‌ను ఎదుర్కొని 97 పరుగులతో నాటౌట్ గా నిల్చాడు. ఆ ఇన్నింగ్సులో జట్టు స్కోరు 190 మాత్రమే. సెంచరీ సాధించకుననూ భారతీయుడు సాధించిన అత్యుత్తమ ఇన్నింగ్సు లలో ఇది ఒకటి [2] భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయం కూడా సాధించింది. 2001లో వెజ్డెన్ ప్రకటించిన 100 అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ఇన్నింగ్సులలో ఇది 38 వ స్థానం ఆక్రమించింది, కాగా సెంచరీ లేని ఇన్నింగ్సులలో ఇది రెండో స్థానంలో ఉంది.[3]. 1975-76 లో గుండప్ప విశ్వనాథ్ వెస్ట్‌ఇండీస్ పై 112 పరుగులు చేసి తన మరో ప్రతిభను నిరూపించాడు. దానితో ఆ టెస్ట్ మ్యాచ్ లో భారత్ 403 పరుగులు చేసి గెల్వడమే కాకుండా అప్పటి వరకు ఛేజింగ్ రికార్డును అధికమించింది [4]. 1978-79 లో మరో పర్యాయం మద్రాసు టెస్టులో విశ్వనాథ్ 124 పరుగులతో నాటౌట్ గా నిల్చాడు. ఆ ఇన్నింగ్సులో టీం స్కోర్ కేవలం 255 మాత్రమే. అతని ప్రతిభతో ఆ టెస్ట్ కూడా భారత్ గెల్చి 6 టెస్టుల సీరీస్ లో 1-0 తో ముందంజవేసింది. 1979-80 లలో కొద్దికాలం గుండప్ప విశ్వనాథ్ భారత కెప్టెన్ గా వ్యవహరించాడు. అతను నేతృత్వం వహించిన రెండూ టెస్టులలో ఒకటి డ్రా కాగా, మరికటి ఓడిపోయింది. ఆ టెస్టులో భారత్ ఓడిననూ విశ్వనాథ్ మంచితనం మాత్రం చెప్పుకోవాల్సిందే. బాబ్ టేలర్ ను అంపైర్ ఔట్ ఇచ్చిననూ విశ్వనాథ్ జోక్యం చేసుకొని అతనిని మళ్ళీ క్రీజుకు పిల్వడం అతను ధాటిగా ఆడి మంచి పరుగులు చేయడం భారత్ ఆ టెస్ట్ కోల్పోవడం జర్గాయి.

గుండప్ప విశ్వనాథ్ 1983లో రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు.

ఇవి కూడా చూడండిసవరించు


మూలాలుసవరించు

  1. Statsguru - GR Viswanath - Tests - Career summary from Cricinfo.com
  2. The 26th anniversary of an immortal innings from Cricinfo.com 11 January 2001
  3. Wisden 100 - Top 100 Batsmen from Rediff.com
  4. Tests - Highest Fourth Innings Totals from Cricinfo.com