గుర్కా జైపాల్ యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడు.

గుర్కా జైపాల్ యాదవ్

పదవీ కాలము
1999, 2009 - 2014, 2018 - ప్రస్తుతం
ముందు చల్లా వంశీచంద్ రెడ్డి
నియోజకవర్గము కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1954 ఆగస్టు 14
రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం, చెల్లంపల్లి గ్రామం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము కల్వకుర్తి
మతం హిందూ

జీవిత విశేషాలుసవరించు

1954, ఆగస్టు 14న రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం, చెల్లంపల్లి గ్రామంలో జన్మించాడు.

రాజకీయ విశేషాలుసవరించు

జైపాల్‌యాదవ్ రాజకీయాల్లో ఆసక్తితో జనతా పార్టీలో చేరాడు. 1981లో చల్లంపల్లి సర్పంచ్‌గా అయన గెలుపొందాడు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 1986లో చేరాడు. 1991లో టీడీపీ నుండి పోటీ చేసి తలకొండపల్లి జడ్పీటీసీగా ఎన్నికయ్యాడు. 1999అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీచేసి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2004 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 2006లో వంగూరు నుండి పోటీచేసి జడ్పీటీసీగా గెలుపొందాడు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి పై 597 స్వల్ప ఓట్ల తేడాతో గెలిచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2014, మార్చిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. టిఆర్ఎస్ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు.[1]

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి టి. ఆచారి పై 3447 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2][3]2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఈయన 1999, 2009 ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిచాడు.[4]

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (23 January 2019). "సర్పంచ్ టు అసెంబ్లీ". www.ntnews.com. Archived from the original on 16 సెప్టెంబర్ 2019. Retrieved 16 September 2019.
  2. https://www.timesnownews.com/amp/elections/telangana-election/article/kalwakurthy-assembly-constituency-election-2018-trs-gurka-jaipal-yadav-up-against-congress-challa-vamshi-chand-reddy/322183
  3. https://www.news18.com/amp/news/politics/kalwakurthy-election-result-2018-live-updates-gurka-jaipal-yadav-of-trs-wins-1967855.html
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (27 November 2018). "కల్వకుర్తిలో జైపాల్‌కు జేజేలు!". www.ntnews.com. Archived from the original on 16 సెప్టెంబర్ 2019. Retrieved 16 September 2019.